Showing posts with label నోటి దుర్గంధం / నోటి వ్యాధులు. Show all posts
Showing posts with label నోటి దుర్గంధం / నోటి వ్యాధులు. Show all posts

Monday, 10 March 2014

పళ్ళు, చిగుళ్ళ నుండి రక్తం కారుతూ నోరు వాసన వస్తుంటే:

కొంతమందికి పండ్లు తినేటప్పుడు, అన్నంగానీ, మరేదైన తినేటప్పుడు, ఒక్కోసారి మాట్లాడేటప్పుడు కూడా, పండ్లు చిగుళ్ళ నుండి చీము,నెత్తురు కారుతూ నోరంతా గబ్బుకొడుతూ వుంటుంది.
ఎందుకని : అన్నవాహికలో క్రిమిదోషమ్వల్ల గానీ, మేహఉడుకువల్లగానీ, విషరసాయనాలతో కూడిన పేస్టులను అధికంగా వాడటంతో దంతక్షయం కావటం వల్లగానీ ఈ సమస్య వస్తుంది.
పరిష్కారం : నీరుల్లిగడ్డను అతి మెత్తనిగుజ్జుగా నూరి ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి. లోపల బయటబాగాల్లో కూడా రుద్దాలి. రుద్ధిన తరువాత అరగంట ఆగి గోరువెచ్చని నీటితో పండ్లు కడగాలి. ఇలా వారం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి వేధించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళీ కనిపించకుండా పోతుంది.

Tuesday, 7 January 2014

పిప్పి పంటి సమస్యకు :

ఆవాలపిండి, కల్లుప్పు సమభాగాలుగా తీసుకుని మెత్తగా మెత్తగాదంచి రోజూ రెండుపూటలా పళ్ళు తోముతూండాలి.

Friday, 1 November 2013

పిప్పి పన్ను/దంత పోటుకు - pippi pannu/danta potuku:

మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వార పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి/దవడనొప్పి తగ్గిపోతాయ్.

Manchi jilledu aakulu rendu, muudu teesukuni rendu chetulato nalipi oka garitalo rasam tiyyali. ee vaipu panti noppi vunnado aa vaipu chevilo 3 chukkalu poyyaali. daaniki mundu notilo kandi pappu leka sanaga pappu koncham vesukuni chevilo rasam posina taruvaata aa pappu namalatam valana rasam chevi randhram dvaaraa panti noppi vunna chotuku cherutundannamata. ilaa muudu rojulu chesesariki panti/davada noppi taggipotaay.

Saturday, 26 October 2013

పిప్పి పన్ను/దంత పోటుకు :

మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వారా  పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి/దవడనొప్పి తగ్గిపోతాయ్.

Tuesday, 22 October 2013

నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?చిట్కా...

వేళకు భుజించకుండా వేళతప్పి తినడంవల్ల, అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కుళ్ళిపోయి పొట్టలోనే కంపుకొడుతూ ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది. మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
అలాంటి వారు తమ తప్పులను తెలుసుకుని రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి, భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి. ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుంధభరితమౌతుంది.


Wednesday, 18 September 2013

చిగుళ్ళవాపుకు :

తులసి ఆకులు 10 గ్రాములు, సన్నజాజిఆకులు 6 గ్రాములు కలిపి నమిలి మింగుతూ వుంటే నాలుగైదు పూటల్లో చిగురువాపు, చిగురుపోటు, దంతాలపోట్లు తగ్గిపోతయ్. ఒక్కసారికే ఎంతో హాయిగా వుంటుంది..
ఆచరించి మీ అనుభవం తెలియజేయండి..