Pages

Friday, 9 August 2013

చుండ్రుకు:

1. వేపాకులు గుప్పెడు తీసుకుని, కాస్త నలగ్గొట్టి కప్పు నీళ్ళలో వేసి మరగపెట్టాలి. పావు కప్పు వచ్చాక చల్లారాక, వడకట్టి గోరువెచ్చగా వున్నప్పుడు తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి). ఈ యోగంతో జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
(లేదా)
2. 100 గ్రాముల కొబ్బరి నూనెలో 30 గ్రాముల నిమ్మరసం కలిపి కేవలం నూనె మిగిలినంత వరకు మరిగించాలి. తరవాత గొరువెచ్చగా(వేడిగా వున్నపుడు వేయరాదు) అయ్యాక 5 గ్రాముల ముద్ద కర్పూరం కలపాలి. తరవాత తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి).

పై యోగాలు నెను చేసి చూసాను, చాలా మంది కి చెప్పాను. చెప్పినవారందరికి 3 లేదా 4 సార్లు చేసేసరికే మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు.
చుండ్రు, జుట్టు రాలే సమస్య వున్నవారు పై వాటిని వాడి మీలా బాధపడే వారికి కూడా ఇదే సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment