Pages

Friday, 25 October 2013

స్వాధిష్టాన చక్రం ఏమి చేస్తుంది, సరిగా పనిచేయకపోతే ఏమవుతుంది?

స్వాధిష్టాన చక్రం వలననే మానవులకు శిరస్సులో మేధస్సు వృద్ధి పొందుతుంది. యుక్తా యుక్త విచక్షణా జ్ణానము, సూక్ష్మ గ్రాహ్యత, సునిశిత బుద్ధి, ధారణా శక్తి, ఆలోచన పటిమ, ఇవన్నీ ఎల్లప్పుడూ వృద్ధి పొందటంలో కూడా ఈ స్వాధిష్టాన చక్రమే మూలకారణం అవుతుంది.

ఇది అపాన వాయువును అదుపులో వుంచి మల మూత్రాలు సాఫీగా విడుదల అయ్యేటట్లు చేస్తుంది. నాభి క్రింది భాగంలోని మూత్రాశయము,మలాశయము, మూత్రపిండాలు, మూత్ర గ్రంధి, మూత్ర నాళాలు మొదలైన భాగాలన్నీ స్వాధిష్టాన చక్రము యొక్క ఆధీనంలో వుంటాయి.

ఈ చక్రం సరిగా పని చేయకపోతే:
ఏ కారణాల వలనైనా ఈ చక్రం యొక్క క్రియలలో లోపం జరిగితే, మానవులకు తెలివితేటలు తగ్గిపోతయ్. అలోచన శక్తి, ప్రతిభ తగ్గుముఖం పడతయ్.
మూత్రాశయం, మూత్రపిండాలు మొదలైన పైన పేర్కొన్న అవయవాలలో అనారోగ్యం కలుగుతుంది. మలబద్ధకం, మూత్రావరోధం, మూత్రంలో మంట, మూత్ర పిండాలలో వాపు, రాళ్ళు ఏర్పడటం వంటి అనేకానేక సమస్యలు ఏర్పడుతూ వుంటాయి.

ఈ చక్రం యొక్క బీజాక్షరం 'వం '

No comments:

Post a Comment