గత కాలంలో మన దేశ ప్రజలకు నూటికి ఒక శాతానికి మించిన ప్రజలకు దంతరోగాలు లేవు. ఇప్పుడు దాదాపు నూటికి నూరు మందికి దంతాలు పుచ్చిపోవటం, రంధ్రాలు పడటం, పైన పింగాణి వూడిపోవటం, చిగుర్లు దెబ్బ తినటం, రక్తం కారటం, దంతాలు వదులు కావటం, చల్లటి లేక వేడి పానీయాలను సేవించినపుడు పండ్లలో సలుపులు పుట్టడం క్రమంగా ఒక్కొక్క పన్ను చిన్న వయసు నుండే వూడిపోవటం, అద్దె పళ్ళు కట్టించుకునే ఖర్మ పుట్ట్టటం జరుగుతుంది. ఈనాటికీ మన గ్రామాలలో వేప, కానుగ వంటి పుల్లలతో పండ్లు తోమే వారికి వృద్ధాప్య దశలో కూడా ఒక్క పన్ను కూడా కదలని వారు, వూడని వారు ఉన్నారు. ఆ పుల్లల కన్నా ఈనాటి ఆధునిక శాస్త్ర విజ్ణానం వల్ల పుట్టి పేస్టులు మంచివైతే అప్పటికన్నా ఇప్పటి వారికి పండ్లు మరింత గట్టిగా వుండి తీరాలి. కానీ, అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఈనాటి పేస్టులకన్నా మన పండ్లు తోముకునే ప్రాచీన దేశీయ విధానాలే సరి అయినవని మనము అర్థము చేసుకోవాలి. పేస్టుల పైన వ్యామోహం నవ నాగరికతపైన భ్రమలు తగ్గించుకొని నిజము వైపు ప్రయాణం చేయాలి. అప్పుడే మనమంతా మన దంత సౌందర్యాన్ని కాపాడుకోగలము.
No comments:
Post a Comment