Pages

Thursday, 9 January 2014

చర్మ సౌందర్యం ఎందుకు హరించిపోతుంది :

ఈ ఆధునిక యుగంలో చాలామందికి శరీరానికి పనిలేకుండా పోయింది. తినటం, కూర్చోవటం, ఎక్కువ సమయం మనసుతోనే పనిచేయటం జరుగుతుంది. శరీరానికి ఏ కొద్దిపాటి వ్యాయమమైనా లేకపోవటం వల్ల, ఆహారపదార్ధాల ద్వారా లోపలికి పోయిన మలిన పదార్ధాలు చెమట ద్వారా బయటకి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. కనీసం నెలకు ఒకసారైనా శరీరమంతా తైలమర్ధనం చేసుకొని రక్తప్రసరణను క్రమబద్ధం చేసుకొని స్నానం చేసేవాళ్ళు ఈనాడు ఒక్కరైనా లేరని చెప్పవచ్చు. అంతేగాకుండా, మన దేశ వాతావరణానికి అనుగుణంగా ఎన్నో తరాలనాడు మన మహర్షులు మనకు అలవాటు చేసిన సున్నిపిండి వంటి స్నాన చూర్ణాల వాడకం పూర్తిగా తగ్గిపోయి, రసాయనిక పదార్ధాలతో తయారైన సబ్బుల వాడకం పెరిగిపోయింది.
ఈ విధానంవల్ల చర్మ రంధ్రాలు క్రమంగా మూసుకుపోయి మలిన పదార్ధాలను విసర్జించలేకపోవడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు కలుగుతున్నాయ్. చర్మం నల్లగా మారటం, గరుకుగా మారటం, పొడి పొడిగా మారి పొలుసులు లేవటం, చర్మం పై మచ్చలు, దురదలు రావటం వంటి రక రకాల సమస్యలతో భారతీయుల చర్మ సౌందర్యం నానాటికీ క్షీణించిపోతుంది.

No comments:

Post a Comment