Pages

Tuesday, 29 April 2014

మజ్జిగ, పాలు, పండ్ల రసం ఎప్పుడు తీసుకోవాలి:

మజ్జిగ ఎల్లప్పుడు మధ్యాహ్నం పూటనే త్రాగాలి. ఆరోగ్యవంతులకు పాలు రాత్రి భోజనం తరవాత , పండ్ల రసాలు ఎప్పుడూ ఉదయం పూట భోజనం చేసిన తరువాతే త్రాగాలి.దీనిని ఎట్టి పరిస్థితిలో మార్పు చేయరాదు. ఎందుకంటే మన శరీరంలో  మజ్జిగను పచనం చేసే ఎంజైములు మధ్యాహ్నం మాత్రమే శరీరంలో స్రవించబడుతుంది. అలాగే పాలను పచనం చేయడానికి సూర్యాస్తమయం తర్వాతనే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అలాగే జ్యూస్ను పచనం చేసే ఎంజైములు ఉదయం పూటనే ఉంటాయి. ఉదయం జ్యూస్, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పాలు అలవాటు చేసుకోవాలి. పిల్ల్లలకు ఈ అలవాటు చేయండి. వారి అరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది వుండదు.

ఫ్రిజ్ లు నిజంగా అవసరమా??అవి లేకుండా బ్రతకలేమా??

తయారైన ఏ ఆహారమైనను 48 నిముషములలోపే ఆ ఆహారాన్ని భుజించాలి.ఎందుకంటే 48 నిముషముల తరువాత అందులో పోషకాలు తగ్గుచూ ఉంటాయి. వండిన 6 గంటల తర్వాత పోషకాలు దాదాపు సగం తగ్గుతుంది, 12 గంటల తరవాత తింటే దాదాపు పోషకవిలువలు లేనట్లే, 24 గంట్ల తరువాత అయితే దుర్గంధం అవుతుంది అని 3500 సంవత్సరాల క్రితమే వాక్భటాచార్య మహర్షి చెప్పారు. అందువలన మనకు అన్నం కానీ కాయగూరలు కానీ ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం ఉన్నదా? మనకు డబ్బులు, 365 రోజులు కరెంటు ఖర్చులు , స్థలము నష్టము.
ఇక అందులే పెట్టిన మంచినీరు, శీతల పానియాలు తాగటం మంచిది అని ఏ డాక్టరునైనా చెప్పమని చెప్పండి ??? చెప్పలేరు, ఎందుకంటే అది వారికి కూడా తెలుసు..ఫ్రిజ్ లు లేకుండా  బ్రతకలేమా????
కాబట్టీ దానిని నిదానంగా దూరం చేయండి.

చేయండి అంటూన్నాను ఎంటా అని అనుకుంటున్నారా? నేను ఫ్రిజ్ కొనలేదు :-) .నా వంతు కర్తవ్యం నేను చేస్తున్నా.. మరి మీరు ?????????????????????...




Monday, 28 April 2014

భూమి వేడిమి తగ్గించటం మన అందరి చేతుల్లోనే వుంది...

మనం దేశంలో వాతావరణ కాలుష్యాలపైన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. వాతావరణము మార్పులు జరిగి చల్లదనము తగ్గి భూతాపము పెరిగిపోతున్నది. వేడిని పెంచే వాటిలో అగ్రస్థానములో నిలిచేవి ఫ్రిజ్ లే. కావున భూమి వేడిమి తగ్గించాలంటే ఫ్రిజ్ లను, ఏసీలను దూరం చేయాల్సిందే..

భూమి వేడిమి తగ్గితే ఈ ఏసీ లు మనకు అవసరమంటారా?
- రాజీవ్ భాయ్(రాజీవ్ దీక్షిత్).

అన్ని ఋతువుల్లో ఒకే ఆహారం - అనారోగ్యానికి విహారం, ఋతు స్వభావాన్ని బట్టి తినే ఆహారం - ఆరోగ్య జీవనహారం.

అన్ని ఋతువుల్లో ఒకే ఆహారం - అనారోగ్యానికి విహారం
ఋతు స్వభావాన్ని బట్టి తినే ఆహారం - ఆరోగ్య జీవనహారం.

ప్రకృతి ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలానికి తగ్గట్లు పండ్లు, కూరగాయలు,చెట్లు (ఔషధాలు) ఒకటేమిటి మానవునికి అవసరమయ్యే అన్నింటినీ సమకూర్చింది. ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనిషి శరీర ప్రకృతి కూడా మారుతుంది. ఆ మార్పును తట్టుకునే ఆహా్రాన్ని మనం భుజించాలి.  ఏఏ కాలాల్లో ఏ  ఆహారం తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తప్పని సరిగా తెలిసివుండాలి. లేకపోతే సంపాదనలో దాన ధర్మాలకు బదులు ఆసుపత్రులకు  ధారపొయ్యాల్సి వస్తుంది. పుణ్యము రాకపోగా కొత్తరోగాలు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువ. ఒక కాలం లో పండాల్సిన కూరగాయలు, పండ్లు ఇతరత్రా.. వేరే కాలం లో పండించటం గొప్ప, సాంకేతిక సాఫల్యం అనుకుంటున్నారు నేటి వ్యవసాయ నిపుణులు. కానీ ప్రకృతి  ప్రతిసంవత్సరం అదేకాలంలో అవే పండ్లు అవే కూరగాయలు ఎందుకు ప్రసాదిస్తుంది ? దాని పరమార్ధం ఎప్పుడైనా తెలుసుకోటానికి ప్రయత్నిస్తే, ఇలా అస్తవ్యస్తంగా కాలం కాని కాలంలో పూసేవి, కాసేవి అన్నీ మానవలోకానికే పెను ముప్పు అని తెలుసుకుని అలా పండించకూడదని అటువంటి ప్రయోగాలు మానుకుంటారు.

పక్క ఊరు రెండు రోజులు వెళ్ళి వస్తేనే నీళ్ళు ఇతరత్రా పడక శరీరం తట్టుకోలేక సుస్తీ చేస్తుంది. అలాంటిది వేరే దేశాలలో ఉన్న ఆహారపు అలవాట్లు, దుస్తుల అలంకరణ, చదువు , విహార వ్యవహారాలు మనదేశంలో వున్నా వారికి ఎలా సరిపోతాయి. ఒకదేశపు ఆహార విహార వ్యవహారలు ( చదువు, పంటలు, వైద్యం , ఆచారాలు ..) అన్నీ ఆదేశపు వాతావరణాన్ని బట్టి నిర్మితమై వుంటాయి. అందువలన అవి మనకు సరిపడవు. మనపూర్వికులు అమలు చేసిన ఆచారాలే మనకు అమృతభాండాలు. వాటిని ఆచరిస్తేనే ఈ సమాజం మరళ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. దానికి మనమందరం బాధ్యులం. ఎందుకంటే మనదేశపు మంచికి చేడుకు మనమే కారణం. మార్పు ప్రతిఒక్కరిలో వస్తే ఇల్లు వీధి ఊరు పట్ట్ణం రాష్ట్రం  దేశం మొత్తం మారిపోతుంది. మార్పు నాలో నీలో అందరిలో రావాలి. ఎందుకంటే మార్పు సహజం, మార్చుదాం మన అలవాట్లని.....

Sunday, 27 April 2014

పిల్లల శాస్వత ఆరోగ్యానికి :

పిల్లలకు నాలుగవ నెల నుండి రోజూ ఉదయం పరగడుపున రెండు గ్రాముల దేశవాళీ ఆవు వెన్న కొంచం కండచక్కెర పొడి కలిపి ఒకటిన్నరేండ్ల వయస్సు వచ్చే వరకు తినిపించాలి. పదిరోజులకొకసారి చిటికెడు వెన్నను పెంచుతుండాలి.
దీనివల్ల పిల్లల్లో అసాధారణమైన వ్యాధినిరోధకశక్తి పెరిగి అన్నిరకాల మార్పులను తట్టుకోగలుగుతారు. వారి రూపం, భాష అన్నీ బహుసుందరంగా మారతయ్.

సమస్త చెవి వ్యాధులకు అద్భుతమైన యోగం :

దేశవాళీ ఆవు నెయ్యి 10 గ్రాములు తీసుకుని అందులో వెల్లుల్లిపాయలో వుండే మూడురేకలను వేసి చిన్న మంటపైన ఆ రేకలు ఎర్రబడేవరకు కాచి తరువాత వాటిని తీసివేయాలి. ఈ నేతిని ప్రతిరోజూ రెండుపూటలా గోరువెచ్చగా మూడు చుక్కల మోతాదుగా చెవుల్లో వేస్తుండాలి. ఇలా చేస్తుంటే క్రమంగా చెవిపోటు, చెవిలో హౌరు , చెవిలో చీము కారడం, చెవిలో కురుపులు రావడం, చెవుడు మొదలైన సమస్యలు హరించి శ్రవణశక్తి బాగా మెరుగుపడుతుంది. 

Thursday, 24 April 2014

బంక విరేచనాల పోవటానికి నెయ్యి వేడి నీరు..

వేడీ నీళ్ళలో కొంచం నెయ్యి కలిపి పూటకు ఒక కప్పు లేదా రెండు కప్పుల నీళ్ళు చొప్పున రెండుపూటలా తాగుతూవుంటే బంక విరేచనాలు బంద్ అవుతాయి.

Wednesday, 23 April 2014

లవణం (ఉప్పు ) వలన నష్టాలు :

* శరీరంలో అమితమైన వేడి పుట్టిస్తుంది. రక్తాన్ని దూషింపచేసి రక్త వ్యాధులు కలిగిస్తుంది.
* అమితమైన దాహాన్ని కలిగించి శరీరం స్పృహ కోల్పోయేటట్లుగాను, మూర్చ వ్యాధ్హులకు గురయ్యేటట్లుగాను చేస్తుంది.
* ఉప్పును అధికంగా వాడటంవల్ల శరీరమంతా అమితంగా వేడెక్కుతుంది. తరచుగా విరేచనాలను కలిగిస్తుంది.
* మాంస కండరాలు కరిగిస్తుంది, కుష్టు వ్రణాలు, గడ్డలు మొదలైనవి పగిలి స్రవించేటట్లు చేస్తుంది.
* శరీరమంతా క్రమంగా త్వరితగతిన ముడతలు పడిపోయి బలహీనమయిపోయి, ఇంద్రియపటుత్వం తగ్గిపోతుంది.
* వెంట్రుకలు త్వరగా నెరసిపోయి వూడిపోతయ్. బట్టతల కూడా సంప్రాప్తిస్తుంది.
* ఇంకా రక్తపిత్తవ్యాధి, ఆమ్ల పిత్త వ్యాధి, వాతరక్తవ్యాధి, విసర్పులు మొదలైన వ్యాధులను కూడా కలిగిస్తుంది.

Saturday, 19 April 2014

చర్మ రోగాలు (ఎక్జిమా, సొరియాసిస్ మొదలైనవాటికి)

చర్మ వ్యాధులు వున్నవారికెవరికైనా వారి శరీరంలో సల్ఫర్ లోపించిందని గమనించాలి. భారతీయ గోమూత్రంలొ సల్ఫర్ విరివిగా వుంటుంది. గోమూత్రం లోపలికి తీసుకుంటూ, పై పూతగా వాడుకుంటుంటే మూడు నెలలో చర్మ రోగాలే కాకుండా సొరియాసిస్, ఎక్జిమా,మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు , దగ్గు(20 ఏళ్ళగా వున్నా దగ్గులు కూడా), జలుబు  పూర్తిగా పోతుంది.
గోమూత్రం సేవించాక ఒకసారి టి.బి తగ్గిందంటే జీవితంలో మరళా రాదు. తెలియకుండానే ఎన్నో వ్యాధులు తగ్గిపోతాయి.

చీ.. గోమూత్రమా అని చాలామంది అసహ్యించుకుంటారు. కానీ దాని విలువ చెప్పటం చాలా కష్టం. ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే...

వాతానికి . మూడింటికీ చెందిన 48 రోగాలు సమూలంగా పోతాయి. అన్ని రకాల రాచపుండు వ్యాధులతో సహా(Cancer)

గోమూత్రం గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటూ ఉందాం .......

లవణము(ఉప్పు లాభ నష్టాలు):

* ఉప్పును ఆహార పదార్ధాలలో కలిపి వాడటం వల్ల అది శరీరంలోని విషపు నీరును దగ్ధము చేసి మాలిన్యాలను తీసివేస్తుంది. ఆకలిని వృద్ధిచేసి మల పదార్ధాలను సక్రమంగా విసర్జింపచేస్తుంది.
* పేరుకుపోయిన కఫము, విషపదార్ధాలు, గట్టిగా వుండలు కట్టిన మలము,జీర్ణము కాని అన్య పదార్ధాలు వీటన్నిటిని తన శక్తితో ముక్కలు ముక్కలు చేసి బయటకు నెట్టివేస్తుంది. అన్నాశయం అపక్వ పదార్ధాలతో నిండివున్నప్పుడు ఆ పదార్ధాలను బలవంతంగా తోసివేసి ఖాళీ ఏర్పరుస్తుంది. కడుపులోని వాత వాయువును హరింపచేస్తుంది.
* శరీరమునందలి కీళ్ళపట్లు, తాడుతో బంధించినట్లుగా కలిగే కాళ్ళు చేతుల నొప్పులు నిమ్మళింపచేస్తుంది.
* శరీరంలోని తక్కిన రసాలను అణగదొక్కి తనదే పై చేయిగా చేస్తుకుంటుంది.
* ఉప్పు గురు గుణాన్ని, వేడి చేసే స్వభావాన్ని, చమురు తత్వాన్ని మితంగా కలిగివుంటుంది.

ఇన్ని మం చి గుణాలు ఉన్నప్పటికి కేవలం ఉప్పునే ఎక్కువగా ఉపయోగిస్తే అది అనేక వ్యాధులను కలుగచేస్తుంది.. అవి ఎంటొ తరువాత తెలుసుకుందాం...

Thursday, 10 April 2014

రాత్రిపూట ఉద్యోగాలు చేసే వారికోసం :

ఈ నిఖిలచరాచరాలలో అన్ని జీవరాశులు ప్రకృతికి అనుసంధానంగా , ప్రకృతిని అనుసరించే ఉంటాయి, ఒక్క మానవుడు తప్ప . ఈ కలియుగంలో వ్యతిరేఖ భావాలు, వ్యతిరేఖ మనస్తత్వాలు, వ్యతిరేఖ జీవనం సహజమైపోయింది. ఈ వ్యతిరేఖ జీవనం పోషణ కోసం కొందరు సాగిస్తుంటే, విలాసాలకోసం మరికొందరు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరైతే ప్రకృతికి వ్యతిరేఖంగా జీవిస్తారో వారు అనారోగ్యాల భారిన పడక తప్పదు.నిప్పును తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకునా కాలక తప్పదు. అందుకే ఆనాటితో పోల్చుకుంటే నేడు రోగాల సంఖ్య, రోగుల సంఖ్య వాటితో పాటు అరకొరగా చదివి పాసయిన డాక్టర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది.
అయితే ఈనాడు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేయటానికి ఉద్యోగావకాశాలు కూడా అలగే వున్నాయి, కుటుంబ పో్షణకోసమో , అధిక ధనసంపాదనకోసమో రాత్రి పూట పని చేయటానికి పరుగులు తీస్తున్నారు. బ్రతకటానికి ఉద్యోగం చేయాలి కాబట్టి , ఇష్టం లేకపోయినా కష్టమైనా కొంతమంది రాత్రిపూట ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది.అలాంటి వారు ఈ క్రింది నియమాలను పాటించాలి.

* రాత్రిపూట జీవశక్తి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం విశ్రాంతిలో ఉండటం వలన జీవశక్తిని నరనారన నింపుకో్వటానికి అవకాశం దొరుకుతుంది.అందువలన ప్రత్యామ్నాయంగా వీలయినప్పుడల్లా ధ్యానం చేయాలి.
* ఉదయం గానీ , సాయంత్రం గానీ యోగాసనాలు తప్పకుండా వేయాలి.
* ఉదయం , రాత్రి బాగా తినాలి.
* బాగా నమిలి తినాలి, ఎందుకంటే పగటి నిద్ర అవసరం కాబట్టి,త్వరగా అరగాలి కాబట్టి . అలా తినకపోతే అజీర్ణం తద్వారా షుగరు, గ్యాసు, వాత నొప్పులు , సుఖవిరేచనం కాకపోవటము మొదలైన చాలా సమస్యలు వస్తాయి.
* తినగానే వెంటనే నిద్రపోకూడదు.
* మధ్యాహ్నం అల్పాహారం తినాలి. అతిగా తినకూడదు.
* తినే ముందు , తిన్నవేంటనే నీళ్లు తాగకూడదు.
(ఆహారం తినే 40 నిముషాల ముందు , తిన్న తరువాత 40 నిముషాల వరకు నీళ్ళు త్రాగరాదు.అత్యవసరం అనిపిస్తే రెండు మూడు బుక్కలు తాగవచ్చు)
* రాత్రి తినగానే పనికి ఉపక్రమించరాదు.
* పైన చెప్పిన విధం గా ఆహారం తీసుకుని , రాత్రి ఎన్ని గంటలు నిద్రపోతారో, పగలు అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోవటమో లేదంటే కొంత సమయం ధ్యానం చేయటమో చేయాలి.
* అతి ముఖ్యమైనది :తప్పక బ్రతుకు తెరువు కోసం రాత్రిపూట ఉద్యోగం చేయాల్సి వస్తుందని ప్రకృతిమాతకు క్షమాపణ చెప్పుకుని ఆరోగ్యం కాపాడమని ప్రార్ధించాలి.

గమనిక: ఈ రాత్రి పూట ఉద్యోగాలు చేసే వారికి , గ్యాస్ , అజీర్ణం, పొట్ట ఉబ్బరం, పొట్ట పెద్దది అవటం, కీళ్ల నొప్పులు సమస్యలు అధికంగా వుంటాయి. దానికి ఇంటివైద్యం లో వామ్ము, మిరియాలు సైంధవలవణం తో ఒక మంచి ఔషధం ఉంది , చూసి , చేసుకుని వాడుకోగలరు. 

Thursday, 3 April 2014

వడదెబ్బ నుండి రక్షణ పొందుటకు:

నీటిలో చింతపండును బాగా పిసికివడపోసి తగినంత పంచదారకలిపి కొద్ది కొద్దిగా రెండుమూడు పూటలు తాగుతూవుంటే వడదెబ్బవలన కలిగిన నీరసం బలహీనత తగ్గిపోతయ్. ఎండాకాలంలో రోజూ కొద్దికొద్దిగా ఈ పానకం సేవించేవారు ఎండలో తిరిగినా కూడా వడదెబ్బ తగలదు.

పుండ్లు పడి చర్మం మందమైతే:

కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మం పైన పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారవుతుంది, అలాంటివారు ప్రతిరోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు తీసుకుని మెత్తగా నూరి ఆముద్దను పైన వేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగా వున్న చర్మం తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది.

రేచీకటి పోవటానికి :

1. ఈ సమస్యతో బాధపడేవారు వరుసగా 1,2 వారాల పాటు రెండుపూటలా గోంగూరతో వండిన కూరగానీ పచ్చడిగానీ తినాలి. గోంగూరలో ఇనపధాతు శక్తి ఆహారం ద్వారా దృష్టిలోపాన్ని సరిచేసి రేచీకటిని పోగొడుతుంది.
2. లేత ఆముదం చెట్టు చిగుళ్ళు రోజూ నాలుగైదు తింటుంటే రేచీకటి పోతుంది.
3. అరచుక్క వేపాకు రసం నిద్రించేముందు కళ్ళకుపెడుతుంటే రేచీకటి తగ్గుతుంది.
4. దేశవాళీ తమలపాకులు బాగా కడిగి, దంచి వడపోసి రాత్రినిద్రించే ముందు రెండు చుక్కల రసం కళ్ళలో వేసుకుని తరువాత నీటితో కడుగుతుంటే వారం రోజుల్లో రేచీకటి తగ్గిపోతుంది.
5. ప్రతిరోజూ అవిసెపూలను గానీ, మొగ్గలనుగానీ కూరగా వండుకుని అన్నంలో కలుపుకుని వరుసగా 21 రోజులు తింటూంటే రేచీకటి రోగం హరించిపోతుంది.

Wednesday, 2 April 2014

చిట్టి చిట్కాలు :

* వేపాకును నీటితో దంచితీసిన రసం ఒకచుక్క కంట్లో వేస్తుంటే రే్చీకటి తగ్గిపోతుంది.
* గుప్పెడు వేపాకు లీటర్ నీటిలో వేసి కాచి ఆవిరిపడుతుంటే చెవిపోటు చెప్పకుండా పారిపోతుంది.
* వేపాకు, ఉప్పు  కలిపిన రసం నాలుగు చుక్కలు వేస్తే చెవిలో దూరిన పురుగులు చచ్చి పడతయ్.
* రోజూ మామిడి పుల్లతో పళ్ళు తొముతుంటే నోటి దుర్గంధం హరించి నోరు పరిమళమౌతుంది.
* ఉల్లిగడ్డ నూరి పట్టు వేస్తుంటే గొంతువాపు, నొప్పి త్వరగా తగ్గిపోతయ్.

Tuesday, 1 April 2014

ఉగాది విశిష్టత : అందరికి జయనామ సమ్వత్సర శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా -.ఇంటివైద్యం

మనజాతి పుట్టినరోజు, మన భాషకు గుర్తింపు వచ్చినరోజు, తొలి తెలుగు సామ్రాజ్య స్థాపన జరిగిన రోజు, తెలుగువారి వీర విక్రమ పరాక్రమ పౌరుషజ్వాలలు మిన్నంటిన రోజు, వసంతఋతుశోభతో తొలి సృష్టి ప్రారంభమైన రోజు, ఆరోగ్య సౌభగ్యమహాభాగ్యాలందించే ఓషధులకు జీవభావ ప్రభావాలు పల్లవించినరోజు, అదే తెలుగువారి నూతన సంవత్సర పర్వదినమైన ఉగాదిగా రూపుదాల్చింది.

విక్రమాదిత్యుని బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగుజాతి, శాతవాహనుడి ఆధ్వర్యంలో శివమెత్తిన శివంగులై విక్రమాదిత్యుని ఉత్తరభారతం వరకు తరిమికొట్టి సువిశాల తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న అలనాటి వీరగాధలు వింటూ ఆ వీరుల పౌరుషాగ్నిజ్వాలలను నరనరాన నింపుకోవలసినరోజిది. సాక్ష్యాత్తు లక్ష్మిస్వరూపమైన వేపచెట్టు పూల రేకలతో తయరైన ఉగాది పచ్చడిని సేవిస్తూ ఆ సంవత్సరాంతం వరకు వ్యాధిరహితులుగా జీవించడానికి పునాది వేసుకోవలసిన రోజిది. తెలుగు భాషకు తీయందనాలంద్దిన కవిత్రయ అష్టదిగ్గజాది కవివరేణ్యుల కమనీయ కవితా శ్రవంతులలో ఈదులాడవలసిన రోజిది..

ఉగాది అసలు పేరు 'యుగాది' అంటే్ నక్షత్రగమనమార్పు మొదలైనరోజు, అలాగే యుగమునకు ఆది అని అర్ధం. యుగం అంటే సంవత్సరం  అని కూడా అర్ధముంది. అనగా కొత్త సంవత్సరానికి మొదలు అని కూడా అర్ధం. అందుకే ఈ పండుగను 'సంవత్సరాది ' అని  కూడా అంటారు
ఈ పండుగ ప్రతీ ఏడాది చైత్రమాసంలో శుద్ధ పాద్యమినాడు ప్రారంభమౌతుంది.ఆరోజే వసంత నవరాత్రులు కూడా ప్రారంభమౌతాయ్. విక్రమార్కుని పై శాతవాహనుడు సాధించిన ఘనవిజయానికి గుర్తుగా, తొలి తెలుగు సామ్రాజ్య ఆవిష్కరణకు నాందిగా  వసంత నవరాత్రులు జరుపుకోవడం తరతరాలుగా తెలుగువారి సంప్రదాయం . ఋతువులకు రాజైన వసంతఋతువులో వేప, మామిడి మొదలైన జీవవృక్షాలన్నీ చిగురించి పూలుపూసి మధురమకరందాలతో మహాశోభాయమానంగా విరాజిల్లుతుంది. వేప,మామిడి చెట్లకు ఈకాలంలో పూసే పూవుల్లో అనంతమైన జీవశక్తి దాగివుంటుంది. అందుకే ఆ జీవశక్తిని ఉగాదిపచ్చడి రూపంలో పండుగనాడు తినటం ద్వారా అ సమ్వత్సరమంతా దాని ప్రభావంతో వాత పిత్త కఫ సంబంధమైన ఏ వ్యాధి రాకుండా కాపాడగల ఆరోగ్యసంప్రదాయం కూడా ఈ పండుగలో దాగి వుంది.