Pages

Wednesday, 25 June 2014

పంచభూతాలను పంకిలం చేస్తూ పాపలకూపంలో పతనమైపోతున్న ఓ మనిషీ! నీ గమనం ఎక్కడకి ? భూమి, నీరు, గాలి ఎందుకు చెడిపోతయ్?

వర్షాకాలంలో వర్షం రావటం లేదు. భూమి నిస్సారమై, పంటలు పండటం లేదు. పవిత్రమైన ఓంకారంతో పుట్టిన ఆకాశం, భూమి నుంచి నీటి నుంచి ఆవిరి రూపంలో పైకి చేరే విషాలతో కలుషితమైపోయింది.
తన పుట్టుకకు, పెరుగుదలకు కారణమైన ప్రకృతిని, పంచభూతాల్ని నాశనం చేస్తున్న మానవులకు మనుగడ వుంటుందా?

ఆత్రేయ మహర్షి ప్రవచనం :
మానవుల్లో ధర్మం ఎంత కాలం వుంటుందో, అంత కాలం పంచ భూతాలు పరిశుద్ధమై ప్రాణ శక్తులతో నిండి వుంటయ్. ప్రతి మమననషికి పూర్తి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆయుషు వుంటయ్. ఎప్పుడైతే ధర్మానికి కాలం చెల్లి అధర్మం రాజ్యమేలుతుందో మనుషుల్లో అసూయాద్వేషాలు, స్వార్ధవైషమ్యాలు, పదవీ కాంక్ష, ధన వ్యామోహం పెచ్చు పెరుగుతుందో, అప్పుడే పంచ భూతాలమయమైన ప్రకృతి పతనమై పోతుంది. తన సహజమైన ప్రాణశక్తిని, ప్రశాంత తత్వాన్ని కోల్పోయి, తనను నాశనం చేస్తున్న మానవలోకం పై విరుచుకుపడుతుంది.
విష రసాయనాల వర్షంతో ఆకాశం, భయంకరమైన కృములు భూతాలతో(వైరస్ ) నిండిన వాయువు, ప్రాణ శక్తులను పీల్చి పిప్పిచేసే ప్రచండ కిరణాలతో సూర్యుడు, వ్యర్ధ పదార్ధాలతో కలుషితమై బడబాగ్నులతో ఉప్పొంగే జలం, ధాతు శక్తి కోల్పోయి, సహజమైన గమనాన్ని తప్పి ప్రకుపితమైన ప్రకంపనాలతో ప్రళయాన్ని సృష్టించే భూమి, ఇవన్నీ కలసి , భూకంపాలుగా, తుఫానులుగా, అగ్నిపర్వతాలుగా, అతి వికృతమైన రోగాలుగా మానవ సమాజంలో మరణహోమాలు రగిలిస్తయ్ .

No comments:

Post a Comment