Thursday, 25 September 2014

ఏ ఆహారం తిన్నా, ఆయుష్షున్నంతకాలం బ్రతుకుతాం ! అని భ్రమ పడుతున్నారా? ఆ భావం నిజం కాదు.

ఆహార నియమాల గురించి అసలు తెలియని వాళ్ళు, లేదా తెలుసుకుందామనే అభిరుచి ఉన్నవాళ్ళు మంచిని స్వీకరించటానికి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి ఎప్పుడూ ముందే వుంటారు. కానీ, కొంతమంది వివిధ రుచులకు అలవాటుపడి ఆ జిహ్వ చాపల్యాన్ని అణచుకోలేక, శరీరమంతా రోగగ్రస్తం అయినా కూడా, తిండి మీద వ్యామోహాన్ని చంపుకోలేక నిర్లక్ష్యంగా, తిరస్కారంగా " ఆ...! దేవుడు ఎంతకాలం ఆయుష్షు ఇస్తే అంతకాలం బ్రతుకుతాం. ఆహారం మార్చినంత మాత్రాన ఎక్కువకాలం బ్రతుకుతామా...." అని మెట్ట వేదాంతం వల్లిస్తుంటారు. ఆహార రహస్యాన్ని మరణ రహస్యాన్ని తెలుసుకుంటే ఎవరు ఇంత అలక్ష్యంగా మాట్లాడరు.

మృత్యువు రెండు రకాలు. కాల మృత్యువు, అకాల మృత్యువు. కాల మృత్యువు అనేది భగవంతుడిచ్చిన ఆయువు తీరేవరకు ఉదయిచిన సూర్యుడు క్రమగతిలో అస్తమించినట్లుగా బాల్య యౌవన వార్ధక్య దశల్లో క్రమంగా ఆవరిస్తూ అంతరింపచేస్తుంది. అకాల మృత్యువు అనేది మనిషి ఆహార నియమాలు పాటించకుండ రోగాల పాలైనప్పుడు, రోడ్ల మీద ప్రయాణ నియమాలు పాటించకుండ అతివేగంగా వాహనాలమీద వీరగమనం చేస్తున్నప్పుడు, తన శక్తిని మరచి బలవంతులైన ఇతరులతో వైరానికి, కొట్లాటలకు దిగినప్పుడు, ధర్మము తప్పి ఇతరులను వంచించి అనుక్షణం ప్రాణభయంతో అల్లాడుతున్నప్పుడు, అకస్మాత్తుగా ఆవరించేదే అకాల మృత్యువు. దీనికి ఉదాహరణగా ఏదైనా వాహనాన్ని గురించి చెప్పుకోవచ్చు.

మనం కొత్తగా కొనుక్కున్న వాహనాన్ని రోజూ శుభ్రంగా కడిగి తుడిచి సకాలంలో ఆయిల్ పొసి ఒక క్రమ పద్ధతిలో వాడుకొంటూ ఉంటే దానిని తయారు చేసిన శాస్త్రవేత్త ఆ వాహనానికి ఎంతకాలం లైఫ్ ఉంటుందని చెప్పాడో అంతకాలం ఆ వాహనం దివంగా పనిచేస్తుంది. అలా కాకుండా కొన్నప్పటినుంచీ ఆ వాహనం మీద శ్రద్ధ చూపకుండా, గతుకుల్లో గుంటల్లో ఎత్తెత్తి పడేస్తూ అశ్రద్ధగా నడిపితే ఆ వాహనం అతి తొందరలోనే శిధిలమైపోతుంది.

అదేవిధంగా మానవ జీవితం కూడా ప్రకృతిని, ఋతువులను అనుసరించి ఆహార నియమాలను పాటిస్తూ ప్రాణ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను అనుసరిస్తూ ఉంటే నిండు నూరేళ్ళపాటు హాయిగా సాగిపోతుంది. అలాకాకుండా విరుద్ధమైన ఆహార సేవనంతో విపరీతమైన దురలవాట్లతో, అహంకారంతో అహంభావం తో జీవించడం అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తిజీవనం అకాల మృత్యువుకు ఆహుతి అవుతుంది. మనిషి ఆయు: పరిమాణానికి ఖచ్చితమైన లెక్కలే వుంటే ఆయువును కాపాడటానికి మందులు, పూజలు, యాగాలు, చట్టాలు, కోర్టుల అవసరమే వుండదు. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసైనా అకాల మృత్యువును తప్పించుకొని, సకాల మృత్యువు కలిగేవరకూ ఆరోగ్యం కాపాడుకోవటమే మనిషి ధర్మం, అదే జీవన మర్మం.

Wednesday, 24 September 2014

తెలుగులోనే మాట్లాడండి..

తెలుగు భాష లోనే మాట్లాడదాం, తెలుగు  భాషని నిర్లక్ష్యం చెయ్యొద్దు, బాగా అవసరం అనుకుంటేనే తప్ప ఇతర భాషల్లొ మాట్లాడవద్దు. మనకు తెలుగు వచ్చని గొప్పగా చెప్పుకుందాం. తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదిద్దాం.

Tuesday, 23 September 2014

లావాటి వారిని సన్నగా - సన్నటి వారిని లావుగా చేసే ఆవుపాలు

దేశవాళి ఆవుపాలు తాగగలిగినన్ని తృప్తిగా రోజూ రెండు లేదా మూడు సార్లు తాగుతుంటే ఏనుగులాగా అతి లావుగా తయారైనవారు క్రమ క్రమంగా చర్మం వ్రేలాడబడకుండా గట్టిపడుతూ సన్నగా నాజూకుగా తయారౌతారు.
అలాగే ఇదేవిధంగా ఆవుపాలు తాగుతునంటే సన్నగా బక్కపలుచగా కృశించివున్నవారు క్రమ క్రమంగా సర్వాంగ సుందరాంగులుగా తీర్చిదిద్దబడతారు.

దురదృష్టం ఏమిటంటే దేశవాళీ గోజాతి అంతరించిపోతుంది. వాటిని చంపి విందుల్లో వినియోగించుకుంటున్నారు.
దేశవాళీ ఆవు పాలు దొరికిన వారు, ఆవు పాలు వేడి అని కొందరు, పలుచగా వుంటాయని కొందరు దురదృష్టవంతులు ఆవుపాలను దూరం చేసుకుని అనారోగ్యానికి దగ్గరౌతున్నారు.

దేశవాళి ఆవుపాలు దొరికిన వారు అదృష్టవంతులు. దయచేసి నిస్సంకోచంగా ఆవుపాలు దొరకటం అదృష్టంగా భావించి తీసుకోండి.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ ; భారతదేశంలో జన్మించడం నా అదృష్టం. 

పెళ్ళిలో మూడే ముళ్లు ఎందుకు వేయాలి ?

ప్రాచీనులు 'మూడు' అనే అంకెకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.
సృష్టి, స్థితి, లయలు మూడు.
ఆధి దైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికశాంతులు మూడు.
యాగానికి కావలసిన అగ్నులు మూడు.
ఆకు, వక్క, సున్నం ఈ మూడూ తాంబూలంకు ముఖ్యం.
యజ్ఞోపవీతంలోని పోగులు మూడు.
ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు.
బ్రహ్మ సూత్రంలోని ముడులు మూడు.
ధర్మ, అర్థ, కామ అనే మూడింటితో మోక్షాన్ని పొందటానికి.
అలాగే మంగలసూత్రపు  పేటలు మూడు, ముడులు కూడా మూడు.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:

ప్రతీ వ్యక్తికీ మూడు శరీరాలుంటాయి : స్థూల - సూక్ష్మ - కారణ శరీరాలు.

మాంసం, రక్తం, ఎముకలు - వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే.( ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాని ద్వారా)

శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం. జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా? లేదా? అని సాక్షిభూతంగా పరమాత్మ చూసే శరీరం కూడా ఇదే.


పూర్వ జన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం  పుట్టిందో అది కారణ శరీరం. రోగాలూ, నొప్పులూ, బాధలూ, మానసిక శాంతీ, ఆధ్యాత్మిక చింతనా ఏది వచ్చినా అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్నా, కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలా మంది పుత్రులు తల్లిదండ్రులలాగ ఉండకపోవడానికి ప్రత్యక్షసాక్ష్యం కారణ శరీరం .

ఇలా మూడు శరీరాలకు మూడు ముడులు వేస్తాడు వరుడు.
భర్త మరణించిన పిమ్మట కూడా భార్య, ఆమె భర్త పేరుని చెప్పమంటే పోయిన వాని పేరే చెప్తుంది. ఎందువల్ల? భర్త స్థూల శరీరమే పోయింది. మంగల సూత్రాన్ని ఆయన ఆ మిగిలిన రెండు శరీరాలకీ కూడా ముడి వేసాడు కాబట్టి.

అలాగే భార్యా భర్తలు మూడు ముళ్ళ సారాంశం తెలుసుకుని, చిన్ని చిన్ని కలహాలు, అర్థంలేని అపోహలతో వివాహ జీవితాన్ని ఆదిలోనే తుంచుకోకుండా, తమది జన్మ జన్మల బంధం అని తెలుసుకుంటే ఈ అపోహలు, కలహాలు వారిని మరింత దగ్గరచేసే వాహకాలని తెలుసుకుని  వారి బంధం  ఇంకా బలంగా చేసుకోగలుగుతారు.

ఇప్పుడు చేసే సత్కార్యాల ద్వారా తరువాత జన్మల్లో ఉత్తమంగా ఉండగలుగుతారు. ఇలా ఒకరికొరు సహాయపడి జన్మను సార్ధకం చేసుకోవాలని వివాహ బంధం తెలియచేస్తుంది.

పెళ్ళి అంటే ఏదో అవసరానికో, సమాజం కోసమో, లేదా చేసుకోవాలి కాబట్టే చేసుకోవటమో అనుకుని చేసుకుంటే వారి జీవితం వ్యర్ధం. పెళ్ళి పరమార్ధం తెలుసుకుంటే జీవితకాలం ఒకరు లేకపోయినా మరొకరు ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మిగతా రెండు శరీరాలతో బంధం అలాగే ఉంటుంది కాబట్టి.











Sunday, 21 September 2014

దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో అర్ధం ఏమిటి?

దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో ఎంతో అంతరార్ధం వుంది. బాహ్యసమాజంలో ఎదురయ్యే దుష్టులకు దూరంగా ఉన్నంత మాత్రాన మనం బాగుపడలేమని, మన మనసులో ఉన్న కామ, క్రోధ , లోభ, మోహ , మద,మత్సర్యాలనే అసలైన దుష్టులకు దూరంగా ఉన్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సుఖశాంతులతో జీవించగలుగుతామని జాగరూకులమై ఉండాలి. 

మానసిక విషాలే మానవరోగాలకు మూలకారణం

మానసిక విషాలే మానవరోగాలకు మూలకారణం. అంటే, రోగమున్న ప్రతిమనిషి మనసులో ఏదో ఒక విషం విరజిమ్ముతుంది అని మనం తెలుసుకోవాలి. మందులతో రోగాలు తగ్గుతాయి అనే భ్రమ నుండి బయటపడి, మనసులో విషాలు లేకుండా చేసుకోవడమే అసలైన ఔషధమని ప్రతిక్షణము గుర్తుచేసుకుంటూ మానవతా మార్గంలో ప్రయాణం చేయాలి.

రేచీకటికి వంటాముదం

రోజూ రెండు పూటలా తలకు మంచి వంటాముదం బాగా మర్ధిస్తుంటే రేచీకటి 21 రోజుల్లో తగ్గిపోతుంది.

చర్మం పై వచ్చిన కురుపులకు - కలబంద, పసుపు

కలబంద గుజ్జు, పసుపు కలిపి మెత్తగానూరి పూస్తుంటే చరంపై వచ్చిన కురుపులు మానిపోతయ్.

దీర్ఘకాల మొలల సమస్యకు - ఉల్లిగడ్డ యోగం :

సంవత్సరాల నుండీ ఆర్శమొలలతో బాధపడేవారు ఇప్పటికైనా అసలైన  ఔషధాలు ఆహార రూపంలోనే ఉన్నాయని తెలుసుకోవాలి.
ఉల్లిగడ్డలు దంచి పిండి తీసిన రసం 20 గ్రాములు, పంచదార 10 గ్రాములు, కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి ఆహారనికి గంటముందు ఒకసారి రెండుపూటలా సేవించాలి. ఆహారం లో పలుచని తీయని మజ్జిగని బాగా వాడాలి, దుంపలు, మాంసాహారాలు ఇంకా మీ శరీర తత్వానికి పడని మరియు అరగని పదార్ధాలు మానుకోవాలి. అతి సునాయాసంగా మూడు నాలుగు వారల్లోనే ఎంతో కాలం నుండీ వేధించే మొలల సమస్య నిర్మూలనమౌతుంది.

Wednesday, 3 September 2014

కోపంతో, దుఖంతో భుజిస్తే కొంపలారిపోతాయ్:

మానవ శరీరంలో గొంతువద్ద విశుద్ధ చక్రం, అక్కడే ' థైరాయిడ్ ' అని పిలవబడే గ్రంధి కూడా నిర్మాణమై ఉన్నయ్. దానికి పైన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం, దానివద్దే ' పిట్యూటరీ గ్లాండ్ ' కూడా ఏర్పాటై ఉన్నయ్ . ఈ రెండు గ్రంధులు మెదడుతో అనుసంధానమై నాడీ సంబంధం కలిగివున్నయ్. ఎప్పుడైతే మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనబడే చెడు సంకల్పాలు పుడతాయో ఆ మరుక్షణమే ఆ దుష్ట సంకల్పాల నుండి ఉత్పన్నమయ్యే విష రసాయనాల ప్రభావం పిట్యూటరీ మరియు థైరాయిడ్ గ్రంధులపైన పడి వాటి  సహజ శక్తిని నశింపజేసి ఆ గ్రంధులను బలహీనపరుస్తుంది.
ఫ్యాన్ రెగులేటర్ సాయంతో ఎక్కువ తక్కువలుగా అవసరమయ్యే విధంగా ఎలా పని చేస్తుందో అదేవిధంగా మానవశరీరంలో జీవాణువుల రసాయనిక మార్పులకు, శారీరక ఎదుగుదలకు ఈ థైరాయిడ్ గ్రంధి రెగ్యులేటర్ అనబడే ఒక క్రమబద్ధ యంత్రంలాగా పని చేస్తుంటుంది.
థైరాయిడ్ గ్రంధిలో ఉత్పన్నమయ్యే జీవ రసాల ప్రభావంతోనే జీర్ణ వ్యవస్థ, మూత్ర పిండాలు, మెదడువంటి అనేక అవయవాలు,ఇతర గ్రంధులు సక్రమంగా పని చేస్తుంటయ్. ఎప్పుడైతే కామం, క్రోధంవంటి మనో మాలిన్యాల విషప్రభావం థైరాయిడ్ గ్రంధి పై పడుతుందో మరుక్షణమే దానికనుసంధానమై ఉండే ఇతర అవయవాలపైన మిగతా గ్రంధుల పైన కూడా ఆ ప్రభావం పడి మనో వ్యాధులు, అతిస్థౌల్యం, గర్భాశయరోగాలు, మూత్రపిండరోగాల వంటి అనేక వ్యాధులు క్రమ క్రమంగా పుట్టుకొస్తుంటయ్.
కాబట్టి భోజనసమయంలో కోప తాపాలకుగురై పైన తెలిపినట్లు అన్ని రోగాలకు మూలమైన అజీర్ణాన్ని సృష్టించుకొని వ్యాధిగ్రస్థులుగా బ్రతకకూడదని మహర్షులు హితవుపలికారు. ఏ కారణం వల్లనైనా భోజన సమయానికి మనసు ఆవేశంతోనో, ఆందోళనతోనో ఉంటే భుజించటం ఆపివేసి మనసు ప్రశాంతమైన తరవాతే భుజించండి.

                                 మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

ముఖముపై ఉన్న నల్లమంగు, ఎర్ర మంగు మచ్చలకు :

మనో మాలిన్యాలు లేనివాళ్ళకు, శారీరక మాలిన్యాలు లేనివాళ్ళకు ముఖములో మచ్చలు రావు. వామ్ము 100 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు అన్ని పొడిచేసి, ఈ పొడిని రోజూ అరస్పూను తింటుంటే జీర్ణశక్తి బాగుపడి, రక్త శుద్ధి జరిగి ముఖ సౌందర్యం బాగుంటుంది.

లివర్ సమస్యలకు చింత పూవు :

లివర్ కు సంబంధించిన ఏ వ్యాధికైనా చింతపూవు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. చింతపూవు రసంగానీ, చింతపూవుతో కాచిన కషాయంగానీ సేవిస్తూవుంటే, లివర్ వ్యాధులన్నీ హరించిపోతయ్. లివర్ క్యాణ్సర్ కు కూడా సంజీవనిలా పనిచేస్తుంది.

గవద బిళ్ళలకు :

ఉడికించిన ఆలుగడ్డ ముక్కను పైన కడితే గవదబిళ్ళలు కరిగిపోతయ్.