మర్రిపండ్లలో వుండే కంటిలోపల నలుసంత పరిమాణంగల చిన్న గింజలనుండి మరణమేలేని మర్రి వృక్షం పుట్టుకొస్తుందంటే ఆ విత్తనం ఎంతగొప్పదో అందులో ఎంతదైవశక్తి దాగివుందో మనం తెలుసుకోవచ్చు. పండిన మర్రిపండ్లు తిని కాకులు వేయ్యేండ్లు ఆయువుతొ వర్ధిల్లుతున్నాయని మనకు తెలియదు. భగవంతునికి ఆది మధ్య అంతం ఎలా వుండదో, మైళ్ళపర్యంతరం విస్తరించిన మర్రిచెట్టుకు కూడా మొదలెక్కడో చివరెక్కడో మధ్యెక్కడో తెలుసుకోలేము. దీని సర్వాంగాలు పచ్చివి గాని, ఎండినవిగాని, పండ్లు గాని అన్నికూడా అపారమైన ఔషధ శక్తులతో నిండి వున్నయ్. అందుకే ఈ చెట్లను గుళ్ళల్లో పెంచాలని పెద్దలు తీర్మానించారు.
No comments:
Post a Comment