Pages

Tuesday, 20 May 2014

దంత సౌందర్యం ఎందుకు హరించిపోతుంది ???

ఈ ఆధునిక యుగంలో దంత బాధలు లేనివారు ఒక్కరు కూడా లేరని చెప్పటం అతిశయోక్తి కాదు. దంతాలు కదలటం, వూడిపోవటం, పుచ్చిపోవటం, తీపులు పుట్ట్టటం, లొట్టలు పడటం, చిగుళ్ళు చిట్లటం , నెత్తురు కారటం , వాయటం , మొదలైన సమస్యలు నానాటికీ పెరుగుతున్నయ్. యుక్త వయస్సులోనే కట్టుడు పళ్ళు పెట్టుకునే దౌర్భాగ్యం మనకు కలుగుతుంది.

మూలికలతో కూడిన దంత చూర్ణాలు, వివిధ చెట్ల పుల్లలు దంత దావనానికి ఉపయోగించిన మన పూర్వీకులు, ఇప్పటికీ కొన్ని పల్లేల్లో ఇదే పద్ధతిని అనుసరిస్తున్న గ్రామీణులు, చక్కటి దంత సౌభాగ్యంతో అందమైన పలువరసతో ఆరోగ్యంగా జీవించారు, జీవిస్తున్నారు కూడా.

అయితే రకరకాల పేస్టులతో బ్ర్ష్లష్ లతో పండ్లు తోముకోవటం అలవాటైన నాటినుండీ మన భారతీయుల దంత సౌందర్యం వినాశనం ప్రారంభమైందని మనం ఖచ్చితం గా తెలుసుకోవచ్చు. పేస్టుల్లో నురుగుకోసం పేస్టుల బేస్ కోసం ఉపయోగించే రక రకాల రసాయనిక పదార్షాల వల్ల దంతాల ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుంది. పసితనం నుంచే పళ్ళు సడలిపోవటం , పిప్పి పళ్ళు రావటం , యుక్తవయసులోకి వచ్చేటప్పటికి గట్టిపదార్ధాలను, తీపి పదార్ధాలను తినలేని దుస్థితికి చేరటం, నలభై ఏళ్ళకే పళ్ళు పండుటాకుల్లా రాలిపోవటం మనం చూస్తూనేవున్నాం. పేస్ట్లతో పాటు చల్లటి కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీములు , ఫ్రిజ్ ల్లో వుంచిన అతి చల్లని నీరు , ఆహార పదార్ధాలు , వేడి వేడి టీ, కాఫీలు , గుట్కాలు , సిగరెట్లు , బీడీలు , చుట్టలు అతిగా సేవించటం వల్ల కూడా దంత సౌందర్యం హరించిపోతూవుంది. ఈ అలవాట్లు మానుకోకుండ , ప్రకృతి సహజమైన దంత చూర్ణాలను వాడుకోవడం అలవాటు చేసుకోకుండ , సౌందర్యం కావాలంటే, ఎక్కడనుంచి వస్తుంది. ఎలా వస్తుంది ? మీరే ఆలోచించండి.

టీ.వీ.ల్లో వచ్చే ప్రకటనలు చూసి భ్రమపడకుండ కళ్ళముందు కనిపిస్తున్న నిజాలను , రుజువులను బేరీజు వేసుకుని వాస్తవాలను అవగాహన చేసుకొని శాశ్వత దంత సౌందర్యం కోసం ప్రయత్నించమని కోరుతున్నాను.....

                                     మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

No comments:

Post a Comment