Showing posts with label మూత్ర / మూత్రపిండాల సమస్యలు. Show all posts
Showing posts with label మూత్ర / మూత్రపిండాల సమస్యలు. Show all posts

Saturday, 28 June 2014

అతి మూత్ర వ్యాధి :

ఎందుకు వస్తుంది: రాత్రిపూట ఎక్కువగా మేల్కోవటం వలన, బాగా చల్లగా వుండే ప్రాంతాల్లో ఎక్కువ కాలం నివసించటం వల్ల ఎక్కువసేపు ఏ.సి. గదుల్లోనే కాలం గడపటం వల్ల ఎక్కువగా మత్తు పానీయాలు సేవించటం వల్ల, ఈ వ్యాధి ఏర్పడుతుంది.

చికిత్స :
1. అలాగే ఎక్కువ విశ్రాంతిగా వుండకుండ శారీరక శ్రమ చేస్తుంటే, క్రమంగా ఈ వ్యాధి నివారించబడుతుంది.
2. నల్ల వులవకట్టును తయారు చేసుకొని ప్రతిరోజూ 1 ఔంసు ప్రమాణంలో తాగుతూవుంటే అతిమూత్రవ్యాధి తగ్గిపోతుంది.
3. మునగ ఆకు చిగుళ్ళతో ఆకు కూరగా తయారు చేసుకొని గానీ, లేక మునగకాయల కూర చేసుకొని గానీ తింటూవుంటే అతి మూత్ర వ్యాధి తగ్గిపోతుంది.

పధ్యం : 
అతి మూత్రవ్యాధి త్వరగా తగ్గాలంటే, బాగా చల్లగా వున్న పదార్ధాలు చలిలో తిరగటం, చన్నీటి స్నానాలు చేయటం మానుకోవాలి.
మజ్జిగ, పెరుగు, దోసకాయ, గుమ్మడికాయ, నిమ్మరసం ,కూల్ డ్రింక్స్, చల్లటి అన్నం, తీపి పదార్ధాలు, చల్లటి అన్నం మానివేయాలి. రాగి జావ, ఉలవ కషాయం వాడాలి. ఉదయం పూట కొద్ది దూరం నడుస్తూ వుండాలి. కొంచమైనా వ్యాయామం చేయాలి.

Monday, 24 March 2014

మూత్రపిండరాళ్ళకు గరిక:

పరిశుభ్రమైన చోట పెరిగిన గరికను తెచ్చి కడిగి దంచి తీసిన రసం రెండు మూడు చెంచాల మోతాదుగా రెండు పూటలా సేవిస్తుంటే 20 రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపడిపోతయ్.

Thursday, 13 March 2014

మూత్ర నాళంలో రాళ్ళు అడ్డు పడితే:

మూత్రపిండాలలోని రాళ్ళను కరిగించటానికి ఔషధాలు వాడినప్పుడు, ఆ రాళ్ళు మూక్కలై క్రిందికి జారి మూత్రనాళంలో అడ్డు పడి మూత్రం బిగుసుకు పోతుంది. దానివల్ల భరించలేని బాధ కలుగుతుంది.
అలాంటి విపత్తులో పెసలు 400 గ్రాములు తీసుకుని పప్పుగా వండి, అందులో రెండు లీటర్ల నీళ్ళు పోసుకొని పాత్రను దించి కదిలించి వుంచాలి. కొంతసేపటికి ఆ పాత్రలో పప్పు క్రిందికి దిగి పెసరకట్టు నీరులాగా పైకి తేలుతుంది.
పాత్రను మెల్లగా వంచి పై నీటిని వంచుకొని తాగుతూవుంటే మూత్రనాళంలో అడ్డుపడిన రాళ్ళు  కరిగి మూత్రం ద్వారా బటకు వస్తయ్.

Monday, 10 March 2014

మూత్రపిండ (kidney stones)రోగాలు ఎందుకు పెరిగిపోతున్నయ్ ?తప్పక తెలుసుకోవాలి...

గత కాలంలో అతి కొద్దిమందికి మాత్రమే ఏర్పడుతున్న ఈ సమస్య ఈనాడు లక్షలాది మందిని ఎందుకు పీడిస్తుంది?

పూర్వకాలం దాదాపు అందరూ దంతధవనానికి వేపపుల్ల, ఉత్తరేణివేరు వంటి సహజమార్గాలను అనుసరించేవారు. ఈ పుల్లలలోని ఔషధశక్తి గొంతులోకి దిగుతూ, ఎల్లవేళలా గొంతులోని విశుద్ధ చక్రస్థానంలో ఉన్న థైరాయిడ్ గ్రంధిని సమతౌల్యంగా కాపాడేది.

ఆ కారణంగా థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా వుంటూ, రోజూ తినే ఆహారంలోని సున్నాన్ని జీర్ణంచేస్తూ ఎములకు పుష్టినిస్తూవుండేది. ఆ కారణంగా సున్నం నిలువ వుండేది కాదు.

ఈ ఆధునికయుగంలో ఇంగ్లీష్ వారిని చూసి తెలుగు వాళ్ళు కూడా తమ తరతరాల  అరోగ్యనిధి అయిన వేప, ఉత్తరేణి పుల్లలను విడిచిపెట్టి అనేక విషవికృత రసాయనాలతొ తయారైన పేస్టులను దంతదావనానికి వాడుతున్నారు. వీటి ప్రభావం వల్ల కొంత కాలానికి థైరాయిడ్ గ్రంధిలో  లోపాలు ఏర్పడి, అది ఆహారంలోని సున్నాన్ని జీర్ణింపచేయలేని స్థితికి చేరుకుంటుంది.

రోజు కొద్దికొద్దిగా మిగిలిపోయే సున్నం క్రమక్రమంగా మూత్రపిండాలలో పేరుకుపోతూ రాళ్ళుగా మారుతుంది. ఈ సమస్య భవిష్యత్తులో అయినా సమూలంగా నిర్మూలించాలంటే మనమంతా దంతదావనానికి సాంప్రదాయ పద్ధతులను ఆచరించాలని నా ప్రియ స్నేహితులను కోరుకుంటున్నాను.

Wednesday, 11 September 2013

అతిమూత్ర వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలు:

అతిగా మూత్రంపోయే వ్యాధిగ్రస్తులకు ఆకలి, దప్పిక, శరీరతాపం, బలహీనత ఎక్కువగా వుంటాయి. ఆహారపు రుచి తెలియదు. మాటిమాటికి గొంతు ఎండిపోతుంటుంది. అధిక శాతం మందికి మూత్రం తియ్యగా వుండి విసర్జించినచోట చీమలు మూగుతయ్. ఈ లక్షనాలను బట్టీ అతిమూత్ర సమస్యను గుర్తించి ఈ క్రింది అహారమార్గాల ద్వారా నివారించుకోవచ్చు.

జీలకర్రతో జీవమైన యోగం:

జీలకర్రను కొంచం దోరగా వేయించి దంచి పొడిచేసి ఆ పొడితో సమంగా పాతబెల్లం లేదా తాటిబెల్లం కలిపి బాగా దంచి ఆ ముద్దను నిలువచేసుకోవాలి. రోజూ రెండూ పూటలా 10 గ్రాముల ముద్దను తింటూవుంటే, అతి మూత్రం అణగారిపోతుంది.

అల్లనేరేడు గింజలతో అద్భుత యోగం:

అల్లనేరేడుపండ్లు తిన్న తరవాత లోపలి గింజలను ఊసివేస్తుంటాం. కానీ ఆ గింజలు చాలా విలువైనవి. ఆ గింజలను దంచి జల్లించిన పొడి నిలువచేసుకోవాలి. రోజూ రెండు పూటలా పావుచెంచా నుండీ అరచెంచా వరకు ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తుంటే అతిమూత్రం హరించిపోతుంది.

ఉసిరిపండ్లతో ఉసిగొలిపే యోగం:

పచ్చి ఉసిరికపండ్లరసం 1 ఔంసు తీసుకుని అందులో తేనె రెండు చెంచాలు కలిపి రెండుపూటలా ఆహారానికి రెండు గంటలముందు సేవిస్తుంటే, కొద్దిరోజుల్లోనే అతిమూత్రం హరించిపోయి శరీరంలోని అన్ని అవయవాలకు అమితమైన శక్తి కలుగుతుంది.