Pages

Saturday, 28 June 2014

అతి మూత్ర వ్యాధి :

ఎందుకు వస్తుంది: రాత్రిపూట ఎక్కువగా మేల్కోవటం వలన, బాగా చల్లగా వుండే ప్రాంతాల్లో ఎక్కువ కాలం నివసించటం వల్ల ఎక్కువసేపు ఏ.సి. గదుల్లోనే కాలం గడపటం వల్ల ఎక్కువగా మత్తు పానీయాలు సేవించటం వల్ల, ఈ వ్యాధి ఏర్పడుతుంది.

చికిత్స :
1. అలాగే ఎక్కువ విశ్రాంతిగా వుండకుండ శారీరక శ్రమ చేస్తుంటే, క్రమంగా ఈ వ్యాధి నివారించబడుతుంది.
2. నల్ల వులవకట్టును తయారు చేసుకొని ప్రతిరోజూ 1 ఔంసు ప్రమాణంలో తాగుతూవుంటే అతిమూత్రవ్యాధి తగ్గిపోతుంది.
3. మునగ ఆకు చిగుళ్ళతో ఆకు కూరగా తయారు చేసుకొని గానీ, లేక మునగకాయల కూర చేసుకొని గానీ తింటూవుంటే అతి మూత్ర వ్యాధి తగ్గిపోతుంది.

పధ్యం : 
అతి మూత్రవ్యాధి త్వరగా తగ్గాలంటే, బాగా చల్లగా వున్న పదార్ధాలు చలిలో తిరగటం, చన్నీటి స్నానాలు చేయటం మానుకోవాలి.
మజ్జిగ, పెరుగు, దోసకాయ, గుమ్మడికాయ, నిమ్మరసం ,కూల్ డ్రింక్స్, చల్లటి అన్నం, తీపి పదార్ధాలు, చల్లటి అన్నం మానివేయాలి. రాగి జావ, ఉలవ కషాయం వాడాలి. ఉదయం పూట కొద్ది దూరం నడుస్తూ వుండాలి. కొంచమైనా వ్యాయామం చేయాలి.

కడుపులో పుండ్లు :

ప్రతిరోజూ రెండు పూటలా ఒక కప్పు పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగుతూ వుంటే కడుపులోని పుండ్లు హరించిపోతయ్.

మొలల వ్యాధికి :

శొంఠి, పిప్పళ్ళు , కరక్కాయలు వీటిల్లో ఏదో ఒకదానితో సమభాగంగా బెల్లం కలిపి దంచి, ప్రతిరోజూ రెండు పూటలా 5 గ్రాములు మోతాదుగా సేవిస్తుంటే మొలలు కరిగిపోతయ్. అజీర్ణము, మలబద్ధకం కూడా తగ్గుతయ్.

Wednesday, 25 June 2014

మీరు బెడ్ కాఫీ - టీ తాగుతారా?

ఈ అలవాటు ఇంగ్లీషు వాళ్ళది. వాళ్ళదేశంలో ఉదయమే చలి ఎక్కువగా వుంటుంది కాబట్టి, నిద్ర లేవగానే శరీరం స్వాధీనంలోకి రావటానికి వాళ్ళు బెడ్ కాఫీ తాగవచ్చేమో కానీ , మనది ఉష్ణమండల దేశం. ఇక్కడ పొద్దునే లేవగానే రాగిచెంబులోని మంచి నీళ్ళు తాగి, రాత్రంతా జీర్ణ క్రియతో ఎండిపోయి వున్న శరీర అంతర్గత భాగాలకు తృప్తి చేకూర్చి, పండ్లు తోముకోవటం పూర్తయింతర్వాత, రాత్రి గంజిలో నానబెట్టిన అంబలి తాగటమో, లేక చల్లటి చిక్కటి మజ్జిగతో అన్నం కలుపుకొని తనివితీరా సేవించటమో మన అలవాటు.
ఆ అలవాటు కాలగమనంలో పొరపాటుగా మారి, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ బెడ్ కాఫీలు, టీలు తాగే దురలవాటుకు లోనయ్యారు. దీనివల్ల ఉదయమే ప్రశాంతంగా విసర్జింపబడ వలసిన మలం గడ్డకట్టుకుపోయి మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకంతో సకల వ్యాధులు మొదలౌతున్నయ్(సర్వరోగా మలాశయా).
చూశారా - ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో.. ఇప్పటికైనా కళ్ళు తెరచి మనన దేశీయంగాని అలవాటు మన వంటికి సరిపడదని తెలుసుకొని , దాన్ని విసర్జించి మన అలవాట్లను ఆచరించటం మంచిది.

పంచభూతాలను పంకిలం చేస్తూ పాపలకూపంలో పతనమైపోతున్న ఓ మనిషీ! నీ గమనం ఎక్కడకి ? భూమి, నీరు, గాలి ఎందుకు చెడిపోతయ్?

వర్షాకాలంలో వర్షం రావటం లేదు. భూమి నిస్సారమై, పంటలు పండటం లేదు. పవిత్రమైన ఓంకారంతో పుట్టిన ఆకాశం, భూమి నుంచి నీటి నుంచి ఆవిరి రూపంలో పైకి చేరే విషాలతో కలుషితమైపోయింది.
తన పుట్టుకకు, పెరుగుదలకు కారణమైన ప్రకృతిని, పంచభూతాల్ని నాశనం చేస్తున్న మానవులకు మనుగడ వుంటుందా?

ఆత్రేయ మహర్షి ప్రవచనం :
మానవుల్లో ధర్మం ఎంత కాలం వుంటుందో, అంత కాలం పంచ భూతాలు పరిశుద్ధమై ప్రాణ శక్తులతో నిండి వుంటయ్. ప్రతి మమననషికి పూర్తి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆయుషు వుంటయ్. ఎప్పుడైతే ధర్మానికి కాలం చెల్లి అధర్మం రాజ్యమేలుతుందో మనుషుల్లో అసూయాద్వేషాలు, స్వార్ధవైషమ్యాలు, పదవీ కాంక్ష, ధన వ్యామోహం పెచ్చు పెరుగుతుందో, అప్పుడే పంచ భూతాలమయమైన ప్రకృతి పతనమై పోతుంది. తన సహజమైన ప్రాణశక్తిని, ప్రశాంత తత్వాన్ని కోల్పోయి, తనను నాశనం చేస్తున్న మానవలోకం పై విరుచుకుపడుతుంది.
విష రసాయనాల వర్షంతో ఆకాశం, భయంకరమైన కృములు భూతాలతో(వైరస్ ) నిండిన వాయువు, ప్రాణ శక్తులను పీల్చి పిప్పిచేసే ప్రచండ కిరణాలతో సూర్యుడు, వ్యర్ధ పదార్ధాలతో కలుషితమై బడబాగ్నులతో ఉప్పొంగే జలం, ధాతు శక్తి కోల్పోయి, సహజమైన గమనాన్ని తప్పి ప్రకుపితమైన ప్రకంపనాలతో ప్రళయాన్ని సృష్టించే భూమి, ఇవన్నీ కలసి , భూకంపాలుగా, తుఫానులుగా, అగ్నిపర్వతాలుగా, అతి వికృతమైన రోగాలుగా మానవ సమాజంలో మరణహోమాలు రగిలిస్తయ్ .

ఆధునిక ఆంగ్ల వైద్యుల పరిక్షా ప్రయోగాలు :

పూనేలోని డాక్టర్ గోగ్డే అనే ఆంగ్లవైద్యుడు, తను ఆపరేషన్ లు చేసిన పేషెంట్స్ కు ఎలాంటి యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండ, గిరిజనులు అనుసరించే భూత వైద్య విధానం ప్రకారం, వేపాకు , గుగ్గిలం , ఆవాలు మొదలైన వాటితో రోగుల గదులనిండా ధూపం వేయించాడు. పదిరోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 15 నిముషాలపాటు ఈ పొగను వేయటం వల్ల ఆపరేషన్ చేసిన భాగాలు ఎలాంటి నొప్పులకు, ఇన్ ఫెక్షన్ కు గురికాకుండా వారం రోజుల్లోనే మానిపోయినియ్ . ఇంతగొప్ప అనుభవాన్ని గిరిజనులవల్ల పొందనన ఆ వైద్యుడు, మూలికా ప్రభావానికి, గిరిజనుల విజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు.

Sunday, 15 June 2014

చల్లటి నీళ్ళు ఎవరు వాడకూడదు ?

పార్శ్వపు  తలనొప్పి, సైనసైటిస్, జలుబు, పడిసెభారము, వాత వ్యాధులు, గొంతు రోగాలు, కడుపు ఉబ్బు, తిమ్మిర్లు, భయంకరమైన చర్మ వ్యాధులు, దగ్గు, ఆయాసం, వాత జ్వరం మొదలైన వ్యాధులతో బాధపడేవాళ్ళు చల్లటి నీళ్ళు ఉపయోగించకూడదు. ఈ నియమాలు తెలిసో తెలియకో పాటించకుండా ఎన్ని ఔషధాలు వాడినా నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది.

                                       మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ 

ఏ.సి. గదులు - ఎముకల వ్యాధులు :

ఎయిర్ కండిషను గదుల్లో గంటలు తరబడి కూర్చోవడం, నిద్రపోవటం, శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మానవ శరీరం ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే పంచ భూతాల కలయికతో నిర్మితమైనది. ఈ అయిదు భూతాల స్పర్శ ప్రతిరోజూ మన శరీరానికి తగలకపోతే, రోగాలు రావటం ఖాయం. ఎలా అంటే, మన శరీరాన్ని ముఖ్యంగా పంచభూతాలనుండి పుట్టిన వాతము, పిత్తము, శ్లేష్మము(కఫం) అనే మూడు ధాతువులు పరిపాలిస్తున్నయ్. ఆ మూడు ధాతువులు మన శరీరంలో సమంగా వుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఆ ధాతువులు సమంగా వుండాలంటే, వాటి మూల రూపాలైన పంచభూతాల స్పర్శను మనం అనుభవించి తీరాలి. ప్రకృతిలోని పరిశుభ్రమైన అతి శక్తివంతమైన ఎండ, గాలి తగలకుండ మనం ఎక్కువ సమయం ఏ.సి. గదుల్లో వుండటం వల్ల శరీరంలో ని వాత, పిత్త, శ్లేష్మాల సమతౌల్యం దెబ్బతింటుంది.ప్రతి రోజూ మన శరీరం ఆరోగ్యంగా వుండి తగినంత ఉత్సాహంతో పని చేయటానికి అవసరమైన విటమినులు, సూర్య్రశ్మి నుంచి మనకు అందకుండా పోతాయ్. దీనివల్ల క్రమంగా మానవ శరీరంలోని ఎముకల్లో, దంతాల్లో పటుత్వం తగ్గిపోతుంది. ఎక్కువసేపు కూర్చోలేక, నిలబడలేక, నడవలేక, ఎముకల, దంతాల దారుఢ్యం తగ్గిపోయి, శరీరం వంగిపోతుంది. అందువల్ల రోజులో కొంతసమయమైనా మనం తప్పకుండా సూర్యరశ్మిని ఆస్వాదించాలి. ప్రతిరాత్రి నిద్రపోయే ముందు పాలు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ' పళ్ళూడిపోయి, ఎముకలు క్షీనించిపోయి యౌవన దశలోనే అకాల వృద్ధాప్యం ఆవహిస్తుంది.


                                           మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ 

పిల్లల వాంతులు - దగ్గులు :

కరక్కాయ బెరడును చూర్ణం చేసి పూటకు 2 గ్రాములు, చూర్ణం లో తగినంత తెనె కలిపి రెండు పూతలా పిల్లలకు తినిపిస్తూ వుంటే వాంతులు, దగ్గులు, నెమ్ము, మల బద్ధకం , కడుపులో నొప్పి, అజీర్ణం, కడుపుబ్బరం, ఇవన్నీ తోగిపోయి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. 

పిల్లల వంటి దురదలకు :

వేప చిగురాకులు, నువ్వులు సమాన భాగాలుగా కలిపి మర్ధించి, వళ్ళంతా పట్టిస్తూ వుంటే దురదలు, చిడుము తగ్గిపోతయ్.

పసి పిల్లల జలుబుకు :

పిల్లలకు జలుబు చేయగానే తమలపాకులకు ఆముదం రాసి వెచ్చచేసి, పిల్లల రొమ్ము పైన, పొట్టపైన, తల పైన కాపడం పెడితే వెంటనే జలుబు తగ్గుతుంది.


                    పిల్లలు భవిష్యత్ ప్రాణ దీపాలు, వారిని అలా తయారు చేసే బాధ్యత ప్రతీ తల్లితండ్రిది.

పిల్లల నోటి్పూతకు:

రావి చెట్టు బెరడు, రావి చిగురు ఆకులు, సమంగా కలిపినూరి, పూటకు 5 గ్రాములు చొప్పున నాకిస్తూ వుంటే పిల్లల నోటి పూత తగ్గిపోతుంది.

                   పిల్లలు భవిష్యత్ ప్రాణ దీపాలు, వారిని అలా తయారు చేసే బాధ్యత ప్రతీ తల్లితండ్రిది.

Saturday, 14 June 2014

నిమ్మ బలం :

ఒక్క నిమంకాయలో ఐదు నారింజకాయల బలమున్నది.

Thursday, 5 June 2014

పిల్లల్ని రోగిష్టులుగా మారుస్తున్న అలవాట్లను మార్చండి :

మనం తెలిసో తెలియకో చేస్తున్న పొరపాట్లవల్లే మన బిడ్డలు రోగిష్టులౌరుతున్నారని తెలుసుకోండి.ఆధునిక విదేశీవిషనాగరికతా వ్యామోహంలో  పడ్డ తల్లిదండ్రులు ఆ దురలవాట్లనే బిడ్డలకు కూడా అలవాటు చేస్తూ వారిని శాశ్వతరోగులుగా మారుస్తూ వారి ఉజ్వల భవిష్యుత్తును కాలరాస్తున్నారు.
ఇళ్ళల్లో తల్లిదండ్రులుగాని, ఇంటికొచ్చిన మిత్రులు బంధువులుగాని పిల్లలకు రకరకాల చాక్లెట్లను అందివ్వడం అలవాటుగా మారింది. ఈ చాక్లెట్లను నిరంతరంగా తినడం వల్ల పిల్లల లేతశరీరాల్లో విషపూరితమైన కఫం ఎంత పేరుకుంటుందో వీరెవరూ అలోచించడంలేదు. అలాగే చాలా ఇళ్ళల్లో చిన్నతనంనుండే పిల్లలకు ఫ్రిజుల్లోని  నీళ్ళు, శీతల పానీయాలు తాగించడం, అదే ఫ్రిజుల్లో వుంచిన పాలను పట్టడం , అందులోనే ఉంచిన కూరగాయలతో ఆహారం వండిపెట్టటం దురలవాటుగా మారింది. వీటితోపాటు తరచుగా సినిమాలకో షికార్లకో వెళ్ళినప్పుడల్లా పిల్లలతో ఐస్ క్రీములు  తినిపించడం గొప్పనాగరికతగా మారింది. ఈ భ్రష్టాచారాలను తక్షణమే నిషేధించండి.
                                            మరికొన్ని విషయాలు తరవాత తెలుసుకుందాం.......

                                            మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ


మరి కొన్ని చిన్ని చిట్కాలు.....

1. నిమ్మ రసంతో పళ్ళు తోమితే దంత క్రిములు, దుర్వాసన హరిస్తయ్.
2. నీటితో నూరిన నేరేడాకుల ముద్ద పట్టిస్తుంటే శరీరదుర్వాసన తగ్గుతుంది.
3. గసగసాలు 10 గ్రాములు, బాదం 10 గ్రాములు పాలతో నూరి సేవిస్తుంటే రక్తవృద్ధి, దేహపుష్టి.
4. కొబ్బరినీళ్ళు మితంగా రెండుపూటలా సేవిస్తుంటే గుండెకుబలం కలుగుతుంది.
5. కప్పు ద్రాక్షరసం రెండుపూటలా తాగుతుంటే గుండెదడ, గుండెబలహీనత  తగ్గుతయ్.


1. Nimma rasamtoo pallu toomitee danta krimulu, durvaasana haristayi.
2. Neetitoo nuurina neereedaakula mudha pattistunte sareera durvaasana taggutundi.
3. Gasagasaalu 10 graamulu, baadam 10 graamulu paalatoo nuuri seevistuntee raktavruddhi, deehapushti.
4. Kobbari neellu mitamgaa rendu puutalaa seevistuntee gundeku balam kalugutundi.
5. Kappu draaksha rasam rendupuutalaa taagutuntee gundedada, gunde balaheenata taggutai.


                        మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Wednesday, 4 June 2014

చిట్టి చిట్కాలు :

1. నువ్వులు పాలతో నూరి రాస్తుంటే జీడిగింజల వాపు, మంట తగ్గుతయ్.
2. ఆముదపు ఆకులు చితగ్గొట్టి వెచ్చజేసి వేస్తుంటే గజ్జబిళ్ళలు తగ్గుతయ్.
3. పసుపు తేనె కలిపి నూరి పైన పట్టిస్తుంటే దెబ్బలవాపు తగ్గుతుంది.
4. సోంపు చూర్ణం తేనెతో తింటుంటే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
5. అన్నంలో పచ్చి ఉల్లిగడ్డ (onion) తింటుంటే అతిగా వచ్చే నిద్ర తొలగిపోతుంది.
6. మంచి గంధం చెక్క నీటితో సాది పట్టు వేస్తుంటే బొడ్డుపుండు తగ్గుతుంది.
7. మిరియాలపొడి 3 గ్రాములు కప్పు వేడి నీటితో తాగుతుంటే నిద్రలో మాట్లాడటం తగ్గుతుంది.
8. పచ్చి ఉల్లిగడ్డ అన్నంలో తింటుంటే ఆవలింతలు తగ్గిపోతయ్.
9. ఎల్లుల్లి పాయ రసం పైన రాస్తుంటే ఆసనంలో పుట్టిన దురద తగ్గిపోతుంది.
10.వెన్న, నీరుసున్నం కలిపి పట్టిస్తుంటే ఆనెకాయలు హరించిపోతయ్.