దంతాలు వదులైపోయి, చిగుర్లు పగిలిపోయి, నోటివెంట రక్తం కారుతూ నోరంతా దుర్వాసనతో వున్నవారు ఈ సులభ విధానాన్ని పాటించండి. ఒక టీ స్పూను సైంధవ లవణము పొడిలో రెండు మూడు చుక్కలు ఆవాల నూనె కలిపి ఆ మిశ్రమంతో వేలు పెట్టి పళ్లు తోమండి. మృదువుగా పళ్ళపైన చిగుళ్ళపైన లోపలివైపు రుద్దండి. 15 నిముషాలు అలాగే వుంచిన తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించి దంతాలు శుభ్రం చేసుకోండి. ఇలాగే, రెండవ పూట కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల క్రమంగా నోటిలో వున్న క్రిములు మలిన పదార్ధాలు, మలిన రక్తం నిర్మూలనమైపోయి క్రమంగా దంతాలు మళ్ళీ గట్టిపడతయ్. బాగా పరిశుభ్రమౌతయ్. ఈ చిన్న విధానం వల్ల మీరు ఎక్కువ లాభం పొందవచ్చు.
మంచి,ఉపయోగకరమైన చిట్కా...బాగా చెప్పారు...ధన్యవాదములు...
ReplyDeleteధన్యవాదములు అవసరం లేదు. ఆ చిట్కా ఆచరించి ఫలితం కలి్గిన తరువాత చెప్పండి అదే చాలా ఆనందం.
ReplyDelete