ఈ సామెత ఎందుకు పుట్టిందంటే, ప్రతి రోజూ నీరుల్లిపాయల్ని తింటూవుంటే వైద్యుడితో అవసరమే ఉండదు.ఎందుకంటే మన శరీరానికి ఎంతో అవసరమైన అల్యూమినియం నీరుల్లిలో పుష్కలంగా వుంది.ఇది నిత్యం వాడుతూ వుంటే శరీరంలో క్రిములన్నీ హరించి అమితమైన బలం చేకూరుతుంది. ఈ వాస్తవాన్ని మన పూర్వీకులైన ఆయుర్వేద వైద్య శాస్త్రవేత్తలు ఆనాడే కనుక్కున్నారు. కాబట్టీ ఈ నీరుల్లిని క్రమం తప్పకుండా ఆహార పదార్ధాల్లో వాడే అలవాటును మనకు నేర్పారు. అంతే కాదు ' ఉల్లి, కన్న తల్లికన్నా గొప్పదని ప్రశంసించారంటే ఉల్లిలో ఎన్ని రకాల ఔషధ గుణాలున్నయ్యో మనం అర్ధం చేసుకోవాలి. నిత్య జీవితంలో ఉల్లిని తప్పకుండ వాడటం అలవాటు చేసుకోవాలి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
- నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నా గురువు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్ధన :
potassium takkuvithe body lo elanti problems vosta sir.. koncham clear ga cheppara..
ReplyDelete