ప్రాచీన భారతదేశంలో జనించిన వైద్యశాస్త్రమే ఆయుర్వేదము. ఆయుర్వేదము కేవలము వైద్యశాస్త్రాన్ని కాక, సంపూర్ణ జీవన విధానాన్ని వివరించింది. ఆయువు అంటే జీవితము, వేదము అంటే విజ్ణానము.ఆయుర్వేదము అంటే ఆయువుకు సంబంధించిన విజ్ణానము అని అర్ధము. ఒక మతపరమైన వైద్యశాస్త్రంగా లేదా వంశపారంపర్యంగా వచ్చే వైద్యశాస్త్రంగా పరిగణించబడుతుంది. కొందరు ఆయుర్వేదాన్ని చిట్కావైద్యంగా లేదా మూఢ నమ్మకాల వైద్యంగా పరిగణిస్తుంటారు. ప్రాచీన ఆయుర్వేదంలో ఆధునిక జీవాణు శాస్త్రం ఇమిడి ఉంది అనే సత్యాన్ని ఆధునిక సమాజానికి చెందినవారు అంత తేలిగ్గా అంగీకరించరు.
పరమాత్మ మానవునికి కావాల్సినవన్నీ ముందే సృష్టించి తరవాత మానవుని సృష్టించారు. అందువలన ఏ కాలానికి అవసరమైన పండ్లు, కూరగాయలు ఇంకా ఆయా కాలాల్లో ఏ రోగాలు వస్తాయో వాటి నిర్మూలనకు అవసరమైన ఆరోగ్యసంబంధమైన మొక్కలను కూడా పుట్టిస్తున్నాడు. పుడమి తల్లి ప్రతికాలంలోనూ మనకు కావలసినవన్నీ మనకు అందిస్తుంటే మనం ఏ కాలంలోనైనా లబించేటట్లుగా పండ్లు, కూరగాయలు పుట్టిస్తున్నారు . అది ఎంత ప్రమాదకరం. వేడి చేసిననపుడు ఇంకా ఆవకాయ తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి..
అలాగే మన శరీరంలో మూడు రకాల దోషాలుంటాయి( వాత, పిత్త, కఫ దోషాలు ), (సత్వ,రజో,తమో గుణాలకు ),(అకార, ఉకార,మకారం). మనం తినే ఆహారం బట్టీ మన వ్యక్తిత్వం వుంటుంది. ఈ దోషాలు సమానంగా వున్నంత వరకు మనకు ఏ రకమైన అనారోగ్యాలు రావు. ఎప్పుడైతే ఈ దోషాలు అసమానమౌతాయో ఆయా దోష సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు కఫ దోషం ఎక్కువైందనుకుంటే, జలుబు, దగ్గు, తల పట్టటం లాంటి వ్యాధులు వస్తాయి..ఈ కఫం ఎక్కువై జఠరాగ్నికి భంగం కలిగిస్తుంది. దీని వలన ఆకలి తగ్గి ఆహారం తినబుద్ధి కాదు సరిగా. వాతం ఎక్కువైతే కీళ్ళనొప్పులు, కాళ్ళుపీకులు ఇంకా చాలా రకాల వ్యాధులున్నై.వీటి గురించి ఇంకొక సారి చెప్పుకుందాము.
మన శరీరం బాగుండాలి అంటే ఎలాంటి సమయంలో ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుసుకుంటే చాలు. నిజం చెప్పాలంటే, మన ఆరోగ్యమంతా మన పెరటి మొక్కల్లో,వంటగదిలోనే వుంది.. మన మహాఋషులు ఈ విషయాన్ని ముందే గ్రహించి రోజూ తినే ఆహారంలో ఏమేమి వాడాలో ముందే పరిశొధనలు జరిపి నిర్ణయించారు. రోజూ 10 తులసాకులు తింటే అనారోగ్యానికి దూరంగా వుండొచ్చు అనే అద్భుతమమైన విషయాన్ని ముందే గ్రహించి తులసిని మనం పూజంచే దేవతగా చూపించారు.కొబ్బరి చిన్నముక్క రోజుకు తింటే శరీరానికి చాలా మంచిది, ఈ విషయం మనకు చెప్తే చేస్తామో,చెయ్యమో అని దేవాలయం లో ప్రసాదంగా ఆచారంలో పెట్టారు..ఇలాంటి ఎన్నో మంచి విషయాలు వున్నాయి.... (to be continued..)

No comments:
Post a Comment