Pages

Thursday, 22 August 2013

ఉబ్బసానికి :

ఈ క్రింది యోగాలలో ఏది వీలైతే దానిని ఆచరించవచ్చు:

1) కుంకుడుగింజల లోపలి పప్పు 5 గ్రాములు రోజూ ఉదయం నీటితో సేవిస్తుంటే, మూడు వారాలలో ఉబ్బసానికి ఉద్వాసన.

2) సైంధవలవణం 50 గ్రాములు, పిప్పళ్ళు 50 గ్రాములు, బెల్లం 150 గ్రాములు కలిపి దంచి పూటకు 10 గ్రాములు రెండుపూటలా తింటూంటే ఆయాసం బంద్. 

Tuesday, 20 August 2013

దగ్గును దూరం చేయండి

* దోరగా వేయించిన మిరియాల చూర్ణం పూటకు 1 లేదా 2 గ్రాములు తేనెతో కలిపి 2 పూటలా తింటుంటే దగ్గు, గొంతులో నస తగ్గుతాయి.
* లవంగాలను నిప్పుల్లో వేడి చేసి చల్లగా అయ్యాక బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుతూ వుంటే దగ్గు, నస, గొంతులో గుర గుర పోతాయి.(రోజుకు 5 లేక 6 సార్లు)
* ఉసిరి పండ్లను ఎండించిన చూర్ణం, పాలతో కాచి నెయ్యి కలిపి తాగిన సర్వ విధములయిన దగ్గులు తగ్గిపోవును.

Friday, 9 August 2013

పిల్లలకు మూత్రం రాకపోతే:

నిమ్మకాయల్లోని గింజల్ని నీళ్ళతో నూరి, ఆ గంధాన్ని బొడ్డుపైన రాసి, చల్లటి నీళ్ళను కొద్ది కొద్దిగా బొడ్డుమీద పోస్తూవుంటే బిగించుకుపోయిన మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది.

తెలుసుకుందాం : పెద్దలంటే ఎవరు?

మన అమ్మ, నాన్న, తాతయ్య. నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య లే పెద్దలు కాదు. వీరితో పాటు మనకు చదువు నేర్పే గురువులు. మనం నివసించే ప్రాంతంలోని వృద్ధులు వీరంతా కూడా పెద్దలుగానే పరిగణించబడతారు. వీరందరితో మాకెంటి పని? అని నిర్లక్ష్యం చూపించకూడదు. మన స్వదేశానికి చెందిన తరతరాల ప్రకృతి విజ్ణానమంతా వీరి వద్దనే వుంది. ఒక్కొ వృద్ధుని వద్ద కొన్ని వందల వేల జీవితానుభవాలు, ప్రకృతి రహస్యాలు దాగి వుంటయ్. కాబట్టి వారందరినీ గౌరవిస్తూ తీరిక సమయాలలో వారి వద్ద కూర్చుని ఆ రహస్యాలను గ్రహిస్తూ వుండాలి.

తెలుసుకుందాం : తల్లి దండ్రులు తొలి గురువులు

ఆఫీసుల్లో  ఎక్కువ అనుభవం వున్నా వారికే ఎక్కువ ప్రాముఖ్యత వున్నప్పుడు అమ్మ, నాన్న / అత్త, మామలకు ఎందుకు లేదు ? ?
మనం పని చేసే ఆఫీసులో ఎక్కువ అనుభవం (experience) వున్న వాళ్ళను ఎందుకు తీసుకుంటారు? ఎందుకు వారికి ఎక్కువ జీతం, సదుపాయాలు కల్పిస్తారు?
ఎందుకంటే వాళ్ళ అనుభవం లో ఎన్నో పొరపాట్లు చేసి/ చూసి వుండవచ్చు, అంతే కాక ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దాలో కూడా తెలుస్తుందని, వాళ్ళు నాయకత్వం వహిస్తే అలాంటి పొరాట్లు జరగవు, ఒక వేళ జరిగినా తట్టుకునే శక్తి, వాటిని సరిదిద్దే అనుభవం, ఓర్పు వుంటుంది కాబట్టి. మరి మన ఇంట్లో పెద్దవాళ్ళ అనుభవాలను ఎందుకు మనం ఉపయోగించుకోవటం లేదు? వాళ్ళు  లేకపోతేనే ఎంతో నష్టపోతాము. ఎంత చదువుకోలేని వారిలో ఐనా వేదాల సారం వారిలో ఇమిడి వుండి వుంటుంది వారి జీవితానుభవంతో. వాళ్ళ సలహాలు ఎంతో విలువైనవో మాటల్లో చెప్పలేనిది. తల్లిదండ్రులను గౌరవించుదాము. వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించి పాపం చేయకూడదు.. వాళ్ళు మనల్ని మన చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో అంతకంటే బాగా చూసుకోవాలి.
అత్త మామలు = వేరొకరి(భర్త / భార్య) తల్లిదండ్రులే కద

తెలుసుకుందాం:జాగృతి

అర్థరాత్రీ దాక  టీ.వీ.లు చూస్తూ
పొద్దు ఎక్కేదాక మొద్దు నిద్దురపో్తూ
ప్రకృతికె వ్యతిరేక జీవితము గడుపుతూ
ఇది గొప్ప ఫ్యాషను ఇది గొప్ప స్టైలని
పిచ్చి కూతలు బాగ కూశారయా
ఎన్నెన్నొ రోగాలతో ఎడ్చేరయా...

వంట ఇంట్లో ఎన్నో దినుసులున్నా గాని
ఏ దినుసు ఎందుకు ఉపయోగ పడుతుందో
తెలియనట్టీ ప్రజలు తెగులు బట్టిన ప్రజలు
దినుసులతో రోగాలు తగ్గుతాయా అంటూ
దీర్ఘాలు బాగా తీసేరయా
దీర్ఘ రోగాలతో కుమిలి కమిలేరయా

సీకాయ కుంకుడు ఇంట్లోనె వుంటాయి
వెంట్రుకలను చక్కగా పోషిస్తు వుంటాయి.
ఏ నష్టము లేని కుంకుడును వదిలేసి
వెంట్రుకలు తినివేయు షాంపూలు వాడుతూ
జుట్టు పోతుందంటు ఏడ్చేరయా
బట్ట బుర్రలతోడ బ్రతికేరయా..

జల చికిత్స :

జలజల జల జల - జలజల మని రాలురా!!
జలముతోనే దీర్ఘకాల - రోగాలే కూలురా!!
జల మహా భూతమే -  జగతికాదరువురా!!
జల చికిత్సలను నేర్చి - జవ శక్తిని పొందరా!!

క్రింద తడి బట్టను - పైన పొడి బట్టను
మొల చుట్టూ గుండ్రంగా - ఒక గంట కట్టరా
జననాంగ గర్భాశయ - మూత్రపిండ వ్యాధులు
అతి మూత్రం ఆర్శమొలలు - అతివల ఋతుబాధలు
శీఘ్రస్కలన దోషాలను - వృషణాల లోపాలు
జలవిదుచ్ఛక్తితో - సమియించి పోవురా

పొట్ట వీపు చుట్టూరా - తడి బట్టను కట్టి
పైన పొడి బట్టను - గంట చుట్టి వుంచితే
ప్లీహంలో వాపులు - తేప తేప తేపులు
కాలేయపు ఆవిర్లు - క్రూరమైన కామెర్లు
కడుపు వాపు కడుపు నెప్పి - కడుపులోని మంటలు
ప్రేవుల్లో అరుపులు - పటా పంచలౌనురా

ఆరడుగుల పొడవున్న - అయిదంగుళ వెడల్పున్న
తడిబట్టను గొంతుచుట్టూ - గుండ్రంగా చుట్టాలి
అదే పొడవు వెడల్పున్న - పొడి బట్టను పైన గట్టి
దానిపైన మరో నూలు - బట్ట కట్టి ఉంచితే
గొంతువాపు గొంతుపుండు - థైరాయిడ్ గ్రంధులు
అన్ని గొంతు రోగాలు - అంతమైపోవురా

జలమనగా శ్రీమహా విష్ణువే తెలుసుకో
సృష్టీ స్థితి లయలలో - స్థితి రూపమే పోల్చుకో
భూమిలోన మూడొంతులు - జలమున్నది చూసుకో
మన మానవ దేహంలో - మూడొంతులు జలమేనూ
సకల జీవరాశులకూ - జలమేరా ప్రాణాధారమూ
జలము విలువ తెలుసుకుంటె - జయము నీదౌను

స్త్రీల అతిఋతురక్తస్రావానికి(Over Bleeding):

1. బాగా మగ్గిన అరటిపండ్లు రెండు లేక మూడు తీసుకుని వాటిలో పేరిన నెయ్యి 30 గ్రాములు, చిన్న ఏలకుల పొడి 3 గ్రాములు కలిపి పిసికి ఉదయం,సాయంత్రం తింటుంటే అతి ఋతురక్తస్రావం రెండు మూడు రోజుల్లొ ఆగిపోతుంది
2. అతిమధురంపొడి 5 గ్రాములు, ఎండు ద్రాక్షపండ్లు 20 గ్రాములు కలిపి మెత్తగా దంచి రెండుపూటలా చప్పరించి తింటుంటే అతిఋతురక్తం క్రమంగా తగ్గి ఆగిపోతుంది.
3. పచ్చివక్కలపొడి 50 గ్రాములు, పిస్తా పప్పు 50 గ్రాములు, పటిక బెల్లం 30 గ్రాములు కలిపి మెత్తగా నూరి నిలవజెసుకోవాలి. పూటకు 10 గ్రాములు మోతాదుగా మూడుపూటలా సేవిస్తుంటే ఆగకుండా ప్రవహించే ఋతురక్తం ఆగిపోతుంది.

మలబద్ధకం ఎందుకు వస్తుంది:

ప్రపంచంలో రకరకాల వ్యాధులకు రకరకాల ఔషధాలు అమ్ముడవుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తైతే వాటీకి రెట్టీంపు ఔషధాలు కేవలం మలబద్ధానికే అమ్ముడవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
మనలో రెండు మూడు రోజులకొకసారి విరేచనమయ్యేవారు, అదీ మందు తీసుకుంటే గాని విరేచనం కాని వారు అనేకమంది వున్నారు.
మలబద్ధకం రోగాలకు మూల కారణం అని అంటారు.
విరేచనమును గుర్తించుటయే మనకు మన ఆరోగ్యం గురించి నిజమైన గుర్తింపని గ్రహించాలి.
1. విరేచనము మరీ గట్టీగా రాళ్ళవలె వుండరాదు, మరీ నీళ్ళవలె వుండరాదు.
2. మలము దుర్గంధ రహితముగా వుండాలి.
3. తాడు ఆకారంలో విరేచనం అవ్వాలి.
4. మల విసర్జన సమయంలో ముక్కీ మూలిగీ ప్రయత్నంతో విరేచనమయితే అది మలబద్ధకం క్రిందే లెక్క.
5. ప్రతి రోజూ ఒకే సమయంలో ప్రయత్నం లేకుండా దానంతటది విసర్జింపబడీతే వ్యాధి లేనట్లు.
దానిని కాల విరేచనమని అంటారు వైద్య పరిభాషలో.
మలబద్ధకం వలన శరీరం సోమరితనము ఆవరించుకుంటుంది. పొట్ట, తల బరువుగా వుంటాయి. వళ్ళంతా పొడిబారి పెళుసుగా తయారవుతుంది.నిద్ర సరిగా పట్టదు. మెదడు మొద్దు బారినట్లంటుంది. ఆకలి కూడా మందగిస్తుంది. అంతే కాదు ఈ లక్షణాలతోపాటు అనేక రోగాలు తలెత్తడానికి అవకాశం కలుగుతుంది.
మలబద్ధకం నయం చేసుకోవడానికి మనకి మన జీర్ణక్రియ గురించి కొంచమైనా తెలిసి వుండాలి.
మనము తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత సరీరోపయోగత్వాలను శరీరంలోపల వుంచుకొని మిగిలిన పిప్పిని మలమూత్ర రూపాలలో బయటకు నెట్టివేస్తుంది. మలబద్ధకం వలన అది బయటకు పోనట్లయిన మలము అక్కడే వుండి కుళ్ళడం మొదలు పెడుతుంది. పురుగులు పుడతాయి. దుర్వాసనతో కూడిన గ్యాస్(అపాన వాయువు) ఉత్పన్నమవుతుంది. గ్యాస్ పైకి లేవడం వ్యాపించడం దాని సహజ గుణం. ఆ గ్యాస్ శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి రక్తమును విషపూరితము చేస్తుంది. ఇది వ్యాధులకు నాంది అన్నమాట.
జీర్ణాశయంలో ఆహారం జీర్ణమైన తర్వాత అది చిన్న ప్రేగులలోకి వెళుతుంది. చిన్న ప్రేగులు ఆహారములోని ఆవస్యక తత్వాలను పీల్చుకొన్న తర్వాత మిగిలినది పెద్ద ప్రేగులలోనికి చేరుతుంది. ఇంకా మిగిలి వున్న శక్తితత్వాలను గ్రహించి వ్యర్ధ పదార్ధమును మలరూపంలో నెట్టివేస్తుంది. సహజంగా జరగవలసిన ఈ కార్యములో అవరోధము కలుగుటయే మలబద్ధకముగా పరిణమిస్తుంది. దాని నివారణకు మదులు ప్రయోగింపబడుతుంటాయి. కాని ఆ మందులు ఎంత వేడిని కలిగిస్తాయో తెలుసుకోవాలంటే మందు యొక్క సూక్ష్మ మోతాదును కంట్లోగాని, ముక్కులో గానే వేసుకుంటే మందు మంటకు నీరు ఊరి ధారగా కారుతుంది. కడుపులో కూడా ఇదే విధంగా ఊరిన ఈ నీరు జీర్ణకోశము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల నుండి ప్రవహిస్తూ తనతోపాటు తడిసి మెత్తబడిన మలమును బయటకు తెస్తుంది. దీనిని అందరూ మలబద్ధక నివారణగా భావిస్తారు. నెమ్మది నెమ్మదిగా ప్రేగులు మందుకు అలవాటు పడి స్వయంగా పనిచేయడం ఆగిపోతుంది.దానితో మొదటికంటే మరింత పవరున్న మందులు వాడవలసి వస్తుంది. ఇలా కొన్ని సార్లు జరిగేసరికి మందులు వ్యాధికి మిత్రులైపోతాయ్. రెండవది అధికంగా వాడిన మందుల ఉష్ణంతో వేడెక్కిన ప్రేగులలోని సున్నితపు పొర కమిలిపోయి పేగుపూత(అల్సర్) మారుతుంది.
అందుకని సహజసిద్ధంగా విరేచనం జరిగేటట్లు చూసుకోవాలి

తెలుసుకుందాం

తల్లి తొలి దైవం, తల్లి తొలి ఉపాధ్యాయురాలు, తల్లి తొలి స్నేహితురాలు... ఇప్పుడు తల్లి బరువౌతుంది.. వృద్ధాశ్రమాలపాలౌతుంది..అదే విధంగా మనం పుట్టగానే పెంచటం కష్టం అని ఏ అనాధాశ్రమంలోనో మనల్ని పడెస్తే మనం ఎమి అయ్యి వుండేవళ్ళమో.....

తెలుగు భాష తీపి : శ్రీకృష్ణరాయలవారిచే....చాటు పద్యం..

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స......

తెలుసుకుందాం

ఆసన, ప్రాణాయామాలు వీర్య రక్షణకు మూల సాధనాలు

బట్ట తలపై కూడా జుట్టు రావటానికి:

ఉల్లి ( onion ) రసం ఒక చెంచా + ముల్లంగి రసం ఒక చెంచా కలిపి మెత్తటి బట్టతో 15 నుంచీ 30 నిముషాలు నింపాదిగా (గట్టిగా రుద్దితే చర్మం కములుతుంది జాగ్రత్త) రుద్ది గంట ఆగి కుంకుడు రసంతో కడుగుతుంటే మెరిసే బట్టతల మీద కుడా వెంట్రుకలు వస్తాయ్.
2 లేదా 3 నెలలకు సన్నగా వెంట్రుకలు రావటం మొదలయ్యాక గుండు చెసెయ్యాలి లేదా వాటి వరకూ షేవ్(గుండు) చెసెయ్యాలి. తరవాత మళ్ళీ పైన చెప్పిన రసం రాయాలి. మళ్ళీ తీసెయ్యాలి. ఇలా ఆ వెంట్రుకలు మందంగా వచ్చే వరకూ 5 లేదా 6 సార్లు చేయాలి.
ఈ యొగంతో జుట్టు వచ్చినవారు దయచేసి ఇదే సమస్యతో బాధ పడుతున్న వారికి చెప్పి సహాయం చేయండి.
గమనిక: ముల్లంగి దొరకకపొతే ఒక్క ఉల్లి రసంతో కూడా పైన చెప్పినట్లు చేయవచ్చు.

చుండ్రుకు:

1. వేపాకులు గుప్పెడు తీసుకుని, కాస్త నలగ్గొట్టి కప్పు నీళ్ళలో వేసి మరగపెట్టాలి. పావు కప్పు వచ్చాక చల్లారాక, వడకట్టి గోరువెచ్చగా వున్నప్పుడు తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి). ఈ యోగంతో జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
(లేదా)
2. 100 గ్రాముల కొబ్బరి నూనెలో 30 గ్రాముల నిమ్మరసం కలిపి కేవలం నూనె మిగిలినంత వరకు మరిగించాలి. తరవాత గొరువెచ్చగా(వేడిగా వున్నపుడు వేయరాదు) అయ్యాక 5 గ్రాముల ముద్ద కర్పూరం కలపాలి. తరవాత తలకు పట్టించి కాస్త మసాజ్ చేసుకుని గంట అయ్యాక తలకు స్నానం చెయ్యాలి(మంచి ఫలితంకొసం కుంకుడు కాయ రసం ఉపయోగించాలి).

పై యోగాలు నెను చేసి చూసాను, చాలా మంది కి చెప్పాను. చెప్పినవారందరికి 3 లేదా 4 సార్లు చేసేసరికే మంచి ఫలితాలు కనిపించాయని చెప్పారు.
చుండ్రు, జుట్టు రాలే సమస్య వున్నవారు పై వాటిని వాడి మీలా బాధపడే వారికి కూడా ఇదే సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను.

తెలుసుకుందాం

రోజూ 15 గుంజీలు తీస్తే 100 సంవత్సరముల వరకూ మోకాళ్ళ నొప్పులుండవు.

సమస్త రోగాలకు ముఖ్యంగా మనం రోజూ తీసుకునే విష రసాయనాలతో పండిన పదార్ధాలను తినటం వలన Cancer రాకుండా :

ఒక 5 కృష్ణ తులసి ఆకులను సాయంత్రం గోరు తగలకుండా తుంచి రాగి చెంబులో వేసి నీళ్ళు పోసి మూత పెట్టి చెక్క పీట/stool మీద పెట్టాలి. ఉదయం లెవగనే స్నానం ముగించుకుని తూర్పుకు తిరిగి ఆ నీటిని త్రాగాలి.
ఎందుకు ఇలాగే చేయాలి?
తులసి లో పాస్పరస్, గంధకం అనే రెండు మూలకాలు ఉండటం వలన, నీటి లో విద్యుత్ శక్తి , రాగి లోహం తో కలిసి విద్యుత్ అయస్కాంత శక్తి తయారవుతుంది.
ఈ విద్యుదయస్కాంత శక్తి మన శరీరం లొ వున్న సప్త ధాతువులలో రక్తమును ఆకర్షించి శుద్ధి చేస్తుది. ఎందుకంటె రక్తం లొ ఇనుము వుంటుంది.

సమస్త రోగాలకు ముఖ్యంగా మనం రోజూ తీసుకునే విష రసాయనాలతో పండిన పదార్ధాలను తినటం వలన Cancer రాకుండా :

ఒక 5 కృష్ణ తులసి ఆకులను సాయంత్రం గోరు తగలకుండా తుంచి రాగి చెంబులో వేసి నీళ్ళు పోసి మూత పెట్టి చెక్క పీట/stool మీద పెట్టాలి. ఉదయం లెవగనే స్నానం ముగించుకుని తూర్పుకు తిరిగి ఆ నీటిని త్రాగాలి.

ఎందుకు ఇలాగే చేయాలి?
తులసి లో పాస్పరస్, గంధకం అనే రెండు మూలకాలు ఉండటం వలన, నీటి లో విద్యుత్ శక్తి , రాగి లోహం తో కలిసి విద్యుత్

అయస్కాంత శక్తి తయారవుతుంది.
ఈ విద్యుదయస్కాంత శక్తి మన శరీరం లొ వున్న సప్త ధాతువులలో రక్తమును ఆకర్షించి శుద్ధి చేస్తుది. ఎందుకంటె రక్తం లొ ఇనుము వుంటుంది.

తుమ్ములు ఆగకుండా వస్తుంటే:

తుమ్ములు ఆగకుండా వెంట వెంటనే వస్తూవుంటే, కొత్తిమీరిగానీ, గంధం పొడిగానీ వాసన చుస్తూ వుంటే వెంటనే తుమ్ములు ఆగిపోతయ్.

కంటి పొరలు కరుగుటకు:

వారానికి రెండు సార్లు కుంకుడు కాయ రసంతో తలస్నానం చేస్తూ వుంటే పొరలు కరిగిపోతయ్.
ఎలా అంటే, స్నానం చేసినప్పుడల్లా ఎంతో కొంత కుంకుడు రసం కళ్ళలో పడుతుంది. కుంకుడు రసం తగిలితే కంటిలోని పొరలు కరిగిపోతయ్. అదే షాంపూలతో తలస్నానం  చేస్తూ వుంటే ఆ షాంపూలలో కలిసి వుండే రసాయన పదార్ధాలు కళ్ళలో పడి క్రమంగా కంటి పొరలు ఏర్పడి కంటిచూపు దెబ్బతింటుంది. అందువల్ల కుంకుడుతో తలస్నానం శ్రేష్టం.

కాలి ఆనెలకు, వ్రణాలకు, దురదలకు, రక్త/చర్మ శుద్ధి, ముళ్ళు మేకులు ఇరుక్కుంటే:

జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెకాయలు హరించిపోతయ్.
తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతయ్.
వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలే్టట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతయ్.
పసుపుపొడి 3 గ్రాములు, ఉసిరిక పొడి 6 గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధి.
మారేడు ఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీ్రంలో ఇరుక్కున్న ముళ్ళు, మేకులు బయటకొస్తయ్.

దగ్గును దూరం చేయండి..

* దోరగా వేయించిన మిరియాల చూర్ణం పూటకు 1 లేదా 2 గ్రాములు తేనెతో కలిపి 2 పూటలా తింటుంటే దగ్గు, గొంతులో నస తగ్గుతాయి.
* లవంగాలను నిప్పుల్లో వేడి చేసి చల్లగా అయ్యాక బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుతూ వుంటే దగ్గు, నస, గొంతులో గుర గుర పోతాయి.(రోజుకు 5 లేక 6 సార్లు)
* ఉసిరి పండ్లను ఎండించిన చూర్ణం, పాలతో కాచి నెయ్యి కలిపి తాగిన సర్వ విధములయిన దగ్గులు తగ్గిపోవును.

ఉసిరి కాయలతో స్త్రీల వ్యాధులకు స్వస్తి

స్త్రీల తెల్లబట్ట వ్యాధికి(white discharge) :
ఉసిరిక పండ్లలో(పెద్ద ఉసిరి) వుండే గింజలను దంచి పొడి చేసి సమంగా పటికబెల్లం పొడి కలిపి రెండు పూటలా పూటకు ఒక చెంచా మోతాదుగా మంచి నీటితో సేవిస్తుంటే తెల్లబట్ట వ్యాధి తగ్గిపోతుంది.

స్త్రీల ఎర్ర బట్ట వ్యాధికి(over bleeding):
ఉసిరక కాయల పొడి ఒక చెంచా, మంచి తేనె ఒక చెంచా కలిపి తింటూ వుంతే ఎర్రబట్ట వ్యాధి తగ్గిపోతుంది.

తెలుగు భాష తీపి

లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు
పెంచీకటి కవ్వల నెవ్వం డే కాకృతి వెలుగు నతిని నే సేవింతుn 

సోంపు మనకు ఎలా ఉపయోగపడుతుంది?

* సోంపు గింజలు నోట్లో వేసుకొని తరచుగా నములుతుంటే నోటి దుర్వాసన పోతుంది
* కప్పు సోంపు కషాయంలో సైంధవలవణం 2 గ్రాములు కలిపి తాగుతుంటే గుండేనొప్పి తగ్గుతుంది.
* సోంపు పొడి 10 గ్రాములు, పటీక బెల్లం 10 గ్రాములు తిని పాలు తాగుతుంటే తల్లి పాలు పెరుగుతాయి.
* సోంపు 3 గ్రాములు, ధనియాలు 3 గ్రాములు, నెయ్యి 10 గ్రాములు తింటుంటే దురదలు తగ్గుతాయి.
* పొట్టూ తీసిన సోంపు గింజలపప్పు 3 గ్రాములు నిద్రించేముందు తింటుంటే మెదడుకు మహాబలం
* కప్పు సోంపు కషాయంలో కండ చక్కెర 10 గ్రాములు కలిపి తాగుతుంటే తలనొప్పులు తగ్గిపోతయ్.
* సోంపు, చక్కెర సమంగా కలిపిన పొడి 10 గ్రాములు తింటుంటే తల తిరగడం తగ్గుతుంది.
* అరకప్పు గోరువెచ్చని సోంపు కషాయంలో తేనె 10 గ్రాములు కలిపి తాగుతుంటే దగ్గు తగ్గుతుంది.

తెలుగు గడ్డ గొప్పతనం

మన భారత దేశంలో 22 సంపూర్ణ భాషలు, అలాగే 3280 వాడుక భాషలు ఉన్నయ్. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని సంపూర్ణ భాషలు, ఇన్ని ఉపభాషలు లేవు. మనదేశంలో ఎన్నొతరాలుగా మనుగడలో వున్న సంపూర్ణ భాషలకు, వాడుక భాషలకు మూలం ప్రేరణ స్పూర్తి సంస్కృత భాషేనని, ఆ కారణంగానే ' జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును' అనే నానుడి పుట్టిందని భాషా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

తెలుగు భాష తీపి

రావి పండ్లను తిన్న రమణి గర్భము పండు
నలుబది దినములు ఉదయ కాలమందు
రావిలోన కలదు ప్రకృతి రహస్యమూ
తెలుసుకొనవె చెల్లీ తెలుగు తల్లీ!!!

తెలుగు భాష తీపి

సందు సందునందు సంతాన కేంద్రాలు
లక్షలాది సొమ్ము లాగుచుండె
రావి పండ్లు తిన్న రమణి గర్భము పండూ
తెలుసుకొనవె సుమతీ తెలుగు యువతీ!!!

కడుపు నెప్పికి చిట్కాలు:

* వాము నేతిలో వేయించి ఉప్పు కలుపుకుని మొదటి రెండు ముద్దలు అన్నం తింటే నొప్పి తగ్గిపోతుంది.
* శొంఠి, ఉప్పు, మిరియాలు, వాము సమ భాగములుగా చేర్చి 5 గ్రాములు పరగడుపున నమిలి తిని కొంచం నిళ్ళు త్రాగితే కడుపు నెప్పి తగ్గుతుంది.
* శొంఠి చూర్ణం 5 గ్రాములు, తగుమాత్రం చక్కెర కలిపి వేడి నీళ్ళతో తీసుకుంటే అజీర్ణం వల్ల వచ్చే కడుపునెప్పి, కడుపు వుబ్బరం తగ్గిపోతుంది.
* పాల పండ్ల వల్ల వచ్చే అజీర్తికి, మజ్జిగ తాగితే పోతుంది.

పసి పిల్లల వాంతులకు :

ఏలక గింజలు, దాల్చిన చెక్క సమంగా కలిపి నూరి, 3 గ్రాముల చూర్ణాన్ని తేనెతో కలిపి పిల్లలకు తినిపిస్తే వాంతులు వెంటనే కట్టుకుంటాయ్.

పిల్లల సుఖ విరేచనానికి:

పిల్లలకు అజీర్తిచేసి, విరేచనం కాకుండ బాధపడుతూ వుంటే, పొట్టమీద ఆముదం రాసి గోరు వెచ్చటి కాపడం పెడితే వెంటనే విరేచనం అవుతుంది

తులసి అమ్మ :

" తులాంశ్యతి ఇతి తులసి " అంటే, కొలవటానికి వీలులేనిది, వెల కట్టటానికి అతీతమైనది అని అర్ధం. అంతేకాదు, " తు " అంటే మృత్యువును " లసతి " అంటే ధిక్కరించునది. అంటే చావును ఆపగలిగేది అని అర్ధం.
    ఈ అనంతమైన సృష్టిలో మనకు కనిపించకుండ వుండే మానవాతీత దైవ శక్తులన్నీ, ఎల్లప్పుడూ తులసి చెట్టును ఆశ్రయించి వుంటయ్ అని మాఘ పురాణం పేర్కొంటుంది. అందుకే తులసి చెట్టును పూజించి తీ్ధం సేవించి, హాయిగా బ్రతకమని మన పెద్దలు సూచించారు.

తులసి చెట్టు లేని వారు, ఎలా ఐనా సరే ఒక మొక్క తెచ్చుకుని పెంచుకుని దాని మంచి ఫలితాలను వినియొగించుకోండి.

తులసితో - శోభి(సిబ్బెం) మచ్చలను పోగొడదాం:

తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతయ్.

తులసితో - చర్మరోగాలను పోగొడదాం:

కృష్ణ తులసి ఆకులు, నిమ్మపండు రసం కలిపి మెత్తగా నూరి ఆ గుజ్జును రెండు పూటలా పైన పట్టిస్తుంటే ఎంతో కాలం నుండీ వేధించే గజ్జి, చిడుము, తామర, దురదలు మొదలైన చర్మ సమస్యలు అతిసులువుగా హరించిపోతయ్.

కడుపు నొప్పికి :

పచ్చి పుదీనా ఆకులు ఏడు, ఏలక కాయ ఒకటి ఈ రెండు పదార్ధాలు ఒక తమలపాకులో పెట్టీ కిళ్ళీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగిన తరువాత కొద్ది కొద్దిగా మంచినీళ్ళు తాగితే, ఆ మరుక్షణమే కడుపు నొప్పి కనుమరుగైపోతుంది.

తులసితో - ప్లీహ(Spleen related Problems)రోగాన్ని పోగొడదాం :

ఉదరంలో ప్లీహం చెడిపోయి ఎడమవైపు పొట్ట ఎత్తుగా పెరిగిన స్థితిలో కృష్ణతులసి ఆకులను దంచి తీసిన రసం రెండు చెంచాల మోతాదుగా రెండు పూటలా తాగుతుండాలి. ఈ చిన్న ప్రయోగంతోనే ప్లీహ వాపు తగ్గిపోయి చక్కని ఆరొగ్యం సిద్ధిస్తుంది. ఇదే వ్యాధి పిల్లలకు వస్తే పై మోతాదులో సగం తగ్గించి వాడటం వల్ల వారికి కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది.