పచ్చి పుదీనా ఆకులు ఏడు , ఏలకకాయ ఒకటి ఈ రెండు పదార్ధాలు ఒక తమలపాకులో పెట్టి కిళ్ళీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగి తరువాత కొద్ది కొద్దిగా మంచి నీళ్ళు తాగితే ఆ మరుక్షణమే కడుపు నొప్ప్పి కనుమరుగవుతుంది.
రెండు తరాల ముందువరకు మనవాళ్ళు తొంభై ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ?
Pages
▼
Tuesday, 31 December 2013
మురికినీటి వల్ల కలిగిన జ్వరాలకు :
శొంఠి 40 గ్రాములు తీసుకుని దానిని నాలుగు రెట్లు నీటితో కలిపి నాల్గవ వంతు కషాయం మిగిలేటట్లు మరిగించి, వడపోసి చల్లర్చి అందులో తగుమాత్రంగా తేనె కలిపి కొద్ది కొద్దిగా సేవిస్తూ వుంటే దుష్టజల సంయోగం వల్ల కలిగిన జ్వరం, అరుచి, అగ్నిమాంద్యం, దగ్గు, పడిశం, జలదోషం వీనిని హరింపచేసి శరీరానికి, మనసుకు, నేత్రములకు నిర్మలత్వాన్ని ప్రసన్నతను కలుగచేస్తుంది.
Saturday, 28 December 2013
మూలవ్యాధి (piles) నివారణకు :
1. కందను కూరగా వండుకుని తింటూ వుంటే 5,6 రోజుల్లో మొలల బాధ నివారణ అవుతుంది
2. బప్పాయి పండ్లు తరుచుగా తింటూ వుంటే మూలవ్యాధులు శాంతిస్తాయ్.
3. వేప పండ్లను రోజూ 5,6 తింటూ వుంటే వేపపండ్లు వచ్చే రుతువు పూర్తయ్యేసరికి మొలలు తగ్గిపోతయ్.
4. నీరుల్లి(ఉల్లిగడ్డల) పాయలను ముక్కలుగా తరిగి నేతితో దోరగా వేయించి ఆ ముక్కల మేద తగినంత పంచదార చల్లి రెండు పూటలా తింటూ వుంటే రక్తం పడే మొలలు తగ్గుతయ్.
5. రోజూ రెండు పూటలా భోజనం చేసిన తరువాత 10 గ్రాములు కరక్కాయ పొడిని పుల్లటి మజ్జిగలో కలుపుకుని తాగుతూ వుంటే మూల వ్యాధి పిలకలు వూడిపడిపోతయ్.
6. మూలవ్యాధి కలవారు ఎక్కువగా జామకాయలను తింటూ వుంటే మొలలలు బాధ శాంతిస్తుంది.

Wednesday, 18 December 2013
తెలుసుకుందాం : బియ్యం గురించి
బియ్యంలో శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్ధాలు అత్యధిక శాతంలో వున్నాయి.
బియ్యంలో శరేర నిర్మాణానికి్ ఉపకరించే మాంసకృత్తులు 7 శాతమే వున్నాయి.
బియ్యంలోగింజకి, పైన వుండే వరి పొట్టూకీ మధ్య విటమిను బి వుంటుంది. బాగ పాలిష్ పట్టిన బియ్యంలో తవుడుతో పాటు ఇది వెళ్ళిపోతుంది.
గోధుమతో పోలిస్తే బియ్యంలో మాంసకృత్తుల శాతం స్వల్పం. అయితే మనిషి శరీరం మాత్రం గోధుమలోని మాంసకృత్తుల కన్నా బియ్యంలోని మాంసకృత్తులే అధికంగా వినియోగించుకుంటుంది.
చాలా కాలం నుంచే పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడే వారిలో ఒకవేళ పాదాలు తిమ్మిరి పట్టడం, మొద్దు బారడం, మంటగా అనిపించడం గనుక జరిగితే అది విటమిను బి లోపంగా గ్రహించాలి.
మామూలు బియ్యం కన్నా ఉప్పుడు బియ్యంలో బి వితమిను శాతం ఎక్కువగా వుంటుంది. గిజలోని ఈ విటమిను చొచ్చుకుపోవడం వల్ల ఈ బియ్యాన్ని ఎంత కడిగినా ఏంకాదు.

కాళ్ళు చేతులు పీకుతుంటే :
ఇటుక పొడుమును గానీ, తవుడు గానీ, ఉప్పు గానీ వెచ్చజేసి గుడ్డలో వేసి కాపడం పెట్టాలి.
వాత నొప్పులకు :
ఉమ్మెత్త ఆకులకి ఆముదము రాసి ఆకుల్ని వేడి చేసి నొప్పిగల చోట వేసి కట్టుకడీతే వెంటనే నొప్పిలాగేస్తుంది.
కాళ్ళు - చేతులు మంటలు :
10 గ్రాముల ఆవునెయ్యిలో 5 గ్రాముల మిరియాలు చితగ్గొట్టీవేసి, మరగకాయాలి.చల్లారిన తరువాత ఆ నేయితో మర్ధనా చేస్తూ ఆ నేతినే అన్నంలో కలుపుకొని తింటూ వుంటే మంటలు తగ్గిపోతయ్.
Tuesday, 17 December 2013
అధిక వేడి తగ్గటానికి:
దోరగా వేయించిన ధనియాలపొడి, దోరగా వేయించిన జీలకర్ర పొడి, దోరగా వేయించిన సోంపు పొడి కలిపి ఒక సీసాలో పెట్టుకుని నీళ్ళలో ఈ పొడిని, సరిపోయేంత పటికబెల్లం, కొన్ని ఎండు ఉసిరి ముక్కలు వేసి వుంచి రోజంతా ఆ నీరు తాగుతూ వుంటే అధిక వేడి తగ్గుతుంది.
లేదా
సబ్జా గింజలు అర చెంచా, అర గ్లాసు నీళ్ళలో వేసి,10 నిముషాల తరువాత అందులో పటిక బెల్లం వేసుకుని తాగితే
15 నిముషాల్లో వేడి దిగిపోతుంది.
లేదా
సబ్జా గింజలు అర చెంచా, అర గ్లాసు నీళ్ళలో వేసి,10 నిముషాల తరువాత అందులో పటిక బెల్లం వేసుకుని తాగితే
15 నిముషాల్లో వేడి దిగిపోతుంది.
పచ్చి అరటికాయ చూర్ణంతో ఉపయోగాలు:
అరటికాయను చిన్న ముక్కలుగా తరిగి ఎండించి దంచి జల్లించి చూర్ణం చేసి విలువ ఉంచుకోవాలి.
జ్వరాలకు :
పిల్లలకు పావు టీ చెంచా, పెద్దలకు అర టీ చెంచా మోతాదుగా అరటి చూర్ణాన్ని రెండు పూటలా ఆహారానికి అరగంట ముందుగా సేవిస్తుంటే జ్వరాలు, జ్వరంలో కలిగే విరేచనాలు తగ్గుతయ్.
జిగట, రక్త విరేచనాలకు :
పై చూర్ణాన్ని మోతాదుగా పిల్లలు పెద్దలు వాడుతుంటే ఉదరకోశంలోని చెడు క్రిములు నశీంచిపోయి జిగట, రక్తవిరేచనాలు కూడా కట్టుకుంటాయి.
నేత్రవ్యాధులకు:
పచ్చి అరటికాయ చూర్ణాన్ని విడవకుండా నలభై నుండీ అరవై రోజుల వరకు రెండుపూటలా ఆహారానికి గంట ముందుగా పైన తెలిపిన మోతాదు
ప్రకారం మంచి నీటితో సేవించడం వల్ల నేత్రరోగాలకు ఉపశమనం కలుగతతని. అనగా నేత్రాలు ఎర్రబడటం, పుసులు కట్టడం, గరగరలాడటం, మంట, నీరు కారటం వంటి బాధలు హరించిపోతయ్.
స్త్రీల బట్టంటు వ్యాధులకు:
ఈనాడు దాదాపుగా నూటికి నూరు మంది ఆడపిల్లలు ఏదో ఒక రకమైన బట్టంతు వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. అలాంటి వారు కారం, ఉప్పు, పులుపు బాగా తగ్గించి, మాంసం, గుడ్లు, చేపలు పూర్తిగా నిషేధించి ఆహారంలో పచ్చి అరటికాయతో చప్పిడిగా వండిన కూరను సేవించాలి. రుంచికోసం కొద్దిగా సైంధవలవణం, మిరియాల కారం కలిపి వండుకోవచ్చు. లేకుంటే పైన తెలిపినట్లుగా చూర్ణాన్ని తయారుచేసుకొని రెండుపూటలా అదే మోతాదుగా మంచి నీటితో సేవించడం ద్వారా కూడా బట్టంటువ్యాధుల నుండి బయటపడవచ్చు.
మూలవ్యాధికి (piles):
ఎంతోకాలం నుండీ తీవ్రమైన మొలలు సమస్యలతో బాధపడేవారు అరటికాయను ముక్కలు చేసి ఎండబెట్టి దంచి పొడిచేసి పైన తెలిపిన మోతాదులా వాడుతుంటే 40-60 రోజుల్లో మొలలు, పోటు తగ్గిపోయి బయటకొచ్చిన మొలల పిలకలు కూడా ఎండి రాలి పడిపోతయ్.
ఈ చూర్ణం కొద్దిగా విరేచనబద్దకాన్ని కలిగిస్తుంది. అలాంటివారు రోజూరాత్రి భోజనంలో తినే చారులో అరచెంచా సునాముఖిపొడిని వేసి తినటం ద్వారా పరిష్కారం పొందవచ్చు.

ఎముకలు అరిగిన సమస్యకు :
చింతగింజలు తెచ్చి బాగా వేయించి నీటిలోవేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పైతోలు తీసి పప్పును ఎండించాలి. తరువాత వాటిని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఒక చెంచా మోతాదుగా నీరుపోసి కలిపి వండుతూ ఉడికిన తరువాత పాలుపోసి చక్కెర వేసి పాయసంలా చేసుకుని రెండు పూటలా సేవించాలి. ఈ విధంగా కొంతకాలంపాటు చేస్తుంటే సంధుల్లో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడుతుంది. ఇది ఖర్చులేని, కష్టంలేని మార్గం.
ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే, ఆపరేషన్లు, కీళ్ళలో రాడ్లు పెట్టించుకుని తరువాత బాధపడే బాధ తప్పుతుంది.
ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే, ఆపరేషన్లు, కీళ్ళలో రాడ్లు పెట్టించుకుని తరువాత బాధపడే బాధ తప్పుతుంది.
దగ్గు ఎందుకు ఆపకూడదు:
శ్వాస కోశమార్గంలో ఏర్పడే అవరోధాలను నిరోధించడానికి శరీరం దగ్గును సృష్టిస్తుంది. ఆ దగ్గును ఆపడానికి ప్రయత్నించకుండా దగ్గితే అవరోధాలు హరించిపోతయ్.
అలాగాక ఏ కారణాలవలనైనా వచ్చిన దగ్గును బలవంతంగా నిరోధిస్తే క్రమక్రమంగా ఆ దగ్గు ఏ ఔషధాలకు లొంగనంత ఉధృతంగా వృద్ధిచెందుతుంది. అంతేగాక, ఆపిన దగ్గువల్ల కాలగమనంలో అరుచి, గుండెరోగం, ఆస్తమా, క్షయ, ఎక్కిళ్ళు, మొదలైన శ్వాసకోశ సంబంధ సమస్యలు అనేకం పుట్టుకొస్తయ్.

తుమ్ములు అధికంగా వస్తూ బాధపెడుతుంటే:
ప్రతిరోజూ ఉదయం అల్లం రసం, తేనె ఒక చెంచా మోతాదుగా 40 రోజులు వాడుతూంటే తుమ్ములు ఆగిపోతాయ్.
తలవెంట్రుకలు పెరగటానికి:
కలబంద గుజ్జు 200 గ్రాములు, నువ్వులనూనె 200 గ్రాములు, ఈ రెండూ కలిపి చిన్న మంటపైన మరగబెట్టి కలబంద గుజ్జు నూనెలో మరిగేవరకు వుడికించి దించి వడపోసి చల్లరిన తరువాత ఒక డబ్బాలో పెట్టుకుని రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయ్.
వండిన పదార్ధాలు, పచ్చి పదార్ధాలు ఒకేసారి సేవించ వచ్చా?
వండిన పదార్ధాలు, పచ్చి పదార్ధాలు ఒకేసారి సేవించడంలో ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కాబట్టి, పచ్చికూరగాయల కుక్కలు గానీ పళ్ళరసాలుగానీ వండిన ఆహారాన్ని భుజించేటప్పుడు సేవించకుండా భోజనం తరువాత రెండు గంటలు ఆగి సేవించడం మంచిది.
వృద్ధుల - సమస్త మూత్రవ్యాధులకు:
పచ్చిపసుపు దుంప చిన్న ముక్కలు చేసి ఎండబెట్టి దంచి చేసిన పొడి 40 గ్రాములు ఉసిరికాయపొడి 40 గ్రాములు పటికబెల్లం పొడి 40 గ్రాములు కలిపి వుంచుకోవాలి. పూటకు 5 గ్రాములు మోతాదుగా రోగస్థితిని బట్టి రెండు లేక మూడు పూటలా సేవిస్తూవుంటే అన్నిరకాల మూత్రవ్యాధులు హరించిపోతాయి.
వృద్ధుల మూత్రంలో మంటకు:
ఒక గ్లాసు గోరువెచ్చని గంజిలో రెండుచెంచాల నెయ్యి కలిపి రోజూ రెండు లేదా మూడుసార్లు తాగుతూవుంటే అతివేడి హరించిపోయి మూత్రమ్లోమంట తగ్గిపోతుంది.
వృద్ధులకు మూత్రం బొట్లు బొట్లుగా పడుతుంటే:
1. వేడిపాలలో బెల్లం కలుపుకుని తాగుతుంటే మూత్రం ధారాళంగా విడుదల అవుతుంది.
2. ఆవాలను దోరగా వేయించి పొడి చేసి అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో మూడు చిటికెలు కలుపుకుని తింటుంటే మూత్రం ధారాళంగా విడదల అవుతుంది.
2. ఆవాలను దోరగా వేయించి పొడి చేసి అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో మూడు చిటికెలు కలుపుకుని తింటుంటే మూత్రం ధారాళంగా విడదల అవుతుంది.
Monday, 16 December 2013
చెవుడు నివారించుటకు :
దేశవాళీ గోమూత్రాన్ని ఏడుసార్లు బట్టలో వడపోసి గోరువెచ్చగా వేడిచేసి ఒక చెంచా గోమూత్రంలో చిటికెడు సైంధవలవణం కలిపి కరిగించి చెవులలో అయిదారు చుక్కలు రెండు పూటలా గోరువెచ్చగా వేస్తూ వుంటే ఎనిమిదిరోజులలో చెవుడు నివారించబడుతుంది. దిర్ఘకాల సమస్య వున్నవారు మరికొన్ని రోజులు వేయవచ్చు.
చెవుడుకు మరొకయోగం:బాగా పండిన పసుపు పచ్చని జిల్లేడాకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడిచి దానిపైన ఆవనూనె బాగా రాయాలి. తరువాత ఆ ఆకును పొయ్యిమీద సెగ చూపించి వాడ్చి ఆకును పిండి తీసిన రసం మూడుచుక్కల మోతాదుగా రెండుపూటలా చెవులలో వేస్తుంటే చెవుడుతో పాటు చెవి మూసుకుపోవడం, చెవిపోటు వంటి అనేకరాకాల చెవి వ్యాధులు అతిసులువుగా హరించిపోతయ్.
ఆహార నియమాలు: చెవి సమస్యలున్నవారు జలుబు చేసే వస్తువులు తినకూడదు. ముఖ్యంగా పెరుగు, పాలు, అరటిపండు, మిఠాయి వంటి తీపిపదార్ధాలు అతిచలువ చేసే ఆకు కూరలు, కాయగూరలు నిషేధించాలి.

చెవిలో చీముకు:
ఒక చిన్న గరిటెలో నువ్వులనూనె గానీ ఆవనూనె గానీ తీసుకొని మంటమీద గరిటెను పెట్టి వేడిచేస్తూ ఆ నూనెలో వెల్లుల్లి లోపలి గర్భం(పాయ/రెబ్బ)ఒకటి చిదిపి వేయాలి. అది నూనెవేడికి చిటపటమని కాగుతూ నల్లగా మాడగానే గరిటెను మంటనుండి తీసి గోరువెచ్చగా అయ్యేవరకూ పక్కన పెట్టి ఆ తరువాత వడపోసి ఆ నూనెలో దూదిని ముంచి చెవులలో రెండు పూటలా నాలుగైదు చుక్కలు పిండాలి. ఎప్పుడు పిండినా నూనె గోరువెచ్చగా వుండాలి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే చెవులోచీము, చెవిపోటు, చెవుల్లో పురుగులు దూరడం వల్ల కలిగిన బాధ తగ్గిపోతయ్.
ఇంగ్లీషు డాక్టర్లు చెవిలో నూనె ఎందుకు వేసుకోవద్దంటారు ? మరి చెవి రోగాలు ఎందుకు వస్తున్నాయ్ ?ఏమి చెయ్యాలి ?
ఈనాడు దాదాపుగా చెవి రోగాలు లేని వ్యక్తులు ఒక్కరుకూడా లేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనమంతా మన దేశీయమైన ముందు జాగ్రత్త చర్యలను విడిచిపెట్టి విదేశీయ మార్గాలను ఆచరిస్తున్నాం. మన పద్ధతి ప్రకారం రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని నువ్వులనూనె మూడునాలుగు చుక్కలు చెవులలో వేసుకోవదం ద్వారా ఎప్పటికీ చెవులకు సంబంధించిన వ్యాధులు వచ్చేవి కావు. వినికిడి శక్తి లోపించేది కాదు.
అయితే, విదేశీ వైద్యం మన దేశంలొ ప్రవేశించిన తరువాత వారిదేశ వాతావరణాన్ని(శీతల) బట్టి చెవులలో నూనె వేయకూడదు కాబట్టి మనదేశంలో కూడా ప్రజలంతా చెవులలో నూనెవేసుకోవడం మానుకోవాలని ఆ చదువు చదివిన వైద్యులు ప్రబోధించడం వల్ల మనమమంతా చెవులలో నూనెవేయడం మానుకున్నాం. అందుకే ఇన్ని రకాల చెవి వ్యాధులు మనల్ని పీడిస్తున్నాయ్. వెంటనే చెవులలో పైన తెలిపినట్లు నూనె వేయడం ప్రారంభించి చెవి రోగాలు రాకుండా కాపాడుకోండి.
మార్కెట్లలో కల్తీ నూనెలు వుండటం వల్ల కూడా డాక్టర్లు వద్దనటానికి మరొక కారణం అని కూడా చెప్పొచ్చు.
కానుగ దగ్గర మంచి నూనె సేకరించుకుని వాడటం ఉత్తమం.

ముక్కులో ఎముక పెరిగితే:
ఈనాడు ఈ సమస్యకు ఆధునిక వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. చేసిన తరువాత కూడా మరలా మరలా కొయ్యకండరాలు ముక్కులో పెరుగుతూనే వున్నయ్. అందువల్ల ఈ సమస్యగల వారు పరిశుద్ధమైన వేపనూనె రెండుమూడు చుక్కల మోతాదుగా రెండుపూటలా ఆహారానికి అరగంటముందు ముక్కుల్లో వేయాలి. దీనివల్ల వారం పదిరోజుల్లోనే ముక్కుల్లో పెరిగిన కొయ్యకండరాలు కరగడం మొదలై చీదినప్పుడు కొంచం ఎర్రగా నీరు స్రవిస్తుంది. అందుకు భయపడవలసిన అవసరం లేదు. ఇలా కొద్దిరోజులు చేస్తే ఆ సమస్య తీరిపోతుంది.
దీనితోపాటు దోరగా వేయించిన శొంఠిపొడి 50 గ్రాములు , పాతబెల్లం 100 గ్రాములు కలిపి దంచి నిలువచేసుకుని పూటకు పిల్లలకు 2 గ్రాములు మోతాదుగా, పెద్దలకు 5 గ్రాములు సేవింపచేస్తుంటే అతిత్వరగా నాసికాసమస్యలు హరించిపోతయ్.
ఆహారనియామాలు : నాసికా సమస్యలున్నవారు ముఖ్యంగా ఫ్రిజ్ లో నిలువచేసిన పదార్ధాలు నిషేధించాలి. ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చల్లని నీరు, చల్లని పదార్ధాలు విడిచిపెట్టాలి. పాలు, పంచదార, దోస, బెండ, ఆనబ(సొరకాయ)కూరలను సేవించడం మానుకోవాలి.

ముక్కునుండి రక్తం కారుతుంటే :
గరిక వేర్లను శుభ్రంగా కడిగి దంచితీసిన రసం బట్టలో వడపోసి మూడునాలుగు చుక్కల మోతాదుగా రెండూపూటలా ముక్కుల్లో వేస్తూంటే ముక్కునుండి కారే రక్తం వెంటనే ఆగిపోతుంది.
దీనితోపాటు దోరగావేయించిన ధనియాలపొడి 100 గ్రాములు, పటిక బెల్లం పొడీ 100 గ్రాములు కలిపి రెండూపూటలా పూటకు చెంచా మోతాదుగా సేవిస్తూ వుంటే త్వరగా ఆ సమస్యనుండి బయటపడవచ్చు.
దీనితోపాటు దోరగావేయించిన ధనియాలపొడి 100 గ్రాములు, పటిక బెల్లం పొడీ 100 గ్రాములు కలిపి రెండూపూటలా పూటకు చెంచా మోతాదుగా సేవిస్తూ వుంటే త్వరగా ఆ సమస్యనుండి బయటపడవచ్చు.
నాసికా(ముక్కు)రోగములకు - నాణ్యమైన మార్గం :
ప్రతిరోజూ నియమం తప్పకుండా గోరువెచ్చని కల్తీలేని స్వచ్చమైన నువ్వుల నూనెను రెండు రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాలలో వేసుకొని పీలుస్తూవుంటే జీవితంలో ఏనాటికీ నాసికారోగములు రానే రావని మహాఋషులు నిర్ధారించారు.
మన ఇండ్లలో మన తాతముత్తతలంతా ఈ విధానాన్ని నియమం తప్పకుకండా ఆచరించి ఏ నాసికారోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇంత గొప్ప సులువైన మార్గం ఈనాడు మనం ఆచరించకపోవడంవల్లే అనేక నాసికా రోగాలకు గురౌతున్నాం.

కండ్ల నుండి నేరు కారుతూవుంటే :
వేపాకును మెత్తగా కొంచం నీటితో ముద్దలాగా నూరి కొద్దిగా నీటిని పిండివేసి ఆ ముద్దను మూసిన కండ్లపైన పలుచని బట్టవేసి దానిపైన ఆ ముద్దను పరిచి 20 నిముషాల పాటు వుంచి తీసివేయాలి. ఈ విధంగా కొద్దిరోజులు చేస్తే కండ్లవెంట నీరుకారడం ఆగిపోయి కళ్ళకు తేజస్సు పెరుగుతుంది.
కండ్లమంటలకు:
జామచెట్టు నుండి పచ్చగా వున్న ఆకులను సేకరించి దుమ్ములేకుండా కడిగి కొంచం నీటితో మెత్తగా ముద్దలాగా నూరి ఆ ముద్దను చిన్న గారెలాగా గుండ్రంగా చేసి మూసినకళ్ళపైన పలుచని నూలు బట్టవేసి దానిపైన ఈ ముద్దను పరచి ఇరవైనిముషములు ఆగిన తరువాత తీసివేయాలి. ఇలా చేస్తుంటే కండ్లమంటలు సులువుగా తగ్గిపోతయ్.
కండ్లకింద నల్లని వలయాలకు:
పరిశుభ్రమైన ఆవనూనె తెచ్చుకొని నాలుగైదు చుక్కలు ఎడమచేతి అరచేతిలో వేసుకుని కుడిచేతితో కొద్దికొద్దిగా అద్దుకొని నిదానంగా కండ్లకింద నల్లని వలయాలపైన మృదువుగా రెండుపూటలా మర్ధన చేయాలి. ఇలా చేస్తూ ఉసిరికాయలపొడి 100 గ్రాములు, పటికబెల్లం పొడి 100 గ్రాములు కలిపివుంచుకొని రెండుపూటలా అరచెంచా నుండి ఒక చెంచా వరకు సేవించాలి. దీని వల్ల కళ్ళకింద ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా హరించిపోతయ్.
ముఖంపై మంగు మచ్చలు మాయమగుటకు :
మర్రిచిగుర్లు, పచ్చ పెసర్లు సమంగా తీసుకొని తగినన్ని ఆవుపాలతో కలిపి బాగా మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మంగుమచ్చలపైన లేపనం చేస్తుంటే తప్పకుండా ఎంతోకాలం నుంచి వున్న మచ్చలైనా మటుమాయమౌతయ్.
వెంట్రుకలు పొడవుగా పెరుగుటకు:
సన్నగా వుండే లేత మర్రి వూడలు 100 గ్రాములు, గుంటగలగరాకులు(బృంగరాజు) 100 గ్రాములు, ఈ రెండింటిని కలిసిపోయేటట్లు మెత్తగానూరి 300 గ్రాముల నల్లనువ్వులనూనెలో వేసి కలిపి చిన్నమంటపైన మరిగిస్తూ నూనె మిగలగానే దించి వడపోసి బధ్రపరచుకోవాలి. ఈ తైలాన్ని రోజూ వెంట్రుకలకు రాస్తుంటే జుట్టు పొట్టిగా వున్నవారికి పొడవుగా పెరుగుతుంది.
మరణం లేని చెట్టు - మర్రి చెట్టు:
మర్రిపండ్లలో వుండే కంటిలోపల నలుసంత పరిమాణంగల చిన్న గింజలనుండి మరణమేలేని మర్రి వృక్షం పుట్టుకొస్తుందంటే ఆ విత్తనం ఎంతగొప్పదో అందులో ఎంతదైవశక్తి దాగివుందో మనం తెలుసుకోవచ్చు. పండిన మర్రిపండ్లు తిని కాకులు వేయ్యేండ్లు ఆయువుతొ వర్ధిల్లుతున్నాయని మనకు తెలియదు. భగవంతునికి ఆది మధ్య అంతం ఎలా వుండదో, మైళ్ళపర్యంతరం విస్తరించిన మర్రిచెట్టుకు కూడా మొదలెక్కడో చివరెక్కడో మధ్యెక్కడో తెలుసుకోలేము. దీని సర్వాంగాలు పచ్చివి గాని, ఎండినవిగాని, పండ్లు గాని అన్నికూడా అపారమైన ఔషధ శక్తులతో నిండి వున్నయ్. అందుకే ఈ చెట్లను గుళ్ళల్లో పెంచాలని పెద్దలు తీర్మానించారు.
రవివున్న చెట్టు - రావి చెట్టు:
రవి అనగా ప్రాణశక్తి. సూర్యుని కిరణాలలో మానవాళిని కాపాడే మహోన్నత జీవశక్తి ఎలా దాగి వుంటుందో అదేవిధంగా ఆ సూర్యుడనబడే రవికి ప్రతిరూపంగా భూమిపై ఆవిర్భవించిన రావిచెట్టులో అదేశక్తి నిండి వుంటుంది.
ఇది రాత్రంబవళ్ళు ఒకవైపు నుండి మానవులు జంతువులు మొదలైన జీవులు విడిచిపెట్టే బొగ్గుపులుసు వాయువు అనేచెడుపదార్ధాలను ఆహారంగా తీసుకొంటూ మరోవైపునుండి జీవకోటి ఆయువునిలిపే ప్రాణవాయువులను నిరంతరం వెదజల్లుతూ వుంటుంది.
అందుకే ఈ చెట్టును సూర్యాత్మ అని, దైవాత్మ అని దైవభవనం అని అశ్వత్ఠవృక్షము అని బోధివృక్షము అని జ్ణాన వృక్షము అని ధర్మ వృక్షము అని సంతాన వృక్షము అని ఇలా అనేకవందల రకాల పేర్లు ఈ చెట్టుకు పెట్టబడినయ్.

చర్మం పై పుట్టిన - గడ్డలకు, బిళ్ళలకు:
రావిచెట్టు ఆకులకు ఆముదంరాసి వాటిని వేడిచేసి గడ్డలపై వేసి కట్టుకడుతూవుంటే ఆ గడ్డలు చితికిపోయి మాడడిపోతయ్.
అధికపానం అనర్ధం:
దాహమైంది కదాని అధికంగా నీరు సేవించినాకూడా అనేకరోగాలు పుడతయ్. దాహం తీరడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వుంటుంది. మనసులో ఇక చాలు అనిపించినప్పుదు నీరు తాగడం ఆపివేయాలి. ఈ నియమం ప్రధానంగా గుర్తుంచుకో్దగినది.
అతిఋతు రక్త స్రావ సమస్యకు: అరటిపండ్లతో నెయ్యి కలిపి మెత్తగా పిసికి తింటూ వుంటే ఎర్రకుసుమ రోగం/అతి ఋతు రక్త స్రావం ఆశ్చర్యంగా తగ్గిపోతుంది.
అతిఋతు రక్త స్రావ సమస్యకు: అరటిపండ్లతో నెయ్యి కలిపి మెత్తగా పిసికి తింటూ వుంటే ఎర్రకుసుమ రోగం/అతి ఋతు రక్త స్రావం ఆశ్చర్యంగా తగ్గిపోతుంది.
బుద్ధ్హి/ఆయుష్షు పెరగాలంటే:
మర్రి వూడలతో రోజూ పండ్లు తోముకుంటూంటే క్రమంగా బుద్ధి, ఆయుష్షు పెరుగుతయ్.
దేహ పుష్టికి :
వంద గ్రాముల పెరుగు, ఆవునేతితో దోరగా వేయించిన మిరియాల చూర్ణం ఐదు గ్రాములు, ఈ రెండు కలిపి, బాగా చిలికితే పానకం లాగా అవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తాగుతూ వుంటే శరీరానికి అగ్నిదీప్తి (ఆకలి), కాంతి పుష్టి కలుగుతయ్.
Wednesday, 11 December 2013
7 రోజుల్లొ టాన్సిల్స్ పోతాయి
7 రోజుల్లొ టాన్సిల్స్ పోతాయి పసుపు 100 గ్రాములు సైంధవ లవణం 100 గ్రాములు వాయువిదంగాలపొడి 100 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి . అర లీటరు మంచి నీటిలో పై చూర్ణాన్ని ఒక టీ చెంచా మోతాదుగా వేసి 5 నిముషాలపాటు మరిగించి వడపోసి గోరు వెచ్చగా నోట్లొ పోసుకుని గులగరించి వుసివెస్తుంటె 7 రోజుల్లొ టాన్సిల్స్ తగ్గుతాయి
ఆహార నియామాలు పాటించాలి.
ఆహార నియామాలు పాటించాలి.
తెల్లబోల్లి మచ్చలు/tellabolli machalaku
మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు హరిస్తయ్
minumulanu neetitoo nuuri pattistunte kramamgaa tellabolli machalu haristai.
minumulanu neetitoo nuuri pattistunte kramamgaa tellabolli machalu haristai.
Tuesday, 10 December 2013
తెలుసుకుందాం/telusukundaam
మానసిక శక్తి మహోన్నతంగా పెరగాలంటే రొజూ సూర్యసక్తిని గ్రహించావలసిందే
maanasika sakti mahonnatamgaa peragaalante roojuu suurya saktini grahinchavalasinde.
ఏ ఇంటిలోనికి సూర్య రశ్మి ప్రవెశీంచదొ ఆ ఇల్లు నివాస యోగ్యం కాదు
ee intiloniki suuryarasmi pravesinchadoo aa illu nivaasa yogyam kaadu.

మంచి విషయం/manchi vishayam
ఆహార విహార వ్యవహారాలలో జరిగే లోపాలే అన్ని రోగాలకు అసలు కారణాలు
aahaara vihaara vyavahaaraalalo jarige lopaale anni roogaalaku asalu kaaranaalu.
కాలిన గాయాలకు కమ్మని లేపనం/ kaalina gaayaalaku kammani lepanam.
బాగా పండిన అరటిపండును మెత్తగా పిసికి కాలిన గాయాలపైన వెంటనే లేపనం చేస్తే మంట పోటు తగ్గి గాయాలు త్వరగా మానుతయ్ .
baagaa pandina arati pandunu mettagaa pisiki kaalina gaayaalapaina ventane lepanam cheste manta, potu taggi gaayaalu tvaragaa maanatay.
baagaa pandina arati pandunu mettagaa pisiki kaalina gaayaalapaina ventane lepanam cheste manta, potu taggi gaayaalu tvaragaa maanatay.
Sunday, 8 December 2013
ఉబ్బసరోగం పారిపోతుంది / vubbasa rogaaniki
మంచి వేప నూనె 5 చుక్కలు తమలపాకు పై వేసి రొజూ తింటుంటే 21 రోజుల్లో ఉబ్బసరోగం పారిపోతుంది
Manchi vepa nune 5 chukkalu tamalapaku pai vesi roju tintunte 21 rojullo vubbasa rogam paaripotundi.
Manchi vepa nune 5 chukkalu tamalapaku pai vesi roju tintunte 21 rojullo vubbasa rogam paaripotundi.
మాటలు రాని చంటి బిడ్డలకు మహత్తర మార్గం :
మర్రి వూడలు తెచ్చి , వాటిని నీళ్ళతో మెత్తటి గంధంగా నూరాలి . ఆ గంధాన్ని చంటి బిడ్డల నాలుక మీద రుద్దుతూ ఉంటే క్రమంగా మాటలు వస్తాయ్, ఈ వూడల గంధం లోపలికి పోయినా మంచిదే గానీ నష్టమేమీ వుండదు .
Saturday, 30 November 2013
Nuvvula nune mardhana chaalaa manchidi..
Nuvvula nuune mardhana anni vidhaala vupayogakaram..idi chedu kovvunu taggistundi..deeni vupayogaalu teliste okka roju kuuda vadilipettakundaa chestaaru.. vaatini tvralo teluputaanu..
Wednesday, 20 November 2013
సెగగడ్డలు/segagaddalu povataniki
పసుపుకొమ్ము, అవిసిగింజలు నీటితో నూరి పైనకడితే సెగగడ్డలు మూడురోజులలో పగిలిపోతయ్.
Pasupukommu, avisiginjalu neetitoomnuuru paina kaditee sega gaddalu muudu roojulaloo pagilipootay.
Tuesday, 19 November 2013
గజ్జి, తామర వంటి చర్మరోగాలు/ gajji, tamara vanti charma roogaalaku..
చర్మంపైన కిరోసినాయిల్ మాటిమాటికీ పూస్తుంటే గజ్జి, తామర వంటి చర్మరోగాలు హరించిపోతయ్.
Charmam pai kirocine maatimaatiki puustunte gajji, taamara vanti charma roogaalu harinchipootay.
Charmam pai kirocine maatimaatiki puustunte gajji, taamara vanti charma roogaalu harinchipootay.
Monday, 18 November 2013
ఎంతో కాలంగా తలనొప్పితో బాధపడుతుంటే :
బాగా పండిన ఆపిల్ పండును తీసుకుని పై తోలును మరియు పండు లోపల మధ్యలో వుండే గట్టి భాగాన్ని తీసివేసి మిగిలిన పండును ముక్కలుగా చేసి వాటికి కొద్దిగా ఉప్పు పొడి అద్దుకుని ఉదయం పరగడుపున సేవించాలి. సేవించిన గంట వరకు మరేమి తినకూడదు.ఇలా చేస్తుంటే వారం పది రోజుల్లో తలనొప్పి ఆచర్యకరంగా తగ్గిపోతుంది.
Saturday, 16 November 2013
గుండె రోగులు ఏమి చేయకూడదు ? / Gunde roogulu emi cheyakuudadu?
గుండె రోగులు దప్పికను, వాంతిని, మలమూత్రమును, అపానవాయువును, ఆవులింతను, దగ్గును, కన్నీటిని ఆపకూడదు, అతి బరువు ఎత్తకూడదు.
Gunde roogulu dappikanu, vaantini, malamuutramunu, appanavaayuvunu, aavulintanu, daggunu, kanneetini aapakuudadu, ati baruvu ettakuudadu...
Thursday, 14 November 2013
శోభిమచ్చల/soobhi machalaku
తులశాకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరినతరువాత స్నానం చేస్తుంటే శోభి త్వరగా తగ్గుతుంది.
Tulasaaku rasamlo haarati karpooram kalipi mettagaanuuri sobhi machalapai ruddi, aarina taruvaata snaanam chestuu vunte soobhi tvaragaa taggutundi..
Tulasaaku rasamlo haarati karpooram kalipi mettagaanuuri sobhi machalapai ruddi, aarina taruvaata snaanam chestuu vunte soobhi tvaragaa taggutundi..
Wednesday, 13 November 2013
గర్భాశయ, అండాశయ, రొమ్ముల్లో గడ్డలు, అండాశయంలో నీటి బుడగలు, అధిక కొవ్వు, గ్రంధుల్లో మార్పులు :
కలబంద గుజ్జు 40 గ్రాములు, ఇంట్లో కొట్టుకున్న పసుపు 3 గ్రాములు, కరక్కాయ బెరడు పొడి 3 గ్రాములు, జీలకర్ర పొడి 3 గ్రాములు, సైంధవలవణం పొడి 3 గ్రాములు, మంచినీళ్ళు అరకప్పు వీటన్నిటినీ ఒక గాజుగ్లాసులోవేసి ఒక చెంచా కండ చక్కెర కూడా కలిపి బాగా గిలక్కొట్టి పానీయంలాగా చేసి ఉదయం లేదా సాయంత్రం లేదా రెండు పూటలా వ్యాధి పరిస్థితిని బట్టి సేవిస్తూ వుంటే గర్భాసయంలో గడ్డలు, అండాశయంలో నీటి బుడగలు, అధిక కొవ్వు, రొమ్ముల్లో గడ్డలు, గ్రంధుల్లో మార్పులు మొదలైన సమస్యలన్నీ క్రమంగా పూర్తి అదుపులోకి వస్తయ్.
Tuesday, 12 November 2013
tip...
స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు, నిమ్మ పండు రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు హరించి శరీరం కాంతివంతంగా మారుతుంది.
why do we get stones in kidneys and remedy for this problem:
* మూత్రపిండాల్లో రాళ్ళు ఎలా/ఎందుకు ఏర్పడతాయి/ఏమి చెయ్యాలి ?
ఆహారం ద్వారా మూత్రపిండాలలోకి ప్రవేశించిన కుళ్ళిన ఆహార పదార్ధ రూపమైన యూరిక్ ఆసిడ్ (మూత్రికామ్లము ) మూత్రపిండాల బలహీనత వల్ల మూత్రంతో కలసి బయటకు రాకుండా లోపలే వుండిపోయి రాళ్ళులాగా మారుతుంది.
అంతేకాక , మనం తినే ఆహారంలోని కా్ల్షియం అనబడే సున్నపు ధాతువు ఎప్పటికప్పుడు థైరాయిడ్ గ్రంధి ద్వారా ధాతురూపంగా మార్చబడుతూ ఎముకలకు చేరుకుంటుంది. అయితే థైరాయిడ్ గ్రంధి ఎప్పుడైతే బలహీనపడి రోగ గ్రస్తమవుతుందో ఆ మరుక్షణమే కాల్షియం అరిగించలేకపోవడంవల్ల, Iరిగించలేకపోవడంవల్ల అది ఎక్కడిదక్కడే నిలవవుండిపోయి మూత్రపిండాలలో రాళ్ళుగా ఏర్పడుతుంది.
అలాంటి సందర్బ్హాల్లో ఆకులు తీసిన ముల్లంగి కాడలను తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు రెండు పూటలా సేవిస్తుంటే మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళం మొదలైన చోట్ల ఏర్పడిన రాళ్ళు ముక్కలు ముక్కలుగా కరిగి పడిపోతయ్.
ఇదే వ్యాధికి ఇంతకుముందు కూడా చిట్కాలు అందించడం జరిగింది, వాటినికూడా పరిశీలించి, ఏది ఆచరించడానికి వీలుగా వుంటుందో అది చేసుకుని, బాగయ్యాక చెప్పడం మరువకండి.
Monday, 11 November 2013
మూత్రబంధం: మూత్రం బొట్టు బొట్టుగా రవడం/పూర్తిగా రాకపోవడం - ముల్లంగి:
మూత్రనాళంలో లేదా మూత్ర గ్రంధిలో పుండు లేదా గడ్డ ఏర్పడడం వల్ల, మూత్రావయవాలు కుచించుకుపోవడం వల్ల మూత్రం ధారాళంగా బయటకు రాకుండా ఆగి ఆగి రావడం గానీ, బొట్టు బొట్టు గా రావడం గానీ లేక పూర్తిగా మూత్రం బంధించడం గానీ జరుగుతుంది.
అలాంటి సందర్భంలో ముల్లంగి రసాన్ని రెండు పూటలా 50 గ్రాముల మోతాదుగా ఆహారానికి రెండు గంటల ముందు సేవిస్తుంటే మూత్రసమస్యలు తీరిపోయి మూత్రం సుఖంగా జారీ అవుతుంది.
అలాంటి సందర్భంలో ముల్లంగి రసాన్ని రెండు పూటలా 50 గ్రాముల మోతాదుగా ఆహారానికి రెండు గంటల ముందు సేవిస్తుంటే మూత్రసమస్యలు తీరిపోయి మూత్రం సుఖంగా జారీ అవుతుంది.
Sunday, 10 November 2013
కాలేయ(లివర్ )రహస్యం మీకు తెలుసా?
కామెర్ల వ్యాధికి మూలకేంద్రం కాలేయం. ఇది సూర్యుని అంశతో మన శరీరంలో పుట్టింది కాబట్టి దీన్ని సూర్యచక్రం అంటారు. సూర్యుని వల్ల సమస్త లోకాలు ఎలా శక్తిని పొందుతాయో అదేవిధంగా శరీరంలో కాలేయంవల్ల మిగిలిన అన్ని అవయవాలు రక్షింపబడుతూ జీవశక్తులను పొందుతూ వుంటయ్.అంతటి మహత్కరమైన కాలేయం ఎల్లవేళలా ఆరోగ్యంగా వుండాలంటే సకాల భోజనం, సకాల నిద్ర, మానసిక ప్రశాంతత వుండి తీరాలి. ఈ పద్ధతుల్లో ఎప్పుడైతే తేడా వస్తుందో అంటే మనం వేళకాని వేల భుజిస్తూ అర్ధరాత్రి నిద్రిస్తూ ప్రకృతికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెట్టగానే కాలేయం దెబ్బతినడం ప్రారంభమౌతుంది.అతివేడి కలిగించే పదార్ధాలు దీనికి పడవు. ఈ శారీరక రహస్యాలు తెలుసుకుని ఒక్క కాలేయాన్ని మనం కాపడుకోగలిగితే యావత్ జీవితం ఆనందంగా కొనసాగుతుంది.
దురద, దద్దుర్లు, గజ్జి, తామర త్వరగా తగ్గుటకు:
తులసి, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా హరించిపోతయ్.
Tulasi, nimma rasam kalipi nuuri pattistunte gajji, taamara, durada, daddurlu tvaragaa harinchipootay.
Tulasi, nimma rasam kalipi nuuri pattistunte gajji, taamara, durada, daddurlu tvaragaa harinchipootay.
Saturday, 9 November 2013
వీర్య వృద్ధికి :
1. చింతపండులో వుండే గింజలను కావలసినన్ని తెచ్చుకుని దోరగా వేయించి నీటిలో పోసి రెండు రోజులపాటు నానబెట్టాలి. తరువాత వాటిని చేతితో పిసికి పైతోలు తీసివేసి లోపలి పప్పుని శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. ఆ తరువాత ఆ పప్పును ముక్కలుగా నలగ్గొట్టి మెత్త్గాగా దంచి జల్లించి చూర్ణంగా తయారుచేసుకోవాలి. ఈ చూర్ణంతో సమానంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి.
ఈ పొడిని రెండు పూటలా అరచెంచా మోతాదుగా అరకప్పు వేడిపాలలో కలిపి తాగుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్త్తూవుంటే నలభై రోజుల్లో విశేషమైన వీర్యవృద్ధి, శారీరక దారుఢ్యం ఏర్పడతయ్.
2. ప్రతిరోజూ 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో 50 గ్రాముల బెల్లం కలిపి తినాలి.
3. మినములతో చేసిన సున్నుండలు మొదలైన వంటకాలు తినాలి.

గర్భాశయంలో గడ్డలు ఎందుకు వస్తున్నయ్?
స్త్రీలకు ప్రాణం గర్భాశయం. అది సక్రమంగా పనిచేస్తుంటే వారికి జీవితంలో ఏ వ్యాధి రాదు. బహిష్టు ఎక్కువతక్కువలు లేకుండా సమంగా జరుగుతూ, ఋతువులో బహిష్టు నొప్పి లేకుండా వుంటే గర్భాశయం ఆరోగ్యంగా వున్నట్లు గుర్తు.
కానీ ఈనాడు ఆధునిక జీవన విధానంలోని లోపాలవల్ల బహిష్టు నియమాలను నేటి స్త్రీలు ఉల్లంఘించటం వల్ల ఋతువులో తేడా వస్తుంది. బహిష్టు పూర్తిగా ఆగిపోవడం లేదా ఆగకుండా స్రవించడం లేదా గడ్డలు గడ్డలుగా స్రవించడం మొదలైన సమస్యలు ఏర్పడుతున్నాయ్.ఆ మూడురోజులపాటు చప్ప్డిడి ఆహారం( అన్నం, పెసరపప్పు, పాలు, నెయ్యి, పంచదార మొదలైన పదార్ధాలతో తయారయిన ఆహారం )తీసుకుంటూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే పైన పేర్కొన్న బహిష్టు సమస్యలేవి ఉత్పన్నం కావు. ఈ నియమాన్ని పాటించని స్త్రీలందరికి బహిష్టు అస్తవ్యస్తమై మలినరక్తం పూర్తిగా బహిష్కరింపబడకుండా కొంతభాగం నెల నెలా గర్భాశయంలోనే నిలువ వుంటూ వాత,పిత్త దోషాలచేత దూషింపబడి గడ్డలుగా మారుతుంది.

రక్త శుద్ధి, వృద్ధి, దేహపుష్టి కొరకు:
నెయ్యి 10 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు కలిపి కరిగించి వడపోసి అన్నంతో తింటుంటే రక్త శుద్ధి, వృద్ధి దేహపుష్టి కలిగుతయ్.
ముఖకాంతికి:
పచ్చి పసుపు, నువ్వులు నీటితో నూరి రాత్రి ముఖానికి పట్టించి ఉదయం కడుగుతుంటే ముఖం చంద్రబింభం.
మూత్రపిండాల్లో రాళ్ళకు..
1. కొండపిండి ఆకు కూర చే్సుకుని తింటుంటే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయ్.
2. మంచి ప్రదేశంలో గరిక, తీసుకుని రసం తీసి ప్రతిరోజూ పరగడుపున రెండు చెంచాలు తాగుతుంటే 21 రోజుల్లో మూత్రపిండల్లో రాళ్ళు కరిగి మూత్రం ద్వారా పడిపోతయ్.
2. మంచి ప్రదేశంలో గరిక, తీసుకుని రసం తీసి ప్రతిరోజూ పరగడుపున రెండు చెంచాలు తాగుతుంటే 21 రోజుల్లో మూత్రపిండల్లో రాళ్ళు కరిగి మూత్రం ద్వారా పడిపోతయ్.
Sunday, 3 November 2013
అతి మూత్రానికి:
1. మామిడి ఆకుపొడి చూర్ణం నీటిలో వేసుకుని త్రాగితే అతిమూత్రం పోతుంది.
2. దోరగా వేయించిన ఆవాల పొడిని మూడుచిటికెలు మొదటి ముద్దలో కలిపి తింటుంతే అతిమూత్రం పోతుంది.
2. దోరగా వేయించిన ఆవాల పొడిని మూడుచిటికెలు మొదటి ముద్దలో కలిపి తింటుంతే అతిమూత్రం పోతుంది.
Saturday, 2 November 2013
ఉబ్బసం, జలుబు, దగ్గు, మలేరియా, రొంప ఉపసమనం కోసం - ubbasam, jalubu, daggu, malariya, rompa upasamanam kosam
1. మిరియాల పొడి 3 గ్రాములు, మిస్రీ 5 గ్రాములు, తేనె 10 గ్రాములు తింటుంటే ఉబ్బసం వెంటనే ఉపశమిస్తుంది.
2. అరకప్పు పసుపు కషాయంలో కరకపొడి 5 గ్రాములు కలిపి తాగుతుంటే ఆస్తమా అదృశ్యం.
3. పాలు, చక్కెర కలపని కాఫీ డికాషను తాగుతుంటే దమ్ము, ఆయాసం తగ్గిపోతయ్.
4. తానికాయ చూర్ణం 5 గ్రాములు తేనె 10 గ్రాములు కలిపి తింటుంటే దగ్గు ఆయాసం తగ్గుతయ్.
5. మిరియాల పొడి 3 గ్రాములు, చక్కెర 5 గ్రాములు, నెయ్యి 5 గ్రాములు, తేనె 10 గ్రాములు తింటుంటే అన్ని దగ్గులు అంతం.
6. లవంగంపొడి 3 గ్రాములు, పంచదార 5 గ్రాములు, తేనె 10 గ్రాములు కలిపి తింటుంటే దగ్గు వెంటనే తగ్గుతుంది.
7. అల్లం రసం 10 గ్రాములు్, తమలపాకు రసం 10 గ్రాములు, తేనె 10 గ్రాములు తింటుంటే దగ్గు, రొంప తగ్గుతయ్.
8. తులసి పొడి 3 గ్రాములు, మిరియాలపొడి 3 గ్రాములు, అల్లం రసం 3 గ్రాములు, తేనె 10 గ్రాములు తింటుంటే దగ్గు, మలేరియా తగ్గుతయ్.
9. కాల్చిన లవంగంపొడి 3 చిటికెలు, తేనె 5 గ్రాములు కలిపి తింటుంటే మొండిదగ్గులు తగ్గిపోతయ్.
10. జిలకర నోట్లో వేసుకుని రసం మింగుతుంటే దగ్గు తగ్గిపోతుంది.
11. నిమ్మరసం 10 గ్రాములు, తేనె 10 గ్రాములు మూడుపూటలా తింటుంటే దగ్గు, రొంప, పడిశం పరార్.
12. ద్రాక్షపండ్ల రసం,తేనె కలిపి రెండుపూటలా తాగుతుంటే దగ్గు, రొంప తగ్గుతయ్.
13. ఆపిల్ పండ్లు తింటుంటే వారం రోజుల్లో పొడిదగ్గు తగ్గిపోతుంది.
1. Miriyaala podi 3 gms, misree 5 gms tene 10 gms tintunte ubbasam ventane upasamistundi
2. Arakappu pasupu kashaayamlo karakapodi 5 gms kalipi taagutunte aasthamaa adrusyam
3. Paalu, chakkera kalapani coffee dicoction taagutunte dammu, aayaasam taggipotay.
4. taanikaaya chuurnam 5gms tene 10gms kalipi tintunte daggu aayaasam taggutay
5. Miriyaalapodi 3gms, chakkera 5gms, neyye 5gms, tene 10gms tintunte anni daggulu antam
6. Lavangam podi 3gms, panchadaara 5gms, tene 10gms kalipi tintunte daggu ventane taggutundi
7. Allam rasam 10 gms, tamalapaaku rasam 10gms, tene 10gms tintunte daggu, rompa taggutay
8. Tulasi podi 3gms, miriyaala podi 3gms, allam rasam 3gms, tene 10gms tintnte daggu, maleriya taggutay
9. kaalchina lavangam podi 3 chitikelu, tene 5gms kalipi tintunte mondi daggulu taggipotay
10. Jeelakara nootloo vesukuni rasam mingutunte daggu taggipotundi
11. Nimmarasam 10gms, tene 10 gms muudupuutalaa tintunte daggu, rompa, padisam paraar.
12.Draakshapandla rasam, tene kalipi rendupuutalaa taagutunte daggu, rompa taggutay.
13. Apple pandlu tintunte vaaram roojullo podi daggu taggipotundi.

Friday, 1 November 2013
నీవు భారత దేశానికి సంబంధించింట్లైతే ఇది చదివి ఎంతవరకూ నిజమో చెప్పు..
ఆంగ్లేయులు మనదేశాన్ని ఇంచుమించుగా 200 యేండ్లు పరిపాలించారు. వారి నిరంకుశ బానిసత్వాన్ని ఎదిరించి ఎన్నో పోరాటాలు చేసి దాదాపు 10 లక్షలమంది స్వాతంత్ర్యవీరులు బలయ్యాక దేశసంపదంతా దోచుకుపోయాక 1947లో స్వాతంత్ర్యం సాధించుకున్నాం.
8వ శతాబ్దం నుండి 20వ శతాబ్ద మధ్య భాగం వరకు ఇంగ్లీషువాళ్ళతో సహా ఎంతమంది విదేశీయులు ఎన్ని విధాలుగా మన భరత ఖండాన్ని చిన్నాభిన్నం చేసినా కూడా ఆయా విదేశాల విషనాగరికతలు మనిళ్ళల్లోకి ప్రవేశించలేక పోయినయ్. ఆంగ్లేయులు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా కూడా మన భారతీయ సంస్కృతిని, మన జీవన విధానాన్ని ఏమాత్రం నాశనం చేయలేకపోయారు.
అతినీచమైన అత్యంత నికృష్టమైన దురదృష్టమేమిటంటే స్వాతంత్ర్యం వచ్చాక ఈ 65 యేండ్లలో మన దేశ పాలకులు,మన మేధావి వర్గాలు ఆంగ్లవిషసంస్కృతిని ప్రజలందరికీ అలవాటు చేసి నేటి దేశదుస్థితికి ప్రధానకారకులు కావడం. అంటే ఆంగ్లేయులు 200 యేండ్లు అధికారంలో ఉండి కూడా నాశనం చేయలేకపోయిన మన దేశీయసంస్కృతిని మన పాలక మేధావి వర్గాలు కేవలం 65 యేండ్లలో ఇంగ్లీషుఎంగిలితో విషమయం చేయగలిగారంటే ఈ దీన హీన దౌర్భాగ్య స్థితి ని ఎలా భరించాలి?

కాళ్ళ పగుళ్ళకు - Kaaalla pagullaku
తుమ్మ బంకను మంచి నీటితో మెత్తగా నూరి కాళ్ళ పగుళ్ళ పైన రోజూ రాత్రి నిద్రపోయే ముందు లేపనం చేస్తూ వుంటే క్రమంగా కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతయ్.
tumma bankanu manchi neetito mettagaa nuuri kaaalla pagullapaina roojuu raatri nidrapooyee mundu lepanam chestuu vuntee krammagaa kaalla pagullu taggipotaayi.
tumma bankanu manchi neetito mettagaa nuuri kaaalla pagullapaina roojuu raatri nidrapooyee mundu lepanam chestuu vuntee krammagaa kaalla pagullu taggipotaayi.
పిప్పి పన్ను/దంత పోటుకు - pippi pannu/danta potuku:
మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వార పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి/దవడనొప్పి తగ్గిపోతాయ్.
Manchi jilledu aakulu rendu, muudu teesukuni rendu chetulato nalipi oka garitalo rasam tiyyali. ee vaipu panti noppi vunnado aa vaipu chevilo 3 chukkalu poyyaali. daaniki mundu notilo kandi pappu leka sanaga pappu koncham vesukuni chevilo rasam posina taruvaata aa pappu namalatam valana rasam chevi randhram dvaaraa panti noppi vunna chotuku cherutundannamata. ilaa muudu rojulu chesesariki panti/davada noppi taggipotaay.

Monday, 28 October 2013
ఎక్కిళ్ళకు:
* ఆవు పాలు కాచి వేడిగా వున్నప్పుడే తాగుతుంటే అప్పటికప్పుడే ఎక్కిళ్ళు తగ్గిపోతయ్.
* కంది పొట్టు నిప్పులమీద వేసి ఆ పొగను పీలుస్తుంటే ఎక్కిళ్ళు ఆగిపోతయ్.
* నిమ్మరసం 20 గ్రాములు, నల్లుప్పు 3 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి సేవిస్తుంటే ఎక్కిళ్ళు ఆగిపోతయ్.
* నీరుల్లిగడ్డరసం 3 చుక్కలు ముక్కుల్లో వేసి పీలుస్తుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతయ్.
* సొంఠి 3 గ్రాములు, నిమ్మరసం 10 గ్రాములు కలిపి సేవిస్తుంటే పైత్యపు ఎక్కిళ్ళు తగ్గిపోతయ్.

Saturday, 26 October 2013
తెలుసుకుందాం...
ఏనాడు మనదేశంలో ఇంగ్లీషువైద్యశాలలు వెలిశాయో ఆనాటినుండే మన భారతీయులంతా తమ స్వయం సంరక్షణా పరిజ్ణానాన్ని కోల్పోతూ ప్రతి చిన్న అనారోగ్యసమస్యకు ఆసుపత్రులపైనే ఆధారపడుతూ తమ కష్టార్జితాన్ని తామనుభవించకుండా మదులకోసం ధారపోస్తూ నిత్యరోగిష్ణులై చవలేకబ్రతికే నికృస్టస్థితికి చేరుకుంటున్నారు.ఇప్పటికైనా కళ్ళుతెరచి ఆయుర్వేద స్వయం సంరక్షణామార్గాలని అవలంభించాలి...
తెలుసుకుందాం...
లక్షలమంది వైద్యులు, లక్షలాది మందుల షాపులు, వేలాది మందుల తయారీకర్మాగారాలు లేని కాలంలో మన భారతీయులంతా తమ అరోగ్యరక్షణకు తమ ఇంటిపైన, తమ ఊరిపైననే ఆధారపడేవారు. ఎంత పెద్ద ఘోరమైన వ్యాధినైనా తమ ఊర్లోని అనుభవజ్ణులైన ఆయుర్వేదవైద్యులద్వారనే పరిష్కరించుకునేవారు. ఈనాడు మనం చెప్పుకునే వందల వేల జబ్బులన్నీమనుషులకు సోకకుండా తమ జీవన విధానం ద్వారా ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేవారు. తమ ఇంటిలోని దినుసులను, ఆహారపదార్ధాలను, తమ ఊరిలోని మొక్కలను, చెట్లను అపుర్వమైన ఔషధాలుగా వాడుకుంటూ నూరేండ్లకు పైగా నిరోగులుగా నిత్య సంతోషంతో జీవించగలిగారు.
తెలుసుకుందాం....
ఈనాడు నూటికి నూరుమంది మన భారతీయులంతా మందులమ్మే అంగళ్ళలో, వైద్యం చేసే ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యం దొరుకుతుందని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎక్కువ ఖరీదున్న మందులే బగా పనిచేస్తాయని, ఎక్కువ ఫీజు తీసుకుని లక్షలరూపాయల బిల్లులు వేసే ఆసుపత్రుల్లోనే నాణ్యమైన చికిత్స లభిస్తుందనని ప్రతిఒక్కరూ ఆశిస్తున్నారు. ఇలాంటి వారందరిలో ఎంతో ఖర్చుపెట్టి ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కూడా ఏ ఒక్క వ్యాధి పూర్తిగాతగ్గకపోవడం, ప్రతివ్యక్తి జీవితకలపురోగులుగా మారడం కళ్ళముందే కనిపిస్తున్నా కూడా ఈ విధానం సరైనది కాదు అనే నిజం ఏ ఒక్కరికీ తెలియడంలేదు.
కాళ్ళ పగుళ్ళకు:
తుమ్మ బంకను మంచి నీటితో మెత్తగా నూరి కాళ్ళ పగుళ్ళ పైన రోజూ రాత్రి నిద్రపోయే ముందు లేపనం చేస్తూ వుంటే క్రమంగా కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతయ్.
పిప్పి పన్ను/దంత పోటుకు :
మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వారా పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి/దవడనొప్పి తగ్గిపోతాయ్.
Friday, 25 October 2013
బహిష్టు నొప్పికి:
1. మిరియాలు, బెల్లం, నెయ్యి సమ భాగాలు కలిపి దంచి మాత్రలు (కుంకుడుకాయ పరిమాణం కంటే కాస్త పెద్దగా)తయారు చేసి మూడు పూటలు బుగ్గను పెట్టుకుని చప్పరిస్తూ తింటుంటే మాత్ర అయిపోయేలోపు బహిష్టు నొప్పి తగ్గిపోతుంది.
2. ఎర్ర ఉత్తరేణి ఆకులు కొన్ని తీసుకొని కడిగి వాటిలో పంచదార కలిపి నమిలి మింగితే బహిష్టు నొప్పి ఐదు నిముషాల్లో పూర్తిగా తగ్గిపోతుంది.
పై రెండు యోగాలలో ఏది వీలుగా వుంటే అది ఆచరింఛండి.
2. ఎర్ర ఉత్తరేణి ఆకులు కొన్ని తీసుకొని కడిగి వాటిలో పంచదార కలిపి నమిలి మింగితే బహిష్టు నొప్పి ఐదు నిముషాల్లో పూర్తిగా తగ్గిపోతుంది.
పై రెండు యోగాలలో ఏది వీలుగా వుంటే అది ఆచరింఛండి.
తులసి పొడి అమృతం
తులసి ఆకులు నీడలో ఆరపెట్టి, పొడి చేసి అన్నంలో(3 చిటికెళ్ళు), కూరల(1 చిటికెడు)లో వాడటం వలన ఆహారంలో విషపదార్ధాలు తొలగిపోయి అన్నం, కూరలు అమృతంగా తయారై తొందరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ముఖంలో తేజస్సు కలిగి మనసు ప్రశాంతంగా వుంటుంది.
స్వాధిష్టాన చక్రం ఏమి చేస్తుంది, సరిగా పనిచేయకపోతే ఏమవుతుంది?
స్వాధిష్టాన చక్రం వలననే మానవులకు శిరస్సులో మేధస్సు వృద్ధి పొందుతుంది. యుక్తా యుక్త విచక్షణా జ్ణానము, సూక్ష్మ గ్రాహ్యత, సునిశిత బుద్ధి, ధారణా శక్తి, ఆలోచన పటిమ, ఇవన్నీ ఎల్లప్పుడూ వృద్ధి పొందటంలో కూడా ఈ స్వాధిష్టాన చక్రమే మూలకారణం అవుతుంది.
ఇది అపాన వాయువును అదుపులో వుంచి మల మూత్రాలు సాఫీగా విడుదల అయ్యేటట్లు చేస్తుంది. నాభి క్రింది భాగంలోని మూత్రాశయము,మలాశయము, మూత్రపిండాలు, మూత్ర గ్రంధి, మూత్ర నాళాలు మొదలైన భాగాలన్నీ స్వాధిష్టాన చక్రము యొక్క ఆధీనంలో వుంటాయి.
ఈ చక్రం సరిగా పని చేయకపోతే:
ఏ కారణాల వలనైనా ఈ చక్రం యొక్క క్రియలలో లోపం జరిగితే, మానవులకు తెలివితేటలు తగ్గిపోతయ్. అలోచన శక్తి, ప్రతిభ తగ్గుముఖం పడతయ్.
మూత్రాశయం, మూత్రపిండాలు మొదలైన పైన పేర్కొన్న అవయవాలలో అనారోగ్యం కలుగుతుంది. మలబద్ధకం, మూత్రావరోధం, మూత్రంలో మంట, మూత్ర పిండాలలో వాపు, రాళ్ళు ఏర్పడటం వంటి అనేకానేక సమస్యలు ఏర్పడుతూ వుంటాయి.
ఈ చక్రం యొక్క బీజాక్షరం 'వం '

Tuesday, 22 October 2013
గర్భిణి పొట్టలో శిశువు కదలకపోతే....
గ్లాసువేడిగంజి ఆవునెయ్యి 20 గ్రాములు తాగిస్తే గర్భిణి పొట్టలో కదలని శిశువు కదులుతుంది.
నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?చిట్కా...
వేళకు భుజించకుండా వేళతప్పి తినడంవల్ల, అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కుళ్ళిపోయి పొట్టలోనే కంపుకొడుతూ ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది. మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
అలాంటి వారు తమ తప్పులను తెలుసుకుని రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి, భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి. ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుంధభరితమౌతుంది.

Wednesday, 16 October 2013
పొడిదగ్గుకు:
ఒక తమలపాకు ఈనెలు తీసివేసి మూడుచిటికెల వామ్ము పెట్టి కిల్లీలాగా చుట్టి బుగ్గనపెట్టి,నెమ్మదిగా నములుతూ రసం మింగుతుంటే పొడి దగ్గు తగ్గుతుంది. లేదా వట్టి వాముగింజల్ని నోట్లో వేసుకుని మెల్లమెల్లగా నమిలితింటూ అనుపానంగా గోరువెచ్చని నీళ్ళు తాగుతుంటే పొడి దగ్గు, దమ్ము, ఆయాసం తగ్గుతయ్.
Tuesday, 15 October 2013
మొటిమలకు/మచ్చలకు లవంగ చూర్ణం:
వేయించిన లవంగాల పొడి 100 గ్రాములు, నల్ల జీలకర్ర పొడి 100 గ్రాములు వస్త్రఘాళితం పట్టి నిలవజేసుకోవాలి. తగినంత పొడి మంచి నీటితో నూరి పైన పూస్తుంటే మొటిమలు,మచ్చలు హరించిపోతయ్.
Sunday, 13 October 2013
పిల్లలు పక్కలో మూత్రం పోస్తే:
నిద్రించే ముందు కప్పు గోరువెచ్చని ఆవుపలల్లో వయసును బట్టి 1 నుండీ 3 చిటికెల ఆవాలపొడీ, కొంచం పటికబెల్లం పొడి కలిపి తాగుతుంటే వారం రోజుల్లో పిల్లలు పక్కలో మూత్రం పోయడం ఆగిపోతుంది.
Note: మార్గం వుంది కదా అని ఈ యోగాన్ని మరీ పసి పిల్లల మీద దయచేసి ప్రయోగించకండి.
Note: మార్గం వుంది కదా అని ఈ యోగాన్ని మరీ పసి పిల్లల మీద దయచేసి ప్రయోగించకండి.
క్షయ రోగానికి ఆవు పాలు:
ఉదయం అప్పుడే పితికిన పావులీటర్ దేశవాళీ ఆవుపాలల్లో కృష్ణతులసి పొడి 5 గ్రాములు రెండు పూటలా తాగుతుంటే 15 రోజుల్లో క్షయరోగం అంతరించిపోతుంది.
Sunday, 6 October 2013
చెడు కొవ్వు తొలగించుకోవటానికి మంచి సులభమైన మార్గం (For bad cholesterol)
రోజూ దాల్చిన చెక్క చిన్న ముక్క నోట్లో పెట్టుకుని దాని రసం మింగుతూ వుంటే bad cholesterol అనబడే చెడుకొవ్వు నెమ్మదిగా చెప్పకుండానే కరిగిపోతుంది...
Wednesday, 2 October 2013
పార్శ్వపు నొప్పికి - కుంకుడు పెచ్చు:
చిన్న నేతిగిన్నెడు వేడినీటీలో కుంకుడు కాయ పై పెచ్చు 2 గ్రాముల ముక్క వేసి చెంచాకాడతో నురుగు వచ్చేవరకు కలదిప్పి ఆ ముక్కను తీసివేయాలి. ఆ నీటిలో దూది ముంచి రెండు ముక్కుల్లో మూడు మూడు చుక్కలు వేసుకుంటే క్షణ కాలంలో పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా రెండు మూడు సార్లు చేస్తే తిరిగి మరళా అరతలనొప్పి రానే రాదు.
పేగుల్లో పుండ్లకు - కొబ్బరిపీచు:
కొబ్బరిపీచు విడివిడిగా తీసి ముక్కలుగా కత్తిరించి కళాయి పాత్రలో వేసి క్రిందమంట పెట్టి అట్లకాడతో తిప్పుతూ ఆ పీచంతా భస్మంచేసి జల్లించి నిలవజేసుకోవాలి.
ఈ భస్మాన్ని పూటకు పావుటీ చెంచా మోతాదుగా ఒక కప్పు పలుచగా తియ్యగా వున్న తాజా మజ్జిగతో కలిపి మూడుపూటలా విడవకుండా సేవిస్తుంటే ఆహారనాళంలో చిన్న ప్రేవుల్లో, పెద్ద ప్రేవుల్లో, గుదస్థానంలో పుట్టిన పుండ్లు, క్రిములు, స్త్రీల గర్భాశయంలో పుట్టిన నెత్తుటి గడ్డలు, అతివేడి్, మంటలు, చురుకులు తగ్గుతయ్.

పులి త్రేనుపులకు - పచ్చి కొబ్బరికాయ :
పచ్చికొబ్బరిబోండం పై డొప్పను కడిగి మెత్తగా దంచి బట్టలో వేసి పిండి రసం తీసిన రసం నాలుగు చెంచాల మోతాదుగా రెండు పూటలా తాగుతుంటే పులి త్రేనుపులు అనబడే ఎసిడిటి, అతి త్రేనుపులు అనబడే గేస్ తగ్గుతయ్.
సయాటికా నొప్పికి - ఆముదయోగం:
రోజూ ఉదయం పరగడుపున ఒక కప్పు దేశవాళీ గోమూత్రంలో ఒక చెంచా వంటాముదం కలిపి తాగాలి. ఈ విధంగా విడవకుండా 30 రోజులపాటు సేవిస్తే సయాటికా అనబడే గృధ్రసీవాతం హరించిపోతుంది.
Tuesday, 1 October 2013
గర్భిణీ స్త్రీల కోసం - III
21. తేనెలో ఊరవేసిన మురబ్బా 2 పూటలా 10 గ్రాములు తింటూంటే గర్భిణిస్త్రీకి, బిడ్డకు బలం.
22. ఏడమ చేతితో అయస్కాంతం పట్టిస్తే ప్రసవించలేని స్త్రీకి సుఖ ప్రసవమౌతుంది.
23. దంచిన ఉత్తరేణీ ముద్ద 20 గోళ్ళకు పట్టీస్తే శీఘ్రంగా సుఖప్రసవం జరుగుతుంది.
24. బప్పయి కాయను కూరగా వండి తింటూంటే స్త్రీలకు చనుబాలు పెరుగుతయ్.
25. తెల్ల గలిజేరు సమూలం నూరి యోనికి పట్టిస్తే ప్రసవ స్త్రీకి మాయ, మైల పడిపోతయ్.
26. కలబంద వేరు, పసుపు నూరి పట్టీస్తుంటే చనుకుదురు గడ్డలు కరిగిపోతయ్.
27. వాము కషాయం 30 గ్రాములు రెండు పూటలా సేవిస్తుంటే బాలింతలకు పాలు చేపుకువస్తయ్.
28. ఉమ్మెత్తాకు, పసుపు నూరి పట్టీస్తుంటే స్త్రే స్త్రీల స్తనాల వాపు,పోటు తగ్గిపోతయ్.
29. వాము 3 గ్రాములు, తేనె 5 గ్రాములు రెండుపూటలా తింటూంటే బాలింతలలకు పాలు పెరుగుతయ్.
30. జీలకర్ర, బియ్యం, పాలతో వండిన పాయసం 50 గ్రాములు తింటుంటే స్త్రీల స్తన బాధలు శమిస్తయ్.
31.అయిదారు ఆముదపు ఆకులను కడిగి మూడు లీటర్ల మంచి నీటిలో వేసి మరిగించి దించి ఆకులు పక్కన పెట్టి ఆ నీరు భరించగలిగినంత వేడిగా ఉన్నప్పుడు పాలు పడని బిడ్డ తల్లులు ముందుకు వంగి స్థనాలను ఆ నీటిలో పది పదిహేను నిముషాల పాటుంచి తీయాలి. తరవాత పక్కన పెట్టిన ఆకులను స్థనాలపై వేసి కట్టుకడుతుంటే తల్లిపాలు
తగినంతగా వృద్ధిచెందుతయ్.

గర్భిణీ స్త్రీల కోసం - II
11. గుమ్మడికాయ గుజ్జు 30 గ్రాములు, పాలు పంచదారలతో సేవిస్తుంటే గర్భస్థపిండం పెరుగుతుంది.
12. రావి పండ్ల పొడి చక్కెర 6 గ్రాములు కప్పు ఆవు పాలతో తాగుతుంటే గర్భ రక్షణ జరుగుతుంది.
13. ఓమ సొంఠి జీలకర్ర తేనె కలిపి 10 గ్రాములు తింటుంటే గర్భిణికి ఆకలి పుడుతుంది.
14. వెన్న 10 గ్రాములు, కండ చక్కెర 10 గ్రాములు తింటుంటే గర్భిణి స్త్రేలకు, బిడ్డకు బలం
కలుగుతుంది.
15. గర్భిణీ స్త్రీలు పండు నారింజ పండ్ల రసం తాగుంటే బలమైన సంతానం కలుగుతుంది.
16. మేడి చెట్టూ బెరడు కషాయం చక్కెర సేవిస్తుంటే గర్భస్రావం కాకుండా గర్భరక్షణ.
17. కప్పు ధనియాల కషాయంలో కండచక్కెర 10 గ్రాములు కలిపి తాగుతుంటే గర్భిణి స్త్రేల వాంతులు
తగ్గుతయ్.
18. చిట్టీ ఆముదం రాసి బట్ట తగలకుండా ఉంచితే గర్భిణిస్త్రేల చనుమొనల పగుళ్ళు తగ్గుతయ్.
19. మూసాంబరం 5 గ్రాములు, గుగ్గిలం 5 గ్రాములు, గోధుమపిండి 10 గ్రాములు నీటితో నూరి రాస్తే
స్తనాల పోట్లు తగ్గుతయ్.
20. జీలకర్ర 10 గ్రాములు, కండ చక్కెర 10 గ్రాములు రెండు పూటలా తింటూంటే తల్లి పాలు

గర్భిణీ స్త్రేల కోసం - I
1. అల్లం రసం 10 గ్రాములు, తేనె 10 గ్రాములు రెండు పూటలా నాకిస్తుంటే బాలింతలకు ఆరోగ్యం.
2. పొంగించిన ఇంగువ 1 గ్రాము, బెల్లం 5 గ్రాములు తినిపిస్తే బాలింతల తుంటి శూల తగ్గుతుంది.
3. మిరియాల పొడి 3 గ్రాములు, చక్కెర 3 గ్రాములు తేనె 10 గ్రాములు తింటుంటే గర్భిణీల దగ్గు,ఆయాసం బంద్.
4. గ్లాసు వేడి గంజి, ఆవు నెయ్యి 20 గ్రాములు తాగిస్తే గర్భిణి పొట్టలో కదలని శిశువు కదులుతుంది.
5. బొడ్డుపై దూది పెట్టి ఆవు నేతితో తడుపుతుంటే గర్భిణి పొట్టలో కదలని శిసువు కదులుతుంది.
6. నేతిలో వేయించిన వామ్ము 3 గ్రాములు, మొదటి ముద్దలో తింటూంటే గర్భిణి అజీర్తి తగ్గుతుంది.
7. నేతిలో వేయించిన మిరియాలపొడి 3 గ్రాములు మొదటి ముద్దలో తింటుంటే గర్భిణికి జీర్ణశక్తి.
8. చల్లార్చిన శొంఠి కషాయం 20 గ్రాములు తాగితే గర్భిణి స్త్రీల ఉదరవాతం తగ్గుతుంది.
9. ధనియాలు 10 గ్రాములు, పుల్లని మజ్జిగతో నూరి చక్కెర కలిపి తాగిస్తుంటే గర్భిణి విరేచనాలు బంద్.
10. ధనియాలు 10 గ్రాములు, కప్పు బియ్యపు నీళ్ళు చక్కెరతో కలిపి తాగితే గర్భిణివాంతులు తగ్గుతయ్.

Friday, 27 September 2013
తెలుసుకోవలసిన ఆరోగ్య సూత్రాలు :
*మధ్యాహ్న భోజనంలోకి పెరుగు వాడకుండా మజ్జిగను వాడాలి.
* పళ్ళు తోముకున్న తరువాత ఏమి తినకుండ ఐదారు తులసి ఆకులు / రసం తీసుకోవటం వల్ల ఎప్పటికీ జ్వరాలు, అజీర్ణరోగాలు రావు.
* పండ్లు తిన్న వెంటనే మంచి నీళ్ళు తాగవద్దు. అలా చేస్తే జలుబు చేస్తుంది.
* వేడి అన్నంగాని, వీడి కాఫీ, టీలు గానీ సేవించిన వెంటనే చల్లని నీళ్ళు త్రాగకూడదు.
* స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకొనకూడదు. అలా తీసుకుంటే జీర్ణశక్తి చెడుతుంది.

Thursday, 26 September 2013
గేస్/అజీర్ణం సమస్యకు :
పద్ధతి 1:
దోరగా వేయించిన వామ్ము పొడి 100 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 50 గ్రాములు, సైంధవ లవణం 25 గ్రాములు కలిపి ఒక సీసాలో బధ్రపరచుకుని,
దోరగా వేయించిన వామ్ము పొడి 100 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 50 గ్రాములు, సైంధవ లవణం 25 గ్రాములు కలిపి ఒక సీసాలో బధ్రపరచుకుని,
1)గేస్ సమస్య వున్న వాళ్ళు అర గ్లాసు నీటిలో అర చెంచా నుంచీ ఒక చెంచా వరకు పొడిని కలుపుకుని అన్నం తినే గంట ముందు త్రాగాలి.
2)అజీర్ణ సమస్య వున్న వాళ్ళు అన్నం తిన్నా గంట తరువాత త్రాగాలి.
పద్ధతి 2:
దోరగా వేయించిన వామ్ము 100 గ్రాములు, పటిక బెల్లం(మిశ్రీ) పొడి 100 గ్రాములు, ఆవు నెయ్యి(దేశవాళీ ఆవునెయ్యి) 100 గ్రాములు ముందుగా వామ్ము పొడి, మిశ్రీ పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి, నెయ్యి వేడి చేసుకుని (మరిగించక్కర్లేదు) ఈ పొడిని వేస్తూ వుండలు లేకుండా కలుపుకోవాలి్. అది ఒక లేహ్యం లాగా/ హల్వా లాగ తయారవుతుంది.దీన్నే అగస్త్య లేహ్యం అంటారు.
దీన్ని గేస్ సమస్య వున్నా వాళ్ళు ఒక చెంచా ముద్దను అన్నం తినే గంట ముందు తినాలి.
అజీర్ణ సమస్య వున్నా వాళ్ళు అన్నం తిన్నా గంట తరవాత తినాలి.
ఈ లేహ్యంతో వాతం వలన కలిగిన కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి కూడా తగ్గిపోతుంది.
రోజుకు రెండు పూటలా పైన చెప్పిన విధానాలలో ఏది వీలైతే అది ఆచరించుకోవచ్చు.
Monday, 23 September 2013
కంటి రెప్పల వెంట్రుకలు వూడుతూవుంటే:
ఆరు గ్రాముల వామ్ము తెచ్చి శుభ్రం చేసి రోట్లో వేసి అందులో నాటు కోడి గుడ్డులోని తెల్ల సొన కలిపి మెత్తగా మర్ధించి కను రెప్పల మీద లేపనం చేస్తూవుంటే, రెప్పల వెంట్రుకలు వూడటం ఆగుతుంది. ఓక వేళ వూడి వుంటే వెంట్రుకలు మళ్ళీ మొలుస్తయ్. ఇంకా దీనివల్ల కనురెప్పల వాపు, రెప్పల యందలి దుర్మాంసం కూడా హరించి నేత్రాలు బహుసుందరంగా రూపుదిద్దుకుంటయ్.
Wednesday, 18 September 2013
చిగుళ్ళవాపుకు :
తులసి ఆకులు 10 గ్రాములు, సన్నజాజిఆకులు 6 గ్రాములు కలిపి నమిలి మింగుతూ వుంటే నాలుగైదు పూటల్లో చిగురువాపు, చిగురుపోటు, దంతాలపోట్లు తగ్గిపోతయ్. ఒక్కసారికే ఎంతో హాయిగా వుంటుంది..
ఆచరించి మీ అనుభవం తెలియజేయండి..
ఆచరించి మీ అనుభవం తెలియజేయండి..
Saturday, 14 September 2013
తెలుసుకుందాం :
1. నీరు ఎక్కువ తాగినా కూడా మూత్రపిండాలకు, మూత్రాశయంకు భారం పెరుగుతుంది.
2. ఆరోగ్యం మొత్తం సూర్య భగవానుని మీద ఆధారపడి వుంటుంది.
3. ప్రతి అవయవానికి అతి తొందరగా చేరేది నువ్వులనూనె.
2. ఆరోగ్యం మొత్తం సూర్య భగవానుని మీద ఆధారపడి వుంటుంది.
3. ప్రతి అవయవానికి అతి తొందరగా చేరేది నువ్వులనూనె.
స్నాన నిబంధనలు :
1. నూనె పెట్టూకోకుండా స్నానం చేయరాదు.
2. హడావిడిగా స్నానం చేయరాదు.
3. భోజనం చేసినవెంటనే స్నానం చేయరాదు.
4. చన్నీళ్ళ స్నానం :చన్నీళ్ళను మొదట తలమీద పోసుకుని తరవాత మిగతా భాగాల మీద పోసుకుని స్నానం చేయాలి.
5. వేన్నీళ్ళ స్నానం : వేన్నీళ్ళను మొదట కాళ్ళమీద పోసుకుని తరవాత పై భాగాల మీదా పోసుకుని స్నానం చే్యాలి.

మలబద్ధకంనకు మంచి యోగం :
వంటాముదం 4 చెంచాలు, అల్లం రసం 2 చెంచాలు, తేనె 2 చెంచాలు ఒక గిన్నెలో వేసి మూడు సార్లు పొంగించి గోరువెచ్చగా వున్నప్పుడు త్రాగాలి. ఇలా త్రాగిన తరువాత 3 లేదా 4 సార్లు విరేచనాలు అవుతాయి. ఆరోజంతా చారు అన్నం మాత్రమే తినాలి.
తెలుగు భాష గొప్పదనం
గడచిపోయిన ప్రతినిమేషమ్ముకూడ
జీవితమ్మున భాగమ్ముపంచుకొనును
దీపముండగ నిలుచక్కదిద్దుకొంచు
మించిపోనీడు సమయము మంచివారు !!!
జీవితమ్మున భాగమ్ముపంచుకొనును
దీపముండగ నిలుచక్కదిద్దుకొంచు
మించిపోనీడు సమయము మంచివారు !!!
Friday, 13 September 2013
Wednesday, 11 September 2013
శరీర - మంటలకు - మంచి మార్గం :
1) ఆముదంగానీ, కొబ్బరినూనెగానీ నీటిలో కలిపి చేతితో గిలకొడితే నురుగు వస్తుంది. ఆ నురుగును మంటలపైన రుద్దుతుంటే, ఆశ్చర్యకరంగా మంటలు మాయమౌతయ్.
2)అదేవిధంగా పైవిధానం కుదరనివారు తంగేడు ఆకు తెచ్చి నీటితో మెత్తగానూరి మంటలపైన రసం ఇంకేలా రుద్దుతుంటే ఎక్కడమంటలైనా అతిత్వరగా తగ్గిపోతయ్.
2)అదేవిధంగా పైవిధానం కుదరనివారు తంగేడు ఆకు తెచ్చి నీటితో మెత్తగానూరి మంటలపైన రసం ఇంకేలా రుద్దుతుంటే ఎక్కడమంటలైనా అతిత్వరగా తగ్గిపోతయ్.
అతిమూత్ర వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలు:
అతిగా మూత్రంపోయే వ్యాధిగ్రస్తులకు ఆకలి, దప్పిక, శరీరతాపం, బలహీనత ఎక్కువగా వుంటాయి. ఆహారపు రుచి తెలియదు. మాటిమాటికి గొంతు ఎండిపోతుంటుంది. అధిక శాతం మందికి మూత్రం తియ్యగా వుండి విసర్జించినచోట చీమలు మూగుతయ్. ఈ లక్షనాలను బట్టీ అతిమూత్ర సమస్యను గుర్తించి ఈ క్రింది అహారమార్గాల ద్వారా నివారించుకోవచ్చు.
జీలకర్రతో జీవమైన యోగం:
జీలకర్రను కొంచం దోరగా వేయించి దంచి పొడిచేసి ఆ పొడితో సమంగా పాతబెల్లం లేదా తాటిబెల్లం కలిపి బాగా దంచి ఆ ముద్దను నిలువచేసుకోవాలి. రోజూ రెండూ పూటలా 10 గ్రాముల ముద్దను తింటూవుంటే, అతి మూత్రం అణగారిపోతుంది.
అల్లనేరేడు గింజలతో అద్భుత యోగం:
అల్లనేరేడుపండ్లు తిన్న తరవాత లోపలి గింజలను ఊసివేస్తుంటాం. కానీ ఆ గింజలు చాలా విలువైనవి. ఆ గింజలను దంచి జల్లించిన పొడి నిలువచేసుకోవాలి. రోజూ రెండు పూటలా పావుచెంచా నుండీ అరచెంచా వరకు ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తుంటే అతిమూత్రం హరించిపోతుంది.
ఉసిరిపండ్లతో ఉసిగొలిపే యోగం:
పచ్చి ఉసిరికపండ్లరసం 1 ఔంసు తీసుకుని అందులో తేనె రెండు చెంచాలు కలిపి రెండుపూటలా ఆహారానికి రెండు గంటలముందు సేవిస్తుంటే, కొద్దిరోజుల్లోనే అతిమూత్రం హరించిపోయి శరీరంలోని అన్ని అవయవాలకు అమితమైన శక్తి కలుగుతుంది.

Tuesday, 10 September 2013
దురదలు, దద్దుర్లకు
పాత బెల్లం, వామ్ము పొడి సమంగా దంచి 10 గ్రాములు మోతాదుగా రెండు పూటలా తింటుంటే దురదలు, దద్దుర్లు హరిస్తయ్.
Saturday, 7 September 2013
తల వెంట్రుకలు పెరగటానికి :
కలబంద గుజ్జు 100 గ్రాములు నువ్వులనూనె 200 గ్రాములు ఈ రెండు కలిపి చిన్న మంటపైన మరగపెట్టి కలబంద గుజ్జు నూనెలో మరిగేవరకు ఉడికించి దించి వడపోసి చల్లార్చిన తరువాత రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
Thursday, 5 September 2013
మత్తు మందుల విషానికి విరుగుడు - రావి:
గంజాయి, నల్ల మందు ఇంకా ప్రాణాంతకమైన మత్తుమందులు సేవించి ప్రాణాపాయ స్థితికి చేరినవారికి రావిచెట్టుబెరడుతో కాచిన కషాయం రెండు లేదా మూడు పూటలా సేవింపచేస్తే ఆ విషాల ప్రభావం విరిగిపోయి ఆ మనిషి జీవిస్తాడు.
Wednesday, 4 September 2013
ఎముకలు అరిగిన సమస్యకు :
శరీరం సంధుల్లో గుజ్జు , ఎముకలు అరిగిపోయి ఎన్ని మందులు వాడినా సమస్య తీరక విసికిపోయిన వారు చాలా మంది వున్నారు, వారందరూ ఈ యోగం ఆచరించి లబ్ది పొందుతారని ఆకాంక్ష:
చింతగింజలు తెచ్చి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పైతోలు తీసి పప్పును ఎండించాలి. తరువాత వాటిని మెత్తగా దంచి పొడిచేసుకోవాలి. సమానంగా పటిక పంచదార(మిశ్రీ) పొడి కూడా కలిపి తయారుచేసుకుని, ఒక గ్లాసు పాలలో ఒక చెంచా పొడి కలుపుకుని్ ఉదయం, సాయంత్రం తీసుకుంటుంటే సంధుల్లో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడుతుంది..ఈ యోగంతో బాగుపడిన వారు చాలా మంది వున్నారు.

Tuesday, 3 September 2013
బెణుకుల నొప్పి, వాపులకు:
నిమ్మరసం రెండుపూటలా రుద్దుతుంటే బెణుకులనెప్పి, వాపు తగ్గుతయ్. తగ్గించుకున్నాక చెప్పటం మరచిపోకండి..
Thursday, 22 August 2013
ఉబ్బసానికి :
ఈ క్రింది యోగాలలో ఏది వీలైతే దానిని ఆచరించవచ్చు:
1) కుంకుడుగింజల లోపలి పప్పు 5 గ్రాములు రోజూ ఉదయం నీటితో సేవిస్తుంటే, మూడు వారాలలో ఉబ్బసానికి ఉద్వాసన.
2) సైంధవలవణం 50 గ్రాములు, పిప్పళ్ళు 50 గ్రాములు, బెల్లం 150 గ్రాములు కలిపి దంచి పూటకు 10 గ్రాములు రెండుపూటలా తింటూంటే ఆయాసం బంద్.

Tuesday, 20 August 2013
దగ్గును దూరం చేయండి
* దోరగా వేయించిన మిరియాల చూర్ణం పూటకు 1 లేదా 2 గ్రాములు తేనెతో కలిపి 2 పూటలా తింటుంటే దగ్గు, గొంతులో నస తగ్గుతాయి.
* లవంగాలను నిప్పుల్లో వేడి చేసి చల్లగా అయ్యాక బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుతూ వుంటే దగ్గు, నస, గొంతులో గుర గుర పోతాయి.(రోజుకు 5 లేక 6 సార్లు)
* ఉసిరి పండ్లను ఎండించిన చూర్ణం, పాలతో కాచి నెయ్యి కలిపి తాగిన సర్వ విధములయిన దగ్గులు తగ్గిపోవును.

Friday, 9 August 2013
పిల్లలకు మూత్రం రాకపోతే:
నిమ్మకాయల్లోని గింజల్ని నీళ్ళతో నూరి, ఆ గంధాన్ని బొడ్డుపైన రాసి, చల్లటి నీళ్ళను కొద్ది కొద్దిగా బొడ్డుమీద పోస్తూవుంటే బిగించుకుపోయిన మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది.
తెలుసుకుందాం : పెద్దలంటే ఎవరు?
మన అమ్మ, నాన్న, తాతయ్య. నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య లే పెద్దలు కాదు. వీరితో పాటు మనకు చదువు నేర్పే గురువులు. మనం నివసించే ప్రాంతంలోని వృద్ధులు వీరంతా కూడా పెద్దలుగానే పరిగణించబడతారు. వీరందరితో మాకెంటి పని? అని నిర్లక్ష్యం చూపించకూడదు. మన స్వదేశానికి చెందిన తరతరాల ప్రకృతి విజ్ణానమంతా వీరి వద్దనే వుంది. ఒక్కొ వృద్ధుని వద్ద కొన్ని వందల వేల జీవితానుభవాలు, ప్రకృతి రహస్యాలు దాగి వుంటయ్. కాబట్టి వారందరినీ గౌరవిస్తూ తీరిక సమయాలలో వారి వద్ద కూర్చుని ఆ రహస్యాలను గ్రహిస్తూ వుండాలి.
తెలుసుకుందాం : తల్లి దండ్రులు తొలి గురువులు
ఆఫీసుల్లో ఎక్కువ అనుభవం వున్నా వారికే ఎక్కువ ప్రాముఖ్యత వున్నప్పుడు అమ్మ, నాన్న / అత్త, మామలకు ఎందుకు లేదు ? ?
మనం పని చేసే ఆఫీసులో ఎక్కువ అనుభవం (experience) వున్న వాళ్ళను ఎందుకు తీసుకుంటారు? ఎందుకు వారికి ఎక్కువ జీతం, సదుపాయాలు కల్పిస్తారు?
ఎందుకంటే వాళ్ళ అనుభవం లో ఎన్నో పొరపాట్లు చేసి/ చూసి వుండవచ్చు, అంతే కాక ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దాలో కూడా తెలుస్తుందని, వాళ్ళు నాయకత్వం వహిస్తే అలాంటి పొరాట్లు జరగవు, ఒక వేళ జరిగినా తట్టుకునే శక్తి, వాటిని సరిదిద్దే అనుభవం, ఓర్పు వుంటుంది కాబట్టి. మరి మన ఇంట్లో పెద్దవాళ్ళ అనుభవాలను ఎందుకు మనం ఉపయోగించుకోవటం లేదు? వాళ్ళు లేకపోతేనే ఎంతో నష్టపోతాము. ఎంత చదువుకోలేని వారిలో ఐనా వేదాల సారం వారిలో ఇమిడి వుండి వుంటుంది వారి జీవితానుభవంతో. వాళ్ళ సలహాలు ఎంతో విలువైనవో మాటల్లో చెప్పలేనిది. తల్లిదండ్రులను గౌరవించుదాము. వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించి పాపం చేయకూడదు.. వాళ్ళు మనల్ని మన చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో అంతకంటే బాగా చూసుకోవాలి.
అత్త మామలు = వేరొకరి(భర్త / భార్య) తల్లిదండ్రులే కద

తెలుసుకుందాం:జాగృతి
అర్థరాత్రీ దాక టీ.వీ.లు చూస్తూ
పొద్దు ఎక్కేదాక మొద్దు నిద్దురపో్తూ
ప్రకృతికె వ్యతిరేక జీవితము గడుపుతూ
ఇది గొప్ప ఫ్యాషను ఇది గొప్ప స్టైలని
పిచ్చి కూతలు బాగ కూశారయా
ఎన్నెన్నొ రోగాలతో ఎడ్చేరయా...
వంట ఇంట్లో ఎన్నో దినుసులున్నా గాని
ఏ దినుసు ఎందుకు ఉపయోగ పడుతుందో
తెలియనట్టీ ప్రజలు తెగులు బట్టిన ప్రజలు
దినుసులతో రోగాలు తగ్గుతాయా అంటూ
దీర్ఘాలు బాగా తీసేరయా
దీర్ఘ రోగాలతో కుమిలి కమిలేరయా
సీకాయ కుంకుడు ఇంట్లోనె వుంటాయి
వెంట్రుకలను చక్కగా పోషిస్తు వుంటాయి.
ఏ నష్టము లేని కుంకుడును వదిలేసి
వెంట్రుకలు తినివేయు షాంపూలు వాడుతూ
జుట్టు పోతుందంటు ఏడ్చేరయా
బట్ట బుర్రలతోడ బ్రతికేరయా..
పొద్దు ఎక్కేదాక మొద్దు నిద్దురపో్తూ
ప్రకృతికె వ్యతిరేక జీవితము గడుపుతూ
ఇది గొప్ప ఫ్యాషను ఇది గొప్ప స్టైలని
పిచ్చి కూతలు బాగ కూశారయా
ఎన్నెన్నొ రోగాలతో ఎడ్చేరయా...
వంట ఇంట్లో ఎన్నో దినుసులున్నా గాని
ఏ దినుసు ఎందుకు ఉపయోగ పడుతుందో
తెలియనట్టీ ప్రజలు తెగులు బట్టిన ప్రజలు
దినుసులతో రోగాలు తగ్గుతాయా అంటూ
దీర్ఘాలు బాగా తీసేరయా
దీర్ఘ రోగాలతో కుమిలి కమిలేరయా
సీకాయ కుంకుడు ఇంట్లోనె వుంటాయి
వెంట్రుకలను చక్కగా పోషిస్తు వుంటాయి.
ఏ నష్టము లేని కుంకుడును వదిలేసి
వెంట్రుకలు తినివేయు షాంపూలు వాడుతూ
జుట్టు పోతుందంటు ఏడ్చేరయా
బట్ట బుర్రలతోడ బ్రతికేరయా..
జల చికిత్స :
జలజల జల జల - జలజల మని రాలురా!!
జలముతోనే దీర్ఘకాల - రోగాలే కూలురా!!
జల మహా భూతమే - జగతికాదరువురా!!
జల చికిత్సలను నేర్చి - జవ శక్తిని పొందరా!!
క్రింద తడి బట్టను - పైన పొడి బట్టను
మొల చుట్టూ గుండ్రంగా - ఒక గంట కట్టరా
జననాంగ గర్భాశయ - మూత్రపిండ వ్యాధులు
అతి మూత్రం ఆర్శమొలలు - అతివల ఋతుబాధలు
శీఘ్రస్కలన దోషాలను - వృషణాల లోపాలు
జలవిదుచ్ఛక్తితో - సమియించి పోవురా
పొట్ట వీపు చుట్టూరా - తడి బట్టను కట్టి
పైన పొడి బట్టను - గంట చుట్టి వుంచితే
ప్లీహంలో వాపులు - తేప తేప తేపులు
కాలేయపు ఆవిర్లు - క్రూరమైన కామెర్లు
కడుపు వాపు కడుపు నెప్పి - కడుపులోని మంటలు
ప్రేవుల్లో అరుపులు - పటా పంచలౌనురా
ఆరడుగుల పొడవున్న - అయిదంగుళ వెడల్పున్న
తడిబట్టను గొంతుచుట్టూ - గుండ్రంగా చుట్టాలి
అదే పొడవు వెడల్పున్న - పొడి బట్టను పైన గట్టి
దానిపైన మరో నూలు - బట్ట కట్టి ఉంచితే
గొంతువాపు గొంతుపుండు - థైరాయిడ్ గ్రంధులు
అన్ని గొంతు రోగాలు - అంతమైపోవురా
జలమనగా శ్రీమహా విష్ణువే తెలుసుకో
సృష్టీ స్థితి లయలలో - స్థితి రూపమే పోల్చుకో
భూమిలోన మూడొంతులు - జలమున్నది చూసుకో
మన మానవ దేహంలో - మూడొంతులు జలమేనూ
సకల జీవరాశులకూ - జలమేరా ప్రాణాధారమూ
జలము విలువ తెలుసుకుంటె - జయము నీదౌను

స్త్రీల అతిఋతురక్తస్రావానికి(Over Bleeding):
1. బాగా మగ్గిన అరటిపండ్లు రెండు లేక మూడు తీసుకుని వాటిలో పేరిన నెయ్యి 30 గ్రాములు, చిన్న ఏలకుల పొడి 3 గ్రాములు కలిపి పిసికి ఉదయం,సాయంత్రం తింటుంటే అతి ఋతురక్తస్రావం రెండు మూడు రోజుల్లొ ఆగిపోతుంది
2. అతిమధురంపొడి 5 గ్రాములు, ఎండు ద్రాక్షపండ్లు 20 గ్రాములు కలిపి మెత్తగా దంచి రెండుపూటలా చప్పరించి తింటుంటే అతిఋతురక్తం క్రమంగా తగ్గి ఆగిపోతుంది.
3. పచ్చివక్కలపొడి 50 గ్రాములు, పిస్తా పప్పు 50 గ్రాములు, పటిక బెల్లం 30 గ్రాములు కలిపి మెత్తగా నూరి నిలవజెసుకోవాలి. పూటకు 10 గ్రాములు మోతాదుగా మూడుపూటలా సేవిస్తుంటే ఆగకుండా ప్రవహించే ఋతురక్తం ఆగిపోతుంది.

మలబద్ధకం ఎందుకు వస్తుంది:
ప్రపంచంలో రకరకాల వ్యాధులకు రకరకాల ఔషధాలు అమ్ముడవుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తైతే వాటీకి రెట్టీంపు ఔషధాలు కేవలం మలబద్ధానికే అమ్ముడవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
మనలో రెండు మూడు రోజులకొకసారి విరేచనమయ్యేవారు, అదీ మందు తీసుకుంటే గాని విరేచనం కాని వారు అనేకమంది వున్నారు.
మలబద్ధకం రోగాలకు మూల కారణం అని అంటారు.
విరేచనమును గుర్తించుటయే మనకు మన ఆరోగ్యం గురించి నిజమైన గుర్తింపని గ్రహించాలి.
1. విరేచనము మరీ గట్టీగా రాళ్ళవలె వుండరాదు, మరీ నీళ్ళవలె వుండరాదు.
2. మలము దుర్గంధ రహితముగా వుండాలి.
3. తాడు ఆకారంలో విరేచనం అవ్వాలి.
4. మల విసర్జన సమయంలో ముక్కీ మూలిగీ ప్రయత్నంతో విరేచనమయితే అది మలబద్ధకం క్రిందే లెక్క.
5. ప్రతి రోజూ ఒకే సమయంలో ప్రయత్నం లేకుండా దానంతటది విసర్జింపబడీతే వ్యాధి లేనట్లు.
దానిని కాల విరేచనమని అంటారు వైద్య పరిభాషలో.
మలబద్ధకం వలన శరీరం సోమరితనము ఆవరించుకుంటుంది. పొట్ట, తల బరువుగా వుంటాయి. వళ్ళంతా పొడిబారి పెళుసుగా తయారవుతుంది.నిద్ర సరిగా పట్టదు. మెదడు మొద్దు బారినట్లంటుంది. ఆకలి కూడా మందగిస్తుంది. అంతే కాదు ఈ లక్షణాలతోపాటు అనేక రోగాలు తలెత్తడానికి అవకాశం కలుగుతుంది.
మలబద్ధకం నయం చేసుకోవడానికి మనకి మన జీర్ణక్రియ గురించి కొంచమైనా తెలిసి వుండాలి.
మనము తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత సరీరోపయోగత్వాలను శరీరంలోపల వుంచుకొని మిగిలిన పిప్పిని మలమూత్ర రూపాలలో బయటకు నెట్టివేస్తుంది. మలబద్ధకం వలన అది బయటకు పోనట్లయిన మలము అక్కడే వుండి కుళ్ళడం మొదలు పెడుతుంది. పురుగులు పుడతాయి. దుర్వాసనతో కూడిన గ్యాస్(అపాన వాయువు) ఉత్పన్నమవుతుంది. గ్యాస్ పైకి లేవడం వ్యాపించడం దాని సహజ గుణం. ఆ గ్యాస్ శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి రక్తమును విషపూరితము చేస్తుంది. ఇది వ్యాధులకు నాంది అన్నమాట.
జీర్ణాశయంలో ఆహారం జీర్ణమైన తర్వాత అది చిన్న ప్రేగులలోకి వెళుతుంది. చిన్న ప్రేగులు ఆహారములోని ఆవస్యక తత్వాలను పీల్చుకొన్న తర్వాత మిగిలినది పెద్ద ప్రేగులలోనికి చేరుతుంది. ఇంకా మిగిలి వున్న శక్తితత్వాలను గ్రహించి వ్యర్ధ పదార్ధమును మలరూపంలో నెట్టివేస్తుంది. సహజంగా జరగవలసిన ఈ కార్యములో అవరోధము కలుగుటయే మలబద్ధకముగా పరిణమిస్తుంది. దాని నివారణకు మదులు ప్రయోగింపబడుతుంటాయి. కాని ఆ మందులు ఎంత వేడిని కలిగిస్తాయో తెలుసుకోవాలంటే మందు యొక్క సూక్ష్మ మోతాదును కంట్లోగాని, ముక్కులో గానే వేసుకుంటే మందు మంటకు నీరు ఊరి ధారగా కారుతుంది. కడుపులో కూడా ఇదే విధంగా ఊరిన ఈ నీరు జీర్ణకోశము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల నుండి ప్రవహిస్తూ తనతోపాటు తడిసి మెత్తబడిన మలమును బయటకు తెస్తుంది. దీనిని అందరూ మలబద్ధక నివారణగా భావిస్తారు. నెమ్మది నెమ్మదిగా ప్రేగులు మందుకు అలవాటు పడి స్వయంగా పనిచేయడం ఆగిపోతుంది.దానితో మొదటికంటే మరింత పవరున్న మందులు వాడవలసి వస్తుంది. ఇలా కొన్ని సార్లు జరిగేసరికి మందులు వ్యాధికి మిత్రులైపోతాయ్. రెండవది అధికంగా వాడిన మందుల ఉష్ణంతో వేడెక్కిన ప్రేగులలోని సున్నితపు పొర కమిలిపోయి పేగుపూత(అల్సర్) మారుతుంది.
అందుకని సహజసిద్ధంగా విరేచనం జరిగేటట్లు చూసుకోవాలి

తెలుసుకుందాం
తల్లి తొలి దైవం, తల్లి తొలి ఉపాధ్యాయురాలు, తల్లి తొలి స్నేహితురాలు... ఇప్పుడు తల్లి బరువౌతుంది.. వృద్ధాశ్రమాలపాలౌతుంది..అదే విధంగా మనం పుట్టగానే పెంచటం కష్టం అని ఏ అనాధాశ్రమంలోనో మనల్ని పడెస్తే మనం ఎమి అయ్యి వుండేవళ్ళమో.....
తెలుగు భాష తీపి : శ్రీకృష్ణరాయలవారిచే....చాటు పద్యం..
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స......
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స......
బట్ట తలపై కూడా జుట్టు రావటానికి:
ఉల్లి ( onion ) రసం ఒక చెంచా + ముల్లంగి రసం ఒక చెంచా కలిపి మెత్తటి బట్టతో 15 నుంచీ 30 నిముషాలు నింపాదిగా (గట్టిగా రుద్దితే చర్మం కములుతుంది జాగ్రత్త) రుద్ది గంట ఆగి కుంకుడు రసంతో కడుగుతుంటే మెరిసే బట్టతల మీద కుడా వెంట్రుకలు వస్తాయ్.
2 లేదా 3 నెలలకు సన్నగా వెంట్రుకలు రావటం మొదలయ్యాక గుండు చెసెయ్యాలి లేదా వాటి వరకూ షేవ్(గుండు) చెసెయ్యాలి. తరవాత మళ్ళీ పైన చెప్పిన రసం రాయాలి. మళ్ళీ తీసెయ్యాలి. ఇలా ఆ వెంట్రుకలు మందంగా వచ్చే వరకూ 5 లేదా 6 సార్లు చేయాలి.
ఈ యొగంతో జుట్టు వచ్చినవారు దయచేసి ఇదే సమస్యతో బాధ పడుతున్న వారికి చెప్పి సహాయం చేయండి.
గమనిక: ముల్లంగి దొరకకపొతే ఒక్క ఉల్లి రసంతో కూడా పైన చెప్పినట్లు చేయవచ్చు.

చుండ్రుకు:
1. వేపాకులు గుప్పెడు తీసుకుని, కాస్త నలగ్గొట్టి కప్పు నీళ్ళలో వేసి మరగపెట్టాలి. పావు కప్పు వచ్చాక చల్లారాక, వడకట్టి గోరువెచ్చగా వున్నప్పుడు తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి). ఈ యోగంతో జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
(లేదా)
2. 100 గ్రాముల కొబ్బరి నూనెలో 30 గ్రాముల నిమ్మరసం కలిపి కేవలం నూనె మిగిలినంత వరకు మరిగించాలి. తరవాత గొరువెచ్చగా(వేడిగా వున్నపుడు వేయరాదు) అయ్యాక 5 గ్రాముల ముద్ద కర్పూరం కలపాలి. తరవాత తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి).
పై యోగాలు నెను చేసి చూసాను, చాలా మంది కి చెప్పాను. చెప్పినవారందరికి 3 లేదా 4 సార్లు చేసేసరికే మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు.
చుండ్రు, జుట్టు రాలే సమస్య వున్నవారు పై వాటిని వాడి మీలా బాధపడే వారికి కూడా ఇదే సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను.

సమస్త రోగాలకు ముఖ్యంగా మనం రోజూ తీసుకునే విష రసాయనాలతో పండిన పదార్ధాలను తినటం వలన Cancer రాకుండా :
ఒక 5 కృష్ణ తులసి ఆకులను సాయంత్రం గోరు తగలకుండా తుంచి రాగి చెంబులో వేసి నీళ్ళు పోసి మూత పెట్టి చెక్క పీట/stool మీద పెట్టాలి. ఉదయం లెవగనే స్నానం ముగించుకుని తూర్పుకు తిరిగి ఆ నీటిని త్రాగాలి.
ఎందుకు ఇలాగే చేయాలి?
తులసి లో పాస్పరస్, గంధకం అనే రెండు మూలకాలు ఉండటం వలన, నీటి లో విద్యుత్ శక్తి , రాగి లోహం తో కలిసి విద్యుత్ అయస్కాంత శక్తి తయారవుతుంది.
ఈ విద్యుదయస్కాంత శక్తి మన శరీరం లొ వున్న సప్త ధాతువులలో రక్తమును ఆకర్షించి శుద్ధి చేస్తుది. ఎందుకంటె రక్తం లొ ఇనుము వుంటుంది.

తులసి లో పాస్పరస్, గంధకం అనే రెండు మూలకాలు ఉండటం వలన, నీటి లో విద్యుత్ శక్తి , రాగి లోహం తో కలిసి విద్యుత్
అయస్కాంత శక్తి తయారవుతుంది.

తుమ్ములు ఆగకుండా వస్తుంటే:
తుమ్ములు ఆగకుండా వెంట వెంటనే వస్తూవుంటే, కొత్తిమీరిగానీ, గంధం పొడిగానీ వాసన చుస్తూ వుంటే వెంటనే తుమ్ములు ఆగిపోతయ్.
కంటి పొరలు కరుగుటకు:
వారానికి రెండు సార్లు కుంకుడు కాయ రసంతో తలస్నానం చేస్తూ వుంటే పొరలు కరిగిపోతయ్.
ఎలా అంటే, స్నానం చేసినప్పుడల్లా ఎంతో కొంత కుంకుడు రసం కళ్ళలో పడుతుంది. కుంకుడు రసం తగిలితే కంటిలోని పొరలు కరిగిపోతయ్. అదే షాంపూలతో తలస్నానం చేస్తూ వుంటే ఆ షాంపూలలో కలిసి వుండే రసాయన పదార్ధాలు కళ్ళలో పడి క్రమంగా కంటి పొరలు ఏర్పడి కంటిచూపు దెబ్బతింటుంది. అందువల్ల కుంకుడుతో తలస్నానం శ్రేష్టం.

కాలి ఆనెలకు, వ్రణాలకు, దురదలకు, రక్త/చర్మ శుద్ధి, ముళ్ళు మేకులు ఇరుక్కుంటే:
జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెకాయలు హరించిపోతయ్.
తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతయ్.
వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలే్టట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతయ్.
పసుపుపొడి 3 గ్రాములు, ఉసిరిక పొడి 6 గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధి.
మారేడు ఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీ్రంలో ఇరుక్కున్న ముళ్ళు, మేకులు బయటకొస్తయ్.

దగ్గును దూరం చేయండి..
* దోరగా వేయించిన మిరియాల చూర్ణం పూటకు 1 లేదా 2 గ్రాములు తేనెతో కలిపి 2 పూటలా తింటుంటే దగ్గు, గొంతులో నస తగ్గుతాయి.
* లవంగాలను నిప్పుల్లో వేడి చేసి చల్లగా అయ్యాక బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుతూ వుంటే దగ్గు, నస, గొంతులో గుర గుర పోతాయి.(రోజుకు 5 లేక 6 సార్లు)
* ఉసిరి పండ్లను ఎండించిన చూర్ణం, పాలతో కాచి నెయ్యి కలిపి తాగిన సర్వ విధములయిన దగ్గులు తగ్గిపోవును.
* లవంగాలను నిప్పుల్లో వేడి చేసి చల్లగా అయ్యాక బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుతూ వుంటే దగ్గు, నస, గొంతులో గుర గుర పోతాయి.(రోజుకు 5 లేక 6 సార్లు)
* ఉసిరి పండ్లను ఎండించిన చూర్ణం, పాలతో కాచి నెయ్యి కలిపి తాగిన సర్వ విధములయిన దగ్గులు తగ్గిపోవును.
ఉసిరి కాయలతో స్త్రీల వ్యాధులకు స్వస్తి
స్త్రీల తెల్లబట్ట వ్యాధికి(white discharge) :
ఉసిరిక పండ్లలో(పెద్ద ఉసిరి) వుండే గింజలను దంచి పొడి చేసి సమంగా పటికబెల్లం పొడి కలిపి రెండు పూటలా పూటకు ఒక చెంచా మోతాదుగా మంచి నీటితో సేవిస్తుంటే తెల్లబట్ట వ్యాధి తగ్గిపోతుంది.
స్త్రీల ఎర్ర బట్ట వ్యాధికి(over bleeding):
ఉసిరక కాయల పొడి ఒక చెంచా, మంచి తేనె ఒక చెంచా కలిపి తింటూ వుంతే ఎర్రబట్ట వ్యాధి తగ్గిపోతుంది.

తెలుగు భాష తీపి
లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు
పెంచీకటి కవ్వల నెవ్వం డే కాకృతి వెలుగు నతిని నే సేవింతుn
పెంచీకటి కవ్వల నెవ్వం డే కాకృతి వెలుగు నతిని నే సేవింతుn
సోంపు మనకు ఎలా ఉపయోగపడుతుంది?
* సోంపు గింజలు నోట్లో వేసుకొని తరచుగా నములుతుంటే నోటి దుర్వాసన పోతుంది
* కప్పు సోంపు కషాయంలో సైంధవలవణం 2 గ్రాములు కలిపి తాగుతుంటే గుండేనొప్పి తగ్గుతుంది.
* సోంపు పొడి 10 గ్రాములు, పటీక బెల్లం 10 గ్రాములు తిని పాలు తాగుతుంటే తల్లి పాలు పెరుగుతాయి.
* సోంపు 3 గ్రాములు, ధనియాలు 3 గ్రాములు, నెయ్యి 10 గ్రాములు తింటుంటే దురదలు తగ్గుతాయి.
* పొట్టూ తీసిన సోంపు గింజలపప్పు 3 గ్రాములు నిద్రించేముందు తింటుంటే మెదడుకు మహాబలం
* కప్పు సోంపు కషాయంలో కండ చక్కెర 10 గ్రాములు కలిపి తాగుతుంటే తలనొప్పులు తగ్గిపోతయ్.
* సోంపు, చక్కెర సమంగా కలిపిన పొడి 10 గ్రాములు తింటుంటే తల తిరగడం తగ్గుతుంది.
* అరకప్పు గోరువెచ్చని సోంపు కషాయంలో తేనె 10 గ్రాములు కలిపి తాగుతుంటే దగ్గు తగ్గుతుంది.

తెలుగు గడ్డ గొప్పతనం
మన భారత దేశంలో 22 సంపూర్ణ భాషలు, అలాగే 3280 వాడుక భాషలు ఉన్నయ్. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని సంపూర్ణ భాషలు, ఇన్ని ఉపభాషలు లేవు. మనదేశంలో ఎన్నొతరాలుగా మనుగడలో వున్న సంపూర్ణ భాషలకు, వాడుక భాషలకు మూలం ప్రేరణ స్పూర్తి సంస్కృత భాషేనని, ఆ కారణంగానే ' జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును' అనే నానుడి పుట్టిందని భాషా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
తెలుగు భాష తీపి
రావి పండ్లను తిన్న రమణి గర్భము పండు
నలుబది దినములు ఉదయ కాలమందు
రావిలోన కలదు ప్రకృతి రహస్యమూ
తెలుసుకొనవె చెల్లీ తెలుగు తల్లీ!!!
నలుబది దినములు ఉదయ కాలమందు
రావిలోన కలదు ప్రకృతి రహస్యమూ
తెలుసుకొనవె చెల్లీ తెలుగు తల్లీ!!!
తెలుగు భాష తీపి
సందు సందునందు సంతాన కేంద్రాలు
లక్షలాది సొమ్ము లాగుచుండె
రావి పండ్లు తిన్న రమణి గర్భము పండూ
తెలుసుకొనవె సుమతీ తెలుగు యువతీ!!!
లక్షలాది సొమ్ము లాగుచుండె
రావి పండ్లు తిన్న రమణి గర్భము పండూ
తెలుసుకొనవె సుమతీ తెలుగు యువతీ!!!
కడుపు నెప్పికి చిట్కాలు:
* వాము నేతిలో వేయించి ఉప్పు కలుపుకుని మొదటి రెండు ముద్దలు అన్నం తింటే నొప్పి తగ్గిపోతుంది.
* శొంఠి, ఉప్పు, మిరియాలు, వాము సమ భాగములుగా చేర్చి 5 గ్రాములు పరగడుపున నమిలి తిని కొంచం నిళ్ళు త్రాగితే కడుపు నెప్పి తగ్గుతుంది.
* శొంఠి చూర్ణం 5 గ్రాములు, తగుమాత్రం చక్కెర కలిపి వేడి నీళ్ళతో తీసుకుంటే అజీర్ణం వల్ల వచ్చే కడుపునెప్పి, కడుపు వుబ్బరం తగ్గిపోతుంది.
* పాల పండ్ల వల్ల వచ్చే అజీర్తికి, మజ్జిగ తాగితే పోతుంది.

పసి పిల్లల వాంతులకు :
ఏలక గింజలు, దాల్చిన చెక్క సమంగా కలిపి నూరి, 3 గ్రాముల చూర్ణాన్ని తేనెతో కలిపి పిల్లలకు తినిపిస్తే వాంతులు వెంటనే కట్టుకుంటాయ్.
పిల్లల సుఖ విరేచనానికి:
పిల్లలకు అజీర్తిచేసి, విరేచనం కాకుండ బాధపడుతూ వుంటే, పొట్టమీద ఆముదం రాసి గోరు వెచ్చటి కాపడం పెడితే వెంటనే విరేచనం అవుతుంది
తులసి అమ్మ :
" తులాంశ్యతి ఇతి తులసి " అంటే, కొలవటానికి వీలులేనిది, వెల కట్టటానికి అతీతమైనది అని అర్ధం. అంతేకాదు, " తు " అంటే మృత్యువును " లసతి " అంటే ధిక్కరించునది. అంటే చావును ఆపగలిగేది అని అర్ధం.
ఈ అనంతమైన సృష్టిలో మనకు కనిపించకుండ వుండే మానవాతీత దైవ శక్తులన్నీ, ఎల్లప్పుడూ తులసి చెట్టును ఆశ్రయించి వుంటయ్ అని మాఘ పురాణం పేర్కొంటుంది. అందుకే తులసి చెట్టును పూజించి తీ్ధం సేవించి, హాయిగా బ్రతకమని మన పెద్దలు సూచించారు.
తులసి చెట్టు లేని వారు, ఎలా ఐనా సరే ఒక మొక్క తెచ్చుకుని పెంచుకుని దాని మంచి ఫలితాలను వినియొగించుకోండి.

తులసితో - శోభి(సిబ్బెం) మచ్చలను పోగొడదాం:
తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతయ్.
తులసితో - చర్మరోగాలను పోగొడదాం:
కృష్ణ తులసి ఆకులు, నిమ్మపండు రసం కలిపి మెత్తగా నూరి ఆ గుజ్జును రెండు పూటలా పైన పట్టిస్తుంటే ఎంతో కాలం నుండీ వేధించే గజ్జి, చిడుము, తామర, దురదలు మొదలైన చర్మ సమస్యలు అతిసులువుగా హరించిపోతయ్.
కడుపు నొప్పికి :
పచ్చి పుదీనా ఆకులు ఏడు, ఏలక కాయ ఒకటి ఈ రెండు పదార్ధాలు ఒక తమలపాకులో పెట్టీ కిళ్ళీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగిన తరువాత కొద్ది కొద్దిగా మంచినీళ్ళు తాగితే, ఆ మరుక్షణమే కడుపు నొప్పి కనుమరుగైపోతుంది.
తులసితో - ప్లీహ(Spleen related Problems)రోగాన్ని పోగొడదాం :
ఉదరంలో ప్లీహం చెడిపోయి ఎడమవైపు పొట్ట ఎత్తుగా పెరిగిన స్థితిలో కృష్ణతులసి ఆకులను దంచి తీసిన రసం రెండు చెంచాల మోతాదుగా రెండు పూటలా తాగుతుండాలి. ఈ చిన్న ప్రయోగంతోనే ప్లీహ వాపు తగ్గిపోయి చక్కని ఆరొగ్యం సిద్ధిస్తుంది. ఇదే వ్యాధి పిల్లలకు వస్తే పై మోతాదులో సగం తగ్గించి వాడటం వల్ల వారికి కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది.
Tuesday, 16 July 2013
మనం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కు వైపు పెట్టుకోవాలి? ఏందుకు?
వీలైనంత వరకూ తలను తూర్పు వైపే పెట్టుకోవాలి లేదా దక్షిణం వైపు పెట్టుకోవాలి.
భూమి యొక్క ఉత్తర, దక్షిణ ధ్రువాలు తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటాయి.
మన శరీరానికి తల - ఉత్తరం(North), పాదాలు - దక్షిణం( South)
భూమికి ఉత్తరం వైపు తల పెట్టుకుంటే :
సాధారణంగా శరీరం, భూమికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది.
మన తల(North), భూమి యొక్క ఉత్తరం(North) వైపు పెట్టుకుంటే వికర్షణ అనే క్రియ జరుగుతుంది. అంటే Force of Repulsion. అందువలన శరీరంను నొక్కినట్లు/నెడుతున్నట్లుంటుంది. శరీరంలో సంకోచ క్రియ జరుతుగుంది. రక్త సరఫరా కాస్త జోరుగా జరుగుతుంది, అందువలన B.P.(రక్త పోటు) అదుపు తప్పుతుంది, మనస్సు అల్లకల్లోలంగా అనిపిస్తుంది, గుండె దడపుడుతుంది, నిద్ర రాదు..
భూమికి దక్షిణం వైపు తల పెట్టుకుంటే :
మన తల(North), భూమి యొక్క దక్షిణం(South) వైపు పెట్టుకుంటే ఆకర్షణ అనే క్రియ జరుగుతుంది. అంటే Force of Attraction. శరీరం సాగినట్లుండి/ వ్యాకోచిస్తుంది, శరీరం విస్తరించినట్లుగా వుండి హాయిగా వుంటుంది. అంటే Relaxed గా అనిపిస్తుంది. అందువల్ల ప్రశాంతమైన నిద్రపడుతుంది. అన్ని రకాలైన మానసిక రోగాలను కూడా తరిమివేస్తుంది.
కాస్త పొట్టిగా వున్నా పిల్లలు దక్షిణం వైపు తల పెట్టి పడుకుంటుంటే 2,3 ఏళ్ళలో వారి పొడవులో మంచి మార్పు వస్తుంది.
తూర్పు neutral గా వుంటుంది.
Monday, 15 July 2013
నా గురువు గారు..
మన దేశ సంస్కృతి, మన దేశ గొప్పతనం, మన భరతమాత గొప్పతనం, మన తల్లి గోమాత గొప్పతనం, మన స్వాతంత్ర్య సమరయోధుల (కష్టం, రక్తం,త్యాగం) ద్వారా మనం ఈనాడు ఎంత హాయిగా వుంటున్న విషయాన్ని, అధ్భుతమైన మన భూమాత, మన నిత్య, ప్రత్యక్ష దైవాలైన పంచభూతాలు (భూమి, నీరు,అగ్ని,గాలి,ఆకాశం) యొక్క గొప్పతనం, మన ప్రకృతి మాత మనకోసం సృష్టించిన వృక్ష సంపద గురించి, వాటిని నిత్య జీవితంలో పాత కాలం వాళ్ళు ఎలా వుపయోగించుకునేవారో, అవి చేయక మనం ఎందుకు ఇన్ని రోగాలతో పాట్లు పడుతున్నామో, ప్రాచీన జీవన విధానం ఎంత అమృతమయమో ఇంకా చాలా విషయాలను ఎంతో అద్భుతంగా చెప్పిన నా గురువుగారైన శ్రీ పండిత ఏల్చూరి మహర్షి గారికి మరియు తమ తరవాత తరాలకోసం వారి జీవితాలను పణంగా పెట్టి ఎన్నొ ప్రయోగాలు చేసి, మనకు మంచి జీవన విధానాన్ని అమర్చిన మహా మహా ఋషులకు నా పాదాభివందనములు..మరియు నాకు ఇంత మంచి జన్మను ప్రసాదించిన నా తల్లి దండ్రులకు నా పాదాభివందనములు...
వారి ద్వారా నేను నేర్చుకున్న విద్యను, విషయాలను వీలైనంతమందికి అందచేయాలన్న చిరుద్దేశంతో వారికి నేను సమర్పించుకుంటున్న చిరు గురు దక్షిణ..
సరస్వతి దండా
వారి ద్వారా నేను నేర్చుకున్న విద్యను, విషయాలను వీలైనంతమందికి అందచేయాలన్న చిరుద్దేశంతో వారికి నేను సమర్పించుకుంటున్న చిరు గురు దక్షిణ..
సరస్వతి దండా
Wednesday, 10 July 2013
Welcome to Inti Vaidyam!
Hello Viewers,
This is a blog for those who are interested in home remedies.
This is a blog for those who are interested in home remedies.