Showing posts with label బహిష్టు సమస్యలు. Show all posts
Showing posts with label బహిష్టు సమస్యలు. Show all posts

Friday, 25 October 2013

బహిష్టు నొప్పికి:

1. మిరియాలు, బెల్లం, నెయ్యి సమ భాగాలు కలిపి దంచి మాత్రలు (కుంకుడుకాయ పరిమాణం  కంటే కాస్త పెద్దగా)తయారు చేసి మూడు పూటలు బుగ్గను పెట్టుకుని చప్పరిస్తూ తింటుంటే మాత్ర అయిపోయేలోపు బహిష్టు నొప్పి తగ్గిపోతుంది.

2. ఎర్ర ఉత్తరేణి ఆకులు కొన్ని తీసుకొని కడిగి వాటిలో పంచదార కలిపి నమిలి మింగితే బహిష్టు నొప్పి ఐదు నిముషాల్లో పూర్తిగా తగ్గిపోతుంది.

పై రెండు యోగాలలో ఏది వీలుగా వుంటే అది ఆచరింఛండి.

Friday, 9 August 2013

స్త్రీల అతిఋతురక్తస్రావానికి(Over Bleeding):

1. బాగా మగ్గిన అరటిపండ్లు రెండు లేక మూడు తీసుకుని వాటిలో పేరిన నెయ్యి 30 గ్రాములు, చిన్న ఏలకుల పొడి 3 గ్రాములు కలిపి పిసికి ఉదయం,సాయంత్రం తింటుంటే అతి ఋతురక్తస్రావం రెండు మూడు రోజుల్లొ ఆగిపోతుంది
2. అతిమధురంపొడి 5 గ్రాములు, ఎండు ద్రాక్షపండ్లు 20 గ్రాములు కలిపి మెత్తగా దంచి రెండుపూటలా చప్పరించి తింటుంటే అతిఋతురక్తం క్రమంగా తగ్గి ఆగిపోతుంది.
3. పచ్చివక్కలపొడి 50 గ్రాములు, పిస్తా పప్పు 50 గ్రాములు, పటిక బెల్లం 30 గ్రాములు కలిపి మెత్తగా నూరి నిలవజెసుకోవాలి. పూటకు 10 గ్రాములు మోతాదుగా మూడుపూటలా సేవిస్తుంటే ఆగకుండా ప్రవహించే ఋతురక్తం ఆగిపోతుంది.

ఉసిరి కాయలతో స్త్రీల వ్యాధులకు స్వస్తి

స్త్రీల తెల్లబట్ట వ్యాధికి(white discharge) :
ఉసిరిక పండ్లలో(పెద్ద ఉసిరి) వుండే గింజలను దంచి పొడి చేసి సమంగా పటికబెల్లం పొడి కలిపి రెండు పూటలా పూటకు ఒక చెంచా మోతాదుగా మంచి నీటితో సేవిస్తుంటే తెల్లబట్ట వ్యాధి తగ్గిపోతుంది.

స్త్రీల ఎర్ర బట్ట వ్యాధికి(over bleeding):
ఉసిరక కాయల పొడి ఒక చెంచా, మంచి తేనె ఒక చెంచా కలిపి తింటూ వుంతే ఎర్రబట్ట వ్యాధి తగ్గిపోతుంది.