Monday, 1 June 2015

మధుమేహ వ్యాధి లక్షణములు :

ఎవరిలో ఈ లక్షణములు ఎక్కువగా కనిపించును : అతిగా తినటం, అధిక బరువు పెరగటం, అతిగా తీపి మరియు కొవ్వును పెంచేటటువంటి నూనె పదార్ధములు సేవించడం, శారీరక శ్రమ గానీ, దేహానికి సరైన వ్యాయామము గానీ లేకుండా ఉండటం, అతిగా నిద్రపోవడం చేసేటటువంటి వారిలో ఈ క్రింది లక్షణములు కలుగుతాయి.

అతిమూత్రము వెళ్ళుట, దప్పిక, ఆకలి అధికంగా ఉండుట,ప్రతి పనియందు నిరాసక్తి , కాళ్ళు చేతులు సంధులందు బాధ, ఏవైనా దెబ్బలు తాకినా త్వరగా మానకుండుట ఈ లక్షణాలతో పాటు ఈ వ్యాధి సోకిన వారికి నిద్రలేమి అధికముగా ఉంటుంది.

అయితే అధిక ప్రోటీన్స్, కార్భోహైడ్రేట్స్ కలిగిన పిండి పదార్ధములు అధికంగా సేవించడంవల్ల, అధిక మాంస సేవన మరియు అధికంగా మద్యం తాగుటవల్ల శరీరంలోని ఆంత్రస్రావ గ్రంధులు ఆగ్నాశయమునందు ఇన్సులిన్ అనే ద్రవము సరైన మోతాదులో స్రవించకకకపోవడం వల్ల మిగిలిన  ఆంత్రస్రావ గ్రంధులపై వీటి ప్రభావము పడి చక్కెర శాతము గణనీయంగా పెరిగి ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

                  మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

0 comments:

Post a Comment