Pages

Wednesday, 3 September 2014

కోపంతో, దుఖంతో భుజిస్తే కొంపలారిపోతాయ్:

మానవ శరీరంలో గొంతువద్ద విశుద్ధ చక్రం, అక్కడే ' థైరాయిడ్ ' అని పిలవబడే గ్రంధి కూడా నిర్మాణమై ఉన్నయ్. దానికి పైన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం, దానివద్దే ' పిట్యూటరీ గ్లాండ్ ' కూడా ఏర్పాటై ఉన్నయ్ . ఈ రెండు గ్రంధులు మెదడుతో అనుసంధానమై నాడీ సంబంధం కలిగివున్నయ్. ఎప్పుడైతే మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనబడే చెడు సంకల్పాలు పుడతాయో ఆ మరుక్షణమే ఆ దుష్ట సంకల్పాల నుండి ఉత్పన్నమయ్యే విష రసాయనాల ప్రభావం పిట్యూటరీ మరియు థైరాయిడ్ గ్రంధులపైన పడి వాటి  సహజ శక్తిని నశింపజేసి ఆ గ్రంధులను బలహీనపరుస్తుంది.
ఫ్యాన్ రెగులేటర్ సాయంతో ఎక్కువ తక్కువలుగా అవసరమయ్యే విధంగా ఎలా పని చేస్తుందో అదేవిధంగా మానవశరీరంలో జీవాణువుల రసాయనిక మార్పులకు, శారీరక ఎదుగుదలకు ఈ థైరాయిడ్ గ్రంధి రెగ్యులేటర్ అనబడే ఒక క్రమబద్ధ యంత్రంలాగా పని చేస్తుంటుంది.
థైరాయిడ్ గ్రంధిలో ఉత్పన్నమయ్యే జీవ రసాల ప్రభావంతోనే జీర్ణ వ్యవస్థ, మూత్ర పిండాలు, మెదడువంటి అనేక అవయవాలు,ఇతర గ్రంధులు సక్రమంగా పని చేస్తుంటయ్. ఎప్పుడైతే కామం, క్రోధంవంటి మనో మాలిన్యాల విషప్రభావం థైరాయిడ్ గ్రంధి పై పడుతుందో మరుక్షణమే దానికనుసంధానమై ఉండే ఇతర అవయవాలపైన మిగతా గ్రంధుల పైన కూడా ఆ ప్రభావం పడి మనో వ్యాధులు, అతిస్థౌల్యం, గర్భాశయరోగాలు, మూత్రపిండరోగాల వంటి అనేక వ్యాధులు క్రమ క్రమంగా పుట్టుకొస్తుంటయ్.
కాబట్టి భోజనసమయంలో కోప తాపాలకుగురై పైన తెలిపినట్లు అన్ని రోగాలకు మూలమైన అజీర్ణాన్ని సృష్టించుకొని వ్యాధిగ్రస్థులుగా బ్రతకకూడదని మహర్షులు హితవుపలికారు. ఏ కారణం వల్లనైనా భోజన సమయానికి మనసు ఆవేశంతోనో, ఆందోళనతోనో ఉంటే భుజించటం ఆపివేసి మనసు ప్రశాంతమైన తరవాతే భుజించండి.

                                 మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

No comments:

Post a Comment