వేళకు భుజించకుండా వేళతప్పి తినడంవల్ల, అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కుళ్ళిపోయి పొట్టలోనే కంపుకొడుతూ ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది. మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
అలాంటి వారు తమ తప్పులను తెలుసుకుని రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి, భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి. ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుంధభరితమౌతుంది.

No comments:
Post a Comment