గరిక రసాన్ని 20 గ్రాములు లోపలికి సేవిస్తుంటే రక్త విరేచనాలు , రక్త మొలలు , మూత్రంలో రక్తం పోవటం, నోటినుండి రక్తం పడటం వంటి రక్తపైత్య వికారాలు కూడా అణగిపోతయ్.
Monday, 24 March 2014
ముక్కు నుండి కారే రక్తానికి :
Published :
Monday, March 24, 2014
పిల్లలకు గానీ, పెద్దలకు గానీ దెబ్బ తగిలి లేదా అధిక పైతం చేసి ముక్కు బెదరి రక్తం కారుతుంటే వెంటనే గరికవేరును కడిగి దంచి రసంతీసి ఐదారు చుక్కలు రెండుముక్కులలో వేస్తే అప్పటికప్పుడే రక్తం కట్టుకుంటుంది.
చర్మరోగాలకు గరిక:
Published :
Monday, March 24, 2014
గరికగడ్డి, మంచి పసుపు (ఇంట్లో కొట్టుకున్నది) సమంగా కొంచెం నీరు కలిపి మెత్తగానూరి పైన రుద్దుతూవుంటే దురదలు, దద్దుర్లు, చర్మరోగాలు హరించిపోతయ్.
Garika gaddi, manchi pasupu (intlo kottukunnadi) samamgaa konchem neeru kalipi mettagaa nuuri paina ruddutuuvunte duradalu, daddurlu,charmaroogaalu harinchipotay.

మూత్రపిండరాళ్ళకు గరిక:
Published :
Monday, March 24, 2014
పరిశుభ్రమైన చోట పెరిగిన గరికను తెచ్చి కడిగి దంచి తీసిన రసం రెండు మూడు చెంచాల మోతాదుగా రెండు పూటలా సేవిస్తుంటే 20 రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపడిపోతయ్.
Sunday, 23 March 2014
ఏన్నో క్రూర రోగాలకు - తిప్పతీగ :
Published :
Sunday, March 23, 2014
రోజూ ఉదయం లేక సాయంత్రం ఆహారానికి అరగంట ముందు ఒక్క తిప్పతీగ ఆకును శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా నమిలితింటూ వుంటే 15 నుండీ 30 రోజుల్లో అధిక రక్తపోటు , కొలెస్త్రాల్, మధుమేహం, దగ్గు, ఉబ్బసం, పాతజ్వరాలు, చర్మం పై గుల్లలు, పుండ్లు, గాయాలు, అతికొవ్వు, మూత్రావయవాల్లో రాళ్ళు , మూత్రనాళంలో పుండు, లివర్ పెరుగుదల, ప్లీహాభివృద్ధి, సకల వాతనొప్పులు మొదలైన అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులోకివస్తయ్.
Wednesday, 19 March 2014
తులసి వున్న ఇంట్లోకి ఏ రోగమైనా ప్రవేశించగలదా?
Published :
Wednesday, March 19, 2014
" తులసి మొక్కల గాలి తగిలన చాలు
అంటు వ్యాధుల క్రిములన్ని అణగిపోవు,
సర్వవ్యాధి నివారణ శక్తి యున్న
తులసి ఇంటింట శుభములు కలుగజేయు ."
తులసి మొక్క మానవజాతి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి అందించిన అమూల్యమైన వరం. దీని గొప్పతనాన్ని చెప్పాలంటే గంటలు,రోజులు, నెలలు కూడా చాలవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులందరికి వచ్చే అన్ని రకాల జబ్బుల్ని అంటే కడుపునొప్పి నుంచీ క్యాణ్సర్ వరకు ఏ జబ్బులైనా అవలీలగా తగ్గించగల అద్భుతమైన ఔషధీ రాజం ఈ తులసి.
శ్రీకృష్ణుడు ఎల్లవేళల విహరించే బృఉందావనం - మరేదో కాదు తులసివనమే. ఆయన ఎల్లప్పుడూ తులసి మాలను ధరించి, తులసి తీర్ధం తాగుతూ, తులసీ వనంలో విహరించడంవల్ల అంతటి శక్తివంతుడు కాగలిగాడు.
తులసీ జలంధరుల కధ మీరు వినే ఉంటారు. ఆనాడు సమస్త లోకల్ని గడగడలాడించి తన ఔన్నత్యాన్ని నిరూపించుకున్న ఆ తులసీ మహా పతివతే, భూలోకంలో ఈ తులసిగా అవతరించి మనుషుల ఆరోగ్యాన్ని అంటు వ్యాధుల్ని తరిమి కొట్టీ, పాపాల నుంచి శాపాల నుంచి విముక్తుల్ని చేసి మనకు శానిని, సుఖాన్ని కలిగిస్తుంది అని మన పురాణాలు తెలుపుతున్నాయి.
అంతే కాదు ఈనాడు ప్రపంచంలోని అనేకమంది ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కూడా ఈ తులసి సర్వ వ్యాధుల్ని నివారించగల తిరుగులేని ఔషధం అని ఏకగ్రీవంగా తీర్మానించారు.
(ఇంకా వుంది )

Thursday, 13 March 2014
పిత్తాశయం ఏమి చేస్తుంది :
Published :
Thursday, March 13, 2014
పిత్తాశయం మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం.అది శరీరంలో ఉష్ణం ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా సమస్థితిలో ఉండేటట్లు చేస్తూ కాలేయానికి హానికలుగకుండా కాపాడుతుంటుంది. అంతటి ప్రధానమైన పిత్తాశయాన్ని చిన్న రాయి పుట్టిందనే కారణంతో తీసివేయాలనుకోవటం సరికాదు. ఒకవేళ పొరపాటుగానో గ్రహపాటుగానో దాన్ని తీసివేస్తే ఆతరువాత శరీరంలో ఉష్ణం అతిగా ప్రకోపించి కాలేయం బాగుచేయడానికి వీలులేని విధంగా దెబ్బతింటుంది.
మూత్ర నాళంలో రాళ్ళు అడ్డు పడితే:
Published :
Thursday, March 13, 2014
మూత్రపిండాలలోని రాళ్ళను కరిగించటానికి ఔషధాలు వాడినప్పుడు, ఆ రాళ్ళు మూక్కలై క్రిందికి జారి మూత్రనాళంలో అడ్డు పడి మూత్రం బిగుసుకు పోతుంది. దానివల్ల భరించలేని బాధ కలుగుతుంది.
అలాంటి విపత్తులో పెసలు 400 గ్రాములు తీసుకుని పప్పుగా వండి, అందులో రెండు లీటర్ల నీళ్ళు పోసుకొని పాత్రను దించి కదిలించి వుంచాలి. కొంతసేపటికి ఆ పాత్రలో పప్పు క్రిందికి దిగి పెసరకట్టు నీరులాగా పైకి తేలుతుంది.
పాత్రను మెల్లగా వంచి పై నీటిని వంచుకొని తాగుతూవుంటే మూత్రనాళంలో అడ్డుపడిన రాళ్ళు కరిగి మూత్రం ద్వారా బటకు వస్తయ్.

Wednesday, 12 March 2014
రక్తపోటుకు కారణాలు :
Published :
Wednesday, March 12, 2014
ఓం శ్రీ గురుభ్యోనమ:
ఈ ఆధునిక కాలంలో, మనం తినే ఆహారమంతా విష రసాయనాలతో కలుషితమైపోయింది. బియ్యం, ధాన్యాలు,కాయగూరలు, ఒకటేమిటి సమస్త ఆహారపదార్ధాలు తీవ్రమైన రసాయనిక ఎరువులతో పండించ బడటం వల్ల, ఆ విషాలన్నీ మన శరీరాల్లో పేరుకుపోయి, రక్తము, మాంసము, మేదస్సు మొదలైన సప్త ధాతువులన్నీ బలహీనమై, వ్యాధినిరోధక శక్తి క్షీణించిపోతుంది. ఎప్పుడైతే శరీరం క్షీణిస్తుందో, అప్పుడే బుద్ధి కూడా వక్రిస్తుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడిని కలిగించే రకరకాల వ్యాపారాలవల్ల ధన వ్యామోహం వల్ల, కుటుంబ కలహాల వల్ల, అసూయ,ద్వేషం, స్వార్ధం, అక్రమం ఇవన్నీ దైనందిన జీవీతంలో ప్రధాన భాగం అవటంవల్ల, మనసు తీవ్రమైన అందోళనకు గురి అవుతుంది.
ఈ విధంగా శరీరం, మనసు కలుషితం కావటం వల్ల రక్త ప్రసరణలో పెను మార్పులు జరిగి, అధిక రక్తపోటుకో, అల్ప రక్తపోటుకో దారితీస్తుంది.
ఎవరైనా గోఆధారిత వ్యవసాయం చేసి అటు మన గోజాతిని, మన తోటి వారిని రక్షిస్తారని ఆశిస్తున్నాను.

కేరేట్ :
Published :
Wednesday, March 12, 2014
పచ్చి కేరేట్ దంత క్షయాన్ని నివారించడమే కాక కేరేట్ రసం గుండే జబ్బులున్నవారికి వర ప్రసాదం, శిరోజాలు రాలకుండా, కంటి వ్యాధుల నివారణకు,వీర్యవృద్ధికి ఇదెంతో దోహదపడుతుంది.
Monday, 10 March 2014
మూత్రపిండ (kidney stones)రోగాలు ఎందుకు పెరిగిపోతున్నయ్ ?తప్పక తెలుసుకోవాలి...
Published :
Monday, March 10, 2014
గత కాలంలో అతి కొద్దిమందికి మాత్రమే ఏర్పడుతున్న ఈ సమస్య ఈనాడు లక్షలాది మందిని ఎందుకు పీడిస్తుంది?
పూర్వకాలం దాదాపు అందరూ దంతధవనానికి వేపపుల్ల, ఉత్తరేణివేరు వంటి సహజమార్గాలను అనుసరించేవారు. ఈ పుల్లలలోని ఔషధశక్తి గొంతులోకి దిగుతూ, ఎల్లవేళలా గొంతులోని విశుద్ధ చక్రస్థానంలో ఉన్న థైరాయిడ్ గ్రంధిని సమతౌల్యంగా కాపాడేది.
ఆ కారణంగా థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా వుంటూ, రోజూ తినే ఆహారంలోని సున్నాన్ని జీర్ణంచేస్తూ ఎములకు పుష్టినిస్తూవుండేది. ఆ కారణంగా సున్నం నిలువ వుండేది కాదు.
ఈ ఆధునికయుగంలో ఇంగ్లీష్ వారిని చూసి తెలుగు వాళ్ళు కూడా తమ తరతరాల అరోగ్యనిధి అయిన వేప, ఉత్తరేణి పుల్లలను విడిచిపెట్టి అనేక విషవికృత రసాయనాలతొ తయారైన పేస్టులను దంతదావనానికి వాడుతున్నారు. వీటి ప్రభావం వల్ల కొంత కాలానికి థైరాయిడ్ గ్రంధిలో లోపాలు ఏర్పడి, అది ఆహారంలోని సున్నాన్ని జీర్ణింపచేయలేని స్థితికి చేరుకుంటుంది.
రోజు కొద్దికొద్దిగా మిగిలిపోయే సున్నం క్రమక్రమంగా మూత్రపిండాలలో పేరుకుపోతూ రాళ్ళుగా మారుతుంది. ఈ సమస్య భవిష్యత్తులో అయినా సమూలంగా నిర్మూలించాలంటే మనమంతా దంతదావనానికి సాంప్రదాయ పద్ధతులను ఆచరించాలని నా ప్రియ స్నేహితులను కోరుకుంటున్నాను.

పళ్ళు, చిగుళ్ళ నుండి రక్తం కారుతూ నోరు వాసన వస్తుంటే:
Published :
Monday, March 10, 2014
కొంతమందికి పండ్లు తినేటప్పుడు, అన్నంగానీ, మరేదైన తినేటప్పుడు, ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా, పండ్లు చిగుళ్ళ నుండి చీము,నెత్తురు కారుతూ నోరంతా గబ్బుకొడుతూ వుంటుంది.
ఎందుకని : అన్నవాహికలో క్రిమిదోషమ్వల్ల గానీ, మేహఉడుకువల్లగానీ, విషరసాయనాలతో కూడిన పేస్టులను అధికంగా వాడటంతో దంతక్షయం కావటం వల్లగానీ ఈ సమస్య వస్తుంది.
పరిష్కారం : నీరుల్లిగడ్డను అతి మెత్తనిగుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి. లోపల బయటబాగాల్లో కూడా రుద్దాలి. రుద్ధిన తరువాత అరగంట ఆగి గోరువెచ్చని నీటితో పండ్లు కడగాలి. ఇలా వారం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి వేధించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళీ కనిపించకుండా పోతుంది.

మూత్రవ్యాధులకు : నీరుల్లిగడ్డ (Onion)
Published :
Monday, March 10, 2014
రోజూ మజ్జిగన్నంలో ఒక నీరుల్లిగడ్డ తినేవారికి జీవితంలో ఎప్పటికీ మూత్రవ్యాధులు రాబోవు.
అతిసారం :
Published :
Monday, March 10, 2014
1. పలుచగా కాచిన బియ్యపు గంజిలో దోరగావేయించి దంచిన జిలకర్రపొడిని పావుచెంచా,సైంధవలవణం అరచెంచా కలిపి తాగుతూ వున్నా అతిసారం ఆగిపోతుంది.
2. దానిమ్మ పండు పైతొక్కు తీసి 20 గ్రాములు మోతాదులో ఒక గ్లాస్ నీటితో నలగ్గొట్టీ వేసి,కప్పుకషాయానికి మరిగించాలి. వడపోసి,చల్లర్చి తాగితే అతిసారం హరిస్తుంది.
3. ఒక గ్ర్లాసు నీటిలో ఒక జామాకు వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి, చల్లార్చి సేవిస్తూ ఉంటే అతిసారం అతి త్వరగా తగ్గిపోతుంది.
4. బార్లీ గింజలతో పలుచగా జావకాచి అంద్లో ఒకచెంచా చక్కెర, రెండు చెంచాల నిమ్మరసం కలిపి తాగుతుంటే అతిసారం ఆగిపోతుంది.

ప్లీహ(Spleen)రోగం
Published :
Monday, March 10, 2014
1. తులసి రసం రెండు చెంచాల మోతాదుగా రెండుపూటలా త్రాగుతుంటే ప్లీహరోగం కుదురుతుంది.
2. కలబంద రసం (లోపల గుజ్జు) 10 గ్రాములు,మంచి పసుపు 5 గ్రాములు కలిపి సేవిస్తూ ఉంటే ప్లీహరోగం పరిసమాప్తం.

మర్రి ఊడలు : ఉబ్బురోగం
Published :
Monday, March 10, 2014
మర్రి ఊడలు నూరి వంటికి లేపనం చేస్తుంటే వళ్ళంతా వాచిన ఉబ్బురోగం హరించిపోతుంది.
Sunday, 9 March 2014
ముఖ పక్షవాతానికి :
Published :
Sunday, March 09, 2014
వెల్లుల్లిపాయ రెబ్బల్ని వాటికి రెందింతలు నువ్వులనూనె కలిపి మెత్తగా దంచి నూరి ఆ ముద్దను నిలువ చేసుకోవాలి. దీనిని ఉదయం, సాయంత్రం వేళల్లో భోజనం తరువాత 3 గ్రాములు మోతాదుగా తింటూ వుంటే, గాలి దెబ్బకు మేఘాలు ఎలా చెల్లా చెదరైపోతాయో అలగే ముఖానికి ఆవరించిన పక్షవాతం పారిపోతుంది.
ఆహారం నుంచి సప్తధాతువులు ఎలా తయారవుతాయి : Must know...
Published :
Sunday, March 09, 2014
మనం తినే ఆహారం అన్నశయంలోని జఠరాగ్ని చేత చక్కగా పచనము చేయ బడినదై, రసము, మలము అనెడి రెండు ప్రధాన విభాగాలుగా మారుతుంది. వీనిలో మొదటిదైన రసము అనే ధాతువు నుండి రక్తము, రక్తము నుండి మాంసము, మాంసము నుండి కొవ్వు, కొవ్వు నుండి ఎముక, ఎముక నుండి మజ్జ, మజ్జ నుండి వీర్యము, వీర్యము నుండి ఓజస్సు తేజస్సు గా రూపాంతరం చెందుతుంది. వీనినే సప్తధాతువులు అని పిలుస్తారు. ఈ ఏడు ధాతువుల నుండి ఉత్పన్నమయ్యే పోషక శక్తులు శరీరంలోని పంచేంద్రియాలను కాపాడే జీవద్రవ్యాలుగాను, శరీరంలోని కీళ్ళు వాటికి అనుసంధానంగా వుండే నరాలు మొదలైన సమస్త శారీరక అవయవాలను పోషించే పోషకద్రవ్యాలుగాను వినియోగపడుతుంటయ్.
ఇక పైన చెప్పిన రెండవ ప్రధాన విభాగమైన కిట్టము అను పేరుగల మలము వలన చెమట,మూత్రము, విసర్జింపబడే పురీషము అనెడు మలము, ముక్కులో పుట్టే మము, ముఖము మేద పుట్టే మలము, రోమ కూపాలనుండి పుట్టే మలము, తల వెంట్రుకలు, మీసము, గడ్డము, శరీఋఅముపైన రోమాలు, గోళ్ళు మొదలైన పదార్ధాలుగా రూపాంతరాలు చెందుతూ ఆయా భాగాలను పోషిస్తూ వుంటుంది.
ఈ విధంగా ఆహారము వలననే పుట్టే రసము, కిట్టము అనే మౌలిక పదార్ధాల సమత్వం వలననే శరీరం ఎల్లవేళలా క్రమ పద్ధతిలో పోషింప బడుతూ, మానవులను సర్వాంగ సుందరులుగా, కాంతి మంతులుగా, బలవంతులుగా, సుఖజీవులుగా, శతాధిక ఆయుష్మంతులుగా తీర్చి దిద్దుతూ వుంటుంది.
ఇది ఎప్పుడు జరుగుతుంది:
మానవులు తమ జఠరాగ్ని శక్తిని అనుసరించి హితమైన ఆహార విధానాన్ని అనుసరించినప్పుడే పైన చెప్పింది సుసాధ్యమౌతుంది. అదే వేళా పాళా లేకుండా కనిపించిన ప్రతి పదార్ధం తింటూ జిహ్వచాపల్యానికి లొంగిపోతే పైన చెప్పిన, రసము, కిట్టము అనే మూల విభాగాలే దోషాలుగా మారి అటు ధాతువులను, ఇటు వివిధ మలాలను చెరచి శరీరాన్నే సర్వనాశనం చేస్తయ్.
ఇంత మహోపకారానికి మానవ జన్మ సాఫల్యానికి సహకరించే ఆహారాన్ని మనమంతా సరైన పద్ధతిలో తింటున్నామా?
వ్యవాయదారులకు : అసలు ఆహార పదార్ధాలనే విష రసాయనాలు వేయకుండా పెంచగలుగుతున్నామా ? ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

చెవిపోటుకు:
Published :
Sunday, March 09, 2014
1. వామును రసం తీసి వేడిచేసి గోరు వెచ్చగా చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది.
2. నేతిలో కర్పూరం కలిపి వెచ్చచేసి 2 చుక్కలు పోసిన పోటు తగ్గిపోతుంది.
3. సబ్జా చెట్టు ఆకురసం 2 చుక్కలు చెవిలో వేస్తే పోట్లు,కురుపులు తగ్గిపోతాయి.
4. తులసి ఆకుల రసం కొంచం వెచ్చచేసి 2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
5. రెండు, మూడు చుక్కలు తమలపాకు రసం చెవిలో వేస్తూవుంటే చెవినొప్పి తగ్గుతుంది.

Saturday, 8 March 2014
చెవిలో చీము :
Published :
Saturday, March 08, 2014
1. బీరాకు రసం 2 చుక్కలు రోజూ ఒక పూట చెవిలో వేస్తే పుండు, చీము కారుట నిలిచిపోతుంది.
2. వేపాకులు నీళ్ళలో వేసి మరిగించి బయటకు వచ్చే ఆవిరి చెవికి పట్టిన చీము,నొప్పి తగ్గిపోతుంది.
3. ఆవు పంచితము 2-4 చుక్కలు చెవిలో వేస్తే చీము, నొప్పి తగ్గుతుంది.
4. కొబ్బరి నూనెలో ఇంగువ వేసి కాచి 2 చుక్కలు చెవిలో వేస్తే చీము తగ్గుతుంది.
5. నీరుల్లి రసం కొంచము కాచి 2 చుక్కలు వేసిన చీము, నొప్పి తగ్గిపోతాయి.
6. మందార ఆకుల రసంలో మంచి నూనెను (నువ్వుల నూనె)చేర్చి నూనె మిగిలేటట్లు కాచి 2 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే చీము కారటం, చెడు వాసన తగ్గిపోతుంది.
7.దానిమ్మ పండు రసం వెచ్చచేసి వేస్తే 2 చుక్కలు పోటు, చేము, దురద తగ్గిపోతుంది.
8. చేమంతి ఆకురసం 2 చుక్కలు పండిన చీముకారటం, పోటు దురద తగ్గిపోతుంది.
మాత్రృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ .

తేలు కాటు వేస్తే:
Published :
Saturday, March 08, 2014
తేలు కుట్టిన చోట వెంటంటే కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి నూరిన ముద్దను వుంచితే, చప్పున బాధతగ్గిపోతుంది.
పార్శ్వపు తలనొప్పి :
Published :
Saturday, March 08, 2014
నెయ్యి, బెల్లము సమాన భాగలుగా కలుపుకొని రోజూ పూటకు ఐదు నుంచి పదిగ్రాములు చొప్పున తింటూ వుంటే, పార్శ్వపు తలనొప్పి శీఘ్రంగా తగ్గిపోతుంది.
లేదా
కుంకుడుకాయ నురుగును వెచ్చచేసి వడపోసి, గోరువెచ్చగా వుండగా, రెండు బొట్లు వేస్తే, వెంటనే పార్శ్వపు తలనొప్పి మాయమైపోతుంది.
మాత్రృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ .
లేదా
కుంకుడుకాయ నురుగును వెచ్చచేసి వడపోసి, గోరువెచ్చగా వుండగా, రెండు బొట్లు వేస్తే, వెంటనే పార్శ్వపు తలనొప్పి మాయమైపోతుంది.
మాత్రృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ .
తుమ్ములు ఆగకుండా వస్తుంటే:
Published :
Saturday, March 08, 2014
తుమ్ములు ఆగకుండా వెంట వెంటనే వస్తూవుంటే, కొత్తిమీరి గానీ, గంధం పొడిని గానీ వాసన చూస్తూ వుంటే వెంటనే తుమ్ములు ఆగింపోతాయ్.
అన్ని రోగాలకు - అసలు కారణం :
Published :
Saturday, March 08, 2014
ఈనాడు దాదాపు వైద్యులంతా రోగాలకు మూలమైన కారణాలకు చికిత్స చేయకుండ కేవలం రోగానికి మాత్రమే చికిత్స చేస్తున్నారు. అందుకే రోగాలు మళ్ళీ మళ్ళీ పుడుతూ దీర్ఘకాలిక వ్యాధులుగా రూపాంతరం చెందుతూ ప్రాణాలు తీస్తున్నయ్. ఆయుర్వేదం రోగాలకు గల కారణాలకు చికిత్స చేసి, రోగాలను సమూలంగా నిర్మూలించి నూరేళ్ళ ఆయుష్షును ప్రసాదిస్తుంది.
ఈనాడు మనల్ని బాధిస్తున్న వ్యాధులన్నీ మనంతినే రసాయనిక విష కలుషితమైన ఆహారం వల్ల,కాలుష్యమైన నీటి వల్ల, గాలి వల్లనే వస్తున్నయ్. ధనానికి దాసుడైన మానవుడు లాభాపేక్షతో రసాయనిక ఎరువుల్ని గుప్పిస్తూ, ఆహార పదార్ధాలను పండిస్తున్నాడు. ఆ ఆహారం ద్వారా మానవ శరీరాల్లోని అణువణువులో విషరసాయనాలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్నయ్. వాటి ప్రభావంతో శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి, చిన్న వయసులోనే రోగాలకు గురౌతుంది.
ఈ రోగాలు ఎన్ని ఔషధాలు వాడినా తగ్గవు. ఎందుకంటే శరీరంలో వున్న రసాయనాలు నానాటికీ పెరుగుతూ వుంటయ్. ఈ రసాయనాలను శరీరంనుండి బహిష్కరింప చేయకుండ, తామర తంపరులుగా ఔషధాలు వాడుతూ పోతే ప్రయోజనం శూన్యం. రోగాలు ఇంకా పెరగటం తప్ప తగ్గే అవకాశమే వుండదు.
ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి పూర్వకాలం వాడిన సాంప్రదాయక ఎరువుల్ని, మొక్కల్ని, వేప, కానుగ చెట్ల ఆకుల్ని ఉపయోగించటం మొదలుపెట్టాలి. లేకపోతే ఈ విష రసాయనాల ప్రభావం వల్ల ఈ తరం వాల్లే కాక, భావితరాలు కూడా వ్యాధిగ్రస్తులు కాకతప్పదు.

ఎర్ర వెంట్రుకలు నల్లగా మారుటకు :
Published :
Saturday, March 08, 2014
వెంట్రుకలు ఎందుకు ఎర్రబడతాయి:
శరీరంలో వాతము, పిత్తము మొదలైన దోషాలు ప్రకోపం చెందటం వల్ల, తలమీద వెంట్రకలు ఎరుపు రంగులో మారుతాయి. దీన్ని ఛాయా రోగం అంటారు.
ఏమి చెయ్యాలి :
నిమ్మపండ్ల రసం, నువ్వుల నూనె సమంగా కలిపి, నిమ్మరసం అంతా నువ్వులనునె లో ఇగిరేవరకూ సన్నటి మంట మీద మరిగించాలి, తరువాత వడపోసుకొని, ఆ తైలాన్ని ప్రతిరోజూ రాగి(ఎర్ర)వెంట్రుకలకు మర్ధనా చేస్తూ వుంటే, క్రమంగా వెంట్రుకల ఎరుపురంగు హరించి సహజమైన నలుపురంగు కలుగుతుంది.

Friday, 7 March 2014
కాళ్ళు చేతులు వణికేవారికి :
Published :
Friday, March 07, 2014
1. తేనీరు (టీ) తాగుతూ వుంటే క్రమంగా వణుకు రోగం తగ్గిపోతుంది .
2. వెల్లుల్లిపాయల్ని తమ ఆహారంలో వాడుతూవున్నా వణుకు తాగ్గుతుంది.

ఆయుర్వేదమంటే చిట్కా వైద్యమా/నాటుమందా/మతపరమైన వైద్యశాస్త్రమా?
Published :
Friday, March 07, 2014
ప్రాచీన భారతదేశంలో జనించిన వైద్యశాస్త్రమే ఆయుర్వేదము. ఆయుర్వేదము కేవలము వైద్యశాస్త్రాన్ని కాక, సంపూర్ణ జీవన విధానాన్ని వివరించింది. ఆయువు అంటే జీవితము, వేదము అంటే విజ్ణానము.ఆయుర్వేదము అంటే ఆయువుకు సంబంధించిన విజ్ణానము అని అర్ధము. ఒక మతపరమైన వైద్యశాస్త్రంగా లేదా వంశపారంపర్యంగా వచ్చే వైద్యశాస్త్రంగా పరిగణించబడుతుంది. కొందరు ఆయుర్వేదాన్ని చిట్కావైద్యంగా లేదా మూఢ నమ్మకాల వైద్యంగా పరిగణిస్తుంటారు. ప్రాచీన ఆయుర్వేదంలో ఆధునిక జీవాణు శాస్త్రం ఇమిడి ఉంది అనే సత్యాన్ని ఆధునిక సమాజానికి చెందినవారు అంత తేలిగ్గా అంగీకరించరు.
పరమాత్మ మానవునికి కావాల్సినవన్నీ ముందే సృష్టించి తరవాత మానవుని సృష్టించారు. అందువలన ఏ కాలానికి అవసరమైన పండ్లు, కూరగాయలు ఇంకా ఆయా కాలాల్లో ఏ రోగాలు వస్తాయో వాటి నిర్మూలనకు అవసరమైన ఆరోగ్యసంబంధమైన మొక్కలను కూడా పుట్టిస్తున్నాడు. పుడమి తల్లి ప్రతికాలంలోనూ మనకు కావలసినవన్నీ మనకు అందిస్తుంటే మనం ఏ కాలంలోనైనా లబించేటట్లుగా పండ్లు, కూరగాయలు పుట్టిస్తున్నారు . అది ఎంత ప్రమాదకరం. వేడి చేసిననపుడు ఇంకా ఆవకాయ తింటే ఎలా ఉంటుందో ఆలోచించండి..
అలాగే మన శరీరంలో మూడు రకాల దోషాలుంటాయి( వాత, పిత్త, కఫ దోషాలు ), (సత్వ,రజో,తమో గుణాలకు ),(అకార, ఉకార,మకారం). మనం తినే ఆహారం బట్టీ మన వ్యక్తిత్వం వుంటుంది. ఈ దోషాలు సమానంగా వున్నంత వరకు మనకు ఏ రకమైన అనారోగ్యాలు రావు. ఎప్పుడైతే ఈ దోషాలు అసమానమౌతాయో ఆయా దోష సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు కఫ దోషం ఎక్కువైందనుకుంటే, జలుబు, దగ్గు, తల పట్టటం లాంటి వ్యాధులు వస్తాయి..ఈ కఫం ఎక్కువై జఠరాగ్నికి భంగం కలిగిస్తుంది. దీని వలన ఆకలి తగ్గి ఆహారం తినబుద్ధి కాదు సరిగా. వాతం ఎక్కువైతే కీళ్ళనొప్పులు, కాళ్ళుపీకులు ఇంకా చాలా రకాల వ్యాధులున్నై.వీటి గురించి ఇంకొక సారి చెప్పుకుందాము.
మన శరీరం బాగుండాలి అంటే ఎలాంటి సమయంలో ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుసుకుంటే చాలు. నిజం చెప్పాలంటే, మన ఆరోగ్యమంతా మన పెరటి మొక్కల్లో,వంటగదిలోనే వుంది.. మన మహాఋషులు ఈ విషయాన్ని ముందే గ్రహించి రోజూ తినే ఆహారంలో ఏమేమి వాడాలో ముందే పరిశొధనలు జరిపి నిర్ణయించారు. రోజూ 10 తులసాకులు తింటే అనారోగ్యానికి దూరంగా వుండొచ్చు అనే అద్భుతమమైన విషయాన్ని ముందే గ్రహించి తులసిని మనం పూజంచే దేవతగా చూపించారు.కొబ్బరి చిన్నముక్క రోజుకు తింటే శరీరానికి చాలా మంచిది, ఈ విషయం మనకు చెప్తే చేస్తామో,చెయ్యమో అని దేవాలయం లో ప్రసాదంగా ఆచారంలో పెట్టారు..ఇలాంటి ఎన్నో మంచి విషయాలు వున్నాయి.... (to be continued..)

Wednesday, 5 March 2014
ఉల్లి(Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదని ఎందుకన్నారు ?
Published :
Wednesday, March 05, 2014
ఈ సామెత ఎందుకు పుట్టిందంటే, ప్రతి రోజూ నీరుల్లిపాయల్ని తింటూవుంటే వైద్యుడితో అవసరమే ఉండదు.ఎందుకంటే మన శరీరానికి ఎంతో అవసరమైన అల్యూమినియం నీరుల్లిలో పుష్కలంగా వుంది.ఇది నిత్యం వాడుతూ వుంటే శరీరంలో క్రిములన్నీ హరించి అమితమైన బలం చేకూరుతుంది. ఈ వాస్తవాన్ని మన పూర్వీకులైన ఆయుర్వేద వైద్య శాస్త్రవేత్తలు ఆనాడే కనుక్కున్నారు. కాబట్టీ ఈ నీరుల్లిని క్రమం తప్పకుండా ఆహార పదార్ధాల్లో వాడే అలవాటును మనకు నేర్పారు. అంతే కాదు ' ఉల్లి, కన్న తల్లికన్నా గొప్పదని ప్రశంసించారంటే ఉల్లిలో ఎన్ని రకాల ఔషధ గుణాలున్నయ్యో మనం అర్ధం చేసుకోవాలి. నిత్య జీవితంలో ఉల్లిని తప్పకుండ వాడటం అలవాటు చేసుకోవాలి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
- నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నా గురువు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్ధన :
Tuesday, 4 March 2014
అతి విరేచనాలకు : నిమ్మ గింజలు
Published :
Tuesday, March 04, 2014
నిమ్మకాయలోని గింజలని నీళ్ళతో మెత్తగా నూరి, ఆ గంధాన్ని బొడ్డులోను, బొడ్డు చుట్టూ పట్టించండి. క్షణాల్లో అతి విరేచనాలు బంద్.
వెంట్రుకలు వూడిపోతున్నాయా?
Published :
Tuesday, March 04, 2014
మినుములు, మెంతులు సమానంగా మెత్తగా రుబ్బి, ఆ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట తరువార కుంకుళ్ళతో స్నానం చేయాలి.
మొటిమలకు :
Published :
Tuesday, March 04, 2014
వాము,పెరుగు సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి పట్టిస్తుంటే చాలు. మొటిమలు,మచ్చలు పోతాయ్.
రాత్రి రాగి చెంబులో మంచినీళ్ళు వుంచి పరగడుపునే తాగితే వందేళ్ళు హాయిగా జీవించవచ్చు:
Published :
Tuesday, March 04, 2014
రాత్రి నిద్రబోయే ముందు రాగి చెంబు నిండా మంచి నీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేచిలేవగానే వెంటనే ఆ రాగి చెంబ్లోని నీళ్ళు తాగాలి. దీనివల్ల 15 నిముషాల నుంచి అరగంటలోపు సుఖ విరేచనం అవుతుంది. గ్యాస్ , కడుపుబ్బరము, కడుపుమంట, మలబద్ధకం, తేపులు , మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో , ఔషధాలు వాడే పని లేకుండ పూర్తిగా తగ్గిపోతయ్. మలబద్ధకం అనే ఇబ్బంది అన్ని వ్యాధుల్ని కలిగించటానికి మూల కారణం కాబట్టి, ఈ అలవాటుతో మలబద్ధకాన్ని నివారించుకుంటే, వందేళ్ళ వరకు ఏ జబ్బులకి గురి కాకుండా హాయిగా ఆనందంగా జీవించవచ్చు.
Monday, 3 March 2014
రక్తం కారే మొలలకు : కానుగ ఆకులు
Published :
Monday, March 03, 2014
కానుగ లేత ఆకుల్ని మెత్తగా నూరి రక్తం కారే మొలలకు కడితే కొద్దిరోజుల్లోనే రక్త మొలల వ్యాధి పూర్తిగా హరించిపోతుంది.
అతి బహిష్టు :ధనియాల కషాయం
Published :
Monday, March 03, 2014
ధనియాలతో కషాయం కాచుకొని తాగుతూ వుంటే అతి బహిష్టు వ్యాధులు హరించిపోతయ్.
పడని తిండ్లు తింటే అనర్ధమే:
Published :
Monday, March 03, 2014
మనం తినే ఆహార పదార్ధాల్లో, ఏ పదార్ధానికి ఏ గుణముందో, ఏ ఏ పదార్ధాలు ఏ ఋతువుల్లో తినాలో, ఏ పదార్ధాలు కలిపి తినకూడదో, అనే ఆహార విజ్ణానం చాలా మందికి తెలియదు. మన చదువుల్లో ఆహార విజ్ణానం లోపించటం వల్ల, మనమందరం తెలిసో తెలియకో, విరుద్ధమైన ఆహార పదార్ధాల్ని వాడుతూ, చేజేతులా మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాము.
ఒకదానికొకటి పడని పదార్ధాలని కలిపి తిండం వల్ల, కడుపులో అల్సర్లు, గడ్డలు, మేహరోగాలు,క్షయ, వాత రోగాలు, మూత్రాశయంలో రాళ్లు,కుష్టురోగం, భగంధరం, అతిసారం, స్పోటకము మొదలైన అనేక వికృతమైన రోగాలు కలుగుతయ్.వేరు వేరు ఆహార పదార్ధాల్ని కలిపి వాడేటప్పుడు, కొన్నింటిని సమానంగా కలిపి వాడితే, మరికొన్నింటిని ఎక్కువ తక్కువ తూకంగా కలిపి వాడితే ఆ ఆహారం విషంతో సమానమై వ్యాధుల్ని కలిగిస్తుంది. ఇంకా కొన్ని పదార్ధాలు, సమంగా కలిపినా, అసమంగా కలిపినా ఆ అహారం కూడా విషం గానే తయారవుతుంది. అంటే మనం తినే అహార పదార్ధాల్ పుట్టూకలోనే ఒక దానికొకటి పడని పదార్ధాలు వున్నాయని, ఆయా విరుద్ధ పదార్ధాల విజ్ణానాన్ని తెలుసుకొని వాడుకుంటే, మనకు ఎలాంటి అనారోగ్యం వుండదు.

అన్ని రకాల దగ్గులకు :
Published :
Monday, March 03, 2014
శొంఠి, మిరియాల పొడి అరటిపండుతో అద్ది తింటూ వుంటే అన్ని రకాల దగ్గులు హరించిపోతయ్.
Sunday, 2 March 2014
టాన్సిల్స్ కు :చింతగింజ
Published :
Sunday, March 02, 2014
నీటితో సాదిన చింతగింజ గంధాన్ని రాస్తుంటే టాన్సిల్స్ క్రమంగా హరించిపోతయ్ .
టాన్సిల్స్ కు : అల్లం
Published :
Sunday, March 02, 2014
అల్లం ముక్కను కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే ఆశ్చర్యకరంగా టాన్సిల్స్ కరిగిపోతయ్
Saturday, 1 March 2014
మూర్చకు సీతాఫలం ఆకు :
Published :
Saturday, March 01, 2014
సీతాఫలం ఆకు నలిపి వాసన చూపితే మూర్చనుండి వెంటనే తేరుకుంటారు .
తెలివితప్పిపడిన వారికి:
Published :
Saturday, March 01, 2014
తెలివితప్పిపడిన వారికి ముక్కుల్లో 3 చుక్కలు అల్లం రసం లేదా 3 చుక్కల కుంకుడురసం వేస్తే తెలివివస్తుంది
Subscribe to:
Posts (Atom)
About Me
Categories
- ఆడ వారికి (3)
- ఆనెలు (1)
- ఆయాసం (1)
- ఉదర వ్యాధులు (1)
- ఉదరవ్యాధులు (1)
- ఉబ్బసం (1)
- ఉబ్బు వ్యాధులు (1)
- ఎముకలు విరిగిన సమస్యలు (1)
- కంటి సమస్యలు (6)
- కడుపు నెప్పి (2)
- కామెర్ల వ్యాధి (1)
- కాలిన గాయాలకు (2)
- కాలేయ (లివర్) సమస్యలకు (1)
- గవద బిళ్ళలు (1)
- గుండె జబ్బులకు (1)
- చర్మ వ్యాధులు (17)
- చిట్టిచిట్కాలు (2)
- చుండ్రుకు (2)
- చెవి సమస్యలు (5)
- జలుబు (3)
- జుట్టు సమస్యలు (11)
- జ్వరం (1)
- టాన్సిల్స్ కు : (2)
- తల నొప్పి (2)
- తెలుగు భాష తీపి (6)
- తెలుసుకుందాం (70)
- తెలుసుకుందాం.. (15)
- దగ్గు (3)
- దురదలు (2)
- దెబ్బలకు (1)
- నా అలోచనలకు రెక్కలొచ్చాయ్ (5)
- నా గురువు గారు.. (1)
- నిద్రలేమికి (1)
- నోటి దుర్గంధం / నోటి వ్యాధులు (6)
- పక్షవాతం: (1)
- పిల్లలకు (18)
- ప్లీహ వ్యాధులు (2)
- ఫాండురోగం (1)
- బహిష్టు సమస్యలు (3)
- బెణుకులు / నొప్పులు (1)
- మడిమశూలకు (1)
- మరిన్ని.. (2)
- మల బద్ధకం (2)
- మూత్ర / మూత్రపిండాల సమస్యలు (5)
- మొటిమలు (2)
- మొలలు (5)
- రామాయణ ప్రశ్నలు (1)
- రేచీకటి (1)
- వాంతులకు (2)
- విరేచనములు (6)
- వ్రణాలు / పుండ్లు (2)
Archive
-
▼
2014
(175)
-
▼
March
(40)
- రక్తపైత్య వికారాలకు గరిక :
- ముక్కు నుండి కారే రక్తానికి :
- చర్మరోగాలకు గరిక:
- మూత్రపిండరాళ్ళకు గరిక:
- ఏన్నో క్రూర రోగాలకు - తిప్పతీగ :
- తులసి వున్న ఇంట్లోకి ఏ రోగమైనా ప్రవేశించగలదా?
- పిత్తాశయం ఏమి చేస్తుంది :
- మూత్ర నాళంలో రాళ్ళు అడ్డు పడితే:
- రక్తపోటుకు కారణాలు :
- కేరేట్ :
- మూత్రపిండ (kidney stones)రోగాలు ఎందుకు పెరిగిపోతున...
- పళ్ళు, చిగుళ్ళ నుండి రక్తం కారుతూ నోరు వాసన వస్తుంటే:
- మూత్రవ్యాధులకు : నీరుల్లిగడ్డ (Onion)
- అతిసారం :
- ప్లీహ(Spleen)రోగం
- మర్రి ఊడలు : ఉబ్బురోగం
- ముఖ పక్షవాతానికి :
- ఆహారం నుంచి సప్తధాతువులు ఎలా తయారవుతాయి : Must kno...
- చెవిపోటుకు:
- చెవిలో చీము :
- తేలు కాటు వేస్తే:
- పార్శ్వపు తలనొప్పి :
- తుమ్ములు ఆగకుండా వస్తుంటే:
- అన్ని రోగాలకు - అసలు కారణం :
- ఎర్ర వెంట్రుకలు నల్లగా మారుటకు :
- కాళ్ళు చేతులు వణికేవారికి :
- ఆయుర్వేదమంటే చిట్కా వైద్యమా/నాటుమందా/మతపరమైన వైద్య...
- ఉల్లి(Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదని ఎందుకన్...
- అతి విరేచనాలకు : నిమ్మ గింజలు
- వెంట్రుకలు వూడిపోతున్నాయా?
- మొటిమలకు :
- రాత్రి రాగి చెంబులో మంచినీళ్ళు వుంచి పరగడుపునే తాగ...
- రక్తం కారే మొలలకు : కానుగ ఆకులు
- అతి బహిష్టు :ధనియాల కషాయం
- పడని తిండ్లు తింటే అనర్ధమే:
- అన్ని రకాల దగ్గులకు :
- టాన్సిల్స్ కు :చింతగింజ
- టాన్సిల్స్ కు : అల్లం
- మూర్చకు సీతాఫలం ఆకు :
- తెలివితప్పిపడిన వారికి:
-
▼
March
(40)