Pages

Friday, 9 August 2013

స్త్రీల అతిఋతురక్తస్రావానికి(Over Bleeding):

1. బాగా మగ్గిన అరటిపండ్లు రెండు లేక మూడు తీసుకుని వాటిలో పేరిన నెయ్యి 30 గ్రాములు, చిన్న ఏలకుల పొడి 3 గ్రాములు కలిపి పిసికి ఉదయం,సాయంత్రం తింటుంటే అతి ఋతురక్తస్రావం రెండు మూడు రోజుల్లొ ఆగిపోతుంది
2. అతిమధురంపొడి 5 గ్రాములు, ఎండు ద్రాక్షపండ్లు 20 గ్రాములు కలిపి మెత్తగా దంచి రెండుపూటలా చప్పరించి తింటుంటే అతిఋతురక్తం క్రమంగా తగ్గి ఆగిపోతుంది.
3. పచ్చివక్కలపొడి 50 గ్రాములు, పిస్తా పప్పు 50 గ్రాములు, పటిక బెల్లం 30 గ్రాములు కలిపి మెత్తగా నూరి నిలవజెసుకోవాలి. పూటకు 10 గ్రాములు మోతాదుగా మూడుపూటలా సేవిస్తుంటే ఆగకుండా ప్రవహించే ఋతురక్తం ఆగిపోతుంది.

No comments:

Post a Comment