Tuesday, 1 October 2013

గర్భిణీ స్త్రేల కోసం - I

1. అల్లం రసం 10 గ్రాములు, తేనె 10 గ్రాములు రెండు పూటలా నాకిస్తుంటే బాలింతలకు ఆరోగ్యం.
2. పొంగించిన ఇంగువ 1 గ్రాము, బెల్లం 5 గ్రాములు తినిపిస్తే బాలింతల తుంటి శూల తగ్గుతుంది.
3. మిరియాల పొడి 3 గ్రాములు, చక్కెర 3 గ్రాములు తేనె 10 గ్రాములు తింటుంటే గర్భిణీల దగ్గు,ఆయాసం బంద్.
4. గ్లాసు వేడి గంజి, ఆవు నెయ్యి 20 గ్రాములు తాగిస్తే గర్భిణి పొట్టలో కదలని శిశువు కదులుతుంది.
5. బొడ్డుపై దూది పెట్టి ఆవు నేతితో తడుపుతుంటే గర్భిణి పొట్టలో కదలని శిసువు కదులుతుంది.
6. నేతిలో వేయించిన వామ్ము 3 గ్రాములు, మొదటి ముద్దలో తింటూంటే గర్భిణి అజీర్తి తగ్గుతుంది.
7. నేతిలో  వేయించిన మిరియాలపొడి 3 గ్రాములు మొదటి ముద్దలో తింటుంటే గర్భిణికి జీర్ణశక్తి.
8. చల్లార్చిన శొంఠి కషాయం 20 గ్రాములు తాగితే గర్భిణి స్త్రీల ఉదరవాతం తగ్గుతుంది.
9. ధనియాలు 10 గ్రాములు, పుల్లని మజ్జిగతో నూరి చక్కెర కలిపి తాగిస్తుంటే గర్భిణి విరేచనాలు బంద్.
10. ధనియాలు 10 గ్రాములు, కప్పు బియ్యపు నీళ్ళు చక్కెరతో కలిపి తాగితే గర్భిణివాంతులు తగ్గుతయ్.

0 comments:

Post a Comment