Pages

Tuesday, 4 November 2014

జీలకర్ర ఉపయోగాలు..

మన వంటకాలలో జీలకర్ర ప్రాధాన్యం ఎనలేనిది. దీనివల్ల ఆహార పదార్ధాలకు రుచి వస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ 'ఎ ', 'సి' లు ఎక్కువగా ఉన్నాయి.

జీలకర్ర ఔషధ గుణాలు :

* జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది.
* కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది.
* కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను  నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.
* జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీ.పీ.ని అదుపులో ఉంచుతుంది.
* గుండె నొప్పులు రాకుండా కాపాడుతుంది. డయేరియాతో బాధపడేవారు ఒక టీ స్పూన్ జీలకర్ర నీటిలో తీసుకుని ఒక టీస్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు ఇలా తీసుకోవాలి.
* నల్ల జీలకర్ర మూలశంకకు మంచి మందు.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్లజీలకర్రను వేయించి మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది.
* గొంతు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా జీలకర్ర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.
* నీళ్ళలో కొద్దిగా అల్లం వేసి బాగా కాయాలి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి.
* వేడిచేసే గుండం దీనికి ఉంది. అతిగా సేవించకూడదు.
* కనీసం వారానికి ఒకసారి జీలకర్ర రసాన్ని ఒక ఔన్స్  సేవిస్తే గుణం కనిపిస్తుంది.
* కఫ సమస్యలతో బాధపడేవారు జీలకర్ర కషాయం సేవిస్తే గుణం కనిపిస్తుంది.
* వాంతులతో బాధపడేవారు జీలకర్ర నమిలి రసాన్ని మింగితే వాంతులను  నివారిస్తుంది.

Sunday, 26 October 2014

వాత రోగ లక్షణాలు

* శరీరంలో ప్రకోపించిన వాయువు, సకల శరీరానికి మూల కేంద్రమైన శిరస్సులోని నరములలోకి చేరి, దాని తీవ్రత స్థాయిని బట్టి, పూర్తి శరీరాన్ని గానీ, శరీరంలో అర్ధ భాగాన్ని గానీ లేక ఏదో ఒక అవయవాన్ని చచ్చు పడేటట్లు చేస్తుంది.
* శరీరంలోని కీళ్ళు కణుపులు బిగిసిపోతయ్.
* అన్ని జాయింట్లలోను తీవ్రమైన నొప్పులు కలుగుతయ్.
* చేతులు, కాళ్ళు, వీపు, నడుము, మెడ బిగుసుకుపోతుంది.
* ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవటం, శరీరం రూక్షగా ఉండటం జరుగుతుంది. పురుషులలో వీర్యశక్తి నశిస్తుంది.
* స్త్రీలలో ఋతువు అస్తవ్యస్తమౌతుంది, గర్భస్రావాలు జరుగుతయ్.
* శరీరమంతా క్రమంగా వణుకు మొదలవుతుంది. ఏ పని మీద శ్రద్ధ వుండక పాలు మాలికతనం పెరుగుతుంది.
* మర్మావయవాల వద్ద చర్మము పగిలి మంటలు మొదలవుతాయి.

ఇలా వాత రోగాల లక్షణాలు లెక్కకు మించి ఉంటాయి.

Saturday, 25 October 2014

వాత రోగాలు ఎందుకు కలుగుతయ్??

మనలో చాలామంది ఒకేరకమైన రుచులను అధికంగా తినటానికి బాగా అలవాటు పడ్డారు. కొందరు ఆవకాయ  పచ్చడి విపరీతంగా తింటే, మరి కొందరు మాంసము మూడుపూటలా తింటారు.ఇంకొందరు ఎక్కువగా చేదుగా వుండే పదార్ధాలను అమితంగా భుజిస్తారు. ఇలా ఏ ఒక్కటో, రెండో రుచులకు మాత్రమే అలవాటు పడి, మిగతా రుచులను స్వీకరించకపోవడం వల్లనే శరీరంలో దోషాలు ధాతువులు అసమానమై సమతౌల్యం దెబ్బతిని సకల రోగాలకు మూలకారణం అవుతున్నయ్.

కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం :

1. కారము, చేదు, వగరు ఈ మూడు రుచులు గల పదార్ధాలను అతిగా సేవించడం
2. బాగా ఎక్కువ గానీ, తక్కువ గానీ భుజించడం
3. అతి వేడిగా గానీ అతి చల్లగా గానీ భోజనం చేయడం
4. ఎక్కువగా గాలికి తిరగటం, లేక నిరంతరం గాలిని విసిరే ఫ్యాన్ల కింద కూర్చోవటం, నిద్రించడం
5. వరుసగా అనేక మాసాల పాటు రాత్రిళ్ళు మేల్కోవటం
6. అనేక మాసాలపాటు విశ్రాంతి లేకుండా విపరీతమైన శారిరక శ్రమ చేయడం
7. మంచు లోను, చల్లటి నీటిలోను, చల్లని గాలిలోను, ఏ.సి. గదులలో ఎక్కువ సమయం గడపడం
8. ఆర్ధక ఇబ్బందుల వల్ల లేక పనుల వత్తిడి వల్ల వేళకు భోజనం చేయకపోవడం, వేళ కాని వేళల్లో అకాల భోజనం చేయడం
9. మలము, మూత్రము, తుమ్ములు, ఆవలింతలు మొదలైన సహజవేగాలను, పనుల ఒత్తిడిలో పడి కొంత సమయం ఆపడం
10. అలివి కాని పనులు చేయటానికి ప్రయత్నించి, విఫలమై అమితంగా దిగులు పడటం, అతిగా అలోచించడం, అతిగా భయపడటం
11. వివిధ అనారోగ్య సమస్యల వల్ల శరీరంలో మాంసం క్షీణించటం
12. జీర్ణ శక్తి గమనించకుండా కఠినమైన పదార్ధాలను సేవించడం, అవి జీర్ణంగాక మురిగిపోయి ఆమం ఏర్పడి వాయు సంచారానికి అడ్డుపడటం

ఇటువంటి ప్రకృతి విరుద్ధమైన మానసిక శారీరక చర్యల వల్ల 80 రకాల వాత వ్యాధులు పుట్టుకొస్తయ్.

వాతరోగ లక్షణాలు కొన్ని గంటల్లో తెలుసుకుందాం...

Thursday, 23 October 2014

చిట్టి చిట్కాలు..

* సోంపు చూర్ణం తేనెతో తింటుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

* నేరేడు చెక్క కషాయం రెండుపూటలా పుక్కిలిస్తుంటే నోట్లో అతిగా నీరూరటం తగ్గుతుంది.

* గోరింటాకు కషాయంతో కడుగుతుంటే పుండ్లు మాడిపోతయ్.

* నిమ్మరసం రెండుపూటలా రుద్దుతుంటే బెణుకులనొప్పి, వాపు తగ్గుతయ్.

* పసుపు తేనె కలిపి నూరి పైన పట్టిస్తుంటే దెబ్బలవాపు తగ్గుతుంది.

* ఆముదపు ఆకులు చితక్కొటి వెచ్చ జేసి వేస్తుంటే గజ్జబిళ్ళలు తగ్గుతయ్.

* నువ్వులను పాలతో నూరి రాస్తుంటే జీడిగించల వాపు, మంట తగ్గుతయ్.

* మంచి గంధం చెక్కను నీటితో సాది పట్టు వేస్తుంటే బొడ్డుపుండు తగ్గుతుంది.

* మిరియాల పొడి 3 గ్రాములు కప్పు వేడినీటితో తాగుతుంటే నిద్రలో మాట్లాడటం తగ్గుతుంది.

* పచ్చి ఉల్లి గడ్డలను అన్నంలో తింటూంటే అతినిద్ర, అతిగా ఆవులించటం తగ్గిపోతుంది.

Thursday, 25 September 2014

ఏ ఆహారం తిన్నా, ఆయుష్షున్నంతకాలం బ్రతుకుతాం ! అని భ్రమ పడుతున్నారా? ఆ భావం నిజం కాదు.

ఆహార నియమాల గురించి అసలు తెలియని వాళ్ళు, లేదా తెలుసుకుందామనే అభిరుచి ఉన్నవాళ్ళు మంచిని స్వీకరించటానికి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి ఎప్పుడూ ముందే వుంటారు. కానీ, కొంతమంది వివిధ రుచులకు అలవాటుపడి ఆ జిహ్వ చాపల్యాన్ని అణచుకోలేక, శరీరమంతా రోగగ్రస్తం అయినా కూడా, తిండి మీద వ్యామోహాన్ని చంపుకోలేక నిర్లక్ష్యంగా, తిరస్కారంగా " ఆ...! దేవుడు ఎంతకాలం ఆయుష్షు ఇస్తే అంతకాలం బ్రతుకుతాం. ఆహారం మార్చినంత మాత్రాన ఎక్కువకాలం బ్రతుకుతామా...." అని మెట్ట వేదాంతం వల్లిస్తుంటారు. ఆహార రహస్యాన్ని మరణ రహస్యాన్ని తెలుసుకుంటే ఎవరు ఇంత అలక్ష్యంగా మాట్లాడరు.

మృత్యువు రెండు రకాలు. కాల మృత్యువు, అకాల మృత్యువు. కాల మృత్యువు అనేది భగవంతుడిచ్చిన ఆయువు తీరేవరకు ఉదయిచిన సూర్యుడు క్రమగతిలో అస్తమించినట్లుగా బాల్య యౌవన వార్ధక్య దశల్లో క్రమంగా ఆవరిస్తూ అంతరింపచేస్తుంది. అకాల మృత్యువు అనేది మనిషి ఆహార నియమాలు పాటించకుండ రోగాల పాలైనప్పుడు, రోడ్ల మీద ప్రయాణ నియమాలు పాటించకుండ అతివేగంగా వాహనాలమీద వీరగమనం చేస్తున్నప్పుడు, తన శక్తిని మరచి బలవంతులైన ఇతరులతో వైరానికి, కొట్లాటలకు దిగినప్పుడు, ధర్మము తప్పి ఇతరులను వంచించి అనుక్షణం ప్రాణభయంతో అల్లాడుతున్నప్పుడు, అకస్మాత్తుగా ఆవరించేదే అకాల మృత్యువు. దీనికి ఉదాహరణగా ఏదైనా వాహనాన్ని గురించి చెప్పుకోవచ్చు.

మనం కొత్తగా కొనుక్కున్న వాహనాన్ని రోజూ శుభ్రంగా కడిగి తుడిచి సకాలంలో ఆయిల్ పొసి ఒక క్రమ పద్ధతిలో వాడుకొంటూ ఉంటే దానిని తయారు చేసిన శాస్త్రవేత్త ఆ వాహనానికి ఎంతకాలం లైఫ్ ఉంటుందని చెప్పాడో అంతకాలం ఆ వాహనం దివంగా పనిచేస్తుంది. అలా కాకుండా కొన్నప్పటినుంచీ ఆ వాహనం మీద శ్రద్ధ చూపకుండా, గతుకుల్లో గుంటల్లో ఎత్తెత్తి పడేస్తూ అశ్రద్ధగా నడిపితే ఆ వాహనం అతి తొందరలోనే శిధిలమైపోతుంది.

అదేవిధంగా మానవ జీవితం కూడా ప్రకృతిని, ఋతువులను అనుసరించి ఆహార నియమాలను పాటిస్తూ ప్రాణ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను అనుసరిస్తూ ఉంటే నిండు నూరేళ్ళపాటు హాయిగా సాగిపోతుంది. అలాకాకుండా విరుద్ధమైన ఆహార సేవనంతో విపరీతమైన దురలవాట్లతో, అహంకారంతో అహంభావం తో జీవించడం అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తిజీవనం అకాల మృత్యువుకు ఆహుతి అవుతుంది. మనిషి ఆయు: పరిమాణానికి ఖచ్చితమైన లెక్కలే వుంటే ఆయువును కాపాడటానికి మందులు, పూజలు, యాగాలు, చట్టాలు, కోర్టుల అవసరమే వుండదు. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసైనా అకాల మృత్యువును తప్పించుకొని, సకాల మృత్యువు కలిగేవరకూ ఆరోగ్యం కాపాడుకోవటమే మనిషి ధర్మం, అదే జీవన మర్మం.

Wednesday, 24 September 2014

తెలుగులోనే మాట్లాడండి..

తెలుగు భాష లోనే మాట్లాడదాం, తెలుగు  భాషని నిర్లక్ష్యం చెయ్యొద్దు, బాగా అవసరం అనుకుంటేనే తప్ప ఇతర భాషల్లొ మాట్లాడవద్దు. మనకు తెలుగు వచ్చని గొప్పగా చెప్పుకుందాం. తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదిద్దాం.

Tuesday, 23 September 2014

లావాటి వారిని సన్నగా - సన్నటి వారిని లావుగా చేసే ఆవుపాలు

దేశవాళి ఆవుపాలు తాగగలిగినన్ని తృప్తిగా రోజూ రెండు లేదా మూడు సార్లు తాగుతుంటే ఏనుగులాగా అతి లావుగా తయారైనవారు క్రమ క్రమంగా చర్మం వ్రేలాడబడకుండా గట్టిపడుతూ సన్నగా నాజూకుగా తయారౌతారు.
అలాగే ఇదేవిధంగా ఆవుపాలు తాగుతునంటే సన్నగా బక్కపలుచగా కృశించివున్నవారు క్రమ క్రమంగా సర్వాంగ సుందరాంగులుగా తీర్చిదిద్దబడతారు.

దురదృష్టం ఏమిటంటే దేశవాళీ గోజాతి అంతరించిపోతుంది. వాటిని చంపి విందుల్లో వినియోగించుకుంటున్నారు.
దేశవాళీ ఆవు పాలు దొరికిన వారు, ఆవు పాలు వేడి అని కొందరు, పలుచగా వుంటాయని కొందరు దురదృష్టవంతులు ఆవుపాలను దూరం చేసుకుని అనారోగ్యానికి దగ్గరౌతున్నారు.

దేశవాళి ఆవుపాలు దొరికిన వారు అదృష్టవంతులు. దయచేసి నిస్సంకోచంగా ఆవుపాలు దొరకటం అదృష్టంగా భావించి తీసుకోండి.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ ; భారతదేశంలో జన్మించడం నా అదృష్టం. 

పెళ్ళిలో మూడే ముళ్లు ఎందుకు వేయాలి ?

ప్రాచీనులు 'మూడు' అనే అంకెకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.
సృష్టి, స్థితి, లయలు మూడు.
ఆధి దైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికశాంతులు మూడు.
యాగానికి కావలసిన అగ్నులు మూడు.
ఆకు, వక్క, సున్నం ఈ మూడూ తాంబూలంకు ముఖ్యం.
యజ్ఞోపవీతంలోని పోగులు మూడు.
ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు.
బ్రహ్మ సూత్రంలోని ముడులు మూడు.
ధర్మ, అర్థ, కామ అనే మూడింటితో మోక్షాన్ని పొందటానికి.
అలాగే మంగలసూత్రపు  పేటలు మూడు, ముడులు కూడా మూడు.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:

ప్రతీ వ్యక్తికీ మూడు శరీరాలుంటాయి : స్థూల - సూక్ష్మ - కారణ శరీరాలు.

మాంసం, రక్తం, ఎముకలు - వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే.( ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాని ద్వారా)

శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం. జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా? లేదా? అని సాక్షిభూతంగా పరమాత్మ చూసే శరీరం కూడా ఇదే.


పూర్వ జన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం  పుట్టిందో అది కారణ శరీరం. రోగాలూ, నొప్పులూ, బాధలూ, మానసిక శాంతీ, ఆధ్యాత్మిక చింతనా ఏది వచ్చినా అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్నా, కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలా మంది పుత్రులు తల్లిదండ్రులలాగ ఉండకపోవడానికి ప్రత్యక్షసాక్ష్యం కారణ శరీరం .

ఇలా మూడు శరీరాలకు మూడు ముడులు వేస్తాడు వరుడు.
భర్త మరణించిన పిమ్మట కూడా భార్య, ఆమె భర్త పేరుని చెప్పమంటే పోయిన వాని పేరే చెప్తుంది. ఎందువల్ల? భర్త స్థూల శరీరమే పోయింది. మంగల సూత్రాన్ని ఆయన ఆ మిగిలిన రెండు శరీరాలకీ కూడా ముడి వేసాడు కాబట్టి.

అలాగే భార్యా భర్తలు మూడు ముళ్ళ సారాంశం తెలుసుకుని, చిన్ని చిన్ని కలహాలు, అర్థంలేని అపోహలతో వివాహ జీవితాన్ని ఆదిలోనే తుంచుకోకుండా, తమది జన్మ జన్మల బంధం అని తెలుసుకుంటే ఈ అపోహలు, కలహాలు వారిని మరింత దగ్గరచేసే వాహకాలని తెలుసుకుని  వారి బంధం  ఇంకా బలంగా చేసుకోగలుగుతారు.

ఇప్పుడు చేసే సత్కార్యాల ద్వారా తరువాత జన్మల్లో ఉత్తమంగా ఉండగలుగుతారు. ఇలా ఒకరికొరు సహాయపడి జన్మను సార్ధకం చేసుకోవాలని వివాహ బంధం తెలియచేస్తుంది.

పెళ్ళి అంటే ఏదో అవసరానికో, సమాజం కోసమో, లేదా చేసుకోవాలి కాబట్టే చేసుకోవటమో అనుకుని చేసుకుంటే వారి జీవితం వ్యర్ధం. పెళ్ళి పరమార్ధం తెలుసుకుంటే జీవితకాలం ఒకరు లేకపోయినా మరొకరు ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మిగతా రెండు శరీరాలతో బంధం అలాగే ఉంటుంది కాబట్టి.











Sunday, 21 September 2014

దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో అర్ధం ఏమిటి?

దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో ఎంతో అంతరార్ధం వుంది. బాహ్యసమాజంలో ఎదురయ్యే దుష్టులకు దూరంగా ఉన్నంత మాత్రాన మనం బాగుపడలేమని, మన మనసులో ఉన్న కామ, క్రోధ , లోభ, మోహ , మద,మత్సర్యాలనే అసలైన దుష్టులకు దూరంగా ఉన్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సుఖశాంతులతో జీవించగలుగుతామని జాగరూకులమై ఉండాలి. 

మానసిక విషాలే మానవరోగాలకు మూలకారణం

మానసిక విషాలే మానవరోగాలకు మూలకారణం. అంటే, రోగమున్న ప్రతిమనిషి మనసులో ఏదో ఒక విషం విరజిమ్ముతుంది అని మనం తెలుసుకోవాలి. మందులతో రోగాలు తగ్గుతాయి అనే భ్రమ నుండి బయటపడి, మనసులో విషాలు లేకుండా చేసుకోవడమే అసలైన ఔషధమని ప్రతిక్షణము గుర్తుచేసుకుంటూ మానవతా మార్గంలో ప్రయాణం చేయాలి.

రేచీకటికి వంటాముదం

రోజూ రెండు పూటలా తలకు మంచి వంటాముదం బాగా మర్ధిస్తుంటే రేచీకటి 21 రోజుల్లో తగ్గిపోతుంది.

చర్మం పై వచ్చిన కురుపులకు - కలబంద, పసుపు

కలబంద గుజ్జు, పసుపు కలిపి మెత్తగానూరి పూస్తుంటే చరంపై వచ్చిన కురుపులు మానిపోతయ్.

దీర్ఘకాల మొలల సమస్యకు - ఉల్లిగడ్డ యోగం :

సంవత్సరాల నుండీ ఆర్శమొలలతో బాధపడేవారు ఇప్పటికైనా అసలైన  ఔషధాలు ఆహార రూపంలోనే ఉన్నాయని తెలుసుకోవాలి.
ఉల్లిగడ్డలు దంచి పిండి తీసిన రసం 20 గ్రాములు, పంచదార 10 గ్రాములు, కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి ఆహారనికి గంటముందు ఒకసారి రెండుపూటలా సేవించాలి. ఆహారం లో పలుచని తీయని మజ్జిగని బాగా వాడాలి, దుంపలు, మాంసాహారాలు ఇంకా మీ శరీర తత్వానికి పడని మరియు అరగని పదార్ధాలు మానుకోవాలి. అతి సునాయాసంగా మూడు నాలుగు వారల్లోనే ఎంతో కాలం నుండీ వేధించే మొలల సమస్య నిర్మూలనమౌతుంది.

Wednesday, 3 September 2014

కోపంతో, దుఖంతో భుజిస్తే కొంపలారిపోతాయ్:

మానవ శరీరంలో గొంతువద్ద విశుద్ధ చక్రం, అక్కడే ' థైరాయిడ్ ' అని పిలవబడే గ్రంధి కూడా నిర్మాణమై ఉన్నయ్. దానికి పైన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం, దానివద్దే ' పిట్యూటరీ గ్లాండ్ ' కూడా ఏర్పాటై ఉన్నయ్ . ఈ రెండు గ్రంధులు మెదడుతో అనుసంధానమై నాడీ సంబంధం కలిగివున్నయ్. ఎప్పుడైతే మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనబడే చెడు సంకల్పాలు పుడతాయో ఆ మరుక్షణమే ఆ దుష్ట సంకల్పాల నుండి ఉత్పన్నమయ్యే విష రసాయనాల ప్రభావం పిట్యూటరీ మరియు థైరాయిడ్ గ్రంధులపైన పడి వాటి  సహజ శక్తిని నశింపజేసి ఆ గ్రంధులను బలహీనపరుస్తుంది.
ఫ్యాన్ రెగులేటర్ సాయంతో ఎక్కువ తక్కువలుగా అవసరమయ్యే విధంగా ఎలా పని చేస్తుందో అదేవిధంగా మానవశరీరంలో జీవాణువుల రసాయనిక మార్పులకు, శారీరక ఎదుగుదలకు ఈ థైరాయిడ్ గ్రంధి రెగ్యులేటర్ అనబడే ఒక క్రమబద్ధ యంత్రంలాగా పని చేస్తుంటుంది.
థైరాయిడ్ గ్రంధిలో ఉత్పన్నమయ్యే జీవ రసాల ప్రభావంతోనే జీర్ణ వ్యవస్థ, మూత్ర పిండాలు, మెదడువంటి అనేక అవయవాలు,ఇతర గ్రంధులు సక్రమంగా పని చేస్తుంటయ్. ఎప్పుడైతే కామం, క్రోధంవంటి మనో మాలిన్యాల విషప్రభావం థైరాయిడ్ గ్రంధి పై పడుతుందో మరుక్షణమే దానికనుసంధానమై ఉండే ఇతర అవయవాలపైన మిగతా గ్రంధుల పైన కూడా ఆ ప్రభావం పడి మనో వ్యాధులు, అతిస్థౌల్యం, గర్భాశయరోగాలు, మూత్రపిండరోగాల వంటి అనేక వ్యాధులు క్రమ క్రమంగా పుట్టుకొస్తుంటయ్.
కాబట్టి భోజనసమయంలో కోప తాపాలకుగురై పైన తెలిపినట్లు అన్ని రోగాలకు మూలమైన అజీర్ణాన్ని సృష్టించుకొని వ్యాధిగ్రస్థులుగా బ్రతకకూడదని మహర్షులు హితవుపలికారు. ఏ కారణం వల్లనైనా భోజన సమయానికి మనసు ఆవేశంతోనో, ఆందోళనతోనో ఉంటే భుజించటం ఆపివేసి మనసు ప్రశాంతమైన తరవాతే భుజించండి.

                                 మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

ముఖముపై ఉన్న నల్లమంగు, ఎర్ర మంగు మచ్చలకు :

మనో మాలిన్యాలు లేనివాళ్ళకు, శారీరక మాలిన్యాలు లేనివాళ్ళకు ముఖములో మచ్చలు రావు. వామ్ము 100 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు అన్ని పొడిచేసి, ఈ పొడిని రోజూ అరస్పూను తింటుంటే జీర్ణశక్తి బాగుపడి, రక్త శుద్ధి జరిగి ముఖ సౌందర్యం బాగుంటుంది.

లివర్ సమస్యలకు చింత పూవు :

లివర్ కు సంబంధించిన ఏ వ్యాధికైనా చింతపూవు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. చింతపూవు రసంగానీ, చింతపూవుతో కాచిన కషాయంగానీ సేవిస్తూవుంటే, లివర్ వ్యాధులన్నీ హరించిపోతయ్. లివర్ క్యాణ్సర్ కు కూడా సంజీవనిలా పనిచేస్తుంది.

గవద బిళ్ళలకు :

ఉడికించిన ఆలుగడ్డ ముక్కను పైన కడితే గవదబిళ్ళలు కరిగిపోతయ్.

Tuesday, 26 August 2014

గుండెరోగాలకు శొంఠికషాయం:

శొంఠి కషాయం రెండుపూటలా పావు కప్పు తాగుతుంటే గుండెరోగాలు హరిస్తయ్.

కడుపులో మంట, వికారాలకు :

కొత్తిమీర పచ్చి ఆకులను 5-10 గ్రాములు రోజూ తింటుంటే జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యం బాగుపడుతుంది. దీనిని కషాయంగా గాని, పచ్చిదిగాని నిత్యం వాడుతుంటే సామాన్య రుగ్మతలు ఉదరవ్యాధులు హరించిపోతయ్.

                                             మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

చంటి బిడ్డల - వణుకు రోగానికి :

ఏదైనా జబ్బు చేసినప్పుడు గానీ కారణం తెలియకుండా కూడా ఒక్కోసారి చిన్నబిడ్డల కండరాలు వణకటం లేక ముడుచుకోవడం జరిగినప్పుడు వెంటనే ఉల్లిపాయను ముక్కగా కోసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించాలి. అలా చేస్తే త్వరగా మామూలు స్థితికి వస్తారు. ఈ విషయం చాలమందికి అనుభవంలో తెలిసిన విషయమే. ఉల్లిపాయను కోసిన వైపున బాగా వాసన ఘాటుగా వస్తుంది. కాబట్టి ఆ వాసన చూపిస్తే ఫలితం ఉంటుంది.

                                           మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Thursday, 31 July 2014

స్త్రీలు పసుపును ఒంటికి ఎందుకు రాయాలి ?


స్త్రీలు పసుపు కొ్మ్మును నీటితో సాది ఆ గంధాన్ని గానీ లేక పసుపు పొడి కలిపిన సున్నిపిండీ కూడా వాడటం అందరకూ తెలుసు. ఇలా చేయడం వల్ల స్త్రీలకు కేవలం సౌభాగ్యం అని మాత్రమే అర్ధం కాదు, పసుపు వాడకం వల్ల చర్మవ్యాధులు, శీతవ్యాధులు, ఉష్ణవ్యాధులు, పాదాల పగుళ్ళు ఇలాంటివి రాకుండా కాపాడబడతారు.
బాలెంతలకు కొన్ని రోజులపాటు శరీరం శీతలం కమ్మకుండా కాపాడబడటం కోసం, పసుపును నలుగుపిండితో కలిపి ఒంటికి రాయటం, పసుపు కలిపిన నీటితో స్నానం చేయించడం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఆచరిస్తున్నారు.

                                      మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

పిల్లల ఉదర వ్యాధులకు :


నల్ల ఉప్పు, సోంపు గింజలు సమంగా తేసుకొని మెత్తగా దంచి నిలవచేసుకొని, రోజూ రెండుపూటల ఒక గ్రాముపొడి గోరువెచ్చని నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల ఉదర సంబంధమైన నొప్పులు, శూలలు, అజీర్ణం మలబద్ధకం హరించిపోతయ్.
 

                                 మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

దద్దుర్లకు :


బెల్లం, వాము సమభాగాలుగా కలిపి దంచి, రేగిపండ్లంత మాత్రలు చేసి నిలువ వుంచుకుని పూటకు ఒక మాత్ర చొప్పున రెండు లేక మూడు పూటలా ఆవనూనెలో ముంచుకొని తింటూ వుంటే దద్దుర్లు హరించిపోతయ్

                                       మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

Saturday, 28 June 2014

అతి మూత్ర వ్యాధి :

ఎందుకు వస్తుంది: రాత్రిపూట ఎక్కువగా మేల్కోవటం వలన, బాగా చల్లగా వుండే ప్రాంతాల్లో ఎక్కువ కాలం నివసించటం వల్ల ఎక్కువసేపు ఏ.సి. గదుల్లోనే కాలం గడపటం వల్ల ఎక్కువగా మత్తు పానీయాలు సేవించటం వల్ల, ఈ వ్యాధి ఏర్పడుతుంది.

చికిత్స :
1. అలాగే ఎక్కువ విశ్రాంతిగా వుండకుండ శారీరక శ్రమ చేస్తుంటే, క్రమంగా ఈ వ్యాధి నివారించబడుతుంది.
2. నల్ల వులవకట్టును తయారు చేసుకొని ప్రతిరోజూ 1 ఔంసు ప్రమాణంలో తాగుతూవుంటే అతిమూత్రవ్యాధి తగ్గిపోతుంది.
3. మునగ ఆకు చిగుళ్ళతో ఆకు కూరగా తయారు చేసుకొని గానీ, లేక మునగకాయల కూర చేసుకొని గానీ తింటూవుంటే అతి మూత్ర వ్యాధి తగ్గిపోతుంది.

పధ్యం : 
అతి మూత్రవ్యాధి త్వరగా తగ్గాలంటే, బాగా చల్లగా వున్న పదార్ధాలు చలిలో తిరగటం, చన్నీటి స్నానాలు చేయటం మానుకోవాలి.
మజ్జిగ, పెరుగు, దోసకాయ, గుమ్మడికాయ, నిమ్మరసం ,కూల్ డ్రింక్స్, చల్లటి అన్నం, తీపి పదార్ధాలు, చల్లటి అన్నం మానివేయాలి. రాగి జావ, ఉలవ కషాయం వాడాలి. ఉదయం పూట కొద్ది దూరం నడుస్తూ వుండాలి. కొంచమైనా వ్యాయామం చేయాలి.

కడుపులో పుండ్లు :

ప్రతిరోజూ రెండు పూటలా ఒక కప్పు పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగుతూ వుంటే కడుపులోని పుండ్లు హరించిపోతయ్.

మొలల వ్యాధికి :

శొంఠి, పిప్పళ్ళు , కరక్కాయలు వీటిల్లో ఏదో ఒకదానితో సమభాగంగా బెల్లం కలిపి దంచి, ప్రతిరోజూ రెండు పూటలా 5 గ్రాములు మోతాదుగా సేవిస్తుంటే మొలలు కరిగిపోతయ్. అజీర్ణము, మలబద్ధకం కూడా తగ్గుతయ్.

Wednesday, 25 June 2014

మీరు బెడ్ కాఫీ - టీ తాగుతారా?

ఈ అలవాటు ఇంగ్లీషు వాళ్ళది. వాళ్ళదేశంలో ఉదయమే చలి ఎక్కువగా వుంటుంది కాబట్టి, నిద్ర లేవగానే శరీరం స్వాధీనంలోకి రావటానికి వాళ్ళు బెడ్ కాఫీ తాగవచ్చేమో కానీ , మనది ఉష్ణమండల దేశం. ఇక్కడ పొద్దునే లేవగానే రాగిచెంబులోని మంచి నీళ్ళు తాగి, రాత్రంతా జీర్ణ క్రియతో ఎండిపోయి వున్న శరీర అంతర్గత భాగాలకు తృప్తి చేకూర్చి, పండ్లు తోముకోవటం పూర్తయింతర్వాత, రాత్రి గంజిలో నానబెట్టిన అంబలి తాగటమో, లేక చల్లటి చిక్కటి మజ్జిగతో అన్నం కలుపుకొని తనివితీరా సేవించటమో మన అలవాటు.
ఆ అలవాటు కాలగమనంలో పొరపాటుగా మారి, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ బెడ్ కాఫీలు, టీలు తాగే దురలవాటుకు లోనయ్యారు. దీనివల్ల ఉదయమే ప్రశాంతంగా విసర్జింపబడ వలసిన మలం గడ్డకట్టుకుపోయి మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకంతో సకల వ్యాధులు మొదలౌతున్నయ్(సర్వరోగా మలాశయా).
చూశారా - ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో.. ఇప్పటికైనా కళ్ళు తెరచి మనన దేశీయంగాని అలవాటు మన వంటికి సరిపడదని తెలుసుకొని , దాన్ని విసర్జించి మన అలవాట్లను ఆచరించటం మంచిది.

పంచభూతాలను పంకిలం చేస్తూ పాపలకూపంలో పతనమైపోతున్న ఓ మనిషీ! నీ గమనం ఎక్కడకి ? భూమి, నీరు, గాలి ఎందుకు చెడిపోతయ్?

వర్షాకాలంలో వర్షం రావటం లేదు. భూమి నిస్సారమై, పంటలు పండటం లేదు. పవిత్రమైన ఓంకారంతో పుట్టిన ఆకాశం, భూమి నుంచి నీటి నుంచి ఆవిరి రూపంలో పైకి చేరే విషాలతో కలుషితమైపోయింది.
తన పుట్టుకకు, పెరుగుదలకు కారణమైన ప్రకృతిని, పంచభూతాల్ని నాశనం చేస్తున్న మానవులకు మనుగడ వుంటుందా?

ఆత్రేయ మహర్షి ప్రవచనం :
మానవుల్లో ధర్మం ఎంత కాలం వుంటుందో, అంత కాలం పంచ భూతాలు పరిశుద్ధమై ప్రాణ శక్తులతో నిండి వుంటయ్. ప్రతి మమననషికి పూర్తి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆయుషు వుంటయ్. ఎప్పుడైతే ధర్మానికి కాలం చెల్లి అధర్మం రాజ్యమేలుతుందో మనుషుల్లో అసూయాద్వేషాలు, స్వార్ధవైషమ్యాలు, పదవీ కాంక్ష, ధన వ్యామోహం పెచ్చు పెరుగుతుందో, అప్పుడే పంచ భూతాలమయమైన ప్రకృతి పతనమై పోతుంది. తన సహజమైన ప్రాణశక్తిని, ప్రశాంత తత్వాన్ని కోల్పోయి, తనను నాశనం చేస్తున్న మానవలోకం పై విరుచుకుపడుతుంది.
విష రసాయనాల వర్షంతో ఆకాశం, భయంకరమైన కృములు భూతాలతో(వైరస్ ) నిండిన వాయువు, ప్రాణ శక్తులను పీల్చి పిప్పిచేసే ప్రచండ కిరణాలతో సూర్యుడు, వ్యర్ధ పదార్ధాలతో కలుషితమై బడబాగ్నులతో ఉప్పొంగే జలం, ధాతు శక్తి కోల్పోయి, సహజమైన గమనాన్ని తప్పి ప్రకుపితమైన ప్రకంపనాలతో ప్రళయాన్ని సృష్టించే భూమి, ఇవన్నీ కలసి , భూకంపాలుగా, తుఫానులుగా, అగ్నిపర్వతాలుగా, అతి వికృతమైన రోగాలుగా మానవ సమాజంలో మరణహోమాలు రగిలిస్తయ్ .

ఆధునిక ఆంగ్ల వైద్యుల పరిక్షా ప్రయోగాలు :

పూనేలోని డాక్టర్ గోగ్డే అనే ఆంగ్లవైద్యుడు, తను ఆపరేషన్ లు చేసిన పేషెంట్స్ కు ఎలాంటి యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండ, గిరిజనులు అనుసరించే భూత వైద్య విధానం ప్రకారం, వేపాకు , గుగ్గిలం , ఆవాలు మొదలైన వాటితో రోగుల గదులనిండా ధూపం వేయించాడు. పదిరోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 15 నిముషాలపాటు ఈ పొగను వేయటం వల్ల ఆపరేషన్ చేసిన భాగాలు ఎలాంటి నొప్పులకు, ఇన్ ఫెక్షన్ కు గురికాకుండా వారం రోజుల్లోనే మానిపోయినియ్ . ఇంతగొప్ప అనుభవాన్ని గిరిజనులవల్ల పొందనన ఆ వైద్యుడు, మూలికా ప్రభావానికి, గిరిజనుల విజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు.

Sunday, 15 June 2014

చల్లటి నీళ్ళు ఎవరు వాడకూడదు ?

పార్శ్వపు  తలనొప్పి, సైనసైటిస్, జలుబు, పడిసెభారము, వాత వ్యాధులు, గొంతు రోగాలు, కడుపు ఉబ్బు, తిమ్మిర్లు, భయంకరమైన చర్మ వ్యాధులు, దగ్గు, ఆయాసం, వాత జ్వరం మొదలైన వ్యాధులతో బాధపడేవాళ్ళు చల్లటి నీళ్ళు ఉపయోగించకూడదు. ఈ నియమాలు తెలిసో తెలియకో పాటించకుండా ఎన్ని ఔషధాలు వాడినా నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది.

                                       మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ 

ఏ.సి. గదులు - ఎముకల వ్యాధులు :

ఎయిర్ కండిషను గదుల్లో గంటలు తరబడి కూర్చోవడం, నిద్రపోవటం, శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మానవ శరీరం ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే పంచ భూతాల కలయికతో నిర్మితమైనది. ఈ అయిదు భూతాల స్పర్శ ప్రతిరోజూ మన శరీరానికి తగలకపోతే, రోగాలు రావటం ఖాయం. ఎలా అంటే, మన శరీరాన్ని ముఖ్యంగా పంచభూతాలనుండి పుట్టిన వాతము, పిత్తము, శ్లేష్మము(కఫం) అనే మూడు ధాతువులు పరిపాలిస్తున్నయ్. ఆ మూడు ధాతువులు మన శరీరంలో సమంగా వుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఆ ధాతువులు సమంగా వుండాలంటే, వాటి మూల రూపాలైన పంచభూతాల స్పర్శను మనం అనుభవించి తీరాలి. ప్రకృతిలోని పరిశుభ్రమైన అతి శక్తివంతమైన ఎండ, గాలి తగలకుండ మనం ఎక్కువ సమయం ఏ.సి. గదుల్లో వుండటం వల్ల శరీరంలో ని వాత, పిత్త, శ్లేష్మాల సమతౌల్యం దెబ్బతింటుంది.ప్రతి రోజూ మన శరీరం ఆరోగ్యంగా వుండి తగినంత ఉత్సాహంతో పని చేయటానికి అవసరమైన విటమినులు, సూర్య్రశ్మి నుంచి మనకు అందకుండా పోతాయ్. దీనివల్ల క్రమంగా మానవ శరీరంలోని ఎముకల్లో, దంతాల్లో పటుత్వం తగ్గిపోతుంది. ఎక్కువసేపు కూర్చోలేక, నిలబడలేక, నడవలేక, ఎముకల, దంతాల దారుఢ్యం తగ్గిపోయి, శరీరం వంగిపోతుంది. అందువల్ల రోజులో కొంతసమయమైనా మనం తప్పకుండా సూర్యరశ్మిని ఆస్వాదించాలి. ప్రతిరాత్రి నిద్రపోయే ముందు పాలు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ' పళ్ళూడిపోయి, ఎముకలు క్షీనించిపోయి యౌవన దశలోనే అకాల వృద్ధాప్యం ఆవహిస్తుంది.


                                           మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ 

పిల్లల వాంతులు - దగ్గులు :

కరక్కాయ బెరడును చూర్ణం చేసి పూటకు 2 గ్రాములు, చూర్ణం లో తగినంత తెనె కలిపి రెండు పూతలా పిల్లలకు తినిపిస్తూ వుంటే వాంతులు, దగ్గులు, నెమ్ము, మల బద్ధకం , కడుపులో నొప్పి, అజీర్ణం, కడుపుబ్బరం, ఇవన్నీ తోగిపోయి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. 

పిల్లల వంటి దురదలకు :

వేప చిగురాకులు, నువ్వులు సమాన భాగాలుగా కలిపి మర్ధించి, వళ్ళంతా పట్టిస్తూ వుంటే దురదలు, చిడుము తగ్గిపోతయ్.

పసి పిల్లల జలుబుకు :

పిల్లలకు జలుబు చేయగానే తమలపాకులకు ఆముదం రాసి వెచ్చచేసి, పిల్లల రొమ్ము పైన, పొట్టపైన, తల పైన కాపడం పెడితే వెంటనే జలుబు తగ్గుతుంది.


                    పిల్లలు భవిష్యత్ ప్రాణ దీపాలు, వారిని అలా తయారు చేసే బాధ్యత ప్రతీ తల్లితండ్రిది.

పిల్లల నోటి్పూతకు:

రావి చెట్టు బెరడు, రావి చిగురు ఆకులు, సమంగా కలిపినూరి, పూటకు 5 గ్రాములు చొప్పున నాకిస్తూ వుంటే పిల్లల నోటి పూత తగ్గిపోతుంది.

                   పిల్లలు భవిష్యత్ ప్రాణ దీపాలు, వారిని అలా తయారు చేసే బాధ్యత ప్రతీ తల్లితండ్రిది.

Saturday, 14 June 2014

నిమ్మ బలం :

ఒక్క నిమంకాయలో ఐదు నారింజకాయల బలమున్నది.

Thursday, 5 June 2014

పిల్లల్ని రోగిష్టులుగా మారుస్తున్న అలవాట్లను మార్చండి :

మనం తెలిసో తెలియకో చేస్తున్న పొరపాట్లవల్లే మన బిడ్డలు రోగిష్టులౌరుతున్నారని తెలుసుకోండి.ఆధునిక విదేశీవిషనాగరికతా వ్యామోహంలో  పడ్డ తల్లిదండ్రులు ఆ దురలవాట్లనే బిడ్డలకు కూడా అలవాటు చేస్తూ వారిని శాశ్వతరోగులుగా మారుస్తూ వారి ఉజ్వల భవిష్యుత్తును కాలరాస్తున్నారు.
ఇళ్ళల్లో తల్లిదండ్రులుగాని, ఇంటికొచ్చిన మిత్రులు బంధువులుగాని పిల్లలకు రకరకాల చాక్లెట్లను అందివ్వడం అలవాటుగా మారింది. ఈ చాక్లెట్లను నిరంతరంగా తినడం వల్ల పిల్లల లేతశరీరాల్లో విషపూరితమైన కఫం ఎంత పేరుకుంటుందో వీరెవరూ అలోచించడంలేదు. అలాగే చాలా ఇళ్ళల్లో చిన్నతనంనుండే పిల్లలకు ఫ్రిజుల్లోని  నీళ్ళు, శీతల పానీయాలు తాగించడం, అదే ఫ్రిజుల్లో వుంచిన పాలను పట్టడం , అందులోనే ఉంచిన కూరగాయలతో ఆహారం వండిపెట్టటం దురలవాటుగా మారింది. వీటితోపాటు తరచుగా సినిమాలకో షికార్లకో వెళ్ళినప్పుడల్లా పిల్లలతో ఐస్ క్రీములు  తినిపించడం గొప్పనాగరికతగా మారింది. ఈ భ్రష్టాచారాలను తక్షణమే నిషేధించండి.
                                            మరికొన్ని విషయాలు తరవాత తెలుసుకుందాం.......

                                            మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ


మరి కొన్ని చిన్ని చిట్కాలు.....

1. నిమ్మ రసంతో పళ్ళు తోమితే దంత క్రిములు, దుర్వాసన హరిస్తయ్.
2. నీటితో నూరిన నేరేడాకుల ముద్ద పట్టిస్తుంటే శరీరదుర్వాసన తగ్గుతుంది.
3. గసగసాలు 10 గ్రాములు, బాదం 10 గ్రాములు పాలతో నూరి సేవిస్తుంటే రక్తవృద్ధి, దేహపుష్టి.
4. కొబ్బరినీళ్ళు మితంగా రెండుపూటలా సేవిస్తుంటే గుండెకుబలం కలుగుతుంది.
5. కప్పు ద్రాక్షరసం రెండుపూటలా తాగుతుంటే గుండెదడ, గుండెబలహీనత  తగ్గుతయ్.


1. Nimma rasamtoo pallu toomitee danta krimulu, durvaasana haristayi.
2. Neetitoo nuurina neereedaakula mudha pattistunte sareera durvaasana taggutundi.
3. Gasagasaalu 10 graamulu, baadam 10 graamulu paalatoo nuuri seevistuntee raktavruddhi, deehapushti.
4. Kobbari neellu mitamgaa rendu puutalaa seevistuntee gundeku balam kalugutundi.
5. Kappu draaksha rasam rendupuutalaa taagutuntee gundedada, gunde balaheenata taggutai.


                        మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Wednesday, 4 June 2014

చిట్టి చిట్కాలు :

1. నువ్వులు పాలతో నూరి రాస్తుంటే జీడిగింజల వాపు, మంట తగ్గుతయ్.
2. ఆముదపు ఆకులు చితగ్గొట్టి వెచ్చజేసి వేస్తుంటే గజ్జబిళ్ళలు తగ్గుతయ్.
3. పసుపు తేనె కలిపి నూరి పైన పట్టిస్తుంటే దెబ్బలవాపు తగ్గుతుంది.
4. సోంపు చూర్ణం తేనెతో తింటుంటే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
5. అన్నంలో పచ్చి ఉల్లిగడ్డ (onion) తింటుంటే అతిగా వచ్చే నిద్ర తొలగిపోతుంది.
6. మంచి గంధం చెక్క నీటితో సాది పట్టు వేస్తుంటే బొడ్డుపుండు తగ్గుతుంది.
7. మిరియాలపొడి 3 గ్రాములు కప్పు వేడి నీటితో తాగుతుంటే నిద్రలో మాట్లాడటం తగ్గుతుంది.
8. పచ్చి ఉల్లిగడ్డ అన్నంలో తింటుంటే ఆవలింతలు తగ్గిపోతయ్.
9. ఎల్లుల్లి పాయ రసం పైన రాస్తుంటే ఆసనంలో పుట్టిన దురద తగ్గిపోతుంది.
10.వెన్న, నీరుసున్నం కలిపి పట్టిస్తుంటే ఆనెకాయలు హరించిపోతయ్.

Friday, 30 May 2014

నల్లమచ్చలు పోవటానికి

నీలాకాశంలో మబ్బు తునకలులా తెల్లటి పలుచటి చర్మము మీద నల్లటి మచ్చలు.
మబ్బు కమ్మిన నీలాకాశమును చూసి ఆనందిస్తాము. స్వీయదేహకాంతి మీద చీకటిలాంటి మచ్చలు చూసి రోధిస్తాము. ఆ మానసిక రోదన పోవాలంటే...

1. జాజికాయను నీటిలో అరగదీసి గంధం పూయాలి.
2. దోసకాయ రసము తీసి మచ్చలపైన పూయాలి.
3. తోటకుర లేదా కారెట్ రసముతో ఒక చిటికెడు పసుపు చేర్చి రోజూ ఉదయం తాగాలి.
4. చేతులు అందంగా కాంతివంతంగా ఉండాలంటే ఒక స్పూను పెరుగు తరచు చేతులకు వ్రాస్తూ ఉండాలి.
5. రావిచెట్టు బెరడు గంధంగా తీసి పూసిన నల్లమచ్చలు పోతాయి.
6. అల్లం రసాన్ని ఆముదముతో కలిపి చర్మము మీద ఏర్పడిన మచ్చ్లల మీద రాస్తే మచ్చలు పోతాయి.
7. కాలిన పుండ్లు మాడిన తరువాత ఆ చోట తేనెతో ముంచిన దూది వేసి కట్టుకడుతూ ఉంటే కాలిన మచ్చలు పోతాయి.
                                         మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవa

Thursday, 22 May 2014

జుట్టు పెరుగుటకు -నల్లబడుటకు :

1. పసుపు కొమ్ము అరగదీసి ఆ గంధమును తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి.
2. సీతాఫలము ఆకు రసము తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి.
3. గురివింద గింజలు నీటితో ముద్దగా నూరి , తలకి రాసి, ఒక గంట తరువాత స్నానం చేయాలి.
4. వారానికి ఒకసారి కొబ్బరిపాలు తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి.
5. ఉసిరికాయ చూర్ణాన్ని ఒక పాత్రలో నానపెట్టి ఉదయమే అందులో ఒక నిమ్మకాయ పిండి జుట్టుకు పట్టిస్తే ఏపుగా పెరిగి మెరుస్తూ ఉంటుంది.
6. కొబ్బరినూనెలో వెల్లుల్లి పాయలను ఉడికించి తరువాత వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.

Tuesday, 20 May 2014

దంత పటిష్టతకు - నేరేడు పుల్ల :

రోజూ ఉదయమే నేరేడు పుల్లతో పండ్లు తోముకొంటూ వుంటే కదిలే దంతాలు కూడా గట్టిపడతయ్. పుల్లలతో తోముకోవటం అలవాటులేనివారు నేరేడు చేక్కను లేదా పుల్లలను ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకొని , ఆ చూర్ణంతో పండ్లు తోముకోవచ్చు.

చిగుళ్ళవాపుకు - జామ ఆకుతో జయమైన యోగం :

జామ చెట్టు ఆకులను దంచి నీళ్ళలో వేసి కషాయం కాచి, ఆ కషాయం గోరువెచ్చగా వున్నప్పుడు నోట్లో పోసుకొని పలుమార్లు పుక్కిలించి వూసివేస్తుంటే చిగుళ్లవాపు హరించి చిగుళ్ళు గట్టిపడతయ్.

గమనిక: ఇదే విధంగా బాగా పండిన జామ పండుతో కూడా చేసుకోవచ్చు.

                మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ


దంత సౌందర్యం ఎందుకు హరించిపోతుంది ???

ఈ ఆధునిక యుగంలో దంత బాధలు లేనివారు ఒక్కరు కూడా లేరని చెప్పటం అతిశయోక్తి కాదు. దంతాలు కదలటం, వూడిపోవటం, పుచ్చిపోవటం, తీపులు పుట్ట్టటం, లొట్టలు పడటం, చిగుళ్ళు చిట్లటం , నెత్తురు కారటం , వాయటం , మొదలైన సమస్యలు నానాటికీ పెరుగుతున్నయ్. యుక్త వయస్సులోనే కట్టుడు పళ్ళు పెట్టుకునే దౌర్భాగ్యం మనకు కలుగుతుంది.

మూలికలతో కూడిన దంత చూర్ణాలు, వివిధ చెట్ల పుల్లలు దంత దావనానికి ఉపయోగించిన మన పూర్వీకులు, ఇప్పటికీ కొన్ని పల్లేల్లో ఇదే పద్ధతిని అనుసరిస్తున్న గ్రామీణులు, చక్కటి దంత సౌభాగ్యంతో అందమైన పలువరసతో ఆరోగ్యంగా జీవించారు, జీవిస్తున్నారు కూడా.

అయితే రకరకాల పేస్టులతో బ్ర్ష్లష్ లతో పండ్లు తోముకోవటం అలవాటైన నాటినుండీ మన భారతీయుల దంత సౌందర్యం వినాశనం ప్రారంభమైందని మనం ఖచ్చితం గా తెలుసుకోవచ్చు. పేస్టుల్లో నురుగుకోసం పేస్టుల బేస్ కోసం ఉపయోగించే రక రకాల రసాయనిక పదార్షాల వల్ల దంతాల ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుంది. పసితనం నుంచే పళ్ళు సడలిపోవటం , పిప్పి పళ్ళు రావటం , యుక్తవయసులోకి వచ్చేటప్పటికి గట్టిపదార్ధాలను, తీపి పదార్ధాలను తినలేని దుస్థితికి చేరటం, నలభై ఏళ్ళకే పళ్ళు పండుటాకుల్లా రాలిపోవటం మనం చూస్తూనేవున్నాం. పేస్ట్లతో పాటు చల్లటి కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీములు , ఫ్రిజ్ ల్లో వుంచిన అతి చల్లని నీరు , ఆహార పదార్ధాలు , వేడి వేడి టీ, కాఫీలు , గుట్కాలు , సిగరెట్లు , బీడీలు , చుట్టలు అతిగా సేవించటం వల్ల కూడా దంత సౌందర్యం హరించిపోతూవుంది. ఈ అలవాట్లు మానుకోకుండ , ప్రకృతి సహజమైన దంత చూర్ణాలను వాడుకోవడం అలవాటు చేసుకోకుండ , సౌందర్యం కావాలంటే, ఎక్కడనుంచి వస్తుంది. ఎలా వస్తుంది ? మీరే ఆలోచించండి.

టీ.వీ.ల్లో వచ్చే ప్రకటనలు చూసి భ్రమపడకుండ కళ్ళముందు కనిపిస్తున్న నిజాలను , రుజువులను బేరీజు వేసుకుని వాస్తవాలను అవగాహన చేసుకొని శాశ్వత దంత సౌందర్యం కోసం ప్రయత్నించమని కోరుతున్నాను.....

                                     మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

Sunday, 18 May 2014

శ్రమ చేయకపోవటమే సుఖమనుకుంటున్నారా? కాదు, అది మధుమేహానికి మూలం:

ఈనాడు చాలామంది శారీరక శ్రమ చేయకుండా హాయిగా కూర్చొని పనిచేయటమే గొప్ప వరం అని భావిస్తున్నారు. కానీ నిజానికి అదే ఆరోగ్యానికి శాపం అని తెలుసుకోలేకపోతున్నారు. ఉద్యోగాలు చేసేవారు కానీ, వ్యాపారాలు చేసేవారు కానీ, ఉదయం ఇంటినుండి స్కూటరు మీదనో, కారు మీదనో, లేక బస్ లోనే ఆ ప్రదేశాలకు చేరటం, అక్కడ పని చేయటం, సాయంత్రం మళ్ళీ వాహనాలలో ఇంటికి రావటం, తినటం, నిద్రపోవటం జరుగుతుంది.

అలాగే ఇండ్లలో వుండే స్త్రీలకు వళ్ళు వంచి పని చేసే అవసరం లేకుండాపోయింది. ఏ చిన్న పనులున్నా అవి చేయటానికి పని మనుషులుంటునారు. వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్ లు , కుక్కర్లు, గ్యాస్ స్టౌవ్ లు వంటివి వాడకంలోకి రావటం స్త్రీలకు శారీరక శ్రమ తగ్గటం అదే వారి అనారోగ్యానికి మూలకారణం అవుతున్నయ్. అంతేగాకుండా టీ.వీ లు వచ్చిన తరువాత ఎక్కువ గంటలు వాటి ముందు కూర్చుని వుండటం వలన కూడా స్త్రీల శరీరాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ అదనపు కొవ్వు పెరగటమే స్త్రీలలో గానీ పురుషులలోగానీ మధుమేహం వంటి రోగాలు రావటనికి రెండవ ప్రధాన కారణం అవుతుంది. ఈ లోపాలతో పాటు వేళకు భోజనం చేయకపోవటం, తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ భుజించటం, రాత్రిళ్ళు మరీ ఆలస్యంగా భుజించటం, భుజించిన వెంటనే నిద్రించటం వంటి అనేక పొరపాట్ల వల్ల శరీరాలు రోగగ్రస్తమౌతున్నాయ్.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ.


Thursday, 15 May 2014

లివర్ (కాలేయ) సమస్యలకు(జుట్టు, కండ్లకు) :

1. తమలపాకులకు ఆముదం రాసి వేడి చేసి కట్టుకడుతూ వుంటే లివర్ గట్టి పడటం తగ్గి యధాస్థితికి వస్తుంది.

2. నిమ్మ పండ్లరసము, టమేటో పండ్ల రసము, బొప్పాయి పండ్లు తరచుగా వాడుకొంటూ వుంటే  కాలేయము మరియు ప్లీహ వ్యాధులు కలుగకుండ వుంటయ్.

3. పచ్చి గుంటగలగర ప్రతిసారి దొరకని వారు ఒకేసారి గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చుకొని రోజూ పూటకు 3 గ్రాములు మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండుపూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.

4.పచ్చి గుంటగలగర చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొన్ని అన్నంలో కలుపుకొని వారానికి ఒకసారి తింటూ వుంటే ఎప్పటికప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండ వుంటుంది. అంతే గాక వెంట్రుకలు తెల్లబడకుండ, కంటి చూపు తగ్గకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

ఆయువుకు అనాది ఆహారం - ఆరోగ్యానికి పునాది ఆచారం :

మనిషికి ఆయువు, ఆరోగ్యం ఎందుకు? కేవలం తను, తన కుటుంబం ఆనందంగా జీవించటానికి అవసరమైన ఆస్తులు, అంతస్తులు ఆర్జించటానికేనా? వందల వేలమంది పొట్టలు కొట్టి తన పొట్ట దిట్టంగా నింపుకొని సాట్ అమాయక ప్రజల సమాధుల మీద తన కుటుంబానికి పునాది వేసుకొని తరతరాలకు తరగనంత ధనాన్ని కూడబెట్టటానికేనా? ఇదే మనిషి ఆయువుకు ఆరోగ్యానికి పరమావధి కాదు ...

భారతీయ మహర్షులు తమ నిండు జీవితాలను ధారపోసి వేల సంవత్సరాలపాటు ప్రకృతిలోని అణువణువును మధించి పరిశొధించి చరకం, శుశ్రుతం, అష్టాంగహృదయం వంటి ఆరోగ్య శాస్త్రాలను సృష్టించింది ఎందుకు ? మనిషి చిరాయువై స్వార్ధపరుడిగా జీవించాలని కాదు. మట్టిలో పుట్టి, మట్టిలోనే గిట్టీ చెదపురుగుల్లా చరిత్రలేని అపవిత్రుల్లా ఊరు, పేరు లేకుండా చెరిగిపోవాలని కాదు. ప్రతి మనిషి ఈ ఆరోగ్య శాస్త్రాల అండదండలతో సక్రమమైన ఆహార నియమాలను అనుసరించి నిండు నూరేళ్ళపాటు సంపూర్ణ ఆరోగ్యంతో ధర్మార్ధకామ మోక్షాలను సాధించి ముందు తరాలకు ఆదర్సజీవులుగా మిగిలిపోవాలనే మహాలక్ష్యంతోనే మన మహర్షులు తమ ఆయువును ఆహుతి చేసి ఆయుర్వేదాన్ని లోకాననికి అందించారు.

ఈనాడు స్వార్ధమే పరమావధిగా, పరమ లక్ష్యంగా బ్రతుకుతున్న మానవుడు, తను ఎంత సంపాదించినా, ఎన్ని పదవులు ఏలినా చివరు తనను రక్షింపగలిగేది ఆ పదవులు అంతస్థులు కావని, తను చేసిన మంచి, ఆ మంచితో తాను నిలబెట్టుకున్న ఆరోగ్యము, ఆ అరోగ్యం కోసం తాను భుజించే సక్రమమైన ఆహారం. ఆ ఆహార సంపాదనకోసం తాను చేసే శ్రమ, ఆశ్రమలో కలిగే ఆనందం. ఇవే మనిషికి ఇహ పరలోకాల విజయానికి ఉపకరించే ఉత్తమ సాధనాలని ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆచరణలో తమ జీవితాలను పండిచుకోవాలని కోరుకుంటున్నాను..

                                            మాతృదేవోభవ -  పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Saturday, 10 May 2014

నీళ్ళతో కంటి జబ్బులు, కళ్ళక్రింద గుంటలు, నల్లటి వలయాలు పోగొ్ట్టుకోవచ్చు...

ఉదయం నిద్రలేవగానే నోటినిండా మంచినీళ్ళు పోసుకుని పుక్కిలిస్తూ తలవంచి రెండుచేతుల నిండా చన్నీళ్ళు తేసుకుని, కళ్ళు మూడు అంగుళాల దూరం నుంచి ఆ నీళ్ళతో కళ్ళ కొనలను సున్నితంగా తడుపుతూ వుండాలి. ఈ విధంగా రోజుకు ఇరవై అయిదుసార్లు ఉదయం పూట చేస్తూవుండాలి. ఇలా చేస్తూవుంటే క్రమంగా మంచి నేత్రదృష్టి కలిగి కళ్ళజోడు పెట్టే అవసరం లేకుండా పోతుంది. కళ్ళకింది గుంటలు, నల్లటి వలయాలు హరించిపోయి నేత్ర సౌందర్యం ఇనుమడిస్తుంది.

ఎండు ఉసిరికాయతో ఆందం, ఆరోగ్యం..

ఎండు ఉసిరికాయ బెరడు ముక్కల్ని తెచ్చుకుని నిలువచేసుకుని రోజూ పది ముక్కలు మంచినీళ్ళు తాగే కుండలో వేసి, ఆ ముక్కలు నానిన తరువాత ఆ నీళ్ళు తాగుతూ వుండాలి. ఈ అలవాటు సంవత్సరం పొడవునా చేస్తూ వుంటే మీ అందం మీ ఆరోగ్యం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.

Tuesday, 29 April 2014

మజ్జిగ, పాలు, పండ్ల రసం ఎప్పుడు తీసుకోవాలి:

మజ్జిగ ఎల్లప్పుడు మధ్యాహ్నం పూటనే త్రాగాలి. ఆరోగ్యవంతులకు పాలు రాత్రి భోజనం తరవాత , పండ్ల రసాలు ఎప్పుడూ ఉదయం పూట భోజనం చేసిన తరువాతే త్రాగాలి.దీనిని ఎట్టి పరిస్థితిలో మార్పు చేయరాదు. ఎందుకంటే మన శరీరంలో  మజ్జిగను పచనం చేసే ఎంజైములు మధ్యాహ్నం మాత్రమే శరీరంలో స్రవించబడుతుంది. అలాగే పాలను పచనం చేయడానికి సూర్యాస్తమయం తర్వాతనే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అలాగే జ్యూస్ను పచనం చేసే ఎంజైములు ఉదయం పూటనే ఉంటాయి. ఉదయం జ్యూస్, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పాలు అలవాటు చేసుకోవాలి. పిల్ల్లలకు ఈ అలవాటు చేయండి. వారి అరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది వుండదు.

ఫ్రిజ్ లు నిజంగా అవసరమా??అవి లేకుండా బ్రతకలేమా??

తయారైన ఏ ఆహారమైనను 48 నిముషములలోపే ఆ ఆహారాన్ని భుజించాలి.ఎందుకంటే 48 నిముషముల తరువాత అందులో పోషకాలు తగ్గుచూ ఉంటాయి. వండిన 6 గంటల తర్వాత పోషకాలు దాదాపు సగం తగ్గుతుంది, 12 గంటల తరవాత తింటే దాదాపు పోషకవిలువలు లేనట్లే, 24 గంట్ల తరువాత అయితే దుర్గంధం అవుతుంది అని 3500 సంవత్సరాల క్రితమే వాక్భటాచార్య మహర్షి చెప్పారు. అందువలన మనకు అన్నం కానీ కాయగూరలు కానీ ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం ఉన్నదా? మనకు డబ్బులు, 365 రోజులు కరెంటు ఖర్చులు , స్థలము నష్టము.
ఇక అందులే పెట్టిన మంచినీరు, శీతల పానియాలు తాగటం మంచిది అని ఏ డాక్టరునైనా చెప్పమని చెప్పండి ??? చెప్పలేరు, ఎందుకంటే అది వారికి కూడా తెలుసు..ఫ్రిజ్ లు లేకుండా  బ్రతకలేమా????
కాబట్టీ దానిని నిదానంగా దూరం చేయండి.

చేయండి అంటూన్నాను ఎంటా అని అనుకుంటున్నారా? నేను ఫ్రిజ్ కొనలేదు :-) .నా వంతు కర్తవ్యం నేను చేస్తున్నా.. మరి మీరు ?????????????????????...




Monday, 28 April 2014

భూమి వేడిమి తగ్గించటం మన అందరి చేతుల్లోనే వుంది...

మనం దేశంలో వాతావరణ కాలుష్యాలపైన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. వాతావరణము మార్పులు జరిగి చల్లదనము తగ్గి భూతాపము పెరిగిపోతున్నది. వేడిని పెంచే వాటిలో అగ్రస్థానములో నిలిచేవి ఫ్రిజ్ లే. కావున భూమి వేడిమి తగ్గించాలంటే ఫ్రిజ్ లను, ఏసీలను దూరం చేయాల్సిందే..

భూమి వేడిమి తగ్గితే ఈ ఏసీ లు మనకు అవసరమంటారా?
- రాజీవ్ భాయ్(రాజీవ్ దీక్షిత్).

అన్ని ఋతువుల్లో ఒకే ఆహారం - అనారోగ్యానికి విహారం, ఋతు స్వభావాన్ని బట్టి తినే ఆహారం - ఆరోగ్య జీవనహారం.

అన్ని ఋతువుల్లో ఒకే ఆహారం - అనారోగ్యానికి విహారం
ఋతు స్వభావాన్ని బట్టి తినే ఆహారం - ఆరోగ్య జీవనహారం.

ప్రకృతి ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలానికి తగ్గట్లు పండ్లు, కూరగాయలు,చెట్లు (ఔషధాలు) ఒకటేమిటి మానవునికి అవసరమయ్యే అన్నింటినీ సమకూర్చింది. ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనిషి శరీర ప్రకృతి కూడా మారుతుంది. ఆ మార్పును తట్టుకునే ఆహా్రాన్ని మనం భుజించాలి.  ఏఏ కాలాల్లో ఏ  ఆహారం తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తప్పని సరిగా తెలిసివుండాలి. లేకపోతే సంపాదనలో దాన ధర్మాలకు బదులు ఆసుపత్రులకు  ధారపొయ్యాల్సి వస్తుంది. పుణ్యము రాకపోగా కొత్తరోగాలు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువ. ఒక కాలం లో పండాల్సిన కూరగాయలు, పండ్లు ఇతరత్రా.. వేరే కాలం లో పండించటం గొప్ప, సాంకేతిక సాఫల్యం అనుకుంటున్నారు నేటి వ్యవసాయ నిపుణులు. కానీ ప్రకృతి  ప్రతిసంవత్సరం అదేకాలంలో అవే పండ్లు అవే కూరగాయలు ఎందుకు ప్రసాదిస్తుంది ? దాని పరమార్ధం ఎప్పుడైనా తెలుసుకోటానికి ప్రయత్నిస్తే, ఇలా అస్తవ్యస్తంగా కాలం కాని కాలంలో పూసేవి, కాసేవి అన్నీ మానవలోకానికే పెను ముప్పు అని తెలుసుకుని అలా పండించకూడదని అటువంటి ప్రయోగాలు మానుకుంటారు.

పక్క ఊరు రెండు రోజులు వెళ్ళి వస్తేనే నీళ్ళు ఇతరత్రా పడక శరీరం తట్టుకోలేక సుస్తీ చేస్తుంది. అలాంటిది వేరే దేశాలలో ఉన్న ఆహారపు అలవాట్లు, దుస్తుల అలంకరణ, చదువు , విహార వ్యవహారాలు మనదేశంలో వున్నా వారికి ఎలా సరిపోతాయి. ఒకదేశపు ఆహార విహార వ్యవహారలు ( చదువు, పంటలు, వైద్యం , ఆచారాలు ..) అన్నీ ఆదేశపు వాతావరణాన్ని బట్టి నిర్మితమై వుంటాయి. అందువలన అవి మనకు సరిపడవు. మనపూర్వికులు అమలు చేసిన ఆచారాలే మనకు అమృతభాండాలు. వాటిని ఆచరిస్తేనే ఈ సమాజం మరళ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. దానికి మనమందరం బాధ్యులం. ఎందుకంటే మనదేశపు మంచికి చేడుకు మనమే కారణం. మార్పు ప్రతిఒక్కరిలో వస్తే ఇల్లు వీధి ఊరు పట్ట్ణం రాష్ట్రం  దేశం మొత్తం మారిపోతుంది. మార్పు నాలో నీలో అందరిలో రావాలి. ఎందుకంటే మార్పు సహజం, మార్చుదాం మన అలవాట్లని.....

Sunday, 27 April 2014

పిల్లల శాస్వత ఆరోగ్యానికి :

పిల్లలకు నాలుగవ నెల నుండి రోజూ ఉదయం పరగడుపున రెండు గ్రాముల దేశవాళీ ఆవు వెన్న కొంచం కండచక్కెర పొడి కలిపి ఒకటిన్నరేండ్ల వయస్సు వచ్చే వరకు తినిపించాలి. పదిరోజులకొకసారి చిటికెడు వెన్నను పెంచుతుండాలి.
దీనివల్ల పిల్లల్లో అసాధారణమైన వ్యాధినిరోధకశక్తి పెరిగి అన్నిరకాల మార్పులను తట్టుకోగలుగుతారు. వారి రూపం, భాష అన్నీ బహుసుందరంగా మారతయ్.

సమస్త చెవి వ్యాధులకు అద్భుతమైన యోగం :

దేశవాళీ ఆవు నెయ్యి 10 గ్రాములు తీసుకుని అందులో వెల్లుల్లిపాయలో వుండే మూడురేకలను వేసి చిన్న మంటపైన ఆ రేకలు ఎర్రబడేవరకు కాచి తరువాత వాటిని తీసివేయాలి. ఈ నేతిని ప్రతిరోజూ రెండుపూటలా గోరువెచ్చగా మూడు చుక్కల మోతాదుగా చెవుల్లో వేస్తుండాలి. ఇలా చేస్తుంటే క్రమంగా చెవిపోటు, చెవిలో హౌరు , చెవిలో చీము కారడం, చెవిలో కురుపులు రావడం, చెవుడు మొదలైన సమస్యలు హరించి శ్రవణశక్తి బాగా మెరుగుపడుతుంది. 

Thursday, 24 April 2014

బంక విరేచనాల పోవటానికి నెయ్యి వేడి నీరు..

వేడీ నీళ్ళలో కొంచం నెయ్యి కలిపి పూటకు ఒక కప్పు లేదా రెండు కప్పుల నీళ్ళు చొప్పున రెండుపూటలా తాగుతూవుంటే బంక విరేచనాలు బంద్ అవుతాయి.

Wednesday, 23 April 2014

లవణం (ఉప్పు ) వలన నష్టాలు :

* శరీరంలో అమితమైన వేడి పుట్టిస్తుంది. రక్తాన్ని దూషింపచేసి రక్త వ్యాధులు కలిగిస్తుంది.
* అమితమైన దాహాన్ని కలిగించి శరీరం స్పృహ కోల్పోయేటట్లుగాను, మూర్చ వ్యాధ్హులకు గురయ్యేటట్లుగాను చేస్తుంది.
* ఉప్పును అధికంగా వాడటంవల్ల శరీరమంతా అమితంగా వేడెక్కుతుంది. తరచుగా విరేచనాలను కలిగిస్తుంది.
* మాంస కండరాలు కరిగిస్తుంది, కుష్టు వ్రణాలు, గడ్డలు మొదలైనవి పగిలి స్రవించేటట్లు చేస్తుంది.
* శరీరమంతా క్రమంగా త్వరితగతిన ముడతలు పడిపోయి బలహీనమయిపోయి, ఇంద్రియపటుత్వం తగ్గిపోతుంది.
* వెంట్రుకలు త్వరగా నెరసిపోయి వూడిపోతయ్. బట్టతల కూడా సంప్రాప్తిస్తుంది.
* ఇంకా రక్తపిత్తవ్యాధి, ఆమ్ల పిత్త వ్యాధి, వాతరక్తవ్యాధి, విసర్పులు మొదలైన వ్యాధులను కూడా కలిగిస్తుంది.

Saturday, 19 April 2014

చర్మ రోగాలు (ఎక్జిమా, సొరియాసిస్ మొదలైనవాటికి)

చర్మ వ్యాధులు వున్నవారికెవరికైనా వారి శరీరంలో సల్ఫర్ లోపించిందని గమనించాలి. భారతీయ గోమూత్రంలొ సల్ఫర్ విరివిగా వుంటుంది. గోమూత్రం లోపలికి తీసుకుంటూ, పై పూతగా వాడుకుంటుంటే మూడు నెలలో చర్మ రోగాలే కాకుండా సొరియాసిస్, ఎక్జిమా,మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు , దగ్గు(20 ఏళ్ళగా వున్నా దగ్గులు కూడా), జలుబు  పూర్తిగా పోతుంది.
గోమూత్రం సేవించాక ఒకసారి టి.బి తగ్గిందంటే జీవితంలో మరళా రాదు. తెలియకుండానే ఎన్నో వ్యాధులు తగ్గిపోతాయి.

చీ.. గోమూత్రమా అని చాలామంది అసహ్యించుకుంటారు. కానీ దాని విలువ చెప్పటం చాలా కష్టం. ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే...

వాతానికి . మూడింటికీ చెందిన 48 రోగాలు సమూలంగా పోతాయి. అన్ని రకాల రాచపుండు వ్యాధులతో సహా(Cancer)

గోమూత్రం గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటూ ఉందాం .......

లవణము(ఉప్పు లాభ నష్టాలు):

* ఉప్పును ఆహార పదార్ధాలలో కలిపి వాడటం వల్ల అది శరీరంలోని విషపు నీరును దగ్ధము చేసి మాలిన్యాలను తీసివేస్తుంది. ఆకలిని వృద్ధిచేసి మల పదార్ధాలను సక్రమంగా విసర్జింపచేస్తుంది.
* పేరుకుపోయిన కఫము, విషపదార్ధాలు, గట్టిగా వుండలు కట్టిన మలము,జీర్ణము కాని అన్య పదార్ధాలు వీటన్నిటిని తన శక్తితో ముక్కలు ముక్కలు చేసి బయటకు నెట్టివేస్తుంది. అన్నాశయం అపక్వ పదార్ధాలతో నిండివున్నప్పుడు ఆ పదార్ధాలను బలవంతంగా తోసివేసి ఖాళీ ఏర్పరుస్తుంది. కడుపులోని వాత వాయువును హరింపచేస్తుంది.
* శరీరమునందలి కీళ్ళపట్లు, తాడుతో బంధించినట్లుగా కలిగే కాళ్ళు చేతుల నొప్పులు నిమ్మళింపచేస్తుంది.
* శరీరంలోని తక్కిన రసాలను అణగదొక్కి తనదే పై చేయిగా చేస్తుకుంటుంది.
* ఉప్పు గురు గుణాన్ని, వేడి చేసే స్వభావాన్ని, చమురు తత్వాన్ని మితంగా కలిగివుంటుంది.

ఇన్ని మం చి గుణాలు ఉన్నప్పటికి కేవలం ఉప్పునే ఎక్కువగా ఉపయోగిస్తే అది అనేక వ్యాధులను కలుగచేస్తుంది.. అవి ఎంటొ తరువాత తెలుసుకుందాం...

Thursday, 10 April 2014

రాత్రిపూట ఉద్యోగాలు చేసే వారికోసం :

ఈ నిఖిలచరాచరాలలో అన్ని జీవరాశులు ప్రకృతికి అనుసంధానంగా , ప్రకృతిని అనుసరించే ఉంటాయి, ఒక్క మానవుడు తప్ప . ఈ కలియుగంలో వ్యతిరేఖ భావాలు, వ్యతిరేఖ మనస్తత్వాలు, వ్యతిరేఖ జీవనం సహజమైపోయింది. ఈ వ్యతిరేఖ జీవనం పోషణ కోసం కొందరు సాగిస్తుంటే, విలాసాలకోసం మరికొందరు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరైతే ప్రకృతికి వ్యతిరేఖంగా జీవిస్తారో వారు అనారోగ్యాల భారిన పడక తప్పదు.నిప్పును తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకునా కాలక తప్పదు. అందుకే ఆనాటితో పోల్చుకుంటే నేడు రోగాల సంఖ్య, రోగుల సంఖ్య వాటితో పాటు అరకొరగా చదివి పాసయిన డాక్టర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది.
అయితే ఈనాడు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేయటానికి ఉద్యోగావకాశాలు కూడా అలగే వున్నాయి, కుటుంబ పో్షణకోసమో , అధిక ధనసంపాదనకోసమో రాత్రి పూట పని చేయటానికి పరుగులు తీస్తున్నారు. బ్రతకటానికి ఉద్యోగం చేయాలి కాబట్టి , ఇష్టం లేకపోయినా కష్టమైనా కొంతమంది రాత్రిపూట ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది.అలాంటి వారు ఈ క్రింది నియమాలను పాటించాలి.

* రాత్రిపూట జీవశక్తి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం విశ్రాంతిలో ఉండటం వలన జీవశక్తిని నరనారన నింపుకో్వటానికి అవకాశం దొరుకుతుంది.అందువలన ప్రత్యామ్నాయంగా వీలయినప్పుడల్లా ధ్యానం చేయాలి.
* ఉదయం గానీ , సాయంత్రం గానీ యోగాసనాలు తప్పకుండా వేయాలి.
* ఉదయం , రాత్రి బాగా తినాలి.
* బాగా నమిలి తినాలి, ఎందుకంటే పగటి నిద్ర అవసరం కాబట్టి,త్వరగా అరగాలి కాబట్టి . అలా తినకపోతే అజీర్ణం తద్వారా షుగరు, గ్యాసు, వాత నొప్పులు , సుఖవిరేచనం కాకపోవటము మొదలైన చాలా సమస్యలు వస్తాయి.
* తినగానే వెంటనే నిద్రపోకూడదు.
* మధ్యాహ్నం అల్పాహారం తినాలి. అతిగా తినకూడదు.
* తినే ముందు , తిన్నవేంటనే నీళ్లు తాగకూడదు.
(ఆహారం తినే 40 నిముషాల ముందు , తిన్న తరువాత 40 నిముషాల వరకు నీళ్ళు త్రాగరాదు.అత్యవసరం అనిపిస్తే రెండు మూడు బుక్కలు తాగవచ్చు)
* రాత్రి తినగానే పనికి ఉపక్రమించరాదు.
* పైన చెప్పిన విధం గా ఆహారం తీసుకుని , రాత్రి ఎన్ని గంటలు నిద్రపోతారో, పగలు అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోవటమో లేదంటే కొంత సమయం ధ్యానం చేయటమో చేయాలి.
* అతి ముఖ్యమైనది :తప్పక బ్రతుకు తెరువు కోసం రాత్రిపూట ఉద్యోగం చేయాల్సి వస్తుందని ప్రకృతిమాతకు క్షమాపణ చెప్పుకుని ఆరోగ్యం కాపాడమని ప్రార్ధించాలి.

గమనిక: ఈ రాత్రి పూట ఉద్యోగాలు చేసే వారికి , గ్యాస్ , అజీర్ణం, పొట్ట ఉబ్బరం, పొట్ట పెద్దది అవటం, కీళ్ల నొప్పులు సమస్యలు అధికంగా వుంటాయి. దానికి ఇంటివైద్యం లో వామ్ము, మిరియాలు సైంధవలవణం తో ఒక మంచి ఔషధం ఉంది , చూసి , చేసుకుని వాడుకోగలరు. 

Thursday, 3 April 2014

వడదెబ్బ నుండి రక్షణ పొందుటకు:

నీటిలో చింతపండును బాగా పిసికివడపోసి తగినంత పంచదారకలిపి కొద్ది కొద్దిగా రెండుమూడు పూటలు తాగుతూవుంటే వడదెబ్బవలన కలిగిన నీరసం బలహీనత తగ్గిపోతయ్. ఎండాకాలంలో రోజూ కొద్దికొద్దిగా ఈ పానకం సేవించేవారు ఎండలో తిరిగినా కూడా వడదెబ్బ తగలదు.

పుండ్లు పడి చర్మం మందమైతే:

కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మం పైన పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారవుతుంది, అలాంటివారు ప్రతిరోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు తీసుకుని మెత్తగా నూరి ఆముద్దను పైన వేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగా వున్న చర్మం తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది.

రేచీకటి పోవటానికి :

1. ఈ సమస్యతో బాధపడేవారు వరుసగా 1,2 వారాల పాటు రెండుపూటలా గోంగూరతో వండిన కూరగానీ పచ్చడిగానీ తినాలి. గోంగూరలో ఇనపధాతు శక్తి ఆహారం ద్వారా దృష్టిలోపాన్ని సరిచేసి రేచీకటిని పోగొడుతుంది.
2. లేత ఆముదం చెట్టు చిగుళ్ళు రోజూ నాలుగైదు తింటుంటే రేచీకటి పోతుంది.
3. అరచుక్క వేపాకు రసం నిద్రించేముందు కళ్ళకుపెడుతుంటే రేచీకటి తగ్గుతుంది.
4. దేశవాళీ తమలపాకులు బాగా కడిగి, దంచి వడపోసి రాత్రినిద్రించే ముందు రెండు చుక్కల రసం కళ్ళలో వేసుకుని తరువాత నీటితో కడుగుతుంటే వారం రోజుల్లో రేచీకటి తగ్గిపోతుంది.
5. ప్రతిరోజూ అవిసెపూలను గానీ, మొగ్గలనుగానీ కూరగా వండుకుని అన్నంలో కలుపుకుని వరుసగా 21 రోజులు తింటూంటే రేచీకటి రోగం హరించిపోతుంది.

Wednesday, 2 April 2014

చిట్టి చిట్కాలు :

* వేపాకును నీటితో దంచితీసిన రసం ఒకచుక్క కంట్లో వేస్తుంటే రే్చీకటి తగ్గిపోతుంది.
* గుప్పెడు వేపాకు లీటర్ నీటిలో వేసి కాచి ఆవిరిపడుతుంటే చెవిపోటు చెప్పకుండా పారిపోతుంది.
* వేపాకు, ఉప్పు  కలిపిన రసం నాలుగు చుక్కలు వేస్తే చెవిలో దూరిన పురుగులు చచ్చి పడతయ్.
* రోజూ మామిడి పుల్లతో పళ్ళు తొముతుంటే నోటి దుర్గంధం హరించి నోరు పరిమళమౌతుంది.
* ఉల్లిగడ్డ నూరి పట్టు వేస్తుంటే గొంతువాపు, నొప్పి త్వరగా తగ్గిపోతయ్.

Tuesday, 1 April 2014

ఉగాది విశిష్టత : అందరికి జయనామ సమ్వత్సర శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా -.ఇంటివైద్యం

మనజాతి పుట్టినరోజు, మన భాషకు గుర్తింపు వచ్చినరోజు, తొలి తెలుగు సామ్రాజ్య స్థాపన జరిగిన రోజు, తెలుగువారి వీర విక్రమ పరాక్రమ పౌరుషజ్వాలలు మిన్నంటిన రోజు, వసంతఋతుశోభతో తొలి సృష్టి ప్రారంభమైన రోజు, ఆరోగ్య సౌభగ్యమహాభాగ్యాలందించే ఓషధులకు జీవభావ ప్రభావాలు పల్లవించినరోజు, అదే తెలుగువారి నూతన సంవత్సర పర్వదినమైన ఉగాదిగా రూపుదాల్చింది.

విక్రమాదిత్యుని బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగుజాతి, శాతవాహనుడి ఆధ్వర్యంలో శివమెత్తిన శివంగులై విక్రమాదిత్యుని ఉత్తరభారతం వరకు తరిమికొట్టి సువిశాల తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న అలనాటి వీరగాధలు వింటూ ఆ వీరుల పౌరుషాగ్నిజ్వాలలను నరనరాన నింపుకోవలసినరోజిది. సాక్ష్యాత్తు లక్ష్మిస్వరూపమైన వేపచెట్టు పూల రేకలతో తయరైన ఉగాది పచ్చడిని సేవిస్తూ ఆ సంవత్సరాంతం వరకు వ్యాధిరహితులుగా జీవించడానికి పునాది వేసుకోవలసిన రోజిది. తెలుగు భాషకు తీయందనాలంద్దిన కవిత్రయ అష్టదిగ్గజాది కవివరేణ్యుల కమనీయ కవితా శ్రవంతులలో ఈదులాడవలసిన రోజిది..

ఉగాది అసలు పేరు 'యుగాది' అంటే్ నక్షత్రగమనమార్పు మొదలైనరోజు, అలాగే యుగమునకు ఆది అని అర్ధం. యుగం అంటే సంవత్సరం  అని కూడా అర్ధముంది. అనగా కొత్త సంవత్సరానికి మొదలు అని కూడా అర్ధం. అందుకే ఈ పండుగను 'సంవత్సరాది ' అని  కూడా అంటారు
ఈ పండుగ ప్రతీ ఏడాది చైత్రమాసంలో శుద్ధ పాద్యమినాడు ప్రారంభమౌతుంది.ఆరోజే వసంత నవరాత్రులు కూడా ప్రారంభమౌతాయ్. విక్రమార్కుని పై శాతవాహనుడు సాధించిన ఘనవిజయానికి గుర్తుగా, తొలి తెలుగు సామ్రాజ్య ఆవిష్కరణకు నాందిగా  వసంత నవరాత్రులు జరుపుకోవడం తరతరాలుగా తెలుగువారి సంప్రదాయం . ఋతువులకు రాజైన వసంతఋతువులో వేప, మామిడి మొదలైన జీవవృక్షాలన్నీ చిగురించి పూలుపూసి మధురమకరందాలతో మహాశోభాయమానంగా విరాజిల్లుతుంది. వేప,మామిడి చెట్లకు ఈకాలంలో పూసే పూవుల్లో అనంతమైన జీవశక్తి దాగివుంటుంది. అందుకే ఆ జీవశక్తిని ఉగాదిపచ్చడి రూపంలో పండుగనాడు తినటం ద్వారా అ సమ్వత్సరమంతా దాని ప్రభావంతో వాత పిత్త కఫ సంబంధమైన ఏ వ్యాధి రాకుండా కాపాడగల ఆరోగ్యసంప్రదాయం కూడా ఈ పండుగలో దాగి వుంది.

 

Monday, 24 March 2014

రక్తపైత్య వికారాలకు గరిక :

గరిక రసాన్ని 20 గ్రాములు లోపలికి సేవిస్తుంటే రక్త విరేచనాలు , రక్త మొలలు , మూత్రంలో రక్తం పోవటం, నోటినుండి రక్తం పడటం వంటి రక్తపైత్య వికారాలు కూడా అణగిపోతయ్.

ముక్కు నుండి కారే రక్తానికి :

పిల్లలకు గానీ, పెద్దలకు గానీ దెబ్బ తగిలి లేదా అధిక పైతం చేసి ముక్కు బెదరి రక్తం కారుతుంటే వెంటనే గరికవేరును కడిగి దంచి రసంతీసి ఐదారు చుక్కలు రెండుముక్కులలో వేస్తే  అప్పటికప్పుడే రక్తం కట్టుకుంటుంది.

చర్మరోగాలకు గరిక:

గరికగడ్డి, మంచి పసుపు (ఇంట్లో కొట్టుకున్నది) సమంగా కొంచెం నీరు కలిపి మెత్తగానూరి పైన రుద్దుతూవుంటే దురదలు, దద్దుర్లు, చర్మరోగాలు హరించిపోతయ్.

Garika gaddi, manchi pasupu (intlo kottukunnadi) samamgaa konchem neeru kalipi mettagaa nuuri paina ruddutuuvunte duradalu, daddurlu,charmaroogaalu harinchipotay.

మూత్రపిండరాళ్ళకు గరిక:

పరిశుభ్రమైన చోట పెరిగిన గరికను తెచ్చి కడిగి దంచి తీసిన రసం రెండు మూడు చెంచాల మోతాదుగా రెండు పూటలా సేవిస్తుంటే 20 రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపడిపోతయ్.

Sunday, 23 March 2014

ఏన్నో క్రూర రోగాలకు - తిప్పతీగ :

రోజూ ఉదయం లేక సాయంత్రం ఆహారానికి అరగంట ముందు ఒక్క తిప్పతీగ ఆకును శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా నమిలితింటూ వుంటే 15 నుండీ 30 రోజుల్లో అధిక రక్తపోటు , కొలెస్త్రాల్, మధుమేహం, దగ్గు, ఉబ్బసం, పాతజ్వరాలు, చర్మం పై గుల్లలు, పుండ్లు, గాయాలు, అతికొవ్వు, మూత్రావయవాల్లో రాళ్ళు , మూత్రనాళంలో పుండు, లివర్ పెరుగుదల, ప్లీహాభివృద్ధి, సకల వాతనొప్పులు మొదలైన అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులోకివస్తయ్.

Wednesday, 19 March 2014

తులసి వున్న ఇంట్లోకి ఏ రోగమైనా ప్రవేశించగలదా?

" తులసి మొక్కల గాలి తగిలన చాలు 
అంటు వ్యాధుల క్రిములన్ని అణగిపోవు, 
సర్వవ్యాధి నివారణ శక్తి యున్న 
తులసి ఇంటింట శుభములు కలుగజేయు ."

తులసి మొక్క మానవజాతి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి అందించిన అమూల్యమైన వరం. దీని గొప్పతనాన్ని చెప్పాలంటే గంటలు,రోజులు, నెలలు కూడా చాలవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులందరికి వచ్చే అన్ని రకాల జబ్బుల్ని అంటే కడుపునొప్పి నుంచీ క్యాణ్సర్ వరకు ఏ జబ్బులైనా అవలీలగా తగ్గించగల అద్భుతమైన ఔషధీ రాజం ఈ తులసి.

శ్రీకృష్ణుడు ఎల్లవేళల విహరించే బృఉందావనం - మరేదో కాదు తులసివనమే. ఆయన ఎల్లప్పుడూ తులసి మాలను ధరించి, తులసి తీర్ధం తాగుతూ, తులసీ వనంలో విహరించడంవల్ల అంతటి శక్తివంతుడు కాగలిగాడు.
తులసీ జలంధరుల కధ మీరు వినే ఉంటారు. ఆనాడు సమస్త లోకల్ని గడగడలాడించి తన ఔన్నత్యాన్ని నిరూపించుకున్న ఆ తులసీ మహా పతివతే, భూలోకంలో ఈ తులసిగా అవతరించి మనుషుల ఆరోగ్యాన్ని అంటు వ్యాధుల్ని తరిమి కొట్టీ, పాపాల నుంచి శాపాల నుంచి విముక్తుల్ని చేసి మనకు శానిని, సుఖాన్ని కలిగిస్తుంది అని మన పురాణాలు తెలుపుతున్నాయి.

అంతే కాదు ఈనాడు ప్రపంచంలోని అనేకమంది ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కూడా ఈ తులసి సర్వ వ్యాధుల్ని నివారించగల తిరుగులేని ఔషధం అని ఏకగ్రీవంగా తీర్మానించారు.
(ఇంకా వుంది )

Thursday, 13 March 2014

పిత్తాశయం ఏమి చేస్తుంది :

పిత్తాశయం మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం.అది శరీరంలో ఉష్ణం ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా సమస్థితిలో ఉండేటట్లు చేస్తూ కాలేయానికి హానికలుగకుండా కాపాడుతుంటుంది. అంతటి ప్రధానమైన పిత్తాశయాన్ని చిన్న రాయి పుట్టిందనే కారణంతో తీసివేయాలనుకోవటం సరికాదు. ఒకవేళ పొరపాటుగానో గ్రహపాటుగానో దాన్ని తీసివేస్తే ఆతరువాత శరీరంలో ఉష్ణం అతిగా ప్రకోపించి కాలేయం బాగుచేయడానికి వీలులేని విధంగా దెబ్బతింటుంది. 

మూత్ర నాళంలో రాళ్ళు అడ్డు పడితే:

మూత్రపిండాలలోని రాళ్ళను కరిగించటానికి ఔషధాలు వాడినప్పుడు, ఆ రాళ్ళు మూక్కలై క్రిందికి జారి మూత్రనాళంలో అడ్డు పడి మూత్రం బిగుసుకు పోతుంది. దానివల్ల భరించలేని బాధ కలుగుతుంది.
అలాంటి విపత్తులో పెసలు 400 గ్రాములు తీసుకుని పప్పుగా వండి, అందులో రెండు లీటర్ల నీళ్ళు పోసుకొని పాత్రను దించి కదిలించి వుంచాలి. కొంతసేపటికి ఆ పాత్రలో పప్పు క్రిందికి దిగి పెసరకట్టు నీరులాగా పైకి తేలుతుంది.
పాత్రను మెల్లగా వంచి పై నీటిని వంచుకొని తాగుతూవుంటే మూత్రనాళంలో అడ్డుపడిన రాళ్ళు  కరిగి మూత్రం ద్వారా బటకు వస్తయ్.

Wednesday, 12 March 2014

రక్తపోటుకు కారణాలు :

                                                                ఓం శ్రీ గురుభ్యోనమ: 

ఈ ఆధునిక కాలంలో, మనం తినే ఆహారమంతా విష రసాయనాలతో కలుషితమైపోయింది. బియ్యం, ధాన్యాలు,కాయగూరలు, ఒకటేమిటి సమస్త ఆహారపదార్ధాలు తీవ్రమైన రసాయనిక ఎరువులతో పండించ బడటం వల్ల, ఆ విషాలన్నీ మన శరీరాల్లో పేరుకుపోయి, రక్తము, మాంసము, మేదస్సు మొదలైన సప్త ధాతువులన్నీ బలహీనమై, వ్యాధినిరోధక శక్తి క్షీణించిపోతుంది. ఎప్పుడైతే శరీరం క్షీణిస్తుందో, అప్పుడే బుద్ధి కూడా వక్రిస్తుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడిని కలిగించే రకరకాల వ్యాపారాలవల్ల ధన వ్యామోహం వల్ల, కుటుంబ కలహాల వల్ల, అసూయ,ద్వేషం, స్వార్ధం, అక్రమం ఇవన్నీ దైనందిన జీవీతంలో  ప్రధాన భాగం అవటంవల్ల, మనసు తీవ్రమైన అందోళనకు గురి అవుతుంది.

ఈ విధంగా శరీరం, మనసు కలుషితం కావటం వల్ల రక్త ప్రసరణలో పెను మార్పులు జరిగి, అధిక రక్తపోటుకో, అల్ప రక్తపోటుకో దారితీస్తుంది.

ఎవరైనా గోఆధారిత వ్యవసాయం చేసి అటు మన గోజాతిని, మన తోటి వారిని రక్షిస్తారని ఆశిస్తున్నాను.


కేరేట్ :

పచ్చి కేరేట్ దంత క్షయాన్ని నివారించడమే కాక కేరేట్ రసం గుండే జబ్బులున్నవారికి వర ప్రసాదం, శిరోజాలు రాలకుండా, కంటి వ్యాధుల నివారణకు,వీర్యవృద్ధికి ఇదెంతో దోహదపడుతుంది.

Monday, 10 March 2014

మూత్రపిండ (kidney stones)రోగాలు ఎందుకు పెరిగిపోతున్నయ్ ?తప్పక తెలుసుకోవాలి...

గత కాలంలో అతి కొద్దిమందికి మాత్రమే ఏర్పడుతున్న ఈ సమస్య ఈనాడు లక్షలాది మందిని ఎందుకు పీడిస్తుంది?

పూర్వకాలం దాదాపు అందరూ దంతధవనానికి వేపపుల్ల, ఉత్తరేణివేరు వంటి సహజమార్గాలను అనుసరించేవారు. ఈ పుల్లలలోని ఔషధశక్తి గొంతులోకి దిగుతూ, ఎల్లవేళలా గొంతులోని విశుద్ధ చక్రస్థానంలో ఉన్న థైరాయిడ్ గ్రంధిని సమతౌల్యంగా కాపాడేది.

ఆ కారణంగా థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా వుంటూ, రోజూ తినే ఆహారంలోని సున్నాన్ని జీర్ణంచేస్తూ ఎములకు పుష్టినిస్తూవుండేది. ఆ కారణంగా సున్నం నిలువ వుండేది కాదు.

ఈ ఆధునికయుగంలో ఇంగ్లీష్ వారిని చూసి తెలుగు వాళ్ళు కూడా తమ తరతరాల  అరోగ్యనిధి అయిన వేప, ఉత్తరేణి పుల్లలను విడిచిపెట్టి అనేక విషవికృత రసాయనాలతొ తయారైన పేస్టులను దంతదావనానికి వాడుతున్నారు. వీటి ప్రభావం వల్ల కొంత కాలానికి థైరాయిడ్ గ్రంధిలో  లోపాలు ఏర్పడి, అది ఆహారంలోని సున్నాన్ని జీర్ణింపచేయలేని స్థితికి చేరుకుంటుంది.

రోజు కొద్దికొద్దిగా మిగిలిపోయే సున్నం క్రమక్రమంగా మూత్రపిండాలలో పేరుకుపోతూ రాళ్ళుగా మారుతుంది. ఈ సమస్య భవిష్యత్తులో అయినా సమూలంగా నిర్మూలించాలంటే మనమంతా దంతదావనానికి సాంప్రదాయ పద్ధతులను ఆచరించాలని నా ప్రియ స్నేహితులను కోరుకుంటున్నాను.

పళ్ళు, చిగుళ్ళ నుండి రక్తం కారుతూ నోరు వాసన వస్తుంటే:

కొంతమందికి పండ్లు తినేటప్పుడు, అన్నంగానీ, మరేదైన తినేటప్పుడు, ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా, పండ్లు చిగుళ్ళ నుండి చీము,నెత్తురు కారుతూ నోరంతా గబ్బుకొడుతూ వుంటుంది.
ఎందుకని : అన్నవాహికలో క్రిమిదోషమ్వల్ల గానీ, మేహఉడుకువల్లగానీ, విషరసాయనాలతో కూడిన పేస్టులను అధికంగా వాడటంతో దంతక్షయం కావటం వల్లగానీ ఈ సమస్య వస్తుంది.
పరిష్కారం : నీరుల్లిగడ్డను అతి మెత్తనిగుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి. లోపల బయటబాగాల్లో కూడా రుద్దాలి. రుద్ధిన తరువాత అరగంట ఆగి గోరువెచ్చని నీటితో పండ్లు కడగాలి. ఇలా వారం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి వేధించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళీ కనిపించకుండా పోతుంది.

మూత్రవ్యాధులకు : నీరుల్లిగడ్డ (Onion)

రోజూ మజ్జిగన్నంలో ఒక నీరుల్లిగడ్డ తినేవారికి జీవితంలో ఎప్పటికీ మూత్రవ్యాధులు రాబోవు.

అతిసారం :

1. పలుచగా కాచిన బియ్యపు గంజిలో దోరగావేయించి దంచిన జిలకర్రపొడిని పావుచెంచా,సైంధవలవణం అరచెంచా కలిపి తాగుతూ వున్నా అతిసారం ఆగిపోతుంది.
2. దానిమ్మ పండు పైతొక్కు తీసి 20 గ్రాములు మోతాదులో ఒక గ్లాస్ నీటితో నలగ్గొట్టీ వేసి,కప్పుకషాయానికి మరిగించాలి. వడపోసి,చల్లర్చి తాగితే అతిసారం హరిస్తుంది.
3. ఒక గ్ర్లాసు నీటిలో ఒక జామాకు వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి, చల్లార్చి సేవిస్తూ ఉంటే అతిసారం అతి త్వరగా తగ్గిపోతుంది.
4. బార్లీ గింజలతో పలుచగా జావకాచి అంద్లో ఒకచెంచా చక్కెర, రెండు చెంచాల నిమ్మరసం కలిపి తాగుతుంటే అతిసారం ఆగిపోతుంది.

ప్లీహ(Spleen)రోగం

1. తులసి రసం రెండు చెంచాల మోతాదుగా రెండుపూటలా త్రాగుతుంటే ప్లీహరోగం కుదురుతుంది.
2. కలబంద రసం (లోపల గుజ్జు) 10 గ్రాములు,మంచి పసుపు 5 గ్రాములు కలిపి సేవిస్తూ ఉంటే ప్లీహరోగం పరిసమాప్తం.

మర్రి ఊడలు : ఉబ్బురోగం

మర్రి ఊడలు నూరి వంటికి లేపనం చేస్తుంటే వళ్ళంతా వాచిన ఉబ్బురోగం హరించిపోతుంది.

Sunday, 9 March 2014

ముఖ పక్షవాతానికి :

వెల్లుల్లిపాయ రెబ్బల్ని వాటికి రెందింతలు నువ్వులనూనె కలిపి మెత్తగా దంచి నూరి ఆ ముద్దను నిలువ చేసుకోవాలి. దీనిని ఉదయం, సాయంత్రం వేళల్లో భోజనం తరువాత 3 గ్రాములు మోతాదుగా తింటూ వుంటే, గాలి దెబ్బకు మేఘాలు ఎలా చెల్లా చెదరైపోతాయో అలగే ముఖానికి ఆవరించిన పక్షవాతం పారిపోతుంది.

ఆహారం నుంచి సప్తధాతువులు ఎలా తయారవుతాయి : Must know...

మనం తినే ఆహారం అన్నశయంలోని జఠరాగ్ని చేత చక్కగా పచనము చేయ బడినదై, రసము, మలము అనెడి రెండు ప్రధాన విభాగాలుగా మారుతుంది. వీనిలో మొదటిదైన రసము అనే ధాతువు నుండి రక్తము, రక్తము నుండి మాంసము, మాంసము నుండి కొవ్వు, కొవ్వు నుండి ఎముక, ఎముక నుండి మజ్జ, మజ్జ నుండి వీర్యము, వీర్యము నుండి ఓజస్సు తేజస్సు గా రూపాంతరం చెందుతుంది. వీనినే సప్తధాతువులు అని పిలుస్తారు. ఈ ఏడు  ధాతువుల నుండి ఉత్పన్నమయ్యే పోషక శక్తులు శరీరంలోని పంచేంద్రియాలను కాపాడే జీవద్రవ్యాలుగాను, శరీరంలోని కీళ్ళు వాటికి అనుసంధానంగా వుండే నరాలు మొదలైన సమస్త శారీరక అవయవాలను పోషించే పోషకద్రవ్యాలుగాను వినియోగపడుతుంటయ్.
ఇక పైన చెప్పిన రెండవ ప్రధాన విభాగమైన కిట్టము అను పేరుగల మలము వలన చెమట,మూత్రము, విసర్జింపబడే పురీషము అనెడు మలము, ముక్కులో పుట్టే మము, ముఖము మేద పుట్టే మలము, రోమ కూపాలనుండి పుట్టే మలము, తల వెంట్రుకలు, మీసము, గడ్డము, శరీఋఅముపైన రోమాలు, గోళ్ళు మొదలైన పదార్ధాలుగా రూపాంతరాలు చెందుతూ ఆయా భాగాలను పోషిస్తూ వుంటుంది.

ఈ విధంగా ఆహారము వలననే పుట్టే రసము, కిట్టము అనే మౌలిక  పదార్ధాల సమత్వం వలననే శరీరం ఎల్లవేళలా క్రమ పద్ధతిలో పోషింప బడుతూ, మానవులను సర్వాంగ సుందరులుగా, కాంతి మంతులుగా, బలవంతులుగా, సుఖజీవులుగా, శతాధిక ఆయుష్మంతులుగా తీర్చి దిద్దుతూ వుంటుంది.

ఇది ఎప్పుడు జరుగుతుంది:
మానవులు తమ జఠరాగ్ని శక్తిని అనుసరించి హితమైన ఆహార విధానాన్ని అనుసరించినప్పుడే పైన చెప్పింది సుసాధ్యమౌతుంది. అదే వేళా పాళా లేకుండా కనిపించిన ప్రతి పదార్ధం తింటూ జిహ్వచాపల్యానికి లొంగిపోతే పైన చెప్పిన, రసము, కిట్టము అనే మూల విభాగాలే దోషాలుగా మారి అటు ధాతువులను, ఇటు వివిధ మలాలను చెరచి శరీరాన్నే సర్వనాశనం చేస్తయ్.

ఇంత మహోపకారానికి మానవ జన్మ సాఫల్యానికి సహకరించే ఆహారాన్ని మనమంతా సరైన పద్ధతిలో తింటున్నామా?
వ్యవాయదారులకు : అసలు ఆహార పదార్ధాలనే విష రసాయనాలు వేయకుండా పెంచగలుగుతున్నామా ? ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

చెవిపోటుకు:

1. వామును రసం తీసి వేడిచేసి గోరు వెచ్చగా చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది.
2. నేతిలో కర్పూరం కలిపి వెచ్చచేసి 2 చుక్కలు పోసిన పోటు తగ్గిపోతుంది.
3. సబ్జా చెట్టు ఆకురసం 2 చుక్కలు చెవిలో వేస్తే పోట్లు,కురుపులు తగ్గిపోతాయి.
4. తులసి ఆకుల రసం కొంచం వెచ్చచేసి 2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
5. రెండు, మూడు చుక్కలు తమలపాకు రసం చెవిలో వేస్తూవుంటే చెవినొప్పి తగ్గుతుంది.


Saturday, 8 March 2014

చెవిలో చీము :

1. బీరాకు రసం 2 చుక్కలు రోజూ ఒక పూట చెవిలో వేస్తే పుండు, చీము కారుట నిలిచిపోతుంది.
2. వేపాకులు నీళ్ళలో వేసి మరిగించి బయటకు వచ్చే ఆవిరి చెవికి పట్టిన చీము,నొప్పి తగ్గిపోతుంది.
3. ఆవు పంచితము 2-4 చుక్కలు చెవిలో వేస్తే చీము, నొప్పి తగ్గుతుంది.
4. కొబ్బరి నూనెలో ఇంగువ వేసి కాచి 2 చుక్కలు చెవిలో వేస్తే చీము తగ్గుతుంది.
5. నీరుల్లి రసం కొంచము కాచి 2 చుక్కలు వేసిన చీము, నొప్పి తగ్గిపోతాయి.
6. మందార ఆకుల రసంలో మంచి నూనెను (నువ్వుల నూనె)చేర్చి నూనె మిగిలేటట్లు కాచి 2 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే చీము కారటం, చెడు వాసన తగ్గిపోతుంది.
7.దానిమ్మ పండు రసం వెచ్చచేసి వేస్తే 2 చుక్కలు పోటు, చేము, దురద తగ్గిపోతుంది.
8. చేమంతి ఆకురసం 2 చుక్కలు పండిన చీముకారటం, పోటు దురద తగ్గిపోతుంది.

మాత్రృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ .

తేలు కాటు వేస్తే:

తేలు కుట్టిన చోట వెంటంటే కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి నూరిన ముద్దను వుంచితే, చప్పున బాధతగ్గిపోతుంది.

పార్శ్వపు తలనొప్పి :

నెయ్యి, బెల్లము సమాన భాగలుగా కలుపుకొని రోజూ పూటకు ఐదు నుంచి పదిగ్రాములు చొప్పున తింటూ వుంటే, పార్శ్వపు తలనొప్పి శీఘ్రంగా తగ్గిపోతుంది.
లేదా
కుంకుడుకాయ నురుగును వెచ్చచేసి వడపోసి, గోరువెచ్చగా వుండగా, రెండు బొట్లు వేస్తే, వెంటనే పార్శ్వపు తలనొప్పి మాయమైపోతుంది.

మాత్రృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ .

తుమ్ములు ఆగకుండా వస్తుంటే:

తుమ్ములు ఆగకుండా వెంట వెంటనే వస్తూవుంటే, కొత్తిమీరి గానీ, గంధం పొడిని గానీ వాసన చూస్తూ వుంటే వెంటనే తుమ్ములు ఆగింపోతాయ్. 

అన్ని రోగాలకు - అసలు కారణం :

ఈనాడు దాదాపు వైద్యులంతా  రోగాలకు మూలమైన కారణాలకు చికిత్స చేయకుండ కేవలం రోగానికి మాత్రమే చికిత్స చేస్తున్నారు. అందుకే రోగాలు మళ్ళీ మళ్ళీ పుడుతూ దీర్ఘకాలిక వ్యాధులుగా రూపాంతరం చెందుతూ ప్రాణాలు తీస్తున్నయ్. ఆయుర్వేదం రోగాలకు గల కారణాలకు చికిత్స చేసి, రోగాలను సమూలంగా నిర్మూలించి నూరేళ్ళ ఆయుష్షును ప్రసాదిస్తుంది.

ఈనాడు మనల్ని బాధిస్తున్న వ్యాధులన్నీ మనంతినే రసాయనిక విష కలుషితమైన ఆహారం వల్ల,కాలుష్యమైన నీటి వల్ల, గాలి వల్లనే వస్తున్నయ్. ధనానికి దాసుడైన మానవుడు లాభాపేక్షతో రసాయనిక ఎరువుల్ని గుప్పిస్తూ, ఆహార పదార్ధాలను పండిస్తున్నాడు. ఆ ఆహారం ద్వారా మానవ శరీరాల్లోని అణువణువులో విషరసాయనాలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్నయ్. వాటి ప్రభావంతో శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి, చిన్న వయసులోనే రోగాలకు గురౌతుంది.

ఈ రోగాలు ఎన్ని ఔషధాలు వాడినా తగ్గవు. ఎందుకంటే శరీరంలో వున్న రసాయనాలు నానాటికీ పెరుగుతూ వుంటయ్. ఈ రసాయనాలను శరీరంనుండి బహిష్కరింప చేయకుండ, తామర తంపరులుగా ఔషధాలు వాడుతూ పోతే ప్రయోజనం శూన్యం. రోగాలు ఇంకా పెరగటం తప్ప తగ్గే అవకాశమే వుండదు.

ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి పూర్వకాలం వాడిన సాంప్రదాయక ఎరువుల్ని, మొక్కల్ని, వేప, కానుగ చెట్ల ఆకుల్ని ఉపయోగించటం మొదలుపెట్టాలి. లేకపోతే ఈ విష రసాయనాల ప్రభావం వల్ల ఈ తరం వాల్లే కాక, భావితరాలు కూడా వ్యాధిగ్రస్తులు కాకతప్పదు.

మాత్రృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ .

ఎర్ర వెంట్రుకలు నల్లగా మారుటకు :

వెంట్రుకలు ఎందుకు ఎర్రబడతాయి:
శరీరంలో వాతము, పిత్తము మొదలైన దోషాలు ప్రకోపం చెందటం వల్ల, తలమీద వెంట్రకలు ఎరుపు రంగులో మారుతాయి. దీన్ని ఛాయా రోగం అంటారు.

ఏమి చెయ్యాలి :
నిమ్మపండ్ల రసం, నువ్వుల నూనె సమంగా కలిపి, నిమ్మరసం అంతా నువ్వులనునె లో ఇగిరేవరకూ సన్నటి మంట మీద మరిగించాలి, తరువాత వడపోసుకొని, ఆ తైలాన్ని ప్రతిరోజూ రాగి(ఎర్ర)వెంట్రుకలకు మర్ధనా చేస్తూ వుంటే, క్రమంగా వెంట్రుకల ఎరుపురంగు హరించి సహజమైన నలుపురంగు కలుగుతుంది.

Friday, 7 March 2014

కాళ్ళు చేతులు వణికేవారికి :

1. తేనీరు (టీ) తాగుతూ వుంటే క్రమంగా వణుకు రోగం తగ్గిపోతుంది .
2. వెల్లుల్లిపాయల్ని తమ ఆహారంలో వాడుతూవున్నా వణుకు తాగ్గుతుంది.

ఆయుర్వేదమంటే చిట్కా వైద్యమా/నాటుమందా/మతపరమైన వైద్యశాస్త్రమా?

ప్రాచీన భారతదేశంలో జనించిన వైద్యశాస్త్రమే ఆయుర్వేదము. ఆయుర్వేదము కేవలము వైద్యశాస్త్రాన్ని కాక, సంపూర్ణ జీవన విధానాన్ని వివరించింది. ఆయువు అంటే జీవితము, వేదము అంటే విజ్ణానము.ఆయుర్వేదము అంటే ఆయువుకు సంబంధించిన విజ్ణానము అని అర్ధము. ఒక మతపరమైన వైద్యశాస్త్రంగా లేదా వంశపారంపర్యంగా వచ్చే వైద్యశాస్త్రంగా పరిగణించబడుతుంది. కొందరు ఆయుర్వేదాన్ని చిట్కావైద్యంగా లేదా మూఢ నమ్మకాల వైద్యంగా పరిగణిస్తుంటారు. ప్రాచీన ఆయుర్వేదంలో ఆధునిక జీవాణు శాస్త్రం ఇమిడి ఉంది అనే సత్యాన్ని ఆధునిక సమాజానికి చెందినవారు అంత తేలిగ్గా అంగీకరించరు.

పరమాత్మ మానవునికి కావాల్సినవన్నీ ముందే సృష్టించి తరవాత మానవుని సృష్టించారు. అందువలన ఏ కాలానికి అవసరమైన పండ్లు, కూరగాయలు  ఇంకా ఆయా కాలాల్లో ఏ రోగాలు వస్తాయో వాటి నిర్మూలనకు అవసరమైన ఆరోగ్యసంబంధమైన మొక్కలను కూడా పుట్టిస్తున్నాడు. పుడమి తల్లి ప్రతికాలంలోనూ మనకు కావలసినవన్నీ మనకు అందిస్తుంటే మనం ఏ కాలంలోనైనా లబించేటట్లుగా పండ్లు, కూరగాయలు పుట్టిస్తున్నారు . అది ఎంత ప్రమాదకరం. వేడి చేసిననపుడు ఇంకా ఆవకాయ తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి..

అలాగే మన శరీరంలో మూడు రకాల దోషాలుంటాయి( వాత, పిత్త, కఫ దోషాలు ), (సత్వ,రజో,తమో గుణాలకు ),(అకార, ఉకార,మకారం). మనం తినే ఆహారం బట్టీ మన వ్యక్తిత్వం వుంటుంది. ఈ దోషాలు సమానంగా వున్నంత వరకు మనకు ఏ రకమైన అనారోగ్యాలు రావు. ఎప్పుడైతే ఈ దోషాలు అసమానమౌతాయో ఆయా దోష సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు కఫ దోషం ఎక్కువైందనుకుంటే, జలుబు, దగ్గు, తల పట్టటం లాంటి వ్యాధులు వస్తాయి..ఈ కఫం ఎక్కువై జఠరాగ్నికి భంగం కలిగిస్తుంది. దీని వలన ఆకలి తగ్గి ఆహారం తినబుద్ధి కాదు సరిగా. వాతం ఎక్కువైతే కీళ్ళనొప్పులు, కాళ్ళుపీకులు ఇంకా చాలా రకాల వ్యాధులున్నై.వీటి గురించి ఇంకొక సారి చెప్పుకుందాము.
మన శరీరం బాగుండాలి అంటే ఎలాంటి సమయంలో ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుసుకుంటే చాలు. నిజం చెప్పాలంటే, మన ఆరోగ్యమంతా మన పెరటి మొక్కల్లో,వంటగదిలోనే వుంది.. మన మహాఋషులు ఈ విషయాన్ని ముందే గ్రహించి రోజూ తినే ఆహారంలో ఏమేమి వాడాలో ముందే పరిశొధనలు జరిపి నిర్ణయించారు. రోజూ 10 తులసాకులు తింటే అనారోగ్యానికి దూరంగా వుండొచ్చు అనే అద్భుతమమైన విషయాన్ని ముందే గ్రహించి తులసిని మనం పూజంచే దేవతగా చూపించారు.కొబ్బరి చిన్నముక్క రోజుకు తింటే శరీరానికి చాలా మంచిది, ఈ విషయం మనకు చెప్తే చేస్తామో,చెయ్యమో అని  దేవాలయం లో ప్రసాదంగా ఆచారంలో పెట్టారు..ఇలాంటి ఎన్నో మంచి విషయాలు వున్నాయి....                                 (to be continued..)







Wednesday, 5 March 2014

ఉల్లి(Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదని ఎందుకన్నారు ?


ఈ సామెత ఎందుకు పుట్టిందంటే, ప్రతి రోజూ నీరుల్లిపాయల్ని తింటూవుంటే వైద్యుడితో అవసరమే ఉండదు.ఎందుకంటే మన శరీరానికి ఎంతో అవసరమైన అల్యూమినియం నీరుల్లిలో పుష్కలంగా వుంది.ఇది నిత్యం వాడుతూ వుంటే శరీరంలో క్రిములన్నీ హరించి అమితమైన బలం చేకూరుతుంది. ఈ వాస్తవాన్ని మన పూర్వీకులైన ఆయుర్వేద వైద్య శాస్త్రవేత్తలు ఆనాడే కనుక్కున్నారు. కాబట్టీ ఈ నీరుల్లిని క్రమం తప్పకుండా ఆహార పదార్ధాల్లో వాడే అలవాటును మనకు నేర్పారు. అంతే కాదు ' ఉల్లి, కన్న తల్లికన్నా గొప్పదని ప్రశంసించారంటే ఉల్లిలో ఎన్ని రకాల ఔషధ గుణాలున్నయ్యో మనం అర్ధం చేసుకోవాలి. నిత్య జీవితంలో ఉల్లిని తప్పకుండ వాడటం అలవాటు చేసుకోవాలి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

- నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నా గురువు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్ధన :

Tuesday, 4 March 2014

అతి విరేచనాలకు : నిమ్మ గింజలు

నిమ్మకాయలోని గింజలని నీళ్ళతో మెత్తగా నూరి, ఆ గంధాన్ని బొడ్డులోను, బొడ్డు చుట్టూ పట్టించండి. క్షణాల్లో అతి విరేచనాలు బంద్.

వెంట్రుకలు వూడిపోతున్నాయా?

మినుములు, మెంతులు సమానంగా మెత్తగా రుబ్బి, ఆ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట తరువార కుంకుళ్ళతో స్నానం చేయాలి.

మొటిమలకు :

వాము,పెరుగు సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి పట్టిస్తుంటే చాలు. మొటిమలు,మచ్చలు పోతాయ్.

రాత్రి రాగి చెంబులో మంచినీళ్ళు వుంచి పరగడుపునే తాగితే వందేళ్ళు హాయిగా జీవించవచ్చు:

రాత్రి నిద్రబోయే ముందు రాగి చెంబు నిండా మంచి నీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేచిలేవగానే వెంటనే ఆ రాగి చెంబ్లోని నీళ్ళు తాగాలి. దీనివల్ల 15 నిముషాల నుంచి అరగంటలోపు సుఖ విరేచనం అవుతుంది. గ్యాస్ , కడుపుబ్బరము, కడుపుమంట, మలబద్ధకం, తేపులు , మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో , ఔషధాలు వాడే పని లేకుండ పూర్తిగా తగ్గిపోతయ్. మలబద్ధకం అనే ఇబ్బంది అన్ని వ్యాధుల్ని కలిగించటానికి మూల కారణం కాబట్టి, ఈ అలవాటుతో మలబద్ధకాన్ని నివారించుకుంటే, వందేళ్ళ వరకు ఏ జబ్బులకి గురి కాకుండా హాయిగా ఆనందంగా జీవించవచ్చు.

Monday, 3 March 2014

రక్తం కారే మొలలకు : కానుగ ఆకులు

కానుగ లేత ఆకుల్ని మెత్తగా నూరి రక్తం కారే మొలలకు కడితే కొద్దిరోజుల్లోనే రక్త మొలల వ్యాధి పూర్తిగా హరించిపోతుంది.

అతి బహిష్టు :ధనియాల కషాయం

ధనియాలతో కషాయం కాచుకొని తాగుతూ వుంటే అతి బహిష్టు వ్యాధులు హరించిపోతయ్.

పడని తిండ్లు తింటే అనర్ధమే:

మనం తినే ఆహార పదార్ధాల్లో, ఏ పదార్ధానికి ఏ గుణముందో, ఏ ఏ పదార్ధాలు ఏ ఋతువుల్లో తినాలో, ఏ పదార్ధాలు కలిపి తినకూడదో, అనే ఆహార విజ్ణానం చాలా మందికి తెలియదు. మన చదువుల్లో ఆహార విజ్ణానం లోపించటం వల్ల, మనమందరం తెలిసో తెలియకో, విరుద్ధమైన ఆహార పదార్ధాల్ని వాడుతూ, చేజేతులా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాము.

ఒకదానికొకటి పడని పదార్ధాలని కలిపి తిండం వల్ల, కడుపులో అల్సర్లు, గడ్డలు, మేహరోగాలు,క్షయ, వాత రోగాలు, మూత్రాశయంలో రాళ్లు,కుష్టురోగం, భగంధరం, అతిసారం, స్పోటకము మొదలైన అనేక వికృతమైన రోగాలు కలుగుతయ్.వేరు వేరు ఆహార పదార్ధాల్ని కలిపి వాడేటప్పుడు, కొన్నింటిని సమానంగా కలిపి వాడితే, మరికొన్నింటిని ఎక్కువ తక్కువ తూకంగా కలిపి వాడితే ఆ ఆహారం విషంతో సమానమై వ్యాధుల్ని కలిగిస్తుంది. ఇంకా కొన్ని పదార్ధాలు, సమంగా కలిపినా, అసమంగా కలిపినా ఆ అహారం కూడా విషం గానే తయారవుతుంది. అంటే మనం తినే అహార పదార్ధాల్ పుట్టూకలోనే ఒక దానికొకటి పడని పదార్ధాలు వున్నాయని, ఆయా విరుద్ధ పదార్ధాల విజ్ణానాన్ని తెలుసుకొని వాడుకుంటే, మనకు ఎలాంటి అనారోగ్యం వుండదు.

అన్ని రకాల దగ్గులకు :

శొంఠి, మిరియాల పొడి అరటిపండుతో అద్ది తింటూ వుంటే అన్ని రకాల దగ్గులు హరించిపోతయ్.

Sunday, 2 March 2014

టాన్సిల్స్ కు :చింతగింజ

నీటితో  సాదిన చింతగింజ గంధాన్ని రాస్తుంటే టాన్సిల్స్ క్రమంగా హరించిపోతయ్ .

టాన్సిల్స్ కు : అల్లం

అల్లం ముక్కను కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే ఆశ్చర్యకరంగా టాన్సిల్స్ కరిగిపోతయ్ 

Saturday, 1 March 2014

మూర్చకు సీతాఫలం ఆకు :

సీతాఫలం ఆకు నలిపి వాసన చూపితే మూర్చనుండి వెంటనే తేరుకుంటారు .

తెలివితప్పిపడిన వారికి:

తెలివితప్పిపడిన వారికి ముక్కుల్లో 3 చుక్కలు అల్లం రసం  లేదా   3 చుక్కల కుంకుడురసం  వేస్తే తెలివివస్తుంది 

Friday, 28 February 2014

చర్మరోగాలకు పాలు , వేపనూనె :

వేపనూనె రెండుచుక్కలు కప్పు పాలతో మిశ్రి కలిపి తాగుతుంటే చర్మరోగాలు చెదరిపోతయ్ .

విరేచనాలకు అరటిపండు :

అరటిపండును పటికబెల్లంపోడితో అద్దుకొని తింటుంటే నీళ్లవిరేచనాలు ఆగిపోతయ్ .

Thursday, 27 February 2014

బిడ్డల అజీర్ణసమస్యకు తేనె :

రోజూ పావుచెంచా  తేనె నాకిస్తుంటే బిడ్డలకు అజీర్ణసమస్య రానేరాదు .

కొవ్వు తగ్గటానికి ఉలవలు :

రోజూ ఉదయం ఉలవ గుగ్గిళ్ళు 100 గ్రాములు తింటుంటే  కొవ్వు తగ్గి సన్నబడతారు .

Wednesday, 26 February 2014

ఉల్లిపాయ తిన్నాక నోటివాసన రాకుండా ఉండాలంటే:

ఉల్లిపాయ తిన్నాక నోటివాసన రాకుండా ఉండాలంటే చిన్నముక్క చింతపండు  చప్పరించాలి లేదా కొన్ని ధనియాలు నమలాలి లేదా పూతికచీపురు పుల్ల నమలాలి .

గోరుచుట్టు: ఆవుపెరుగు

ఆవుపెరుగు పైన వుండే మీగడను పట్టులాగా వేస్తే గోరుచుట్టు మానిపూతుంది .

అజీర్ణ విరేచనాలు :

రోజుకు మూడుసార్లు మజ్జిగ తాగిపిస్తే పిల్లల అజీర్ణ విరేచనాలు తగ్గిపోతాయి .

Monday, 24 February 2014

నెత్తురు బంక విరేచనాలు బంద్:

జొన్నకడుగు 100 గ్రాములు , చక్కెర 20 గ్రాములు కలిపి తాగుతుంటే 3 రోజుల్లో నెత్తురు బంక విరేచనాలు బంద్ .

Sunday, 23 February 2014

కాలినగాయాలు,వాపులు-మెంతులు

మంచి నీటితో నూరిన మెంతుల గంధాన్ని పైన లేపనం చేస్తుంటే కాలినగాయాలు బొబ్బలెక్క కుండా తగ్గుతాయ్ . అలాగే మెంతులు నానపెట్టి నూరి పూస్తు ఉంటే వాపులు తగ్గిపోతయ్ .

Wednesday, 19 February 2014

రక్తపోటు ఇబ్బందులు

రోజూ రెండు పచ్చి ఉల్లిపాయలు నంజుకుని తింటుంటే  రక్తపోటు ఇబ్బందులు రావు. 

చెడు కొవ్వు

రోజూ ఒక గ్రాము దాల్చిన చెక్క బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ వుండటం వలన చెడు కొవ్వు పోతుంది .

Saturday, 25 January 2014

నేత్ర సౌందర్య వినాశనానికి ప్రధాన కారణం :

ఆయా ఋతువులననుసరించి వాటి స్వభావాన్ని బట్టి వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడిన కషాయంతో పుక్కిలించకపోవటం వలన, కళ్ళకు కాటుక పెట్టక పోవటం వలన, ముక్కుల్లో తైలము వేయకపోవటం వలన నేత్ర వ్యాధులు ఏర్పడి నేత్రసౌందర్యాన్ని సమూలంగా నాశనం చేస్తయ్.
మన పూర్వీకులు ఆడ, మగ, అందరూ పుక్కిలించటం, కాటుక ధరించటం, ముక్కుల్లో నూనె వేసుకోవటం అనే అలవాట్లను అనుసరించటం వలననే వృద్ధాప్యంలో కూడా కళ్ళజోడు అవసరం లేకుండ, కంటి చూపు దెబ్బతినకుండ, కళ్ళ కింద ముడుతలు పడకుండ ఆరోగ్యంగా జీవించారని మనం తెలుసుకోవచ్చు.

కడుపులో పుండ్లు/ Kadupuloo pundlu:

ప్రతిరోజూ రెండు పూటలా ఒక కప్పుపాలలోఒక స్పూను నెయ్యి కలిపి తాగుతూ వుంటే కడుపులోని పుండ్లు హరించిపోతయ్.
pratiroojuu rendu puutalaa oka kappu paalalo oka spoon neyyi kalipi taagutuu  vuntee kadupulooni pundlu harinchipotay.

Friday, 24 January 2014

ఉబ్బు- ఊబ - వాపులు / Vubbu- Vuuba -Vaapulu :

ఉసిరిక పండ్ల రసము పూటకు 50 గ్రాముల వంతున సేవించిన శరీరములోని ఉబ్బులు, ఊబలు, వాపులు తగ్గును. ఈ చికిత్స వలన ఆ సంవత్స్రరమంతయు శరీరమునకు ఏ రోగము రాదు.

Vusirika pandla rasamu puutaku 50 graamula vantuna seevinchina sareeramulooni vubbulu, Vuubalu, Vaapulu taggunu. Ee chikitsa valana aa samvatsaramantau sareeramunaku ee roogamuu raadu.

Wednesday, 22 January 2014

వండిన ఆహారం ఎన్నిగంటలు బాగుంటుంది / Vandina aahaaram ennti gantalu baaguntundi:

ఏ ఆహారమైనా వండిన తరువాత ఆరుగంటల వ్యవధిలోనే వాడుకోవాలని, ఆ సమయం మించిపోయిన ఆహార పదార్ధాలు విషంతో సమానమని మన పెద్దలు సూచించారు. వండిన గంటలోపు తినటం ఎల్లవేళలా శ్రేయస్కరం.

Ee aahaaramainaa vandina taruvaata aarugantala vyavadhiloonee vaadukoovaalani, aa samayam minchipooyina aahaara padaardhaalu vishamtoo samaanamani mana peddalu suuchinchaaru.Vandina gantaloopu tinatam ellaveelalaa sreeyaskaram.

పిల్లల సుఖ విరేచనానికి/Pillala sukha vireechanaaniki:

పిల్లలకు అజీర్తి చేసి, విరేచనం కాకుండ బాధపడుతూ వుంటే, పొట్టమీద ఆముదం రాసి గోరువెచ్చటి కాపడం పెడితే వెంటనే విరేచనమౌతుంది.

Pillalaku ajeerti cheesi, vireechanam kaakunda baadhapadutuu vuntee, pottameeda aamudam raasi gooruvechati kaapadam peditee ventanee vireechanamoutundi.

వాంతులకు / Vaantulaku:

వాంతులు విపరీతంగా అవుతూవుంటే, నీరుల్లిగడ్డను చితగ్గొట్టి వాసన చూస్తే చాలు.

Vaantulu vipareetamgaa avutuuvuntee, neerulligaddanu chitaggotti vaasana chuustee chaalu.

Tuesday, 21 January 2014

తలకు నూనె పెట్టమనే ప్రాచీన వాదం / Talaku nuune pettamanee praacheena vaadam :

పూర్వం వేల సంవత్సరాలనుంచి తరతరాలుగా మన ఇళ్ళల్లో బిడ్డలు పుట్టినప్పటి నుంచి ఆముదం, కొబ్బరి నూనెలతో తల మర్ధనా చేసేవారు. పసివారి నుంచి పండు ముదుసలి వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా తలకు నూనె రాసేవారు.వారానికి ఒకసారి ఎక్కువ నూనె పెట్టి మర్ధనా చేసేవారు. దానివల్ల వారి నేత్రదృష్టి స్థిరంగా వుండేది. వెంట్రుకలు రాలిపోకుండ, బట్టతలలు లేకుండా అందమైన జుట్టుతో ప్రశాంతమమైన మానసిక స్థితిలో హాయిగా జీవించారు.
                                            పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు మానవ స్వభావం ఎప్పుడూ తన స్వదేశ సంప్రదాయాల్లోని ఔన్నత్యాన్ని గ్రహించలేదు.విదేశ నాగరికత ఎంత చండాలపుదైనా దానివైపు ఆకర్షింపబడుతుంది.విదేశీ తిండ్లు, విదేశీ బట్టలు, విదేశీ మందులు, విదేశీ విద్య,విధానాలు ఇలా విదేశీ నాగరికతకు లోను కావటం వల్లే మన దేశ దౌర్భాగ్యం ఇంత ఘోరంగా తయారైంది. ప్రపంచానికి పాఠాలు నేర్పిన భారత జాతి, ఈనాడు ప్రతి దానికోసం ప్రపంచాన్ని దేహీ అని అడిగే దుస్థితికి దిగజారింది.


Puurvam veela samvatsaraalanunchi tarataraalugaa mana illallo biddalu puttinappati nunchee aamudam, kobbar nuunelatoo talamardhanaa cheeseevaaru.pasivaari nunchi pandu mudusli varaku pratirooju kramam tappakundaa talaku nuune raaseevaaru. vaaraniki okasaari ekkuva nuune petti mardhanaa cheeseevaaru. daanvalla vaari neetradrushti sthiramgaa vundeedi. ventrukalu raalipookundaa, battatalaku leekundaa  andamaina juttuto prasaantamaina maanasika sthitiloo haaigaa jeevinchaaru.
Poruginti pullakuura ruchi annattu maanava swabhaavam eppuduu tana swadeesa sampradaayaallooni ounnatyanni grahinchaleedu. videesee naagarikata enta chandaalaputainaa daanivaipu aakarshimpabadutundi. videesee tindlu, videesee battalu, videesee mandulu, videesee vidya, vidhanaalu ilaa videese naagarikataku loonu kaavatam vallee mana deesa daurbhaagyam inta ghoramgaa tayaaraindi. prapanchaaniki paathaalu neerpina bhaaratajaati, eenaadu prati daanikoosam prapanchanni deehee ani adigee dusthitiki digajaarindi.

తలకు నూనె పెట్టకూడదనే ఆధునిక వాదం/Talaku nuune pettakuudadane aadhunika vaadam:

తలకు నూనె రాస్తే జుట్టు వూడిపోతుందని చుండ్రు,దురద,కురుపులు వస్తయ్యని ఆధునిక ఆంగ్ల వైద్య విధానం చెబుతుంది. ఆ విధానాన్ని నేర్చుకున్న మన ఇంగ్లీషు వైద్యులు కూడా అదే మాటలు వల్లిస్తున్నారు.వందేళ్ళ ఇంగ్లీషు వైద్యం పుణ్యమా అని, దేశంలో బట్టతల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇంగ్లీషు వైద్యం పుట్టిన దేశాల్లో వాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి అక్కడ తలకు నూనె రాయటం మంచిది కాకపోవచ్చు. కానీ మన ఉష్ణమండల దేశల్లో తప్పనిసరిగా తలకు తైల మర్ధనం అవసరం.
ఈనాడు తలకు నూనె రాయటం మహా అపరాధంగా భావిస్తూ తలకు నూనె రాయటం మానేశారు. దానివల్ల జుట్టు వూడిపోవటమే కాకుండా, శరీరం మొత్తాన్ని నియంత్రించే మెదడు కూడా వేడెక్కి మనిషిలో ఓర్పు, సహనం సన్నగిల్లుతున్నయ్.కళ్ళశక్తి తగ్గి, మసకలు, మంటలు, అంధత్వం ఏర్పడుతున్నయ్.


Talaku nuune raastee juttu vuudipootundani chundru,durada, kurupulu vastayyani aadhunika aangla vaidhya vidhaanam chebutundi. aa vidhaananni neerchukunna mana engleeshu vaidhylu kuuda adee maatalu vallistunnaaru. vandella english vaidyam punyamaa ani, desamlo battala sankhya vipareetamgaa perigipootundi. english vaidyam puttina deesalloo vaati vaatavarana pariisthitulni batti akkada talaku nuune rayatam manchidi kaakapovachu. kaanee mana vushnamandala deesaallo tappanisarigaa talaku taila mardhanam avasaram.
eenaadu talaku nuune raayatam mahaa aparaadhamgaa bhaavistuu talaku nuune raayatam maaneesaaru. daanivalla juttu vuudipoovatamee kaakundaa, sariiram mottaanni niyantrinchee medadu kuudaa veedekki manishiloo oorpu, sahanam sannagillutunnay. kallasakti taggi, masakalu, mantalu, andhatvam eerpadutunnay.

నీళ్ళు లేని పైరు వాలిపోతుంది, నూనె పెట్టని తల జుట్టు రాలిపోతుంది/neellu leni pairu vaalipotundi, nuune pettani tala juttu raalipotundi::

పైరు పచ్చగా పెరగటానికి నీరు ఎంత అవసరమో, జుట్టు బలంగా పెరగటానికి నూనెకూడా అంతే అవసరం.తలకు నూనె పెట్టకపోతే, మాడు ఎండిపోతుంది,జుట్టు బిరుసెక్కి రాలిపోతుంది. మాడు పోటు, కండ్లమంటలు, చుండ్రు, నిద్రపట్టకపోవటం మొదలైన అనేక శిరోవ్యాధులు కలుగుతయ్.



pairu pachaga peragataaniki neeru enta avasaramoo, juttu balamgaa peragataaniki nune kuudaa ante avasaram. talaku nuune pettakapootee, maadu endipootundi, juttu birusekki raalipootundi. maadu pootu, kandla mantalu, chundru, nidrapattakapoovatam modalaina aneeka siroo vyaadhulu kalugutay.


                                                                                                                                           Continues....

పులిపిరికాయలకు/Pulipirikaayalaku :

అరటి పండు తొక్కమీద తెల్లగా వుండే గుజ్జును పులిపిర్లకు రాస్తూ వుంటే, కొద్ది రోజుల్లోనే పులిపిర్లు వూడిపోతయ్.
Arati pandu tokkameeda tellagaa vundee gujjunu pulipirlaku raastuu vuntee, koddi roojulloonee pulipirlu vuudipotay.

Monday, 20 January 2014

మడిమశూలకి/Madimasuulaki:

జిల్లేడు పూలను మెత్తగా చితగ్గొట్టి ఆముదంలో వేసి ఉడకబెట్టి మడిమలకు కట్టు కడుతూ వుంటే మడిమశూల తగ్గిపోతుంది.
Jilledu puulanu mettagaa chitaggotti aamudamloo veesi vudakabetti madimalaku kattu kadutuu vunte madimasuula taggipotundi.

శిరోభారం తగ్గాలంటే/Siroobhaaram taggalantee:

వేడి వేడిగా వున్న అన్నాన్నిబట్టలో మూటగా చుట్టి, తలంతా కాపడం పెడుతూ వుంటే తలభారం తగ్గిపోతుంది.
Vedivedigaa vunna annaanni battalo muutagaa chutti, talanta kaapadam pedutuu vuntee talabharam taggippotundi.

దెబ్బలకు - వాపులకు/Debbalaku - Vaapulaku :

 చింతపండు గుజ్జుని వేడి చేసి, దెబ్బలమీద కడితే నొప్పులు, వాపులు మాయమౌతయ్.
Chintapandu gujjuni veedi chesi, debbalameeda kaditee noppulu, vaapulu maayamoutay .

బాగా వేడి నీటితో ఎందుకు స్నానం చేయరాదు? /Baagaa vedi neetitoo enduku snaanam cheyaraadu ?

చాలా మందికి సలసల కాగిన వేడి నీళ్ళతో స్నానం చేయటం అలవాటు. ఇది ఏ మాత్రమూ మంచిది కాదు. గొంతు వరకు వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చు. గొంతు పైనున్న శిరస్సు మీద మాత్రం పొరపాటున గూడా వేడి వేడి నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే, శిరస్సులో వుండే ప్రతి అవయవం, ఎంతో సున్నితంగా, సుకుమారంగా వుంటుంది. దాన్ని చన్నీళ్ళతో చల్ల బరచాలే గానీ, వేడి నీళ్ళతో ఇంకా వేడెక్కించ కూడదు. తల మీద వేడినీళ్ళు పోయటం వల్ల ముఖ్యంగా, కళ్ళు, వెంట్రుకలు దెబ్బ తింటయ్. వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడి వెంట్రుకలు రాలి పోతయ్. క్రమంగా బట్టతల ఏర్పడుతుంది. దీంతోపాటు కంటి చూపు మందగిస్తుంది. కంటిచుట్టూ వుండే అతి సన్నని నరాలు వేడినీళ్ళ స్పర్శకు దెబ్బ తింటయ్. కళ్ళు బలహీనమై క్రమంగా కంటి వ్యాధులు వస్తయ్.

పార్శ్వపు తలనొప్పికి / paarsvapu talanoppi ki

కొబ్బరిపాలల్లో పటిక బెల్లం (మిశ్రీ)పొడి కలిపి తాగుతూ వుంటే కొద్దిరోజుల్లో పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది.

kobbari paalallO patika bellam (misree)podi kalipi taagutuu vunte koddi rojullo paarsvapu talanoppi taggipotundi.

Saturday, 11 January 2014

వడదెబ్బ తగిలితే:

నీరుల్లిపాయల రసాన్ని వడదెబ్బ తగిలిన వ్యక్తికి కణతలకు, గుండేకు బాగా లేపనం చేయాలి.

పుచ్చకాయ రసం గానీ, బార్లీజావలో పటికబెల్లం కలిపిగానీ, లేక కొబ్బరినీళ్ళు గానీ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగా సేవింపచేయాలి.

చల్లని గాలి వచ్చేచోట పడుకోబెట్టాలి. కొబ్బరినూనెను శరీరమంతా మర్ధనా చేయాలి. అవకాశముంటే మంచిగంధం చెక్కతో సాది, ఆ గంధాన్ని శరీరానికి లేపనం చేయాలి.

వడదెబ్బ తగలకుండా:

ఒక గ్లాసు మంచి నీటిలో 10 గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేలా పిసికి వడపోయాలి. తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కెర కలిపితే చక్కని పానీయం తయారవుతుంది. దీనిని వేసవికాలంలో ప్రతి రోజూ ఉదయంపూట సేవిస్తూవుంటే, వేసవితాపాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది.

అధిక ఆయాసంకు:

అల్లం రసం 30 గ్రాములు, తేనె 20 గ్రాములు కలిపి రోజుకు రెండు లేక మూడు సార్లు త్రాగుతుంటే అధిక ఆయాసం హరిస్తుంది.

కామెర్లకు :

తాజా పెరుగు 40 గ్రాములు, మంచి పసుపు 10 గ్రాములు కలిపి ఉదయం తింటుంటే మూడువారాలలో కామెర్లు
తగ్గుతయ్.

ప్లీహరోగం తగ్గటానికి తులసి రసం :

తులసి రసం రెండు చెంచాల మోతాదుగా రెండు పూటలా త్రాగుతుంటే ప్లీహరోగం కుదురుతుంది.

పాండురోగం(Anemia):

1. పిప్పళ్ళ పొడి 3 గ్రాములు, పంచదార 10 గ్రాములు కలిపి ఒక్కపూట వాడుతుంటే 21 రోజులలో పాండురోగం తగ్గుతుంది.
2. లేత వేపాకు రసం 30 గ్రాములు, కండచక్కెర 10 గ్రాములు కలిపి గోరువెచ్చగా చేసి త్రాగుతుంటే 14 రోజులలో పాండురోగాలు పోతాయి.

అతిసారం(విరేచనాలు) వస్తే:

ఆకలి మందగించి, దేహంలోని వాత, పిత్త, కఫాలు దోషాలుగా మారి మలం ద్రవం రూపం చెంది మాటిమాటికి విసర్జింపబడటాన్ని అతిసారం అంటారు.

1. గంజితో: పలుచగా కాచిన బియ్యపు గంజిలో దోరగా వేయించి దంచిన జిలకర్రపొడిని పావుచెంచా, సైంధవలవణం అరచెంచా కలిపి తాగుతూ వున్నా అతిసారం ఆగిపోతుంది.

2. బార్లీగింజలతో: బార్లీ గింజలతో పలుచగా జావ కాచి అందులో ఒక చెంచా చక్కెర, రెండు చెంచాల నిమ్మరసం కలిపి తాగుతుంటే అతిసారం ఆగిపోతుంది.

3. పిప్పళ్ళతో: పిప్పళ్ళను దోరగా వేయించి దంచి జల్లించిన పొడి మూడు చిటికెల మోతాదులో ఒక చెంచా తేనె కలిపి తింటే అతిసారం హరించిపోతుంది.

4. జామాకుతో: ఒకగ్లాసు నీటిలో ఒక జామాకు వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి చల్లర్చి సేవిస్తూ ఉంటే అతిసారం అతి త్వరగా తగ్గిపోతుంది.

5. దనిమ్మ తొక్కతో: దనిమ్మ పండూ పైతొ్క్కు తీసి 20 గ్రాములు మోతాదులో ఒక గ్లాస్ నీటిలో నల్గ్గొట్టివేసి, కప్పు కషాయానికి మరిగించాలి. వడపోసి చల్లార్చి తాగితే అతిసారం హరిస్తుంది.

6. వేయించిన బియ్యం, వేయించిన పెసలు తీసుకుని నీటిలో కలిపి కషాయం కాచి పిసికి వడపోసి, అది చల్లార్చిన తరువాత అందులో చక్కెర, తేనె కలిపి తాగితే అతిసారం, దప్పిక, కడుపులో మంట తగ్గిపోయి రోగికి బలం కలుగుతుంది.

Friday, 10 January 2014

కాలేయం, ప్లీహ వ్యాధులు రాకుండా వుండాలంటే:

1. నిమ్మ పండ్ల రసం, టమేటో పండ్ల రసము, బొప్పాయి పండ్లు తరచుగా వాడుకొంటూ వుంటే కాలేయ, ప్లీహ వ్యాధులు కలుగకుండ వుంటాయి.

2. పచ్చి గుంటగలగరాకు చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొని అన్నంలో కలుపుకొని వారానికి ఒకసారి తింటూ వుంటే ఎప్ప్టటి కప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా వుంటుంది. అంతేగాక వెంట్రుకలు తెల్లబడకుండ, కంటి చూపు తగ్గకుండ కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.

3. గుంటగలగరాకు పొడి రోజూ పూటకు 3 గ్రాముల మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండుపూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.

* గుంటగలగరాకు ఆకు కూరలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది 

ప్లీహభివృద్ధికి(Spleen Enlargement) కలబంద(Aloe vera)తో యోగం :

కలబంద మట్టలు చీల్చి లోపల వుండే గుజ్జు తీసి, ఆ గుజ్జు 10 గ్రాములు మోతాదుగా అందులో 3 గ్రాముల పసుపు(ఇంట్లో దంచిన పసుపు పొడి) కలిపి రోజూ సేవిస్తూంటే ప్లీహభివృద్ధి తగ్గిపోతుంది.

దంతరోగాలు ఎందుకొస్తున్నయ్ ?

గత కాలంలో మన దేశ ప్రజలకు నూటికి ఒక శాతానికి మించిన ప్రజలకు దంతరోగాలు లేవు. ఇప్పుడు దాదాపు నూటికి నూరు మందికి దంతాలు పుచ్చిపోవటం, రంధ్రాలు పడటం, పైన పింగాణి వూడిపోవటం, చిగుర్లు దెబ్బ తినటం, రక్తం కారటం, దంతాలు వదులు  కావటం, చల్లటి లేక వేడి పానీయాలను సేవించినపుడు పండ్లలో సలుపులు పుట్టడం క్రమంగా ఒక్కొక్క పన్ను చిన్న వయసు నుండే వూడిపోవటం, అద్దె పళ్ళు కట్టించుకునే ఖర్మ పుట్ట్టటం జరుగుతుంది. ఈనాటికీ మన గ్రామాలలో వేప, కానుగ వంటి పుల్లలతో పండ్లు తోమే వారికి వృద్ధాప్య దశలో కూడా ఒక్క పన్ను కూడా కదలని వారు, వూడని వారు ఉన్నారు. ఆ పుల్లల కన్నా ఈనాటి ఆధునిక శాస్త్ర విజ్ణానం వల్ల పుట్టి పేస్టులు మంచివైతే అప్పటికన్నా ఇప్పటి వారికి పండ్లు మరింత గట్టిగా వుండి తీరాలి. కానీ, అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఈనాటి పేస్టులకన్నా మన పండ్లు తోముకునే ప్రాచీన దేశీయ విధానాలే సరి అయినవని మనము అర్థము చేసుకోవాలి. పేస్టుల పైన వ్యామోహం నవ నాగరికతపైన భ్రమలు తగ్గించుకొని నిజము వైపు ప్రయాణం చేయాలి. అప్పుడే మనమంతా మన దంత సౌందర్యాన్ని కాపాడుకోగలము.  

Thursday, 9 January 2014

పార్శ్వపు తల నొప్పికి(Migrane) - పంచదార యోగము :

రాత్రి నిద్రపోయే ముందు 60 గ్రాముల పంచదారను కానీ, కండచక్కెర పొడిని గానీ పావు లీటరు మంచి నీటిలో వేసి కరిగించి మూతబెట్టి మంచము కింద పెట్టుకుని పడుకోవాలి. తెల్లవారు జామున అయిదు గంటలకు నిద్రలేచి ఆ పంచదార నీళ్ళను ఒకసారి కలుపుకొని తాగాలి. ఒక గంట వరకు మరేమీ తాగకూడదు, తినకూడదు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసేటప్పటికి అర తలనొప్పి అనగా తలలో ఏదో ఒక వైపు వచ్చేటటువంటి తలనొప్పి ఆశ్చర్యకరముగా తగ్గిపోతుంది.

చర్మ సౌందర్యానికి పాటించవలసిన నియమములు :

1. రోజూ ఒక గంటసేపైనా వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం అలవాటు చేసుకోవాలి.
2. సబ్బుల వాడకం పూర్తిగా నిషేధించి, సుగంధ స్నాన చూర్ణాలనే వాడాలి.
3. వారానికి ఒకసారి తప్పకుండా వర్షాకాలంలో, చలి కాలంలో నువ్వుల నూనె తోటి, ఎండాకాలంలో ఆముదము లేక ఆలివ్ నూనె తోటి శరీరమంతా మర్ధనా చేసుకోవాలి.
4. రోజూ స్నానం చేసేటప్పుడు అవయవాలను బాగా రుద్దుకొని స్నానం చేయాలి.
5. చర్మానికి బాగా గాలి తగిలేటట్లు వీలైనంత వరకూ వదులైన నూలు బట్టలనే ధరించాలి.

చర్మ సౌందర్యం ఎందుకు హరించిపోతుంది :

ఈ ఆధునిక యుగంలో చాలామందికి శరీరానికి పనిలేకుండా పోయింది. తినటం, కూర్చోవటం, ఎక్కువ సమయం మనసుతోనే పనిచేయటం జరుగుతుంది. శరీరానికి ఏ కొద్దిపాటి వ్యాయమమైనా లేకపోవటం వల్ల, ఆహారపదార్ధాల ద్వారా లోపలికి పోయిన మలిన పదార్ధాలు చెమట ద్వారా బయటకి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. కనీసం నెలకు ఒకసారైనా శరీరమంతా తైలమర్ధనం చేసుకొని రక్తప్రసరణను క్రమబద్ధం చేసుకొని స్నానం చేసేవాళ్ళు ఈనాడు ఒక్కరైనా లేరని చెప్పవచ్చు. అంతేగాకుండా, మన దేశ వాతావరణానికి అనుగుణంగా ఎన్నో తరాలనాడు మన మహర్షులు మనకు అలవాటు చేసిన సున్నిపిండి వంటి స్నాన చూర్ణాల వాడకం పూర్తిగా తగ్గిపోయి, రసాయనిక పదార్ధాలతో తయారైన సబ్బుల వాడకం పెరిగిపోయింది.
ఈ విధానంవల్ల చర్మ రంధ్రాలు క్రమంగా మూసుకుపోయి మలిన పదార్ధాలను విసర్జించలేకపోవడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు కలుగుతున్నాయ్. చర్మం నల్లగా మారటం, గరుకుగా మారటం, పొడి పొడిగా మారి పొలుసులు లేవటం, చర్మం పై మచ్చలు, దురదలు రావటం వంటి రక రకాల సమస్యలతో భారతీయుల చర్మ సౌందర్యం నానాటికీ క్షీణించిపోతుంది.

Wednesday, 8 January 2014

దంతాలు వదులు,చిగుర్లు పగలటం, చిగుళ్ళ నుంచి రక్తం, నోటి దుర్వాసన సమస్యలకు మార్గం :

దంతాలు వదులైపోయి, చిగుర్లు పగిలిపోయి, నోటివెంట రక్తం కారుతూ నోరంతా దుర్వాసనతో వున్నవారు ఈ సులభ విధానాన్ని పాటించండి. ఒక టీ స్పూను సైంధవ లవణము పొడిలో రెండు మూడు చుక్కలు ఆవాల నూనె కలిపి ఆ మిశ్రమంతో వేలు పెట్టి పళ్లు తోమండి. మృదువుగా పళ్ళపైన చిగుళ్ళపైన లోపలివైపు రుద్దండి. 15 నిముషాలు అలాగే వుంచిన తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించి దంతాలు శుభ్రం చేసుకోండి. ఇలాగే, రెండవ పూట కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల క్రమంగా నోటిలో వున్న క్రిములు మలిన పదార్ధాలు, మలిన రక్తం నిర్మూలనమైపోయి క్రమంగా దంతాలు మళ్ళీ గట్టిపడతయ్. బాగా పరిశుభ్రమౌతయ్. ఈ చిన్న విధానం వల్ల మీరు ఎక్కువ లాభం పొందవచ్చు.

మొటిమలకు :

1. సొంఠి, లవంగాలు నీటితో మెత్తగా నూరి లేపనం చేస్తూ వుంటే మొటిమలు తగ్గిపోతయ్.
2. జాజికాయను నీటితో అరగదీసి ఆ గంధాన్ని లేపనం చేస్తూ వున్నా మొటిమలు తగ్గిపోతయ్.
3. నీరుల్లిగడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గిపోతయ్.
4. బియ్యం కడిగిన నీటిని మొటిమలపై మ్రుదువుగా రుద్దుతూ వుంటే తగ్గిపోతయ్.
5. కస్తూరి పసుపును నిమ్మరసంతో సాది తీసిన గంధం రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతయ్.

ముఖ సౌందర్యం హరించడానికి కారణాలు :

ఈనాడు ముఖంపైన మొటిమలు కానీ, మచ్చలు కానీ, మంగు కానీ, సోబి కానీ, గుల్లలు కానీ, గుంటలు కానీ కళ్ళచుట్టు నల్లని వలయాలు కానీ లేని వారు చాలా అరుదేనని చెప్పవచ్చు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగుబెట్టే యువతీ యువకులకు కొత్థగా వివాహమైన స్త్రీ పురుషులకు ఈ సమస్యలు ఎక్కువగా వుంటయ్. వీటి నుండి బయటపడటానికి వీరంతా చర్మ వ్యాధుల వైద్యులను సంప్రదించటం లేక టీవీలలో ప్రకటనలు చూసి రక రకాల క్రీములు, లోషన్లు ముఖానికి పూసుకోవటం, మరికొందరు బ్యూటీపార్లర్ల చుటూ ప్రదక్షిణాలు చేయటం, ఎన్ని చేసినా ఎంత ఖర్చుపెట్టినా ఆ సమస్యలు పరిష్కారం గాక, అద్దం ముందు కూర్చుని అందోళన పడుతూ వుండటం జరుగుతూ వుంది.
ఆహారం ద్వారా రోజూ శరీరంలోకి ప్రవేశిస్తున్న విష రసాయనికి పదార్ధాల ప్రభావమే ఈ సమస్యలకు మొదటి కారణమని అందరూ గుర్తించాలి. రోజు రోజుకు రక్తంలో విషాలు పేరుకుపోతూవుండటం వల్ల ఆ విషాలను శరీరం బయటకి త్రోసివేసే చర్యలో భాగంగా ఈ సమస్యలు కకలలుగుతూ వుంటయ్.
ఆడవారిలో బహిష్టు సక్రమంగా జరగకపోవడం, కొందరికి నెలల పర్యంతం బహిష్టు రాకపోవటం, మొదలైన గర్భాశయ సమస్యల వల్ల ముఖ సౌందర్యం నాశనం కావటం జరుగుతూ వుంది. కాబట్టి, ఆయా సమస్యలు వున్న వారు వాటి మూలకారణాలను తెలుసుకొని ఆహార విహారాలను సరిదిద్దుకొని  తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవాలి.

Tuesday, 7 January 2014

గృధ్రసీవాతం(సయాటికా)సమస్యకు :

తొడనుండి పాదంవరకు నరం లాగుతూ బంధించినట్లువుండే గృధ్రసీవాతానికి, పై బెరడు తీసివేసిన ఆముదపు గింజల్లోని తెల్లపప్పు 10 గ్రాములు కొంచం నీటి్తో నూరి పావులీటర్లో వేసి మరిగించి వడపోసి అందులో 40 గ్రాములు కండచక్కెరపొడి కలిపి రోజూ 2 పూటలా తాగుతుంటే గృధ్రసీవాతం హరిస్తుంది.

పిప్పి పంటి సమస్యకు :

ఆవాలపిండి, కల్లుప్పు సమభాగాలుగా తీసుకుని మెత్తగా మెత్తగాదంచి రోజూ రెండుపూటలా పళ్ళు తోముతూండాలి.

పొట్ట లావుగా వున్న సమస్యకు :

శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, వాము, జిలకర్ర, సైంధవలవణం, సమభాగాలుగా చుర్ణించి మూడువేళ్ళకు వచ్చినంత చూర్ణాన్ని పావులీటర్ ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ రెండుపూటలా తాగుతుంటే లావుగావున్న ఊదరపొట్ట క్రమంగా తగ్గిపోతుంది.

Monday, 6 January 2014

పిల్లలకు పొట్ట పెరిగితే:

ప్రతిరోజూ ఉదయం పరగడుపున పావుచెంచా తేనె, 5 నుంచీ 10 చుక్కలు అల్లం రసం, కొద్దిగా గోరువెచ్చటి మంచినీళ్ళు కలిపి తాగిస్తూ వుంటే, పిల్లల ఉదరపొట్ట,అజీర్ణం, పైత్యం, అగ్నిమాంద్యం, మలబద్ధకము తగ్గిపోతయ్. వయసును బట్టి మోతాదు ఎక్కువ తక్కువలు నిర్ణయించుకోవాలి.

పిల్లల వంటిపై లేచే కురుపులకు - గడ్డలకు :

వేపాకు కొద్దిగా పసుపు కలిపి నీళ్ళతో మెత్తగా నూరి, కురుపులు, గడ్డలు, దురదలు, గజ్జి, తామర మొదలైన వాటిమీద లేపనంచేసి ఒక గంట ఆగి స్నానం చేయిస్తూవుంటే అవన్నీ అయిదారు రోజుల్లో తగ్గిపోతయ్.

Sunday, 5 January 2014

శిశువుల శరీరదారుఢ్యానికి:

పిల్లలకు పుట్టినరోజు నుండి ఐదవ సంవత్సరం వరకు ప్రతి రోజూ ఒంటికి నువ్వులనూనె రాసి రెండు గంటలు ఆగిన తరువాత సున్నిపిండితో స్నానం చేయిస్తూ వుంటే పిల్లల ఎముకలు గట్టిపడి, క్రింద పడినా విరగకుండ వుంటయ్. వారి శరీరం కూడా అన్ని ఋతువుల వాతావరణాలను తట్టుకోగలిగిన శక్తి పొందుతుంది. చర్మము నునుపుగా కాంతివంతంగా వుంటుంది.
5 సంవత్సరాలవరకే కాదు.. ఎప్పుడూ రాస్తూ వున్నా పిల్లలకు, పెద్దలకు ఎంతో మంచిది.

పిల్లలు పక్కలో మూత్రం పోస్తుంటే :

జొన్నల్ని వేయించిన అటుకులు, నువ్వులను దంచి నూనె పిండి వేయిగా మిగిలిన నువ్వులపిండి (తెలకపిండి), ఎండుకొబ్బరి, బెల్లము వీటన్నిటిని సమభాగాలుగా తీసుకుని దంచి వుండలు చేసి నిలువ వుంచుకోవాలి. రోజూ పూటకు 5 గ్రాముల వుండ రెండు పూటలా తినిపిస్తూవుంటే పక్కలో మూత్రం పోయటం బంద్ అవుతుంది.

పిల్లల చెవిపోటుకు :

నీరుల్లి పాయను ముక్కలు చేసి ఒక గరిటలో వేసి అందులో నువ్వులనూనె కలిపి నిప్పులమీద వేడిచేసి వడపోసి ఆ నూనెను మూడు నాలుగు చుక్కలు చెవుల్లో వేస్తూవుంటే చెవినొప్పి తగ్గిపోతుంది.

పిల్లలకు కడుపునొప్పులకు :

తినే సోపుగింజలు, నల్ల వుప్పు సమభాగాలుగా చూర్ణం చేసి వుంచుకొని, పూటకు ఒక గ్రాము చూర్ణం కొంచం గోరువెచ్చని నీళ్ళతో కలిపి రెండుపూటలా ఇస్తూవుంటే వెంటనే కడుపునొప్పి  తగ్గిపోతుంది.

బాగా చిన్న పిల్లలకు కడుపుకు ఆముదం రాసి (పెద్దవాళ్ళ)చేతిని వేడి చేసి కడుపుమీద వేడి చూపిస్తే 5 నుంచీ 10 నిముషాల్లోపే నొప్పి తగ్గిపోతుంది.

తెలుసుకుందాం

ఈనాడు ప్రపంచ వ్యాపితంగా మానవాళి ఎదుర్కొంటున్న అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఆహార సేవనంలో జరిగే లోపాలే మూల కారణాలు.
" ఆహార నియమాలు పాటిస్తే - ఏ రోగానికీ ఔషధం అవసరం లేదు. ఆహార నియమాలు పాటించకపోతే, ఏరోగాన్ని ఔషధాలు నయం చేయలేవు " 

పిల్లలకు : నిద్రలో పళ్ళు కొరుకుతుంటే:

కడుపులో పురుగులు వుండటము వలన పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతారు.

ఆవాలు చూర్ణం ఒకటి నుండీ రెండు గ్రాముల మోతాదుగా ఒక కప్పు పెరుగులో కలుపుకుని రెండుపూటలా మూడు రోజులపాటు తింటూ వుంటే కడుపులో పురుగులు పడిపోతయ్. వయసునుబట్టి అరగ్రాము నుండే 2 గ్రాముల వరకు ఆవలు పొడిని ఉపయోగించాలి.

పిల్లలకు :నులిపురుగులు, ఏలికపాములు పడిపోవుటకు :

నీరుల్లిగడ్డ (onion)దంచి రసం తీసి వడపోసి, ఒక టీ స్పూను మోతాదుగా రెండుపూటలా తాగిస్తూవుంటే కడుపులో, ప్రేగులనుంచి క్రిములు పడిపోతయ్. వయసును బట్టి మోతాదు ఎక్కువతక్కువలు నిర్ణయించుకోవాలి. పెద్ద పిల్లలకైతే ఉల్లిగడ్డను ముక్కలుగా తరిగి భోజనంతో కలిపి తినిపించవచ్చు.

పిల్లలకు ముక్కు నుంచీ రక్తం కారుతుంటే:

1. ముక్కును చన్నీళ్ళతో కడగాలి. బాగా చల్లగా వున్న నీళ్ళలో గుడ్డముంచి ఆ గుడ్డను ముక్కుమీద వెయ్యాలి.ఐస్ ముక్కలు దొరికితే ముక్కుమీద వుంచటం మంచిది. వెంటనే హారతి కర్పూరం వాసన చూపిస్తూ వుంటే రక్తం కారటం ఆగిపోతుంది.
2. ధనియాలను చితక్కోట్టి కొంచం నీళ్ళు కలిపి మెత్తగా నూరి నడినెత్తిమీద వుంచి గుడ్డకట్టాలి.
3. దానితో పాటు ధనియాలను నీళ్ళతో నూరి వడపోసి కొంచం పంచదార కలిపి తాగిస్తూ వుంటే ముక్కునుంచీ రక్తం కారటం వెంటనే నిలచిపోతుంది.
4. కొన్నాళ్ళవరకూ వేడిచేసే పదార్ధాలు పెట్టకుండా, చలువచేసే పదార్ధాలు పెట్టాలి. తలకు, అరికాళ్ళకు ఆముదంతో సున్నితంగా మర్ధనా చేయాలి.

పిల్లల వ్యాధులకు కారణాలు - 2

10. పచ్చి కూరగాయలను, ధాన్యాలను తినే అలవాటు అసలు లేకపోవటం.
11. ఫ్రిజ్ లో నిలువవుంచిన ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు పదే పదే పసితనం నుంచే వాడటం.
12. కనీసం నెలకు ఒకసారి కూడా తైలమర్ధనం చేయకుండా శరీరాన్ని ఎండబెట్టటం.
13. తలకు కూడా నూనె పెట్టకుండ తలను శోషింపచేయటం.
14. బజారు తిండ్లకు, హోటల్ రుచులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పిల్లలను అలవాటుచేయటం.
15. ఏమాత్రం శక్తి ఇవ్వలేని తెల్లబియ్యం అన్నాన్ని మాత్రమే పెడుతూ మిగిలిన పుష్టికర ధాన్యాలను పిల్లలకు తినిపించకపోవటం.
16. స్కూలు నుంచి ఇంటికి రాగానే కొద్దికాలమైనా వారికి ఆడుకునే అవకాశం ఇవ్వకుండా పసితనం నుంచే టూషన్లు ఏర్పాటు చేయటం.
17. అసభ్యము, అశ్లీలము, హింస, క్రూరత్వం గల సినిమాలను టీవి ద్వారా నిరంతరం చూడటం.
18. పిల్లలు మన జాతి సమస్యలు, నాగరికత, దేశ చరిత్ర, మంచి చెడుల విశ్లేషణ నేర్పేవారు కరువైపోవటం.
19. వారికి తాతలు, నయనమ్మలు దగ్గరలేక, పరిసరాల విజ్ణానానికి దూరం కావటం.
20. పిల్లల సున్నిత హృదయాలను అర్థంచేసుకొని, వారిని మంచి పపౌరులుగా తీర్చిదిద్దే విద్య గానీ, అలాంటి విద్యను బోధించే ఉపాధ్యాయులు గానీ లేకపోవటం, పసితనం నుంచే ఏసిగదుల్లోనో నిరంతరం ఫ్యాన్ల క్రిందనో వుండటానికి అలవాటు పడటం.
21. ప్రకృతికి విరుద్ధమైన సకల అవలక్షణాలతో కూడిన విరుద్ధ జీవన విధానాలలో పిల్లలు పెరగటం.

Saturday, 4 January 2014

పిల్లల వ్యాధులకు కారణాలు : -1

1. తల్లులు పాలివ్వకుండా డబ్బా పాలను అలవాటు చేయటం.
2. పుట్టినప్పటి నుండే పిల్లలకు విపరీతమైన ప్రభావం గల ఇంగ్లీష్ మందులను వాడటం. పిల్లల్లో సహజ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారన్ని ఇవ్వకపోవటం.
3. మూడేళ్ళ వయసుకే నర్సరీ పేరుతో పిల్లలను బలవంతంగా స్కూళ్ళలో పడేయడం.
4. మాటలు రాని వయసులోనే మాతృభాషకు సంబంధంలేని ఇంగ్లీషు విద్యా విధానాన్ని నేర్పించటం.
5. నర్సరీ నుండే గాడిద బరువులా మోయలేనన్ని పుస్తకాల మోతను పిల్లల వీపు మీదు మోపటం.
6. తల్లి దగ్గర లేకపోవటం వల్ల పిల్లలు స్కుళ్ళల్లో సరిగ్గా భోజనం చేయకపోవటం.
7. ఉదయం వండిన పదార్ధాలను క్యారియర్ లలో మధ్యహ్నం వరకు వుంచటం వలన మగ్గిపోయి పిల్లలు వాటిని తినలేకపోవటం, స్కుల్లో టీచర్లు ఆ ఎండిపోయిన ఆహారన్ని పిల్లలచేత బలవంతంగా తినిపించటం.
8. శరీరానికి సరిగ్గా గాలి వెలుతురు తగలకుణ్డా మూడేండ్ల వయసునుంచే నిండుగా బట్టలు వేసి గొంతుకు ఉరివేసినట్లు టైలు బిగించి, కాళ్ళకు షూస్ తగిలించటం.
9. స్కూళ్ళలోని క్యంటిన్లలో పిల్లలు, చాక్లేట్లు, బిస్కట్లు, బబుల్ గం లు మొదలైన వ్య్ర్ధర్ధ  అనారోగ్య పదార్ధాలను తినటానికి అలవాటు పడటం.                              

                                                                                                          ఇంకా వున్నాయి...