Thursday, 3 April 2014

వడదెబ్బ నుండి రక్షణ పొందుటకు:

నీటిలో చింతపండును బాగా పిసికివడపోసి తగినంత పంచదారకలిపి కొద్ది కొద్దిగా రెండుమూడు పూటలు తాగుతూవుంటే వడదెబ్బవలన కలిగిన నీరసం బలహీనత తగ్గిపోతయ్. ఎండాకాలంలో రోజూ కొద్దికొద్దిగా ఈ పానకం సేవించేవారు ఎండలో తిరిగినా కూడా వడదెబ్బ తగలదు.

3 comments:

  1. నమస్కారం సరస్వతి గారూ !నేను మీ బ్లాగు చూస్తూ ఉంటాను. నేను ఎనిమిది సంవత్సరాలుగా ఎక్జిమా తో బాధ పడుతున్నాను.అలోపతి ,హోమియాపతి,ఆయుర్వేదం ఏమి వాడినా , వాడుతూఉన్నంతవరకే,ఉపశమనం.మందు మానేస్తే మళ్లీ మొదటికొస్తుంది.ఆయుర్వేదం డాక్టరు గారి సలహా తో గత రెండు సంవత్సరాలుగా పూర్తి శాకాహారిగా ఉన్నాను.అయినా ప్రయోజనం లేదు .మంజిష్టాదికషాయం, ఎపిడెర్మ్ క్యాప్స్యూల్ వాడుతున్నాను!లివర్ లో దోషంఉందంటారు ఆయన. మీరు గరిక,పసుపు కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయని రాసింది చదివి ,దానిని వాడుతున్నాను.చాలా గుణం కనబడుతుంది .నాకు చాలా సంతోషంగా ఉంది .దీనితో పాటు లోపలికి తీసుకునే మందు ఏదైనా సూచించగలరని ఆశిస్తున్నాను .ఈ వ్యాధికి శాశ్వతంగా పరిష్కారం ఉంటుందంటారా?దయచేసి సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను .ధన్యవాదములు.

    ReplyDelete
  2. చాలా సంతోషమండి, తప్పకుండా చెప్తాను, ఏ సమస్యనైనా వేళ్ళతో సహా తీసివేయాలి, తాత్కాలిక ఉపసమనం తాత్కాలికమే కదా. తప్పకుండా లివర్ కి సంబంధించిన చిట్కాలు పెడతాను, చూసి వాడుకోగలరు. అందులో ఏదైనా సందేహం వుంటే నాతొ చెప్పి నివృత్తి చేసుకుని వాడుకోగలరు .

    ReplyDelete
  3. ధన్యవాదాలు సరస్వతి గారూ ! నా సమస్య ఓపికగా చదివి ,సమాధానం ఇచ్చినందుకు సంతోషమండీ. నా సమస్య పరిష్కారం కోసం ఇకమీదట క్రమం తప్పకుండా మీ బ్లాగు చూస్తూ ఉంటాను .

    ReplyDelete