Pages

Friday, 9 August 2013

మలబద్ధకం ఎందుకు వస్తుంది:

ప్రపంచంలో రకరకాల వ్యాధులకు రకరకాల ఔషధాలు అమ్ముడవుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తైతే వాటీకి రెట్టీంపు ఔషధాలు కేవలం మలబద్ధానికే అమ్ముడవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
మనలో రెండు మూడు రోజులకొకసారి విరేచనమయ్యేవారు, అదీ మందు తీసుకుంటే గాని విరేచనం కాని వారు అనేకమంది వున్నారు.
మలబద్ధకం రోగాలకు మూల కారణం అని అంటారు.
విరేచనమును గుర్తించుటయే మనకు మన ఆరోగ్యం గురించి నిజమైన గుర్తింపని గ్రహించాలి.
1. విరేచనము మరీ గట్టీగా రాళ్ళవలె వుండరాదు, మరీ నీళ్ళవలె వుండరాదు.
2. మలము దుర్గంధ రహితముగా వుండాలి.
3. తాడు ఆకారంలో విరేచనం అవ్వాలి.
4. మల విసర్జన సమయంలో ముక్కీ మూలిగీ ప్రయత్నంతో విరేచనమయితే అది మలబద్ధకం క్రిందే లెక్క.
5. ప్రతి రోజూ ఒకే సమయంలో ప్రయత్నం లేకుండా దానంతటది విసర్జింపబడీతే వ్యాధి లేనట్లు.
దానిని కాల విరేచనమని అంటారు వైద్య పరిభాషలో.
మలబద్ధకం వలన శరీరం సోమరితనము ఆవరించుకుంటుంది. పొట్ట, తల బరువుగా వుంటాయి. వళ్ళంతా పొడిబారి పెళుసుగా తయారవుతుంది.నిద్ర సరిగా పట్టదు. మెదడు మొద్దు బారినట్లంటుంది. ఆకలి కూడా మందగిస్తుంది. అంతే కాదు ఈ లక్షణాలతోపాటు అనేక రోగాలు తలెత్తడానికి అవకాశం కలుగుతుంది.
మలబద్ధకం నయం చేసుకోవడానికి మనకి మన జీర్ణక్రియ గురించి కొంచమైనా తెలిసి వుండాలి.
మనము తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత సరీరోపయోగత్వాలను శరీరంలోపల వుంచుకొని మిగిలిన పిప్పిని మలమూత్ర రూపాలలో బయటకు నెట్టివేస్తుంది. మలబద్ధకం వలన అది బయటకు పోనట్లయిన మలము అక్కడే వుండి కుళ్ళడం మొదలు పెడుతుంది. పురుగులు పుడతాయి. దుర్వాసనతో కూడిన గ్యాస్(అపాన వాయువు) ఉత్పన్నమవుతుంది. గ్యాస్ పైకి లేవడం వ్యాపించడం దాని సహజ గుణం. ఆ గ్యాస్ శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి రక్తమును విషపూరితము చేస్తుంది. ఇది వ్యాధులకు నాంది అన్నమాట.
జీర్ణాశయంలో ఆహారం జీర్ణమైన తర్వాత అది చిన్న ప్రేగులలోకి వెళుతుంది. చిన్న ప్రేగులు ఆహారములోని ఆవస్యక తత్వాలను పీల్చుకొన్న తర్వాత మిగిలినది పెద్ద ప్రేగులలోనికి చేరుతుంది. ఇంకా మిగిలి వున్న శక్తితత్వాలను గ్రహించి వ్యర్ధ పదార్ధమును మలరూపంలో నెట్టివేస్తుంది. సహజంగా జరగవలసిన ఈ కార్యములో అవరోధము కలుగుటయే మలబద్ధకముగా పరిణమిస్తుంది. దాని నివారణకు మదులు ప్రయోగింపబడుతుంటాయి. కాని ఆ మందులు ఎంత వేడిని కలిగిస్తాయో తెలుసుకోవాలంటే మందు యొక్క సూక్ష్మ మోతాదును కంట్లోగాని, ముక్కులో గానే వేసుకుంటే మందు మంటకు నీరు ఊరి ధారగా కారుతుంది. కడుపులో కూడా ఇదే విధంగా ఊరిన ఈ నీరు జీర్ణకోశము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల నుండి ప్రవహిస్తూ తనతోపాటు తడిసి మెత్తబడిన మలమును బయటకు తెస్తుంది. దీనిని అందరూ మలబద్ధక నివారణగా భావిస్తారు. నెమ్మది నెమ్మదిగా ప్రేగులు మందుకు అలవాటు పడి స్వయంగా పనిచేయడం ఆగిపోతుంది.దానితో మొదటికంటే మరింత పవరున్న మందులు వాడవలసి వస్తుంది. ఇలా కొన్ని సార్లు జరిగేసరికి మందులు వ్యాధికి మిత్రులైపోతాయ్. రెండవది అధికంగా వాడిన మందుల ఉష్ణంతో వేడెక్కిన ప్రేగులలోని సున్నితపు పొర కమిలిపోయి పేగుపూత(అల్సర్) మారుతుంది.
అందుకని సహజసిద్ధంగా విరేచనం జరిగేటట్లు చూసుకోవాలి

No comments:

Post a Comment