కాలేయం పాడైతే జరిగే నష్టం చాలా వుంది. ఎందుకంటే ఇది చెడిపోతే ముందుగా ఆకలి దెబ్బ తింటుంది.ఆహారం చూస్తే వాంతి వచ్చినట్లనిపిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ ఆ పైన పాడవుతుంది. మలమూత్రాల రంగు మారిపోతుంది. మనిషి బలహీనపడిపోతాడు.పసరికలు కూడా రావచ్చు. కాలేయం పెరిగిపోయి అందులో గడ్డలు ఏర్పడవచ్చు. దీనితోపాటు పిత్తాశయము (గాల్బ్లాడర్) కూడా చెడిపోవడానికి, దానిలో రాళ్ళు ఏర్పడటానికి దోహదమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే కాలేయం కుచించుకుని దానికి సంబంధించిన క్యాన్సర్ కు దారితీయవచ్చు. ఈ విధం గా ఇంకెన్నో నష్టాలు కాలేయము పాడవడంవల్ల జరుగుతాయి.
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ
0 comments:
Post a Comment