Pages

Monday, 15 July 2013

నా గురువు గారు..

 మన దేశ సంస్కృతి, మన దేశ గొప్పతనం, మన భరతమాత గొప్పతనం, మన తల్లి గోమాత గొప్పతనం,  మన స్వాతంత్ర్య సమరయోధుల (కష్టం, రక్తం,త్యాగం) ద్వారా మనం ఈనాడు ఎంత హాయిగా వుంటున్న విషయాన్ని, అధ్భుతమైన మన భూమాత, మన నిత్య, ప్రత్యక్ష దైవాలైన పంచభూతాలు (భూమి, నీరు,అగ్ని,గాలి,ఆకాశం) యొక్క గొప్పతనం, మన ప్రకృతి మాత మనకోసం సృష్టించిన వృక్ష సంపద గురించి, వాటిని నిత్య జీవితంలో పాత కాలం వాళ్ళు ఎలా వుపయోగించుకునేవారో, అవి చేయక మనం ఎందుకు ఇన్ని రోగాలతో పాట్లు పడుతున్నామో, ప్రాచీన జీవన విధానం ఎంత అమృతమయమో  ఇంకా చాలా విషయాలను ఎంతో అద్భుతంగా చెప్పిన నా గురువుగారైన శ్రీ పండిత ఏల్చూరి మహర్షి గారికి మరియు తమ తరవాత తరాలకోసం వారి జీవితాలను పణంగా పెట్టి ఎన్నొ ప్రయోగాలు చేసి, మనకు మంచి జీవన విధానాన్ని అమర్చిన మహా మహా ఋషులకు నా పాదాభివందనములు..మరియు నాకు ఇంత మంచి జన్మను ప్రసాదించిన నా తల్లి దండ్రులకు నా పాదాభివందనములు...

  వారి ద్వారా నేను నేర్చుకున్న విద్యను, విషయాలను వీలైనంతమందికి అందచేయాలన్న చిరుద్దేశంతో వారికి నేను సమర్పించుకుంటున్న చిరు గురు దక్షిణ..
                                                                                                                 
                                                                                                                           సరస్వతి దండా

1 comment:

  1. నిజంగా మీరు ఒక "అమ్మ"

    ReplyDelete