Thursday, 11 June 2015

చిట్టి చిట్కాలు :

1. ముల్లంగి దుంపను ఆహారంగా ఉపయోగించే వారికి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
2. సన్న జాజి ఆకులు నమిలి ఉమ్మి వేస్తుంటే నోటిపూత అతి త్వరగా తగ్గుతుంది.
3. ఉమ్మెత్తాకు పసరును పైన పట్టువేస్తుంటే కాలిన పుండ్లు నయమౌతాయి.
4. వేడి పాలలో పసుపు, మిరియాలపొడి కలిపి తాగితే జ్వరం, పడిశం హరిస్తాయి.
5. పత్తిగింజలు నీటితో నూరిన ముద్దను పైన వేసి కడితే గడ్డలు కరిగిపోతాయి.
6. గోధుమ పిండిని నీళ్ళతో కలిపి పైన పట్టువేస్తే కాలిన బొబ్బలు తగ్గిపొతాయి.
7. నాలుగు చుక్కలు కుంకుడుపులుసు ముక్కుల్లో వేస్తే కఫం పడి ఉబ్బసం శాంతిస్తుంది.



మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

0 comments:

Post a Comment