Pages

Friday, 1 November 2013

నీవు భారత దేశానికి సంబంధించింట్లైతే ఇది చదివి ఎంతవరకూ నిజమో చెప్పు..

ఆంగ్లేయులు మనదేశాన్ని ఇంచుమించుగా 200 యేండ్లు పరిపాలించారు. వారి నిరంకుశ బానిసత్వాన్ని ఎదిరించి ఎన్నో పోరాటాలు చేసి దాదాపు 10 లక్షలమంది స్వాతంత్ర్యవీరులు బలయ్యాక దేశసంపదంతా దోచుకుపోయాక 1947లో స్వాతంత్ర్యం సాధించుకున్నాం.

8వ శతాబ్దం నుండి 20వ శతాబ్ద మధ్య భాగం వరకు ఇంగ్లీషువాళ్ళతో సహా ఎంతమంది విదేశీయులు ఎన్ని విధాలుగా మన భరత ఖండాన్ని చిన్నాభిన్నం చేసినా కూడా ఆయా విదేశాల విషనాగరికతలు మనిళ్ళల్లోకి ప్రవేశించలేక పోయినయ్. ఆంగ్లేయులు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా కూడా మన భారతీయ సంస్కృతిని, మన జీవన విధానాన్ని ఏమాత్రం నాశనం చేయలేకపోయారు.

అతినీచమైన అత్యంత నికృష్టమైన దురదృష్టమేమిటంటే స్వాతంత్ర్యం వచ్చాక ఈ 65 యేండ్లలో మన దేశ పాలకులు,మన మేధావి వర్గాలు ఆంగ్లవిషసంస్కృతిని ప్రజలందరికీ అలవాటు చేసి నేటి దేశదుస్థితికి ప్రధానకారకులు కావడం. అంటే ఆంగ్లేయులు 200 యేండ్లు అధికారంలో ఉండి కూడా నాశనం చేయలేకపోయిన మన దేశీయసంస్కృతిని మన పాలక మేధావి వర్గాలు కేవలం 65 యేండ్లలో ఇంగ్లీషుఎంగిలితో  విషమయం చేయగలిగారంటే ఈ దీన హీన దౌర్భాగ్య స్థితి ని ఎలా భరించాలి?

1 comment:

  1. this is exactly correct ,try to use the things of Indian made,politicians needs money ,
    change has to come in the public ,government is giving permission to foreign countries initially we get jobs and later on every thing in their hands

    ReplyDelete