లక్షలమంది వైద్యులు, లక్షలాది మందుల షాపులు, వేలాది మందుల తయారీకర్మాగారాలు లేని కాలంలో మన భారతీయులంతా తమ అరోగ్యరక్షణకు తమ ఇంటిపైన, తమ ఊరిపైననే ఆధారపడేవారు. ఎంత పెద్ద ఘోరమైన వ్యాధినైనా తమ ఊర్లోని అనుభవజ్ణులైన ఆయుర్వేదవైద్యులద్వారనే పరిష్కరించుకునేవారు. ఈనాడు మనం చెప్పుకునే వందల వేల జబ్బులన్నీమనుషులకు సోకకుండా తమ జీవన విధానం ద్వారా ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేవారు. తమ ఇంటిలోని దినుసులను, ఆహారపదార్ధాలను, తమ ఊరిలోని మొక్కలను, చెట్లను అపుర్వమైన ఔషధాలుగా వాడుకుంటూ నూరేండ్లకు పైగా నిరోగులుగా నిత్య సంతోషంతో జీవించగలిగారు.
No comments:
Post a Comment