Saturday, 9 November 2013

గర్భాశయంలో గడ్డలు ఎందుకు వస్తున్నయ్?

స్త్రీలకు ప్రాణం గర్భాశయం. అది సక్రమంగా పనిచేస్తుంటే వారికి జీవితంలో ఏ వ్యాధి రాదు. బహిష్టు ఎక్కువతక్కువలు లేకుండా సమంగా జరుగుతూ, ఋతువులో బహిష్టు నొప్పి లేకుండా వుంటే గర్భాశయం  ఆరోగ్యంగా వున్నట్లు గుర్తు.
కానీ ఈనాడు ఆధునిక జీవన విధానంలోని లోపాలవల్ల బహిష్టు నియమాలను నేటి స్త్రీలు ఉల్లంఘించటం వల్ల ఋతువులో తేడా వస్తుంది. బహిష్టు పూర్తిగా ఆగిపోవడం లేదా ఆగకుండా స్రవించడం లేదా గడ్డలు గడ్డలుగా స్రవించడం మొదలైన సమస్యలు ఏర్పడుతున్నాయ్.ఆ మూడురోజులపాటు చప్ప్డిడి ఆహారం( అన్నం, పెసరపప్పు, పాలు, నెయ్యి, పంచదార మొదలైన పదార్ధాలతో తయారయిన ఆహారం )తీసుకుంటూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే పైన పేర్కొన్న బహిష్టు సమస్యలేవి ఉత్పన్నం కావు. ఈ నియమాన్ని పాటించని స్త్రీలందరికి బహిష్టు అస్తవ్యస్తమై మలినరక్తం పూర్తిగా బహిష్కరింపబడకుండా కొంతభాగం నెల నెలా గర్భాశయంలోనే నిలువ వుంటూ వాత,పిత్త దోషాలచేత దూషింపబడి గడ్డలుగా మారుతుంది.

0 comments:

Post a Comment