మన అమ్మ, నాన్న, తాతయ్య. నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య లే పెద్దలు కాదు. వీరితో పాటు మనకు చదువు నేర్పే గురువులు. మనం నివసించే ప్రాంతంలోని వృద్ధులు వీరంతా కూడా పెద్దలుగానే పరిగణించబడతారు. వీరందరితో మాకెంటి పని? అని నిర్లక్ష్యం చూపించకూడదు. మన స్వదేశానికి చెందిన తరతరాల ప్రకృతి విజ్ణానమంతా వీరి వద్దనే వుంది. ఒక్కొ వృద్ధుని వద్ద కొన్ని వందల వేల జీవితానుభవాలు, ప్రకృతి రహస్యాలు దాగి వుంటయ్. కాబట్టి వారందరినీ గౌరవిస్తూ తీరిక సమయాలలో వారి వద్ద కూర్చుని ఆ రహస్యాలను గ్రహిస్తూ వుండాలి.
No comments:
Post a Comment