Pages

Sunday, 18 May 2014

శ్రమ చేయకపోవటమే సుఖమనుకుంటున్నారా? కాదు, అది మధుమేహానికి మూలం:

ఈనాడు చాలామంది శారీరక శ్రమ చేయకుండా హాయిగా కూర్చొని పనిచేయటమే గొప్ప వరం అని భావిస్తున్నారు. కానీ నిజానికి అదే ఆరోగ్యానికి శాపం అని తెలుసుకోలేకపోతున్నారు. ఉద్యోగాలు చేసేవారు కానీ, వ్యాపారాలు చేసేవారు కానీ, ఉదయం ఇంటినుండి స్కూటరు మీదనో, కారు మీదనో, లేక బస్ లోనే ఆ ప్రదేశాలకు చేరటం, అక్కడ పని చేయటం, సాయంత్రం మళ్ళీ వాహనాలలో ఇంటికి రావటం, తినటం, నిద్రపోవటం జరుగుతుంది.

అలాగే ఇండ్లలో వుండే స్త్రీలకు వళ్ళు వంచి పని చేసే అవసరం లేకుండాపోయింది. ఏ చిన్న పనులున్నా అవి చేయటానికి పని మనుషులుంటునారు. వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్ లు , కుక్కర్లు, గ్యాస్ స్టౌవ్ లు వంటివి వాడకంలోకి రావటం స్త్రీలకు శారీరక శ్రమ తగ్గటం అదే వారి అనారోగ్యానికి మూలకారణం అవుతున్నయ్. అంతేగాకుండా టీ.వీ లు వచ్చిన తరువాత ఎక్కువ గంటలు వాటి ముందు కూర్చుని వుండటం వలన కూడా స్త్రీల శరీరాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ అదనపు కొవ్వు పెరగటమే స్త్రీలలో గానీ పురుషులలోగానీ మధుమేహం వంటి రోగాలు రావటనికి రెండవ ప్రధాన కారణం అవుతుంది. ఈ లోపాలతో పాటు వేళకు భోజనం చేయకపోవటం, తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ భుజించటం, రాత్రిళ్ళు మరీ ఆలస్యంగా భుజించటం, భుజించిన వెంటనే నిద్రించటం వంటి అనేక పొరపాట్ల వల్ల శరీరాలు రోగగ్రస్తమౌతున్నాయ్.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ.


No comments:

Post a Comment