Pages

Saturday, 25 January 2014

నేత్ర సౌందర్య వినాశనానికి ప్రధాన కారణం :

ఆయా ఋతువులననుసరించి వాటి స్వభావాన్ని బట్టి వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడిన కషాయంతో పుక్కిలించకపోవటం వలన, కళ్ళకు కాటుక పెట్టక పోవటం వలన, ముక్కుల్లో తైలము వేయకపోవటం వలన నేత్ర వ్యాధులు ఏర్పడి నేత్రసౌందర్యాన్ని సమూలంగా నాశనం చేస్తయ్.
మన పూర్వీకులు ఆడ, మగ, అందరూ పుక్కిలించటం, కాటుక ధరించటం, ముక్కుల్లో నూనె వేసుకోవటం అనే అలవాట్లను అనుసరించటం వలననే వృద్ధాప్యంలో కూడా కళ్ళజోడు అవసరం లేకుండ, కంటి చూపు దెబ్బతినకుండ, కళ్ళ కింద ముడుతలు పడకుండ ఆరోగ్యంగా జీవించారని మనం తెలుసుకోవచ్చు.

కడుపులో పుండ్లు/ Kadupuloo pundlu:

ప్రతిరోజూ రెండు పూటలా ఒక కప్పుపాలలోఒక స్పూను నెయ్యి కలిపి తాగుతూ వుంటే కడుపులోని పుండ్లు హరించిపోతయ్.
pratiroojuu rendu puutalaa oka kappu paalalo oka spoon neyyi kalipi taagutuu  vuntee kadupulooni pundlu harinchipotay.

Friday, 24 January 2014

ఉబ్బు- ఊబ - వాపులు / Vubbu- Vuuba -Vaapulu :

ఉసిరిక పండ్ల రసము పూటకు 50 గ్రాముల వంతున సేవించిన శరీరములోని ఉబ్బులు, ఊబలు, వాపులు తగ్గును. ఈ చికిత్స వలన ఆ సంవత్స్రరమంతయు శరీరమునకు ఏ రోగము రాదు.

Vusirika pandla rasamu puutaku 50 graamula vantuna seevinchina sareeramulooni vubbulu, Vuubalu, Vaapulu taggunu. Ee chikitsa valana aa samvatsaramantau sareeramunaku ee roogamuu raadu.

Wednesday, 22 January 2014

వండిన ఆహారం ఎన్నిగంటలు బాగుంటుంది / Vandina aahaaram ennti gantalu baaguntundi:

ఏ ఆహారమైనా వండిన తరువాత ఆరుగంటల వ్యవధిలోనే వాడుకోవాలని, ఆ సమయం మించిపోయిన ఆహార పదార్ధాలు విషంతో సమానమని మన పెద్దలు సూచించారు. వండిన గంటలోపు తినటం ఎల్లవేళలా శ్రేయస్కరం.

Ee aahaaramainaa vandina taruvaata aarugantala vyavadhiloonee vaadukoovaalani, aa samayam minchipooyina aahaara padaardhaalu vishamtoo samaanamani mana peddalu suuchinchaaru.Vandina gantaloopu tinatam ellaveelalaa sreeyaskaram.

పిల్లల సుఖ విరేచనానికి/Pillala sukha vireechanaaniki:

పిల్లలకు అజీర్తి చేసి, విరేచనం కాకుండ బాధపడుతూ వుంటే, పొట్టమీద ఆముదం రాసి గోరువెచ్చటి కాపడం పెడితే వెంటనే విరేచనమౌతుంది.

Pillalaku ajeerti cheesi, vireechanam kaakunda baadhapadutuu vuntee, pottameeda aamudam raasi gooruvechati kaapadam peditee ventanee vireechanamoutundi.

వాంతులకు / Vaantulaku:

వాంతులు విపరీతంగా అవుతూవుంటే, నీరుల్లిగడ్డను చితగ్గొట్టి వాసన చూస్తే చాలు.

Vaantulu vipareetamgaa avutuuvuntee, neerulligaddanu chitaggotti vaasana chuustee chaalu.

Tuesday, 21 January 2014

తలకు నూనె పెట్టమనే ప్రాచీన వాదం / Talaku nuune pettamanee praacheena vaadam :

పూర్వం వేల సంవత్సరాలనుంచి తరతరాలుగా మన ఇళ్ళల్లో బిడ్డలు పుట్టినప్పటి నుంచి ఆముదం, కొబ్బరి నూనెలతో తల మర్ధనా చేసేవారు. పసివారి నుంచి పండు ముదుసలి వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా తలకు నూనె రాసేవారు.వారానికి ఒకసారి ఎక్కువ నూనె పెట్టి మర్ధనా చేసేవారు. దానివల్ల వారి నేత్రదృష్టి స్థిరంగా వుండేది. వెంట్రుకలు రాలిపోకుండ, బట్టతలలు లేకుండా అందమైన జుట్టుతో ప్రశాంతమమైన మానసిక స్థితిలో హాయిగా జీవించారు.
                                            పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు మానవ స్వభావం ఎప్పుడూ తన స్వదేశ సంప్రదాయాల్లోని ఔన్నత్యాన్ని గ్రహించలేదు.విదేశ నాగరికత ఎంత చండాలపుదైనా దానివైపు ఆకర్షింపబడుతుంది.విదేశీ తిండ్లు, విదేశీ బట్టలు, విదేశీ మందులు, విదేశీ విద్య,విధానాలు ఇలా విదేశీ నాగరికతకు లోను కావటం వల్లే మన దేశ దౌర్భాగ్యం ఇంత ఘోరంగా తయారైంది. ప్రపంచానికి పాఠాలు నేర్పిన భారత జాతి, ఈనాడు ప్రతి దానికోసం ప్రపంచాన్ని దేహీ అని అడిగే దుస్థితికి దిగజారింది.


Puurvam veela samvatsaraalanunchi tarataraalugaa mana illallo biddalu puttinappati nunchee aamudam, kobbar nuunelatoo talamardhanaa cheeseevaaru.pasivaari nunchi pandu mudusli varaku pratirooju kramam tappakundaa talaku nuune raaseevaaru. vaaraniki okasaari ekkuva nuune petti mardhanaa cheeseevaaru. daanvalla vaari neetradrushti sthiramgaa vundeedi. ventrukalu raalipookundaa, battatalaku leekundaa  andamaina juttuto prasaantamaina maanasika sthitiloo haaigaa jeevinchaaru.
Poruginti pullakuura ruchi annattu maanava swabhaavam eppuduu tana swadeesa sampradaayaallooni ounnatyanni grahinchaleedu. videesee naagarikata enta chandaalaputainaa daanivaipu aakarshimpabadutundi. videesee tindlu, videesee battalu, videesee mandulu, videesee vidya, vidhanaalu ilaa videese naagarikataku loonu kaavatam vallee mana deesa daurbhaagyam inta ghoramgaa tayaaraindi. prapanchaaniki paathaalu neerpina bhaaratajaati, eenaadu prati daanikoosam prapanchanni deehee ani adigee dusthitiki digajaarindi.

తలకు నూనె పెట్టకూడదనే ఆధునిక వాదం/Talaku nuune pettakuudadane aadhunika vaadam:

తలకు నూనె రాస్తే జుట్టు వూడిపోతుందని చుండ్రు,దురద,కురుపులు వస్తయ్యని ఆధునిక ఆంగ్ల వైద్య విధానం చెబుతుంది. ఆ విధానాన్ని నేర్చుకున్న మన ఇంగ్లీషు వైద్యులు కూడా అదే మాటలు వల్లిస్తున్నారు.వందేళ్ళ ఇంగ్లీషు వైద్యం పుణ్యమా అని, దేశంలో బట్టతల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇంగ్లీషు వైద్యం పుట్టిన దేశాల్లో వాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి అక్కడ తలకు నూనె రాయటం మంచిది కాకపోవచ్చు. కానీ మన ఉష్ణమండల దేశల్లో తప్పనిసరిగా తలకు తైల మర్ధనం అవసరం.
ఈనాడు తలకు నూనె రాయటం మహా అపరాధంగా భావిస్తూ తలకు నూనె రాయటం మానేశారు. దానివల్ల జుట్టు వూడిపోవటమే కాకుండా, శరీరం మొత్తాన్ని నియంత్రించే మెదడు కూడా వేడెక్కి మనిషిలో ఓర్పు, సహనం సన్నగిల్లుతున్నయ్.కళ్ళశక్తి తగ్గి, మసకలు, మంటలు, అంధత్వం ఏర్పడుతున్నయ్.


Talaku nuune raastee juttu vuudipootundani chundru,durada, kurupulu vastayyani aadhunika aangla vaidhya vidhaanam chebutundi. aa vidhaananni neerchukunna mana engleeshu vaidhylu kuuda adee maatalu vallistunnaaru. vandella english vaidyam punyamaa ani, desamlo battala sankhya vipareetamgaa perigipootundi. english vaidyam puttina deesalloo vaati vaatavarana pariisthitulni batti akkada talaku nuune rayatam manchidi kaakapovachu. kaanee mana vushnamandala deesaallo tappanisarigaa talaku taila mardhanam avasaram.
eenaadu talaku nuune raayatam mahaa aparaadhamgaa bhaavistuu talaku nuune raayatam maaneesaaru. daanivalla juttu vuudipoovatamee kaakundaa, sariiram mottaanni niyantrinchee medadu kuudaa veedekki manishiloo oorpu, sahanam sannagillutunnay. kallasakti taggi, masakalu, mantalu, andhatvam eerpadutunnay.

నీళ్ళు లేని పైరు వాలిపోతుంది, నూనె పెట్టని తల జుట్టు రాలిపోతుంది/neellu leni pairu vaalipotundi, nuune pettani tala juttu raalipotundi::

పైరు పచ్చగా పెరగటానికి నీరు ఎంత అవసరమో, జుట్టు బలంగా పెరగటానికి నూనెకూడా అంతే అవసరం.తలకు నూనె పెట్టకపోతే, మాడు ఎండిపోతుంది,జుట్టు బిరుసెక్కి రాలిపోతుంది. మాడు పోటు, కండ్లమంటలు, చుండ్రు, నిద్రపట్టకపోవటం మొదలైన అనేక శిరోవ్యాధులు కలుగుతయ్.



pairu pachaga peragataaniki neeru enta avasaramoo, juttu balamgaa peragataaniki nune kuudaa ante avasaram. talaku nuune pettakapootee, maadu endipootundi, juttu birusekki raalipootundi. maadu pootu, kandla mantalu, chundru, nidrapattakapoovatam modalaina aneeka siroo vyaadhulu kalugutay.


                                                                                                                                           Continues....

పులిపిరికాయలకు/Pulipirikaayalaku :

అరటి పండు తొక్కమీద తెల్లగా వుండే గుజ్జును పులిపిర్లకు రాస్తూ వుంటే, కొద్ది రోజుల్లోనే పులిపిర్లు వూడిపోతయ్.
Arati pandu tokkameeda tellagaa vundee gujjunu pulipirlaku raastuu vuntee, koddi roojulloonee pulipirlu vuudipotay.

Monday, 20 January 2014

మడిమశూలకి/Madimasuulaki:

జిల్లేడు పూలను మెత్తగా చితగ్గొట్టి ఆముదంలో వేసి ఉడకబెట్టి మడిమలకు కట్టు కడుతూ వుంటే మడిమశూల తగ్గిపోతుంది.
Jilledu puulanu mettagaa chitaggotti aamudamloo veesi vudakabetti madimalaku kattu kadutuu vunte madimasuula taggipotundi.

శిరోభారం తగ్గాలంటే/Siroobhaaram taggalantee:

వేడి వేడిగా వున్న అన్నాన్నిబట్టలో మూటగా చుట్టి, తలంతా కాపడం పెడుతూ వుంటే తలభారం తగ్గిపోతుంది.
Vedivedigaa vunna annaanni battalo muutagaa chutti, talanta kaapadam pedutuu vuntee talabharam taggippotundi.

దెబ్బలకు - వాపులకు/Debbalaku - Vaapulaku :

 చింతపండు గుజ్జుని వేడి చేసి, దెబ్బలమీద కడితే నొప్పులు, వాపులు మాయమౌతయ్.
Chintapandu gujjuni veedi chesi, debbalameeda kaditee noppulu, vaapulu maayamoutay .

బాగా వేడి నీటితో ఎందుకు స్నానం చేయరాదు? /Baagaa vedi neetitoo enduku snaanam cheyaraadu ?

చాలా మందికి సలసల కాగిన వేడి నీళ్ళతో స్నానం చేయటం అలవాటు. ఇది ఏ మాత్రమూ మంచిది కాదు. గొంతు వరకు వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చు. గొంతు పైనున్న శిరస్సు మీద మాత్రం పొరపాటున గూడా వేడి వేడి నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే, శిరస్సులో వుండే ప్రతి అవయవం, ఎంతో సున్నితంగా, సుకుమారంగా వుంటుంది. దాన్ని చన్నీళ్ళతో చల్ల బరచాలే గానీ, వేడి నీళ్ళతో ఇంకా వేడెక్కించ కూడదు. తల మీద వేడినీళ్ళు పోయటం వల్ల ముఖ్యంగా, కళ్ళు, వెంట్రుకలు దెబ్బ తింటయ్. వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడి వెంట్రుకలు రాలి పోతయ్. క్రమంగా బట్టతల ఏర్పడుతుంది. దీంతోపాటు కంటి చూపు మందగిస్తుంది. కంటిచుట్టూ వుండే అతి సన్నని నరాలు వేడినీళ్ళ స్పర్శకు దెబ్బ తింటయ్. కళ్ళు బలహీనమై క్రమంగా కంటి వ్యాధులు వస్తయ్.

పార్శ్వపు తలనొప్పికి / paarsvapu talanoppi ki

కొబ్బరిపాలల్లో పటిక బెల్లం (మిశ్రీ)పొడి కలిపి తాగుతూ వుంటే కొద్దిరోజుల్లో పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది.

kobbari paalallO patika bellam (misree)podi kalipi taagutuu vunte koddi rojullo paarsvapu talanoppi taggipotundi.

Saturday, 11 January 2014

వడదెబ్బ తగిలితే:

నీరుల్లిపాయల రసాన్ని వడదెబ్బ తగిలిన వ్యక్తికి కణతలకు, గుండేకు బాగా లేపనం చేయాలి.

పుచ్చకాయ రసం గానీ, బార్లీజావలో పటికబెల్లం కలిపిగానీ, లేక కొబ్బరినీళ్ళు గానీ మెల్ల మెల్లగా కొద్ది కొద్దిగా సేవింపచేయాలి.

చల్లని గాలి వచ్చేచోట పడుకోబెట్టాలి. కొబ్బరినూనెను శరీరమంతా మర్ధనా చేయాలి. అవకాశముంటే మంచిగంధం చెక్కతో సాది, ఆ గంధాన్ని శరీరానికి లేపనం చేయాలి.

వడదెబ్బ తగలకుండా:

ఒక గ్లాసు మంచి నీటిలో 10 గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేలా పిసికి వడపోయాలి. తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కెర కలిపితే చక్కని పానీయం తయారవుతుంది. దీనిని వేసవికాలంలో ప్రతి రోజూ ఉదయంపూట సేవిస్తూవుంటే, వేసవితాపాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది.

అధిక ఆయాసంకు:

అల్లం రసం 30 గ్రాములు, తేనె 20 గ్రాములు కలిపి రోజుకు రెండు లేక మూడు సార్లు త్రాగుతుంటే అధిక ఆయాసం హరిస్తుంది.

కామెర్లకు :

తాజా పెరుగు 40 గ్రాములు, మంచి పసుపు 10 గ్రాములు కలిపి ఉదయం తింటుంటే మూడువారాలలో కామెర్లు
తగ్గుతయ్.

ప్లీహరోగం తగ్గటానికి తులసి రసం :

తులసి రసం రెండు చెంచాల మోతాదుగా రెండు పూటలా త్రాగుతుంటే ప్లీహరోగం కుదురుతుంది.

పాండురోగం(Anemia):

1. పిప్పళ్ళ పొడి 3 గ్రాములు, పంచదార 10 గ్రాములు కలిపి ఒక్కపూట వాడుతుంటే 21 రోజులలో పాండురోగం తగ్గుతుంది.
2. లేత వేపాకు రసం 30 గ్రాములు, కండచక్కెర 10 గ్రాములు కలిపి గోరువెచ్చగా చేసి త్రాగుతుంటే 14 రోజులలో పాండురోగాలు పోతాయి.

అతిసారం(విరేచనాలు) వస్తే:

ఆకలి మందగించి, దేహంలోని వాత, పిత్త, కఫాలు దోషాలుగా మారి మలం ద్రవం రూపం చెంది మాటిమాటికి విసర్జింపబడటాన్ని అతిసారం అంటారు.

1. గంజితో: పలుచగా కాచిన బియ్యపు గంజిలో దోరగా వేయించి దంచిన జిలకర్రపొడిని పావుచెంచా, సైంధవలవణం అరచెంచా కలిపి తాగుతూ వున్నా అతిసారం ఆగిపోతుంది.

2. బార్లీగింజలతో: బార్లీ గింజలతో పలుచగా జావ కాచి అందులో ఒక చెంచా చక్కెర, రెండు చెంచాల నిమ్మరసం కలిపి తాగుతుంటే అతిసారం ఆగిపోతుంది.

3. పిప్పళ్ళతో: పిప్పళ్ళను దోరగా వేయించి దంచి జల్లించిన పొడి మూడు చిటికెల మోతాదులో ఒక చెంచా తేనె కలిపి తింటే అతిసారం హరించిపోతుంది.

4. జామాకుతో: ఒకగ్లాసు నీటిలో ఒక జామాకు వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి చల్లర్చి సేవిస్తూ ఉంటే అతిసారం అతి త్వరగా తగ్గిపోతుంది.

5. దనిమ్మ తొక్కతో: దనిమ్మ పండూ పైతొ్క్కు తీసి 20 గ్రాములు మోతాదులో ఒక గ్లాస్ నీటిలో నల్గ్గొట్టివేసి, కప్పు కషాయానికి మరిగించాలి. వడపోసి చల్లార్చి తాగితే అతిసారం హరిస్తుంది.

6. వేయించిన బియ్యం, వేయించిన పెసలు తీసుకుని నీటిలో కలిపి కషాయం కాచి పిసికి వడపోసి, అది చల్లార్చిన తరువాత అందులో చక్కెర, తేనె కలిపి తాగితే అతిసారం, దప్పిక, కడుపులో మంట తగ్గిపోయి రోగికి బలం కలుగుతుంది.

Friday, 10 January 2014

కాలేయం, ప్లీహ వ్యాధులు రాకుండా వుండాలంటే:

1. నిమ్మ పండ్ల రసం, టమేటో పండ్ల రసము, బొప్పాయి పండ్లు తరచుగా వాడుకొంటూ వుంటే కాలేయ, ప్లీహ వ్యాధులు కలుగకుండ వుంటాయి.

2. పచ్చి గుంటగలగరాకు చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొని అన్నంలో కలుపుకొని వారానికి ఒకసారి తింటూ వుంటే ఎప్ప్టటి కప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా వుంటుంది. అంతేగాక వెంట్రుకలు తెల్లబడకుండ, కంటి చూపు తగ్గకుండ కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.

3. గుంటగలగరాకు పొడి రోజూ పూటకు 3 గ్రాముల మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండుపూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.

* గుంటగలగరాకు ఆకు కూరలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది 

ప్లీహభివృద్ధికి(Spleen Enlargement) కలబంద(Aloe vera)తో యోగం :

కలబంద మట్టలు చీల్చి లోపల వుండే గుజ్జు తీసి, ఆ గుజ్జు 10 గ్రాములు మోతాదుగా అందులో 3 గ్రాముల పసుపు(ఇంట్లో దంచిన పసుపు పొడి) కలిపి రోజూ సేవిస్తూంటే ప్లీహభివృద్ధి తగ్గిపోతుంది.

దంతరోగాలు ఎందుకొస్తున్నయ్ ?

గత కాలంలో మన దేశ ప్రజలకు నూటికి ఒక శాతానికి మించిన ప్రజలకు దంతరోగాలు లేవు. ఇప్పుడు దాదాపు నూటికి నూరు మందికి దంతాలు పుచ్చిపోవటం, రంధ్రాలు పడటం, పైన పింగాణి వూడిపోవటం, చిగుర్లు దెబ్బ తినటం, రక్తం కారటం, దంతాలు వదులు  కావటం, చల్లటి లేక వేడి పానీయాలను సేవించినపుడు పండ్లలో సలుపులు పుట్టడం క్రమంగా ఒక్కొక్క పన్ను చిన్న వయసు నుండే వూడిపోవటం, అద్దె పళ్ళు కట్టించుకునే ఖర్మ పుట్ట్టటం జరుగుతుంది. ఈనాటికీ మన గ్రామాలలో వేప, కానుగ వంటి పుల్లలతో పండ్లు తోమే వారికి వృద్ధాప్య దశలో కూడా ఒక్క పన్ను కూడా కదలని వారు, వూడని వారు ఉన్నారు. ఆ పుల్లల కన్నా ఈనాటి ఆధునిక శాస్త్ర విజ్ణానం వల్ల పుట్టి పేస్టులు మంచివైతే అప్పటికన్నా ఇప్పటి వారికి పండ్లు మరింత గట్టిగా వుండి తీరాలి. కానీ, అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఈనాటి పేస్టులకన్నా మన పండ్లు తోముకునే ప్రాచీన దేశీయ విధానాలే సరి అయినవని మనము అర్థము చేసుకోవాలి. పేస్టుల పైన వ్యామోహం నవ నాగరికతపైన భ్రమలు తగ్గించుకొని నిజము వైపు ప్రయాణం చేయాలి. అప్పుడే మనమంతా మన దంత సౌందర్యాన్ని కాపాడుకోగలము.  

Thursday, 9 January 2014

పార్శ్వపు తల నొప్పికి(Migrane) - పంచదార యోగము :

రాత్రి నిద్రపోయే ముందు 60 గ్రాముల పంచదారను కానీ, కండచక్కెర పొడిని గానీ పావు లీటరు మంచి నీటిలో వేసి కరిగించి మూతబెట్టి మంచము కింద పెట్టుకుని పడుకోవాలి. తెల్లవారు జామున అయిదు గంటలకు నిద్రలేచి ఆ పంచదార నీళ్ళను ఒకసారి కలుపుకొని తాగాలి. ఒక గంట వరకు మరేమీ తాగకూడదు, తినకూడదు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసేటప్పటికి అర తలనొప్పి అనగా తలలో ఏదో ఒక వైపు వచ్చేటటువంటి తలనొప్పి ఆశ్చర్యకరముగా తగ్గిపోతుంది.

చర్మ సౌందర్యానికి పాటించవలసిన నియమములు :

1. రోజూ ఒక గంటసేపైనా వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం అలవాటు చేసుకోవాలి.
2. సబ్బుల వాడకం పూర్తిగా నిషేధించి, సుగంధ స్నాన చూర్ణాలనే వాడాలి.
3. వారానికి ఒకసారి తప్పకుండా వర్షాకాలంలో, చలి కాలంలో నువ్వుల నూనె తోటి, ఎండాకాలంలో ఆముదము లేక ఆలివ్ నూనె తోటి శరీరమంతా మర్ధనా చేసుకోవాలి.
4. రోజూ స్నానం చేసేటప్పుడు అవయవాలను బాగా రుద్దుకొని స్నానం చేయాలి.
5. చర్మానికి బాగా గాలి తగిలేటట్లు వీలైనంత వరకూ వదులైన నూలు బట్టలనే ధరించాలి.

చర్మ సౌందర్యం ఎందుకు హరించిపోతుంది :

ఈ ఆధునిక యుగంలో చాలామందికి శరీరానికి పనిలేకుండా పోయింది. తినటం, కూర్చోవటం, ఎక్కువ సమయం మనసుతోనే పనిచేయటం జరుగుతుంది. శరీరానికి ఏ కొద్దిపాటి వ్యాయమమైనా లేకపోవటం వల్ల, ఆహారపదార్ధాల ద్వారా లోపలికి పోయిన మలిన పదార్ధాలు చెమట ద్వారా బయటకి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. కనీసం నెలకు ఒకసారైనా శరీరమంతా తైలమర్ధనం చేసుకొని రక్తప్రసరణను క్రమబద్ధం చేసుకొని స్నానం చేసేవాళ్ళు ఈనాడు ఒక్కరైనా లేరని చెప్పవచ్చు. అంతేగాకుండా, మన దేశ వాతావరణానికి అనుగుణంగా ఎన్నో తరాలనాడు మన మహర్షులు మనకు అలవాటు చేసిన సున్నిపిండి వంటి స్నాన చూర్ణాల వాడకం పూర్తిగా తగ్గిపోయి, రసాయనిక పదార్ధాలతో తయారైన సబ్బుల వాడకం పెరిగిపోయింది.
ఈ విధానంవల్ల చర్మ రంధ్రాలు క్రమంగా మూసుకుపోయి మలిన పదార్ధాలను విసర్జించలేకపోవడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు కలుగుతున్నాయ్. చర్మం నల్లగా మారటం, గరుకుగా మారటం, పొడి పొడిగా మారి పొలుసులు లేవటం, చర్మం పై మచ్చలు, దురదలు రావటం వంటి రక రకాల సమస్యలతో భారతీయుల చర్మ సౌందర్యం నానాటికీ క్షీణించిపోతుంది.

Wednesday, 8 January 2014

దంతాలు వదులు,చిగుర్లు పగలటం, చిగుళ్ళ నుంచి రక్తం, నోటి దుర్వాసన సమస్యలకు మార్గం :

దంతాలు వదులైపోయి, చిగుర్లు పగిలిపోయి, నోటివెంట రక్తం కారుతూ నోరంతా దుర్వాసనతో వున్నవారు ఈ సులభ విధానాన్ని పాటించండి. ఒక టీ స్పూను సైంధవ లవణము పొడిలో రెండు మూడు చుక్కలు ఆవాల నూనె కలిపి ఆ మిశ్రమంతో వేలు పెట్టి పళ్లు తోమండి. మృదువుగా పళ్ళపైన చిగుళ్ళపైన లోపలివైపు రుద్దండి. 15 నిముషాలు అలాగే వుంచిన తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించి దంతాలు శుభ్రం చేసుకోండి. ఇలాగే, రెండవ పూట కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల క్రమంగా నోటిలో వున్న క్రిములు మలిన పదార్ధాలు, మలిన రక్తం నిర్మూలనమైపోయి క్రమంగా దంతాలు మళ్ళీ గట్టిపడతయ్. బాగా పరిశుభ్రమౌతయ్. ఈ చిన్న విధానం వల్ల మీరు ఎక్కువ లాభం పొందవచ్చు.

మొటిమలకు :

1. సొంఠి, లవంగాలు నీటితో మెత్తగా నూరి లేపనం చేస్తూ వుంటే మొటిమలు తగ్గిపోతయ్.
2. జాజికాయను నీటితో అరగదీసి ఆ గంధాన్ని లేపనం చేస్తూ వున్నా మొటిమలు తగ్గిపోతయ్.
3. నీరుల్లిగడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గిపోతయ్.
4. బియ్యం కడిగిన నీటిని మొటిమలపై మ్రుదువుగా రుద్దుతూ వుంటే తగ్గిపోతయ్.
5. కస్తూరి పసుపును నిమ్మరసంతో సాది తీసిన గంధం రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతయ్.

ముఖ సౌందర్యం హరించడానికి కారణాలు :

ఈనాడు ముఖంపైన మొటిమలు కానీ, మచ్చలు కానీ, మంగు కానీ, సోబి కానీ, గుల్లలు కానీ, గుంటలు కానీ కళ్ళచుట్టు నల్లని వలయాలు కానీ లేని వారు చాలా అరుదేనని చెప్పవచ్చు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగుబెట్టే యువతీ యువకులకు కొత్థగా వివాహమైన స్త్రీ పురుషులకు ఈ సమస్యలు ఎక్కువగా వుంటయ్. వీటి నుండి బయటపడటానికి వీరంతా చర్మ వ్యాధుల వైద్యులను సంప్రదించటం లేక టీవీలలో ప్రకటనలు చూసి రక రకాల క్రీములు, లోషన్లు ముఖానికి పూసుకోవటం, మరికొందరు బ్యూటీపార్లర్ల చుటూ ప్రదక్షిణాలు చేయటం, ఎన్ని చేసినా ఎంత ఖర్చుపెట్టినా ఆ సమస్యలు పరిష్కారం గాక, అద్దం ముందు కూర్చుని అందోళన పడుతూ వుండటం జరుగుతూ వుంది.
ఆహారం ద్వారా రోజూ శరీరంలోకి ప్రవేశిస్తున్న విష రసాయనికి పదార్ధాల ప్రభావమే ఈ సమస్యలకు మొదటి కారణమని అందరూ గుర్తించాలి. రోజు రోజుకు రక్తంలో విషాలు పేరుకుపోతూవుండటం వల్ల ఆ విషాలను శరీరం బయటకి త్రోసివేసే చర్యలో భాగంగా ఈ సమస్యలు కకలలుగుతూ వుంటయ్.
ఆడవారిలో బహిష్టు సక్రమంగా జరగకపోవడం, కొందరికి నెలల పర్యంతం బహిష్టు రాకపోవటం, మొదలైన గర్భాశయ సమస్యల వల్ల ముఖ సౌందర్యం నాశనం కావటం జరుగుతూ వుంది. కాబట్టి, ఆయా సమస్యలు వున్న వారు వాటి మూలకారణాలను తెలుసుకొని ఆహార విహారాలను సరిదిద్దుకొని  తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవాలి.

Tuesday, 7 January 2014

గృధ్రసీవాతం(సయాటికా)సమస్యకు :

తొడనుండి పాదంవరకు నరం లాగుతూ బంధించినట్లువుండే గృధ్రసీవాతానికి, పై బెరడు తీసివేసిన ఆముదపు గింజల్లోని తెల్లపప్పు 10 గ్రాములు కొంచం నీటి్తో నూరి పావులీటర్లో వేసి మరిగించి వడపోసి అందులో 40 గ్రాములు కండచక్కెరపొడి కలిపి రోజూ 2 పూటలా తాగుతుంటే గృధ్రసీవాతం హరిస్తుంది.

పిప్పి పంటి సమస్యకు :

ఆవాలపిండి, కల్లుప్పు సమభాగాలుగా తీసుకుని మెత్తగా మెత్తగాదంచి రోజూ రెండుపూటలా పళ్ళు తోముతూండాలి.

పొట్ట లావుగా వున్న సమస్యకు :

శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, వాము, జిలకర్ర, సైంధవలవణం, సమభాగాలుగా చుర్ణించి మూడువేళ్ళకు వచ్చినంత చూర్ణాన్ని పావులీటర్ ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ రెండుపూటలా తాగుతుంటే లావుగావున్న ఊదరపొట్ట క్రమంగా తగ్గిపోతుంది.

Monday, 6 January 2014

పిల్లలకు పొట్ట పెరిగితే:

ప్రతిరోజూ ఉదయం పరగడుపున పావుచెంచా తేనె, 5 నుంచీ 10 చుక్కలు అల్లం రసం, కొద్దిగా గోరువెచ్చటి మంచినీళ్ళు కలిపి తాగిస్తూ వుంటే, పిల్లల ఉదరపొట్ట,అజీర్ణం, పైత్యం, అగ్నిమాంద్యం, మలబద్ధకము తగ్గిపోతయ్. వయసును బట్టి మోతాదు ఎక్కువ తక్కువలు నిర్ణయించుకోవాలి.

పిల్లల వంటిపై లేచే కురుపులకు - గడ్డలకు :

వేపాకు కొద్దిగా పసుపు కలిపి నీళ్ళతో మెత్తగా నూరి, కురుపులు, గడ్డలు, దురదలు, గజ్జి, తామర మొదలైన వాటిమీద లేపనంచేసి ఒక గంట ఆగి స్నానం చేయిస్తూవుంటే అవన్నీ అయిదారు రోజుల్లో తగ్గిపోతయ్.

Sunday, 5 January 2014

శిశువుల శరీరదారుఢ్యానికి:

పిల్లలకు పుట్టినరోజు నుండి ఐదవ సంవత్సరం వరకు ప్రతి రోజూ ఒంటికి నువ్వులనూనె రాసి రెండు గంటలు ఆగిన తరువాత సున్నిపిండితో స్నానం చేయిస్తూ వుంటే పిల్లల ఎముకలు గట్టిపడి, క్రింద పడినా విరగకుండ వుంటయ్. వారి శరీరం కూడా అన్ని ఋతువుల వాతావరణాలను తట్టుకోగలిగిన శక్తి పొందుతుంది. చర్మము నునుపుగా కాంతివంతంగా వుంటుంది.
5 సంవత్సరాలవరకే కాదు.. ఎప్పుడూ రాస్తూ వున్నా పిల్లలకు, పెద్దలకు ఎంతో మంచిది.

పిల్లలు పక్కలో మూత్రం పోస్తుంటే :

జొన్నల్ని వేయించిన అటుకులు, నువ్వులను దంచి నూనె పిండి వేయిగా మిగిలిన నువ్వులపిండి (తెలకపిండి), ఎండుకొబ్బరి, బెల్లము వీటన్నిటిని సమభాగాలుగా తీసుకుని దంచి వుండలు చేసి నిలువ వుంచుకోవాలి. రోజూ పూటకు 5 గ్రాముల వుండ రెండు పూటలా తినిపిస్తూవుంటే పక్కలో మూత్రం పోయటం బంద్ అవుతుంది.

పిల్లల చెవిపోటుకు :

నీరుల్లి పాయను ముక్కలు చేసి ఒక గరిటలో వేసి అందులో నువ్వులనూనె కలిపి నిప్పులమీద వేడిచేసి వడపోసి ఆ నూనెను మూడు నాలుగు చుక్కలు చెవుల్లో వేస్తూవుంటే చెవినొప్పి తగ్గిపోతుంది.

పిల్లలకు కడుపునొప్పులకు :

తినే సోపుగింజలు, నల్ల వుప్పు సమభాగాలుగా చూర్ణం చేసి వుంచుకొని, పూటకు ఒక గ్రాము చూర్ణం కొంచం గోరువెచ్చని నీళ్ళతో కలిపి రెండుపూటలా ఇస్తూవుంటే వెంటనే కడుపునొప్పి  తగ్గిపోతుంది.

బాగా చిన్న పిల్లలకు కడుపుకు ఆముదం రాసి (పెద్దవాళ్ళ)చేతిని వేడి చేసి కడుపుమీద వేడి చూపిస్తే 5 నుంచీ 10 నిముషాల్లోపే నొప్పి తగ్గిపోతుంది.

తెలుసుకుందాం

ఈనాడు ప్రపంచ వ్యాపితంగా మానవాళి ఎదుర్కొంటున్న అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఆహార సేవనంలో జరిగే లోపాలే మూల కారణాలు.
" ఆహార నియమాలు పాటిస్తే - ఏ రోగానికీ ఔషధం అవసరం లేదు. ఆహార నియమాలు పాటించకపోతే, ఏరోగాన్ని ఔషధాలు నయం చేయలేవు " 

పిల్లలకు : నిద్రలో పళ్ళు కొరుకుతుంటే:

కడుపులో పురుగులు వుండటము వలన పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతారు.

ఆవాలు చూర్ణం ఒకటి నుండీ రెండు గ్రాముల మోతాదుగా ఒక కప్పు పెరుగులో కలుపుకుని రెండుపూటలా మూడు రోజులపాటు తింటూ వుంటే కడుపులో పురుగులు పడిపోతయ్. వయసునుబట్టి అరగ్రాము నుండే 2 గ్రాముల వరకు ఆవలు పొడిని ఉపయోగించాలి.

పిల్లలకు :నులిపురుగులు, ఏలికపాములు పడిపోవుటకు :

నీరుల్లిగడ్డ (onion)దంచి రసం తీసి వడపోసి, ఒక టీ స్పూను మోతాదుగా రెండుపూటలా తాగిస్తూవుంటే కడుపులో, ప్రేగులనుంచి క్రిములు పడిపోతయ్. వయసును బట్టి మోతాదు ఎక్కువతక్కువలు నిర్ణయించుకోవాలి. పెద్ద పిల్లలకైతే ఉల్లిగడ్డను ముక్కలుగా తరిగి భోజనంతో కలిపి తినిపించవచ్చు.

పిల్లలకు ముక్కు నుంచీ రక్తం కారుతుంటే:

1. ముక్కును చన్నీళ్ళతో కడగాలి. బాగా చల్లగా వున్న నీళ్ళలో గుడ్డముంచి ఆ గుడ్డను ముక్కుమీద వెయ్యాలి.ఐస్ ముక్కలు దొరికితే ముక్కుమీద వుంచటం మంచిది. వెంటనే హారతి కర్పూరం వాసన చూపిస్తూ వుంటే రక్తం కారటం ఆగిపోతుంది.
2. ధనియాలను చితక్కోట్టి కొంచం నీళ్ళు కలిపి మెత్తగా నూరి నడినెత్తిమీద వుంచి గుడ్డకట్టాలి.
3. దానితో పాటు ధనియాలను నీళ్ళతో నూరి వడపోసి కొంచం పంచదార కలిపి తాగిస్తూ వుంటే ముక్కునుంచీ రక్తం కారటం వెంటనే నిలచిపోతుంది.
4. కొన్నాళ్ళవరకూ వేడిచేసే పదార్ధాలు పెట్టకుండా, చలువచేసే పదార్ధాలు పెట్టాలి. తలకు, అరికాళ్ళకు ఆముదంతో సున్నితంగా మర్ధనా చేయాలి.

పిల్లల వ్యాధులకు కారణాలు - 2

10. పచ్చి కూరగాయలను, ధాన్యాలను తినే అలవాటు అసలు లేకపోవటం.
11. ఫ్రిజ్ లో నిలువవుంచిన ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు పదే పదే పసితనం నుంచే వాడటం.
12. కనీసం నెలకు ఒకసారి కూడా తైలమర్ధనం చేయకుండా శరీరాన్ని ఎండబెట్టటం.
13. తలకు కూడా నూనె పెట్టకుండ తలను శోషింపచేయటం.
14. బజారు తిండ్లకు, హోటల్ రుచులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పిల్లలను అలవాటుచేయటం.
15. ఏమాత్రం శక్తి ఇవ్వలేని తెల్లబియ్యం అన్నాన్ని మాత్రమే పెడుతూ మిగిలిన పుష్టికర ధాన్యాలను పిల్లలకు తినిపించకపోవటం.
16. స్కూలు నుంచి ఇంటికి రాగానే కొద్దికాలమైనా వారికి ఆడుకునే అవకాశం ఇవ్వకుండా పసితనం నుంచే టూషన్లు ఏర్పాటు చేయటం.
17. అసభ్యము, అశ్లీలము, హింస, క్రూరత్వం గల సినిమాలను టీవి ద్వారా నిరంతరం చూడటం.
18. పిల్లలు మన జాతి సమస్యలు, నాగరికత, దేశ చరిత్ర, మంచి చెడుల విశ్లేషణ నేర్పేవారు కరువైపోవటం.
19. వారికి తాతలు, నయనమ్మలు దగ్గరలేక, పరిసరాల విజ్ణానానికి దూరం కావటం.
20. పిల్లల సున్నిత హృదయాలను అర్థంచేసుకొని, వారిని మంచి పపౌరులుగా తీర్చిదిద్దే విద్య గానీ, అలాంటి విద్యను బోధించే ఉపాధ్యాయులు గానీ లేకపోవటం, పసితనం నుంచే ఏసిగదుల్లోనో నిరంతరం ఫ్యాన్ల క్రిందనో వుండటానికి అలవాటు పడటం.
21. ప్రకృతికి విరుద్ధమైన సకల అవలక్షణాలతో కూడిన విరుద్ధ జీవన విధానాలలో పిల్లలు పెరగటం.

Saturday, 4 January 2014

పిల్లల వ్యాధులకు కారణాలు : -1

1. తల్లులు పాలివ్వకుండా డబ్బా పాలను అలవాటు చేయటం.
2. పుట్టినప్పటి నుండే పిల్లలకు విపరీతమైన ప్రభావం గల ఇంగ్లీష్ మందులను వాడటం. పిల్లల్లో సహజ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారన్ని ఇవ్వకపోవటం.
3. మూడేళ్ళ వయసుకే నర్సరీ పేరుతో పిల్లలను బలవంతంగా స్కూళ్ళలో పడేయడం.
4. మాటలు రాని వయసులోనే మాతృభాషకు సంబంధంలేని ఇంగ్లీషు విద్యా విధానాన్ని నేర్పించటం.
5. నర్సరీ నుండే గాడిద బరువులా మోయలేనన్ని పుస్తకాల మోతను పిల్లల వీపు మీదు మోపటం.
6. తల్లి దగ్గర లేకపోవటం వల్ల పిల్లలు స్కుళ్ళల్లో సరిగ్గా భోజనం చేయకపోవటం.
7. ఉదయం వండిన పదార్ధాలను క్యారియర్ లలో మధ్యహ్నం వరకు వుంచటం వలన మగ్గిపోయి పిల్లలు వాటిని తినలేకపోవటం, స్కుల్లో టీచర్లు ఆ ఎండిపోయిన ఆహారన్ని పిల్లలచేత బలవంతంగా తినిపించటం.
8. శరీరానికి సరిగ్గా గాలి వెలుతురు తగలకుణ్డా మూడేండ్ల వయసునుంచే నిండుగా బట్టలు వేసి గొంతుకు ఉరివేసినట్లు టైలు బిగించి, కాళ్ళకు షూస్ తగిలించటం.
9. స్కూళ్ళలోని క్యంటిన్లలో పిల్లలు, చాక్లేట్లు, బిస్కట్లు, బబుల్ గం లు మొదలైన వ్య్ర్ధర్ధ  అనారోగ్య పదార్ధాలను తినటానికి అలవాటు పడటం.                              

                                                                                                          ఇంకా వున్నాయి...

ఆధునిక యుగంలో - పిల్లల వ్యాధులు:

ముఖ్యంగా ఈనాటి పిల్లల్లో ఆకలిలేక పోవటం, సరిగ్గా విరేచనం కాకపోవటం, దానివల్ల శరీరమంతా క్షీణించిపోవటం జరుగుతుంది. దాంతోపాటు తరుచుగా సీజం మారినప్పుడల్లా దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు కలుగుతున్నయ్. ముక్కుదిబ్బడ వేయటం, శ్వాస పీల్చలేకపోవటం, ముక్కులో అధి మాంసం పెరగటం. టాణ్సిల్స్, సైనసైటిస్ తీవ్రమైన తలనొప్పి, కళ్ళు సరిగా కనపపించకపోవటం. కళ్ళకింద గుంటలు రావటం, పసితనం నుండే వెంట్రుకలు వూడటం, వెంట్రుకలు తెల్లగా నెరిసిపోవటం, కాళ్ళునొప్పులు, ఎక్కువసేపు చదవలేకపోవటం, కొద్ది దూరంకూడా నడవలేక రొప్ప, ఆయాసం రావటం, పాల ఉబ్బసం మొదలైన ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలతో పిల్లలు సతమతమవుతున్నారు.

ఎందుకు ?

1. బలమైన ఆహారాన్ని బాగా తినటమే ఆరోగ్యమైతే - ఎక్కువ మంది ధనవంతులంతా దీర్ఘరోగులౌతున్నారెందుకు? గంజి తాగి డొక్క మాడ్చుకోవడమే అనారోగ్యమైతే - అధికశాతం నిరుపేదలు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారెందుకు?

2. చేస్తున్నా పని పూర్తికాక ముందే మరికొంత పని చేయమంటే మనకు కోపం వస్తుంది కదా..మరి తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ ఆహారం పెడితే జీర్ణాశయానికి కూడా అలానే అనిపించకుండా వుంటుందా..

కన్నీటిని బలవంతంగా ఆపితే:

ఏదైనా బాధ కలిగినప్పుడు వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపటంవల్ల ముక్కు పడిశము, నేత్రరోగాలు, రొమ్ము వ్యాధులు , అరుచి కలుగుతాయి.

ఆవలింతలను ఆపటం మంచిది కాదు..

ఆవలింతలను ఆపటం వలన శరీరం ముడుచుకుపోయి, ముందుకు వంగిపోతుంది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరుకున్నప్పుడు అది ఆవలింతలను సృష్టిస్తుంది. వాటిని స్వాభావికంగా విడుదలచేసి చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Friday, 3 January 2014

వాతరోగము అంటే?

వాతము అంటే వాయువు అని అర్ధం. ఈ వాతం ఆకాశ వాయు భూతాల వలన జనించిన మహాశక్తి స్వరూపము. ప్రకృతిలో ఎక్కువ తక్కువలు లేకుండ సమంగా వీచేగాలి వల్ల సర్వ ప్రాణులు ఎలా ప్రాణాన్న్ని కాపాడుకుంటయ్యో, అదే విధంగా మన శరీరంలో కూడా వాతం అనే వాయువు సమంగా వున్నప్పుడు అది శరీరమంతా పరిభ్రమిస్తూ దేహంలోని పిత్తాన్ని (అగ్నిని)కఫాన్ని(నీటిని ) ఆయా శరీర భాగాలకు చేరుస్తూ మానవుల సుఖజీవనానికి, ప్రాణ రక్షణకు వాతమే మూల కారణమౌతుంది. అదే ప్రకృతిలో వాతావరణ సమతౌల్యం లోపించటం వల్లగానీ, ఋతువుల స్వభావం వల్లగానీ వాయువు సుడిగాలిలా ప్రభంజనమై విజృంభించినపుడు సకల లోకము సకల ప్రాణులు సర్వ ప్రకృతి అతలాకుతలమై ఎలా ధ్వంసమైపోతుందో, అదే విధంగా మానవ శరీరల్లో కూడా మనం సేవించే విరుద్ధమైన  అహార పదార్ధాల వల్ల వాతము విజృంభించి పిత్త్తాన్ని, కఫాన్ని కూడా ప్రకోపింపచేసి సకల శరీరాన్ని 80 రకాల వాత వ్యాధులతో చిన్నా భిన్నం చేసి నాశనం చేస్తుంది. కాబట్టి ప్రకోపించిన వాయుదోషం వల్ల కలిగే అనేక రోగాలన్నింటిని వాత రోగాలు అంటారు.

వాత వ్యాధులకు వివిధ రకాల కాపడాలు :

1.. ఇటుకరాయి పొడుమును గానీ, ఉప్పును గానీ, తవుడును గానీ వేడి చేసి దానిని నూలుగుడ్డలో వేసి మూటగా చుట్టి దానితో నొప్పులమీద కాపడం పెడుతూ వుంటే కాళ్ళు, పిక్కలు పీక్కుపోయే నొప్పులు తగ్గిపోతయ్.

2. నీళ్ళలో వావిలాకు వేసి కాచి ఆ నీళ్ళలో గుడ్డ తడిపి నొప్పులమీద కాపడం పెడుతూ వుంటే వాత నొప్పులు తగ్గిపోతయ్.

3. ఆముదపు గింజల్ని బాండీలో వేసి వేడి చేసి వాటిని మూటగా కట్టి, దానితో నొప్పుల మీద కాపడం పెడుతూ వుంటే నొప్పులు తొందరరగగా సర్దుకుంటయ్.

4. నువ్వులనూనెలో గానే ఆవనూనెలో గానీ 100 గ్రాములు నూనెను ముందుగా బాగా వేడి చేసి దించి గోరువెచ్చగా అయ్యాక అందులో 20 గ్రాములు హారతి కర్పూరము కలిపి మూత పెట్టాలి. తరువాత ఆ తైలాన్ని నిలువ చేసుకుని దానితో రోజూ రెండు పూటలా గోరువెచ్చగా నొప్పుల మేద మర్ధనా చేస్తూవుంటే వాతము హరించి నొప్పులు తగ్గుతయ్.

Wednesday, 1 January 2014

కడుపుబ్బరం..

1. కడుపుబ్బరంగా వుండి పుల్లటి త్రేనుపులు వస్తుంటే చల్లని మంచినీళ్ళు తాగాలి.
2. ఖర్జూరపు గింజని నోట్లో పెట్టుకుని నెమ్మదిగా పళ్ళకింద కొరుకుతూ దాని రసం మింగుతుంటే కడుపబ్బరం పోతుంది.

తెలుసుకుందాం..

స్నానం చేసిన వెంటనే భోజనం చేస్తే జీర్ణశక్తి చెడిపోతుంది.

కాలిన గాయాలకు

1. పచ్చి ఆలుగడ్డను నూరి పట్టువేస్తుంటే కాలిన గాయాలు తగ్గిపోతయ్.
2. కాలిన వెంటనే కలబంద రసం పూస్తుంటే చల్లగా వుండి బొబ్బలెక్కవు.

సుఖ నిద్రకు..

జాజికాయ నేతితో నూరి కణతలకు పట్టిస్తుంటే మంచి సుఖనిద్ర వస్తుంది.

రక్త మొలలకు

వెల్లుల్లిని నిప్పులపై వేసి ఆ పొగను ఆసనానికి పడుతుంటే రక్తమొలలు పిలకలు తగ్గుతయ్.

దేశీయ పంటలనే ఎందుకు ఎన్నుకోవాలి....తెలుసుకుందాం

మన రాష్ట్రంలో మన దేశంలో రోజు రోజుకు విషరసాయనికి పదార్ధాల వాడకం తీవ్రస్ఠాయిలో పెరిగిపోతుంది. పంటపొలాల్లో వేస్తున్న విషరసాయనిక పురుగుమందులు, రోజూ ఇళ్ళల్లో వాడుతున్న నిత్యావసర పదార్ధాల్లోని విషాలు, ఇంకా కలుషితమైన గాలిలోని, నీటిలోని విషాలు ప్రతిక్షణం మన శరీరాల్లోని అణువణువులోకి చొచ్చుకుపోతున్నయ్. ఈ విషాలన్ని ఆయా అవయవాల సహజ శక్తిని నశింపచేస్తూ రక్తంలో ప్రవేశించి దేహంలోని ధాతువులను నిర్వీర్యం చేస్తున్నయ్. దీనివల్ల శరీరంలో ఎల్లప్పుడు సమంగా ఉండవలసిన వాత పిత్త కఫాలు అసమానమై సహజవ్యాధినిరోధకశక్తిని దెబ్బతీస్తున్నయ్

దీంతోపాటు ప్రకృతికి విరుద్ధమైన జీవనవిధానం మానవజాతిని దుర్భలులుగా, నిత్యరోగిష్టులుగా మారుస్తున్నాయి. అంతేగాక మనుషుల్లో శాంతం, సహనం, నీతి, నిజాయితి వంటి సహజ భావాలు అంతరించి పోతూ వాటిస్థానంలో దురాశ, దుర్భుద్ధి, అసహనం, ఆక్రోశం, ఆవేశం, అధర్మవర్తనం పెరిగిపోతూ మనసుమలినమై ఆ మలిన హృదయం నుండి ఉత్పన్నమయ్యే తీవ్రవిషరసాయనాల ప్రభావం కూడా అధికమౌతుంది.

ఇన్ని విధాలుగా విషమయమైపోతున్న మానవశరీరాల్లో Cancer పుట్టుకొస్తూ ఒకభయంకర ప్రళయవిలయంలాగా సకల మానవజాతిని సంహరించబోతుంది. ఈ వ్యాధి బారినపడకుండా మన కుటుంబాల రక్షణ కలగాలంటే పైన తెలిపిన అన్ని రకాల మానసిక శారీరక విషరసాయనాలను మన జీవితం నుండి నిషేధించగలగాలి. దేశీయమైన ఎరువులను, వాటితో పండించిన పంటలను, ఆయుర్వేద జీవన విధానాన్ని ఆహ్వానించి ఆచరించి ఆయురారోగ్యమందుకోవాలి..