Pages

Monday, 28 October 2013

ఎక్కిళ్ళకు:

* ఆవు పాలు కాచి వేడిగా వున్నప్పుడే తాగుతుంటే అప్పటికప్పుడే ఎక్కిళ్ళు తగ్గిపోతయ్.
* కంది పొట్టు నిప్పులమీద వేసి ఆ పొగను పీలుస్తుంటే ఎక్కిళ్ళు ఆగిపోతయ్.
* నిమ్మరసం 20 గ్రాములు, నల్లుప్పు 3 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి సేవిస్తుంటే ఎక్కిళ్ళు ఆగిపోతయ్.
* నీరుల్లిగడ్డరసం 3 చుక్కలు ముక్కుల్లో వేసి పీలుస్తుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతయ్.
* సొంఠి 3 గ్రాములు, నిమ్మరసం 10 గ్రాములు కలిపి సేవిస్తుంటే పైత్యపు ఎక్కిళ్ళు తగ్గిపోతయ్.

Saturday, 26 October 2013

తెలుసుకుందాం...

ఏనాడు మనదేశంలో ఇంగ్లీషువైద్యశాలలు వెలిశాయో ఆనాటినుండే మన భారతీయులంతా తమ స్వయం సంరక్షణా పరిజ్ణానాన్ని కోల్పోతూ ప్రతి చిన్న అనారోగ్యసమస్యకు ఆసుపత్రులపైనే ఆధారపడుతూ తమ కష్టార్జితాన్ని తామనుభవించకుండా మదులకోసం ధారపోస్తూ నిత్యరోగిష్ణులై చవలేకబ్రతికే నికృస్టస్థితికి చేరుకుంటున్నారు.ఇప్పటికైనా కళ్ళుతెరచి ఆయుర్వేద స్వయం సంరక్షణామార్గాలని అవలంభించాలి...

తెలుసుకుందాం...

లక్షలమంది వైద్యులు, లక్షలాది మందుల షాపులు, వేలాది మందుల తయారీకర్మాగారాలు లేని కాలంలో మన భారతీయులంతా తమ అరోగ్యరక్షణకు తమ ఇంటిపైన, తమ ఊరిపైననే ఆధారపడేవారు. ఎంత పెద్ద ఘోరమైన వ్యాధినైనా తమ ఊర్లోని అనుభవజ్ణులైన ఆయుర్వేదవైద్యులద్వారనే పరిష్కరించుకునేవారు. ఈనాడు మనం చెప్పుకునే వందల వేల జబ్బులన్నీమనుషులకు సోకకుండా తమ జీవన విధానం ద్వారా ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేవారు. తమ ఇంటిలోని దినుసులను, ఆహారపదార్ధాలను, తమ ఊరిలోని మొక్కలను, చెట్లను అపుర్వమైన ఔషధాలుగా వాడుకుంటూ నూరేండ్లకు పైగా నిరోగులుగా నిత్య సంతోషంతో జీవించగలిగారు.

తెలుసుకుందాం....

ఈనాడు నూటికి నూరుమంది మన భారతీయులంతా మందులమ్మే అంగళ్ళలో, వైద్యం చేసే ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యం దొరుకుతుందని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎక్కువ ఖరీదున్న మందులే బగా పనిచేస్తాయని, ఎక్కువ ఫీజు తీసుకుని లక్షలరూపాయల బిల్లులు వేసే ఆసుపత్రుల్లోనే నాణ్యమైన చికిత్స లభిస్తుందనని ప్రతిఒక్కరూ ఆశిస్తున్నారు. ఇలాంటి వారందరిలో ఎంతో ఖర్చుపెట్టి ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కూడా ఏ ఒక్క వ్యాధి పూర్తిగాతగ్గకపోవడం, ప్రతివ్యక్తి జీవితకలపురోగులుగా మారడం కళ్ళముందే కనిపిస్తున్నా కూడా ఈ విధానం సరైనది కాదు అనే నిజం ఏ ఒక్కరికీ తెలియడంలేదు.

కాళ్ళ పగుళ్ళకు:

తుమ్మ బంకను మంచి నీటితో మెత్తగా నూరి కాళ్ళ పగుళ్ళ పైన రోజూ రాత్రి నిద్రపోయే ముందు లేపనం చేస్తూ వుంటే క్రమంగా కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతయ్.

పిప్పి పన్ను/దంత పోటుకు :

మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వారా  పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి/దవడనొప్పి తగ్గిపోతాయ్.

Friday, 25 October 2013

బహిష్టు నొప్పికి:

1. మిరియాలు, బెల్లం, నెయ్యి సమ భాగాలు కలిపి దంచి మాత్రలు (కుంకుడుకాయ పరిమాణం  కంటే కాస్త పెద్దగా)తయారు చేసి మూడు పూటలు బుగ్గను పెట్టుకుని చప్పరిస్తూ తింటుంటే మాత్ర అయిపోయేలోపు బహిష్టు నొప్పి తగ్గిపోతుంది.

2. ఎర్ర ఉత్తరేణి ఆకులు కొన్ని తీసుకొని కడిగి వాటిలో పంచదార కలిపి నమిలి మింగితే బహిష్టు నొప్పి ఐదు నిముషాల్లో పూర్తిగా తగ్గిపోతుంది.

పై రెండు యోగాలలో ఏది వీలుగా వుంటే అది ఆచరింఛండి.

తులసి పొడి అమృతం

తులసి ఆకులు నీడలో ఆరపెట్టి, పొడి చేసి అన్నంలో(3 చిటికెళ్ళు), కూరల(1 చిటికెడు)లో వాడటం వలన ఆహారంలో విషపదార్ధాలు తొలగిపోయి అన్నం, కూరలు అమృతంగా తయారై తొందరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ముఖంలో తేజస్సు కలిగి మనసు ప్రశాంతంగా వుంటుంది.

స్వాధిష్టాన చక్రం ఏమి చేస్తుంది, సరిగా పనిచేయకపోతే ఏమవుతుంది?

స్వాధిష్టాన చక్రం వలననే మానవులకు శిరస్సులో మేధస్సు వృద్ధి పొందుతుంది. యుక్తా యుక్త విచక్షణా జ్ణానము, సూక్ష్మ గ్రాహ్యత, సునిశిత బుద్ధి, ధారణా శక్తి, ఆలోచన పటిమ, ఇవన్నీ ఎల్లప్పుడూ వృద్ధి పొందటంలో కూడా ఈ స్వాధిష్టాన చక్రమే మూలకారణం అవుతుంది.

ఇది అపాన వాయువును అదుపులో వుంచి మల మూత్రాలు సాఫీగా విడుదల అయ్యేటట్లు చేస్తుంది. నాభి క్రింది భాగంలోని మూత్రాశయము,మలాశయము, మూత్రపిండాలు, మూత్ర గ్రంధి, మూత్ర నాళాలు మొదలైన భాగాలన్నీ స్వాధిష్టాన చక్రము యొక్క ఆధీనంలో వుంటాయి.

ఈ చక్రం సరిగా పని చేయకపోతే:
ఏ కారణాల వలనైనా ఈ చక్రం యొక్క క్రియలలో లోపం జరిగితే, మానవులకు తెలివితేటలు తగ్గిపోతయ్. అలోచన శక్తి, ప్రతిభ తగ్గుముఖం పడతయ్.
మూత్రాశయం, మూత్రపిండాలు మొదలైన పైన పేర్కొన్న అవయవాలలో అనారోగ్యం కలుగుతుంది. మలబద్ధకం, మూత్రావరోధం, మూత్రంలో మంట, మూత్ర పిండాలలో వాపు, రాళ్ళు ఏర్పడటం వంటి అనేకానేక సమస్యలు ఏర్పడుతూ వుంటాయి.

ఈ చక్రం యొక్క బీజాక్షరం 'వం '

Tuesday, 22 October 2013

గర్భిణి పొట్టలో శిశువు కదలకపోతే....

గ్లాసువేడిగంజి ఆవునెయ్యి 20 గ్రాములు తాగిస్తే గర్భిణి పొట్టలో కదలని శిశువు కదులుతుంది.

నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?చిట్కా...

వేళకు భుజించకుండా వేళతప్పి తినడంవల్ల, అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కుళ్ళిపోయి పొట్టలోనే కంపుకొడుతూ ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది. మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
అలాంటి వారు తమ తప్పులను తెలుసుకుని రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి, భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి. ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుంధభరితమౌతుంది.


Wednesday, 16 October 2013

పొడిదగ్గుకు:

ఒక తమలపాకు ఈనెలు తీసివేసి మూడుచిటికెల వామ్ము పెట్టి కిల్లీలాగా చుట్టి బుగ్గనపెట్టి,నెమ్మదిగా నములుతూ రసం మింగుతుంటే  పొడి దగ్గు తగ్గుతుంది. లేదా వట్టి వాముగింజల్ని నోట్లో వేసుకుని మెల్లమెల్లగా నమిలితింటూ అనుపానంగా గోరువెచ్చని నీళ్ళు తాగుతుంటే పొడి దగ్గు, దమ్ము, ఆయాసం తగ్గుతయ్.

Tuesday, 15 October 2013

మొటిమలకు/మచ్చలకు లవంగ చూర్ణం:

వేయించిన లవంగాల పొడి 100 గ్రాములు, నల్ల జీలకర్ర పొడి 100 గ్రాములు వస్త్రఘాళితం పట్టి నిలవజేసుకోవాలి. తగినంత పొడి మంచి నీటితో నూరి పైన పూస్తుంటే మొటిమలు,మచ్చలు హరించిపోతయ్.

Sunday, 13 October 2013

పిల్లలు పక్కలో మూత్రం పోస్తే:

నిద్రించే ముందు కప్పు గోరువెచ్చని ఆవుపలల్లో వయసును బట్టి 1 నుండీ 3 చిటికెల ఆవాలపొడీ, కొంచం పటికబెల్లం పొడి కలిపి తాగుతుంటే వారం రోజుల్లో పిల్లలు పక్కలో మూత్రం పోయడం ఆగిపోతుంది.

Note: మార్గం వుంది కదా అని ఈ యోగాన్ని మరీ పసి పిల్లల మీద దయచేసి ప్రయోగించకండి.

క్షయ రోగానికి ఆవు పాలు:

 ఉదయం అప్పుడే పితికిన పావులీటర్ దేశవాళీ ఆవుపాలల్లో కృష్ణతులసి పొడి 5 గ్రాములు రెండు పూటలా తాగుతుంటే 15 రోజుల్లో క్షయరోగం అంతరించిపోతుంది.

Sunday, 6 October 2013

చెడు కొవ్వు తొలగించుకోవటానికి మంచి సులభమైన మార్గం (For bad cholesterol)

రోజూ దాల్చిన చెక్క చిన్న ముక్క నోట్లో పెట్టుకుని దాని రసం మింగుతూ వుంటే  bad cholesterol అనబడే చెడుకొవ్వు నెమ్మదిగా చెప్పకుండానే కరిగిపోతుంది...

Wednesday, 2 October 2013

పార్శ్వపు నొప్పికి - కుంకుడు పెచ్చు:


చిన్న నేతిగిన్నెడు వేడినీటీలో కుంకుడు కాయ పై పెచ్చు 2 గ్రాముల ముక్క వేసి చెంచాకాడతో నురుగు వచ్చేవరకు కలదిప్పి ఆ ముక్కను తీసివేయాలి. ఆ నీటిలో దూది ముంచి రెండు ముక్కుల్లో మూడు మూడు చుక్కలు వేసుకుంటే క్షణ కాలంలో పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా రెండు మూడు సార్లు చేస్తే తిరిగి మరళా అరతలనొప్పి రానే రాదు.

పేగుల్లో పుండ్లకు - కొబ్బరిపీచు:

కొబ్బరిపీచు విడివిడిగా తీసి ముక్కలుగా కత్తిరించి కళాయి పాత్రలో వేసి క్రిందమంట పెట్టి అట్లకాడతో తిప్పుతూ ఆ పీచంతా భస్మంచేసి జల్లించి నిలవజేసుకోవాలి.
ఈ భస్మాన్ని పూటకు పావుటీ చెంచా మోతాదుగా ఒక కప్పు పలుచగా తియ్యగా వున్న తాజా మజ్జిగతో కలిపి మూడుపూటలా విడవకుండా సేవిస్తుంటే ఆహారనాళంలో చిన్న ప్రేవుల్లో, పెద్ద ప్రేవుల్లో, గుదస్థానంలో పుట్టిన పుండ్లు, క్రిములు, స్త్రీల గర్భాశయంలో పుట్టిన నెత్తుటి గడ్డలు, అతివేడి్, మంటలు, చురుకులు తగ్గుతయ్.

పులి త్రేనుపులకు - పచ్చి కొబ్బరికాయ :

పచ్చికొబ్బరిబోండం పై డొప్పను కడిగి మెత్తగా దంచి  బట్టలో వేసి పిండి రసం తీసిన రసం నాలుగు చెంచాల మోతాదుగా రెండు పూటలా తాగుతుంటే పులి త్రేనుపులు అనబడే ఎసిడిటి, అతి త్రేనుపులు అనబడే గేస్ తగ్గుతయ్.

సయాటికా నొప్పికి - ఆముదయోగం:

రోజూ ఉదయం పరగడుపున ఒక కప్పు దేశవాళీ గోమూత్రంలో ఒక చెంచా వంటాముదం కలిపి తాగాలి. ఈ విధంగా విడవకుండా 30 రోజులపాటు సేవిస్తే సయాటికా అనబడే గృధ్రసీవాతం హరించిపోతుంది.

Tuesday, 1 October 2013

గర్భిణీ స్త్రీల కోసం - III

21. తేనెలో ఊరవేసిన మురబ్బా 2 పూటలా 10 గ్రాములు తింటూంటే గర్భిణిస్త్రీకి, బిడ్డకు బలం.
22. ఏడమ చేతితో అయస్కాంతం పట్టిస్తే ప్రసవించలేని స్త్రీకి సుఖ ప్రసవమౌతుంది.
23. దంచిన ఉత్తరేణీ ముద్ద 20 గోళ్ళకు పట్టీస్తే శీఘ్రంగా సుఖప్రసవం జరుగుతుంది.
24. బప్పయి కాయను కూరగా వండి తింటూంటే స్త్రీలకు చనుబాలు పెరుగుతయ్.
25. తెల్ల గలిజేరు సమూలం నూరి యోనికి పట్టిస్తే ప్రసవ స్త్రీకి మాయ, మైల పడిపోతయ్.
26. కలబంద వేరు, పసుపు నూరి పట్టీస్తుంటే చనుకుదురు గడ్డలు కరిగిపోతయ్.
27. వాము కషాయం 30 గ్రాములు రెండు పూటలా సేవిస్తుంటే బాలింతలకు పాలు చేపుకువస్తయ్.
28. ఉమ్మెత్తాకు, పసుపు నూరి పట్టీస్తుంటే స్త్రే స్త్రీల స్తనాల వాపు,పోటు తగ్గిపోతయ్.
29. వాము 3 గ్రాములు, తేనె 5 గ్రాములు రెండుపూటలా తింటూంటే బాలింతలలకు పాలు పెరుగుతయ్.
30. జీలకర్ర, బియ్యం, పాలతో వండిన పాయసం 50 గ్రాములు తింటుంటే స్త్రీల స్తన బాధలు శమిస్తయ్.
31.అయిదారు ఆముదపు ఆకులను కడిగి మూడు లీటర్ల మంచి నీటిలో వేసి మరిగించి దించి ఆకులు పక్కన పెట్టి ఆ నీరు భరించగలిగినంత వేడిగా ఉన్నప్పుడు పాలు పడని బిడ్డ తల్లులు ముందుకు వంగి స్థనాలను ఆ నీటిలో పది పదిహేను నిముషాల పాటుంచి తీయాలి. తరవాత పక్కన పెట్టిన ఆకులను స్థనాలపై వేసి కట్టుకడుతుంటే తల్లిపాలు
తగినంతగా వృద్ధిచెందుతయ్.

గర్భిణీ స్త్రీల కోసం - II

11. గుమ్మడికాయ గుజ్జు 30 గ్రాములు, పాలు పంచదారలతో సేవిస్తుంటే గర్భస్థపిండం పెరుగుతుంది.
12. రావి పండ్ల పొడి చక్కెర 6 గ్రాములు కప్పు ఆవు పాలతో తాగుతుంటే గర్భ రక్షణ జరుగుతుంది.
13. ఓమ సొంఠి జీలకర్ర తేనె కలిపి 10 గ్రాములు తింటుంటే గర్భిణికి ఆకలి పుడుతుంది.
14. వెన్న 10 గ్రాములు, కండ చక్కెర 10 గ్రాములు తింటుంటే గర్భిణి స్త్రేలకు, బిడ్డకు బలం

కలుగుతుంది.
15. గర్భిణీ స్త్రీలు పండు నారింజ పండ్ల రసం తాగుంటే బలమైన సంతానం కలుగుతుంది.
16. మేడి చెట్టూ బెరడు కషాయం చక్కెర సేవిస్తుంటే గర్భస్రావం కాకుండా గర్భరక్షణ.
17. కప్పు ధనియాల కషాయంలో కండచక్కెర 10 గ్రాములు కలిపి తాగుతుంటే గర్భిణి స్త్రేల వాంతులు

తగ్గుతయ్.
18. చిట్టీ ఆముదం రాసి బట్ట తగలకుండా ఉంచితే గర్భిణిస్త్రేల చనుమొనల పగుళ్ళు తగ్గుతయ్.
19. మూసాంబరం 5 గ్రాములు, గుగ్గిలం 5 గ్రాములు, గోధుమపిండి 10 గ్రాములు నీటితో నూరి రాస్తే

స్తనాల పోట్లు తగ్గుతయ్.
20. జీలకర్ర 10 గ్రాములు, కండ చక్కెర 10 గ్రాములు రెండు పూటలా తింటూంటే తల్లి పాలు

గర్భిణీ స్త్రేల కోసం - I

1. అల్లం రసం 10 గ్రాములు, తేనె 10 గ్రాములు రెండు పూటలా నాకిస్తుంటే బాలింతలకు ఆరోగ్యం.
2. పొంగించిన ఇంగువ 1 గ్రాము, బెల్లం 5 గ్రాములు తినిపిస్తే బాలింతల తుంటి శూల తగ్గుతుంది.
3. మిరియాల పొడి 3 గ్రాములు, చక్కెర 3 గ్రాములు తేనె 10 గ్రాములు తింటుంటే గర్భిణీల దగ్గు,ఆయాసం బంద్.
4. గ్లాసు వేడి గంజి, ఆవు నెయ్యి 20 గ్రాములు తాగిస్తే గర్భిణి పొట్టలో కదలని శిశువు కదులుతుంది.
5. బొడ్డుపై దూది పెట్టి ఆవు నేతితో తడుపుతుంటే గర్భిణి పొట్టలో కదలని శిసువు కదులుతుంది.
6. నేతిలో వేయించిన వామ్ము 3 గ్రాములు, మొదటి ముద్దలో తింటూంటే గర్భిణి అజీర్తి తగ్గుతుంది.
7. నేతిలో  వేయించిన మిరియాలపొడి 3 గ్రాములు మొదటి ముద్దలో తింటుంటే గర్భిణికి జీర్ణశక్తి.
8. చల్లార్చిన శొంఠి కషాయం 20 గ్రాములు తాగితే గర్భిణి స్త్రీల ఉదరవాతం తగ్గుతుంది.
9. ధనియాలు 10 గ్రాములు, పుల్లని మజ్జిగతో నూరి చక్కెర కలిపి తాగిస్తుంటే గర్భిణి విరేచనాలు బంద్.
10. ధనియాలు 10 గ్రాములు, కప్పు బియ్యపు నీళ్ళు చక్కెరతో కలిపి తాగితే గర్భిణివాంతులు తగ్గుతయ్.