Pages

Sunday, 10 November 2013

కాలేయ(లివర్ )రహస్యం మీకు తెలుసా?

 కామెర్ల వ్యాధికి మూలకేంద్రం కాలేయం. ఇది సూర్యుని అంశతో మన శరీరంలో పుట్టింది కాబట్టి దీన్ని సూర్యచక్రం అంటారు. సూర్యుని వల్ల సమస్త లోకాలు ఎలా శక్తిని పొందుతాయో అదేవిధంగా శరీరంలో కాలేయంవల్ల మిగిలిన అన్ని అవయవాలు రక్షింపబడుతూ జీవశక్తులను పొందుతూ వుంటయ్.అంతటి మహత్కరమైన కాలేయం ఎల్లవేళలా ఆరోగ్యంగా వుండాలంటే సకాల భోజనం, సకాల నిద్ర, మానసిక ప్రశాంతత వుండి తీరాలి. ఈ పద్ధతుల్లో ఎప్పుడైతే తేడా వస్తుందో అంటే మనం వేళకాని వేల భుజిస్తూ అర్ధరాత్రి నిద్రిస్తూ ప్రకృతికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెట్టగానే కాలేయం దెబ్బతినడం ప్రారంభమౌతుంది.అతివేడి కలిగించే పదార్ధాలు దీనికి పడవు. ఈ శారీరక రహస్యాలు తెలుసుకుని ఒక్క కాలేయాన్ని మనం కాపడుకోగలిగితే యావత్ జీవితం ఆనందంగా కొనసాగుతుంది.

No comments:

Post a Comment