Pages

Monday, 28 April 2014

అన్ని ఋతువుల్లో ఒకే ఆహారం - అనారోగ్యానికి విహారం, ఋతు స్వభావాన్ని బట్టి తినే ఆహారం - ఆరోగ్య జీవనహారం.

అన్ని ఋతువుల్లో ఒకే ఆహారం - అనారోగ్యానికి విహారం
ఋతు స్వభావాన్ని బట్టి తినే ఆహారం - ఆరోగ్య జీవనహారం.

ప్రకృతి ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలానికి తగ్గట్లు పండ్లు, కూరగాయలు,చెట్లు (ఔషధాలు) ఒకటేమిటి మానవునికి అవసరమయ్యే అన్నింటినీ సమకూర్చింది. ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనిషి శరీర ప్రకృతి కూడా మారుతుంది. ఆ మార్పును తట్టుకునే ఆహా్రాన్ని మనం భుజించాలి.  ఏఏ కాలాల్లో ఏ  ఆహారం తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తప్పని సరిగా తెలిసివుండాలి. లేకపోతే సంపాదనలో దాన ధర్మాలకు బదులు ఆసుపత్రులకు  ధారపొయ్యాల్సి వస్తుంది. పుణ్యము రాకపోగా కొత్తరోగాలు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువ. ఒక కాలం లో పండాల్సిన కూరగాయలు, పండ్లు ఇతరత్రా.. వేరే కాలం లో పండించటం గొప్ప, సాంకేతిక సాఫల్యం అనుకుంటున్నారు నేటి వ్యవసాయ నిపుణులు. కానీ ప్రకృతి  ప్రతిసంవత్సరం అదేకాలంలో అవే పండ్లు అవే కూరగాయలు ఎందుకు ప్రసాదిస్తుంది ? దాని పరమార్ధం ఎప్పుడైనా తెలుసుకోటానికి ప్రయత్నిస్తే, ఇలా అస్తవ్యస్తంగా కాలం కాని కాలంలో పూసేవి, కాసేవి అన్నీ మానవలోకానికే పెను ముప్పు అని తెలుసుకుని అలా పండించకూడదని అటువంటి ప్రయోగాలు మానుకుంటారు.

పక్క ఊరు రెండు రోజులు వెళ్ళి వస్తేనే నీళ్ళు ఇతరత్రా పడక శరీరం తట్టుకోలేక సుస్తీ చేస్తుంది. అలాంటిది వేరే దేశాలలో ఉన్న ఆహారపు అలవాట్లు, దుస్తుల అలంకరణ, చదువు , విహార వ్యవహారాలు మనదేశంలో వున్నా వారికి ఎలా సరిపోతాయి. ఒకదేశపు ఆహార విహార వ్యవహారలు ( చదువు, పంటలు, వైద్యం , ఆచారాలు ..) అన్నీ ఆదేశపు వాతావరణాన్ని బట్టి నిర్మితమై వుంటాయి. అందువలన అవి మనకు సరిపడవు. మనపూర్వికులు అమలు చేసిన ఆచారాలే మనకు అమృతభాండాలు. వాటిని ఆచరిస్తేనే ఈ సమాజం మరళ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. దానికి మనమందరం బాధ్యులం. ఎందుకంటే మనదేశపు మంచికి చేడుకు మనమే కారణం. మార్పు ప్రతిఒక్కరిలో వస్తే ఇల్లు వీధి ఊరు పట్ట్ణం రాష్ట్రం  దేశం మొత్తం మారిపోతుంది. మార్పు నాలో నీలో అందరిలో రావాలి. ఎందుకంటే మార్పు సహజం, మార్చుదాం మన అలవాట్లని.....

No comments:

Post a Comment