Showing posts with label తెలుగు భాష తీపి. Show all posts
Showing posts with label తెలుగు భాష తీపి. Show all posts

Wednesday, 24 September 2014

తెలుగులోనే మాట్లాడండి..

తెలుగు భాష లోనే మాట్లాడదాం, తెలుగు  భాషని నిర్లక్ష్యం చెయ్యొద్దు, బాగా అవసరం అనుకుంటేనే తప్ప ఇతర భాషల్లొ మాట్లాడవద్దు. మనకు తెలుగు వచ్చని గొప్పగా చెప్పుకుందాం. తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదిద్దాం.

Saturday, 14 September 2013

తెలుగు భాష గొప్పదనం

గడచిపోయిన ప్రతినిమేషమ్ముకూడ
జీవితమ్మున భాగమ్ముపంచుకొనును
దీపముండగ నిలుచక్కదిద్దుకొంచు
మించిపోనీడు సమయము మంచివారు !!!

Friday, 9 August 2013

తెలుగు భాష తీపి : శ్రీకృష్ణరాయలవారిచే....చాటు పద్యం..

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స......

తెలుగు భాష తీపి

లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు
పెంచీకటి కవ్వల నెవ్వం డే కాకృతి వెలుగు నతిని నే సేవింతుn 

తెలుగు భాష తీపి

రావి పండ్లను తిన్న రమణి గర్భము పండు
నలుబది దినములు ఉదయ కాలమందు
రావిలోన కలదు ప్రకృతి రహస్యమూ
తెలుసుకొనవె చెల్లీ తెలుగు తల్లీ!!!

తెలుగు భాష తీపి

సందు సందునందు సంతాన కేంద్రాలు
లక్షలాది సొమ్ము లాగుచుండె
రావి పండ్లు తిన్న రమణి గర్భము పండూ
తెలుసుకొనవె సుమతీ తెలుగు యువతీ!!!