Tuesday, 16 July 2013

మనం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కు వైపు పెట్టుకోవాలి? ఏందుకు?


వీలైనంత వరకూ తలను తూర్పు వైపే పెట్టుకోవాలి లేదా దక్షిణం వైపు పెట్టుకోవాలి.
భూమి యొక్క ఉత్తర, దక్షిణ ధ్రువాలు తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటాయి.
మన శరీరానికి తల - ఉత్తరం(North), పాదాలు - దక్షిణం( South)

భూమికి ఉత్తరం వైపు తల పెట్టుకుంటే :
సాధారణంగా శరీరం, భూమికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది.
మన తల(North), భూమి యొక్క ఉత్తరం(North) వైపు పెట్టుకుంటే వికర్షణ అనే క్రియ జరుగుతుంది. అంటే Force of Repulsion. అందువలన శరీరంను నొక్కినట్లు/నెడుతున్నట్లుంటుంది. శరీరంలో సంకోచ క్రియ జరుతుగుంది. రక్త సరఫరా కాస్త జోరుగా జరుగుతుంది, అందువలన B.P.(రక్త పోటు) అదుపు తప్పుతుంది, మనస్సు అల్లకల్లోలంగా అనిపిస్తుంది, గుండె దడపుడుతుంది, నిద్ర రాదు..

భూమికి దక్షిణం వైపు తల పెట్టుకుంటే :
మన తల(North), భూమి యొక్క దక్షిణం(South) వైపు పెట్టుకుంటే ఆకర్షణ అనే క్రియ జరుగుతుంది. అంటే Force of Attraction. శరీరం సాగినట్లుండి/ వ్యాకోచిస్తుంది, శరీరం విస్తరించినట్లుగా వుండి హాయిగా వుంటుంది. అంటే Relaxed గా అనిపిస్తుంది. అందువల్ల ప్రశాంతమైన నిద్రపడుతుంది. అన్ని రకాలైన మానసిక రోగాలను కూడా తరిమివేస్తుంది.
కాస్త పొట్టిగా వున్నా పిల్లలు  దక్షిణం వైపు తల పెట్టి పడుకుంటుంటే 2,3 ఏళ్ళలో వారి పొడవులో మంచి మార్పు వస్తుంది.

తూర్పు neutral గా వుంటుంది.

0 comments:

Post a Comment