పద్ధతి 1:
దోరగా వేయించిన వామ్ము పొడి 100 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 50 గ్రాములు, సైంధవ లవణం 25 గ్రాములు కలిపి ఒక సీసాలో బధ్రపరచుకుని,
దోరగా వేయించిన వామ్ము పొడి 100 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 50 గ్రాములు, సైంధవ లవణం 25 గ్రాములు కలిపి ఒక సీసాలో బధ్రపరచుకుని,
1)గేస్ సమస్య వున్న వాళ్ళు అర గ్లాసు నీటిలో అర చెంచా నుంచీ ఒక చెంచా వరకు పొడిని కలుపుకుని అన్నం తినే గంట ముందు త్రాగాలి.
2)అజీర్ణ సమస్య వున్న వాళ్ళు అన్నం తిన్నా గంట తరువాత త్రాగాలి.
పద్ధతి 2:
దోరగా వేయించిన వామ్ము 100 గ్రాములు, పటిక బెల్లం(మిశ్రీ) పొడి 100 గ్రాములు, ఆవు నెయ్యి(దేశవాళీ ఆవునెయ్యి) 100 గ్రాములు ముందుగా వామ్ము పొడి, మిశ్రీ పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి, నెయ్యి వేడి చేసుకుని (మరిగించక్కర్లేదు) ఈ పొడిని వేస్తూ వుండలు లేకుండా కలుపుకోవాలి్. అది ఒక లేహ్యం లాగా/ హల్వా లాగ తయారవుతుంది.దీన్నే అగస్త్య లేహ్యం అంటారు.
దీన్ని గేస్ సమస్య వున్నా వాళ్ళు ఒక చెంచా ముద్దను అన్నం తినే గంట ముందు తినాలి.
అజీర్ణ సమస్య వున్నా వాళ్ళు అన్నం తిన్నా గంట తరవాత తినాలి.
ఈ లేహ్యంతో వాతం వలన కలిగిన కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి కూడా తగ్గిపోతుంది.
రోజుకు రెండు పూటలా పైన చెప్పిన విధానాలలో ఏది వీలైతే అది ఆచరించుకోవచ్చు.
No comments:
Post a Comment