Pages

Tuesday, 31 December 2013

కడుపు నొప్పి కి :

పచ్చి పుదీనా ఆకులు ఏడు , ఏలకకాయ ఒకటి ఈ రెండు పదార్ధాలు ఒక తమలపాకులో పెట్టి కిళ్ళీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగి తరువాత కొద్ది కొద్దిగా మంచి నీళ్ళు తాగితే ఆ మరుక్షణమే కడుపు నొప్ప్పి కనుమరుగవుతుంది.

మురికినీటి వల్ల కలిగిన జ్వరాలకు :

శొంఠి 40 గ్రాములు తీసుకుని దానిని నాలుగు రెట్లు నీటితో కలిపి నాల్గవ వంతు కషాయం మిగిలేటట్లు మరిగించి, వడపోసి చల్లర్చి అందులో తగుమాత్రంగా తేనె కలిపి కొద్ది కొద్దిగా సేవిస్తూ వుంటే దుష్టజల సంయోగం వల్ల కలిగిన జ్వరం, అరుచి, అగ్నిమాంద్యం, దగ్గు, పడిశం, జలదోషం వీనిని హరింపచేసి శరీరానికి, మనసుకు, నేత్రములకు నిర్మలత్వాన్ని ప్రసన్నతను కలుగచేస్తుంది.

Saturday, 28 December 2013

మూలవ్యాధి (piles) నివారణకు :

1. కందను కూరగా వండుకుని తింటూ వుంటే 5,6 రోజుల్లో మొలల బాధ నివారణ అవుతుంది
2. బప్పాయి పండ్లు తరుచుగా తింటూ వుంటే మూలవ్యాధులు శాంతిస్తాయ్.
3. వేప పండ్లను రోజూ 5,6 తింటూ వుంటే వేపపండ్లు వచ్చే రుతువు పూర్తయ్యేసరికి మొలలు తగ్గిపోతయ్.
4. నీరుల్లి(ఉల్లిగడ్డల) పాయలను ముక్కలుగా తరిగి నేతితో దోరగా వేయించి ఆ ముక్కల మేద తగినంత పంచదార చల్లి రెండు పూటలా తింటూ వుంటే రక్తం పడే మొలలు తగ్గుతయ్.
5. రోజూ రెండు పూటలా భోజనం చేసిన తరువాత 10 గ్రాములు కరక్కాయ పొడిని పుల్లటి మజ్జిగలో కలుపుకుని తాగుతూ వుంటే మూల వ్యాధి పిలకలు వూడిపడిపోతయ్.
6. మూలవ్యాధి కలవారు ఎక్కువగా జామకాయలను తింటూ వుంటే మొలలలు బాధ శాంతిస్తుంది.

Wednesday, 18 December 2013

తెలుసుకుందాం : బియ్యం గురించి

బియ్యంలో శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్ధాలు అత్యధిక శాతంలో వున్నాయి.

బియ్యంలో శరేర నిర్మాణానికి్ ఉపకరించే మాంసకృత్తులు 7 శాతమే వున్నాయి.

బియ్యంలోగింజకి, పైన వుండే వరి పొట్టూకీ మధ్య విటమిను  బి వుంటుంది. బాగ పాలిష్ పట్టిన బియ్యంలో తవుడుతో పాటు ఇది వెళ్ళిపోతుంది.

గోధుమతో పోలిస్తే బియ్యంలో మాంసకృత్తుల శాతం స్వల్పం. అయితే మనిషి శరీరం మాత్రం గోధుమలోని మాంసకృత్తుల కన్నా బియ్యంలోని మాంసకృత్తులే అధికంగా వినియోగించుకుంటుంది.

చాలా కాలం నుంచే పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడే వారిలో ఒకవేళ పాదాలు తిమ్మిరి పట్టడం, మొద్దు బారడం, మంటగా అనిపించడం గనుక జరిగితే అది విటమిను  బి లోపంగా గ్రహించాలి.

మామూలు బియ్యం కన్నా ఉప్పుడు బియ్యంలో బి వితమిను శాతం ఎక్కువగా వుంటుంది. గిజలోని ఈ విటమిను చొచ్చుకుపోవడం వల్ల ఈ బియ్యాన్ని ఎంత కడిగినా ఏంకాదు.

కాళ్ళు చేతులు పీకుతుంటే :

ఇటుక పొడుమును గానీ, తవుడు గానీ, ఉప్పు గానీ వెచ్చజేసి గుడ్డలో వేసి కాపడం పెట్టాలి.

వాత నొప్పులకు :

ఉమ్మెత్త ఆకులకి ఆముదము రాసి ఆకుల్ని వేడి చేసి నొప్పిగల చోట వేసి కట్టుకడీతే వెంటనే నొప్పిలాగేస్తుంది.

కాళ్ళు - చేతులు మంటలు :

10 గ్రాముల ఆవునెయ్యిలో 5 గ్రాముల మిరియాలు చితగ్గొట్టీవేసి, మరగకాయాలి.చల్లారిన తరువాత ఆ నేయితో మర్ధనా చేస్తూ ఆ నేతినే అన్నంలో కలుపుకొని తింటూ వుంటే మంటలు తగ్గిపోతయ్.

Tuesday, 17 December 2013

అధిక వేడి తగ్గటానికి:

దోరగా వేయించిన ధనియాలపొడి, దోరగా వేయించిన జీలకర్ర పొడి, దోరగా వేయించిన సోంపు పొడి కలిపి ఒక సీసాలో పెట్టుకుని  నీళ్ళలో ఈ పొడిని, సరిపోయేంత పటికబెల్లం, కొన్ని ఎండు ఉసిరి ముక్కలు వేసి వుంచి రోజంతా ఆ నీరు తాగుతూ వుంటే అధిక వేడి తగ్గుతుంది.

లేదా

సబ్జా గింజలు అర చెంచా, అర గ్లాసు నీళ్ళలో వేసి,10 నిముషాల తరువాత అందులో పటిక బెల్లం వేసుకుని తాగితే
15 నిముషాల్లో వేడి దిగిపోతుంది.

పచ్చి అరటికాయ చూర్ణంతో ఉపయోగాలు:

అరటికాయను చిన్న ముక్కలుగా తరిగి ఎండించి దంచి జల్లించి చూర్ణం చేసి విలువ ఉంచుకోవాలి.
జ్వరాలకు :
పిల్లలకు పావు టీ చెంచా, పెద్దలకు అర టీ చెంచా మోతాదుగా అరటి చూర్ణాన్ని రెండు పూటలా ఆహారానికి అరగంట ముందుగా సేవిస్తుంటే జ్వరాలు, జ్వరంలో కలిగే విరేచనాలు తగ్గుతయ్.

జిగట, రక్త విరేచనాలకు :
పై చూర్ణాన్ని మోతాదుగా పిల్లలు పెద్దలు వాడుతుంటే ఉదరకోశంలోని చెడు క్రిములు నశీంచిపోయి జిగట, రక్తవిరేచనాలు కూడా కట్టుకుంటాయి.

నేత్రవ్యాధులకు:
పచ్చి అరటికాయ చూర్ణాన్ని విడవకుండా నలభై నుండీ అరవై రోజుల వరకు రెండుపూటలా ఆహారానికి గంట ముందుగా పైన తెలిపిన మోతాదు
ప్రకారం మంచి నీటితో సేవించడం వల్ల నేత్రరోగాలకు ఉపశమనం కలుగతతని. అనగా నేత్రాలు ఎర్రబడటం, పుసులు కట్టడం, గరగరలాడటం, మంట, నీరు కారటం వంటి బాధలు హరించిపోతయ్.

స్త్రీల బట్టంటు వ్యాధులకు:
 ఈనాడు దాదాపుగా నూటికి నూరు మంది ఆడపిల్లలు ఏదో ఒక రకమైన బట్టంతు వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. అలాంటి వారు కారం, ఉప్పు, పులుపు బాగా తగ్గించి, మాంసం, గుడ్లు, చేపలు పూర్తిగా నిషేధించి ఆహారంలో పచ్చి అరటికాయతో చప్పిడిగా వండిన కూరను సేవించాలి. రుంచికోసం కొద్దిగా సైంధవలవణం, మిరియాల కారం కలిపి వండుకోవచ్చు. లేకుంటే పైన తెలిపినట్లుగా చూర్ణాన్ని తయారుచేసుకొని రెండుపూటలా అదే మోతాదుగా మంచి నీటితో సేవించడం ద్వారా కూడా బట్టంటువ్యాధుల నుండి బయటపడవచ్చు.

మూలవ్యాధికి (piles):
ఎంతోకాలం నుండీ తీవ్రమైన మొలలు సమస్యలతో బాధపడేవారు అరటికాయను ముక్కలు చేసి ఎండబెట్టి దంచి పొడిచేసి పైన తెలిపిన మోతాదులా వాడుతుంటే 40-60 రోజుల్లో మొలలు, పోటు తగ్గిపోయి బయటకొచ్చిన మొలల పిలకలు కూడా ఎండి రాలి పడిపోతయ్.
ఈ చూర్ణం కొద్దిగా విరేచనబద్దకాన్ని కలిగిస్తుంది. అలాంటివారు రోజూరాత్రి భోజనంలో తినే చారులో అరచెంచా సునాముఖిపొడిని వేసి తినటం ద్వారా పరిష్కారం పొందవచ్చు.

ఎముకలు అరిగిన సమస్యకు :

చింతగింజలు తెచ్చి బాగా వేయించి నీటిలోవేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పైతోలు తీసి పప్పును ఎండించాలి. తరువాత వాటిని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఒక చెంచా మోతాదుగా నీరుపోసి కలిపి వండుతూ ఉడికిన తరువాత పాలుపోసి చక్కెర వేసి పాయసంలా చేసుకుని రెండు పూటలా సేవించాలి. ఈ విధంగా కొంతకాలంపాటు చేస్తుంటే సంధుల్లో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడుతుంది. ఇది ఖర్చులేని, కష్టంలేని మార్గం.
 ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే, ఆపరేషన్లు, కీళ్ళలో రాడ్లు పెట్టించుకుని తరువాత బాధపడే బాధ తప్పుతుంది.

దగ్గు ఎందుకు ఆపకూడదు:

శ్వాస కోశమార్గంలో ఏర్పడే అవరోధాలను నిరోధించడానికి శరీరం దగ్గును సృష్టిస్తుంది. ఆ దగ్గును ఆపడానికి ప్రయత్నించకుండా దగ్గితే అవరోధాలు హరించిపోతయ్.
అలాగాక ఏ కారణాలవలనైనా వచ్చిన దగ్గును బలవంతంగా నిరోధిస్తే క్రమక్రమంగా ఆ దగ్గు ఏ ఔషధాలకు లొంగనంత ఉధృతంగా వృద్ధిచెందుతుంది. అంతేగాక, ఆపిన దగ్గువల్ల కాలగమనంలో అరుచి, గుండెరోగం, ఆస్తమా, క్షయ, ఎక్కిళ్ళు, మొదలైన శ్వాసకోశ సంబంధ సమస్యలు అనేకం పుట్టుకొస్తయ్.

తుమ్ములు అధికంగా వస్తూ బాధపెడుతుంటే:

ప్రతిరోజూ ఉదయం అల్లం రసం, తేనె ఒక చెంచా మోతాదుగా 40 రోజులు వాడుతూంటే తుమ్ములు ఆగిపోతాయ్.

తలవెంట్రుకలు పెరగటానికి:

కలబంద గుజ్జు 200 గ్రాములు, నువ్వులనూనె 200 గ్రాములు, ఈ రెండూ కలిపి చిన్న మంటపైన మరగబెట్టి కలబంద గుజ్జు నూనెలో మరిగేవరకు వుడికించి దించి వడపోసి చల్లరిన తరువాత ఒక డబ్బాలో పెట్టుకుని రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయ్. 

వండిన పదార్ధాలు, పచ్చి పదార్ధాలు ఒకేసారి సేవించ వచ్చా?

వండిన పదార్ధాలు, పచ్చి పదార్ధాలు ఒకేసారి సేవించడంలో ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కాబట్టి, పచ్చికూరగాయల కుక్కలు గానీ పళ్ళరసాలుగానీ వండిన ఆహారాన్ని భుజించేటప్పుడు సేవించకుండా భోజనం తరువాత రెండు గంటలు ఆగి సేవించడం మంచిది.



వృద్ధుల - సమస్త మూత్రవ్యాధులకు:

పచ్చిపసుపు దుంప చిన్న ముక్కలు చేసి ఎండబెట్టి దంచి చేసిన పొడి 40 గ్రాములు ఉసిరికాయపొడి 40 గ్రాములు పటికబెల్లం పొడి 40 గ్రాములు కలిపి వుంచుకోవాలి. పూటకు 5 గ్రాములు మోతాదుగా రోగస్థితిని బట్టి రెండు లేక మూడు పూటలా సేవిస్తూవుంటే అన్నిరకాల మూత్రవ్యాధులు హరించిపోతాయి.

వృద్ధుల మూత్రంలో మంటకు:

ఒక గ్లాసు గోరువెచ్చని గంజిలో రెండుచెంచాల నెయ్యి కలిపి రోజూ రెండు లేదా మూడుసార్లు తాగుతూవుంటే అతివేడి హరించిపోయి మూత్రమ్లోమంట తగ్గిపోతుంది.

వృద్ధులకు మూత్రం బొట్లు బొట్లుగా పడుతుంటే:

1. వేడిపాలలో బెల్లం కలుపుకుని తాగుతుంటే మూత్రం ధారాళంగా విడుదల అవుతుంది.
2. ఆవాలను దోరగా వేయించి పొడి చేసి  అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో మూడు చిటికెలు కలుపుకుని తింటుంటే మూత్రం ధారాళంగా విడదల అవుతుంది.

Monday, 16 December 2013

చెవుడు నివారించుటకు :

దేశవాళీ గోమూత్రాన్ని ఏడుసార్లు బట్టలో వడపోసి గోరువెచ్చగా వేడిచేసి ఒక చెంచా గోమూత్రంలో చిటికెడు సైంధవలవణం కలిపి కరిగించి చెవులలో అయిదారు చుక్కలు రెండు పూటలా గోరువెచ్చగా వేస్తూ వుంటే ఎనిమిదిరోజులలో చెవుడు నివారించబడుతుంది. దిర్ఘకాల సమస్య వున్నవారు మరికొన్ని రోజులు వేయవచ్చు.

చెవుడుకు మరొకయోగం:బాగా పండిన పసుపు పచ్చని జిల్లేడాకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడిచి దానిపైన ఆవనూనె బాగా రాయాలి. తరువాత ఆ ఆకును పొయ్యిమీద సెగ చూపించి వాడ్చి ఆకును పిండి తీసిన రసం మూడుచుక్కల మోతాదుగా రెండుపూటలా చెవులలో వేస్తుంటే చెవుడుతో పాటు చెవి మూసుకుపోవడం, చెవిపోటు వంటి అనేకరాకాల చెవి వ్యాధులు అతిసులువుగా హరించిపోతయ్.

ఆహార నియమాలు: చెవి సమస్యలున్నవారు జలుబు చేసే వస్తువులు తినకూడదు. ముఖ్యంగా పెరుగు, పాలు, అరటిపండు, మిఠాయి వంటి తీపిపదార్ధాలు అతిచలువ చేసే ఆకు కూరలు, కాయగూరలు నిషేధించాలి.

చెవిలో చీముకు:

ఒక చిన్న గరిటెలో నువ్వులనూనె గానీ ఆవనూనె గానీ తీసుకొని మంటమీద గరిటెను పెట్టి వేడిచేస్తూ ఆ నూనెలో వెల్లుల్లి లోపలి గర్భం(పాయ/రెబ్బ)ఒకటి చిదిపి వేయాలి. అది నూనెవేడికి చిటపటమని కాగుతూ నల్లగా మాడగానే గరిటెను మంటనుండి తీసి గోరువెచ్చగా అయ్యేవరకూ పక్కన పెట్టి ఆ తరువాత వడపోసి ఆ నూనెలో దూదిని ముంచి చెవులలో రెండు పూటలా నాలుగైదు చుక్కలు పిండాలి. ఎప్పుడు పిండినా నూనె గోరువెచ్చగా వుండాలి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే చెవులోచీము, చెవిపోటు, చెవుల్లో పురుగులు దూరడం వల్ల కలిగిన బాధ తగ్గిపోతయ్.

ఇంగ్లీషు డాక్టర్లు చెవిలో నూనె ఎందుకు వేసుకోవద్దంటారు ? మరి చెవి రోగాలు ఎందుకు వస్తున్నాయ్ ?ఏమి చెయ్యాలి ?

ఈనాడు దాదాపుగా చెవి రోగాలు లేని వ్యక్తులు ఒక్కరుకూడా లేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనమంతా మన దేశీయమైన ముందు జాగ్రత్త చర్యలను విడిచిపెట్టి విదేశీయ మార్గాలను ఆచరిస్తున్నాం. మన పద్ధతి ప్రకారం రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని నువ్వులనూనె మూడునాలుగు చుక్కలు చెవులలో వేసుకోవదం ద్వారా ఎప్పటికీ చెవులకు సంబంధించిన వ్యాధులు వచ్చేవి కావు. వినికిడి శక్తి లోపించేది కాదు.
అయితే, విదేశీ వైద్యం మన దేశంలొ ప్రవేశించిన తరువాత వారిదేశ వాతావరణాన్ని(శీతల) బట్టి చెవులలో నూనె వేయకూడదు కాబట్టి మనదేశంలో కూడా ప్రజలంతా చెవులలో నూనెవేసుకోవడం మానుకోవాలని ఆ చదువు చదివిన వైద్యులు ప్రబోధించడం వల్ల మనమమంతా చెవులలో నూనెవేయడం మానుకున్నాం. అందుకే ఇన్ని రకాల చెవి వ్యాధులు మనల్ని పీడిస్తున్నాయ్. వెంటనే చెవులలో పైన తెలిపినట్లు నూనె వేయడం ప్రారంభించి చెవి రోగాలు రాకుండా కాపాడుకోండి.

మార్కెట్లలో కల్తీ నూనెలు వుండటం వల్ల కూడా డాక్టర్లు వద్దనటానికి మరొక  కారణం అని కూడా చెప్పొచ్చు.

కానుగ దగ్గర మంచి నూనె సేకరించుకుని వాడటం ఉత్తమం.

ముక్కులో ఎముక పెరిగితే:

ఈనాడు ఈ సమస్యకు ఆధునిక వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. చేసిన తరువాత కూడా మరలా మరలా కొయ్యకండరాలు ముక్కులో పెరుగుతూనే వున్నయ్. అందువల్ల ఈ సమస్యగల వారు పరిశుద్ధమైన వేపనూనె రెండుమూడు చుక్కల మోతాదుగా రెండుపూటలా ఆహారానికి అరగంటముందు ముక్కుల్లో వేయాలి. దీనివల్ల వారం పదిరోజుల్లోనే ముక్కుల్లో పెరిగిన కొయ్యకండరాలు కరగడం మొదలై చీదినప్పుడు కొంచం ఎర్రగా నీరు స్రవిస్తుంది. అందుకు భయపడవలసిన అవసరం లేదు. ఇలా కొద్దిరోజులు చేస్తే ఆ సమస్య తీరిపోతుంది.
దీనితోపాటు దోరగా వేయించిన శొంఠిపొడి 50 గ్రాములు , పాతబెల్లం 100 గ్రాములు కలిపి దంచి నిలువచేసుకుని పూటకు పిల్లలకు 2 గ్రాములు మోతాదుగా, పెద్దలకు 5 గ్రాములు  సేవింపచేస్తుంటే అతిత్వరగా నాసికాసమస్యలు హరించిపోతయ్.

ఆహారనియామాలు : నాసికా సమస్యలున్నవారు ముఖ్యంగా ఫ్రిజ్ లో నిలువచేసిన పదార్ధాలు నిషేధించాలి. ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చల్లని నీరు, చల్లని పదార్ధాలు విడిచిపెట్టాలి. పాలు, పంచదార, దోస, బెండ, ఆనబ(సొరకాయ)కూరలను సేవించడం మానుకోవాలి.

ముక్కునుండి రక్తం కారుతుంటే :

గరిక వేర్లను శుభ్రంగా కడిగి దంచితీసిన రసం బట్టలో వడపోసి మూడునాలుగు చుక్కల మోతాదుగా రెండూపూటలా ముక్కుల్లో వేస్తూంటే ముక్కునుండి కారే రక్తం వెంటనే ఆగిపోతుంది.
దీనితోపాటు దోరగావేయించిన ధనియాలపొడి 100 గ్రాములు, పటిక బెల్లం పొడీ 100 గ్రాములు కలిపి రెండూపూటలా పూటకు చెంచా మోతాదుగా సేవిస్తూ వుంటే త్వరగా ఆ సమస్యనుండి బయటపడవచ్చు.

నాసికా(ముక్కు)రోగములకు - నాణ్యమైన మార్గం :

ప్రతిరోజూ నియమం తప్పకుండా గోరువెచ్చని కల్తీలేని స్వచ్చమైన నువ్వుల నూనెను రెండు రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాలలో వేసుకొని పీలుస్తూవుంటే జీవితంలో ఏనాటికీ నాసికారోగములు రానే రావని మహాఋషులు నిర్ధారించారు.
మన ఇండ్లలో మన తాతముత్తతలంతా ఈ విధానాన్ని నియమం తప్పకుకండా ఆచరించి ఏ నాసికారోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇంత గొప్ప సులువైన మార్గం ఈనాడు మనం ఆచరించకపోవడంవల్లే అనేక నాసికా రోగాలకు గురౌతున్నాం.

కండ్ల నుండి నేరు కారుతూవుంటే :

వేపాకును మెత్తగా కొంచం నీటితో ముద్దలాగా నూరి కొద్దిగా నీటిని పిండివేసి ఆ ముద్దను మూసిన కండ్లపైన పలుచని బట్టవేసి దానిపైన ఆ ముద్దను పరిచి 20 నిముషాల పాటు వుంచి తీసివేయాలి. ఈ విధంగా కొద్దిరోజులు చేస్తే కండ్లవెంట నీరుకారడం ఆగిపోయి కళ్ళకు తేజస్సు పెరుగుతుంది.

కండ్లమంటలకు:

జామచెట్టు నుండి పచ్చగా వున్న ఆకులను సేకరించి దుమ్ములేకుండా కడిగి కొంచం నీటితో మెత్తగా ముద్దలాగా నూరి ఆ ముద్దను చిన్న గారెలాగా గుండ్రంగా చేసి మూసినకళ్ళపైన పలుచని నూలు బట్టవేసి దానిపైన ఈ ముద్దను పరచి ఇరవైనిముషములు ఆగిన తరువాత తీసివేయాలి. ఇలా చేస్తుంటే కండ్లమంటలు సులువుగా తగ్గిపోతయ్.

కండ్లకింద నల్లని వలయాలకు:

పరిశుభ్రమైన ఆవనూనె తెచ్చుకొని నాలుగైదు చుక్కలు ఎడమచేతి అరచేతిలో వేసుకుని కుడిచేతితో కొద్దికొద్దిగా అద్దుకొని నిదానంగా కండ్లకింద నల్లని వలయాలపైన మృదువుగా రెండుపూటలా మర్ధన చేయాలి. ఇలా చేస్తూ ఉసిరికాయలపొడి 100 గ్రాములు, పటికబెల్లం పొడి 100 గ్రాములు కలిపివుంచుకొని రెండుపూటలా అరచెంచా నుండి ఒక చెంచా వరకు సేవించాలి. దీని వల్ల కళ్ళకింద ఏర్పడిన  నల్లని వలయాలు క్రమంగా హరించిపోతయ్.

ముఖంపై మంగు మచ్చలు మాయమగుటకు :

మర్రిచిగుర్లు, పచ్చ పెసర్లు సమంగా తీసుకొని తగినన్ని ఆవుపాలతో కలిపి బాగా మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మంగుమచ్చలపైన లేపనం చేస్తుంటే తప్పకుండా ఎంతోకాలం నుంచి వున్న మచ్చలైనా మటుమాయమౌతయ్.

వెంట్రుకలు పొడవుగా పెరుగుటకు:

సన్నగా వుండే లేత మర్రి వూడలు 100 గ్రాములు, గుంటగలగరాకులు(బృంగరాజు) 100 గ్రాములు, ఈ రెండింటిని కలిసిపోయేటట్లు మెత్తగానూరి 300 గ్రాముల నల్లనువ్వులనూనెలో వేసి కలిపి చిన్నమంటపైన మరిగిస్తూ నూనె మిగలగానే దించి వడపోసి బధ్రపరచుకోవాలి. ఈ తైలాన్ని రోజూ వెంట్రుకలకు రాస్తుంటే జుట్టు పొట్టిగా వున్నవారికి పొడవుగా పెరుగుతుంది.

మరణం లేని చెట్టు - మర్రి చెట్టు:

మర్రిపండ్లలో వుండే కంటిలోపల నలుసంత పరిమాణంగల చిన్న గింజలనుండి మరణమేలేని మర్రి వృక్షం పుట్టుకొస్తుందంటే ఆ విత్తనం ఎంతగొప్పదో అందులో ఎంతదైవశక్తి దాగివుందో మనం తెలుసుకోవచ్చు. పండిన మర్రిపండ్లు తిని కాకులు వేయ్యేండ్లు ఆయువుతొ వర్ధిల్లుతున్నాయని  మనకు తెలియదు. భగవంతునికి ఆది మధ్య అంతం ఎలా వుండదో, మైళ్ళపర్యంతరం విస్తరించిన మర్రిచెట్టుకు కూడా మొదలెక్కడో చివరెక్కడో  మధ్యెక్కడో తెలుసుకోలేము. దీని సర్వాంగాలు పచ్చివి గాని, ఎండినవిగాని, పండ్లు గాని అన్నికూడా అపారమైన ఔషధ శక్తులతో నిండి వున్నయ్. అందుకే ఈ చెట్లను గుళ్ళల్లో పెంచాలని పెద్దలు తీర్మానించారు.

రవివున్న చెట్టు - రావి చెట్టు:

రవి అనగా ప్రాణశక్తి. సూర్యుని కిరణాలలో మానవాళిని కాపాడే మహోన్నత జీవశక్తి ఎలా దాగి వుంటుందో అదేవిధంగా ఆ సూర్యుడనబడే రవికి ప్రతిరూపంగా భూమిపై ఆవిర్భవించిన రావిచెట్టులో అదేశక్తి నిండి వుంటుంది.
ఇది రాత్రంబవళ్ళు ఒకవైపు నుండి మానవులు జంతువులు మొదలైన జీవులు విడిచిపెట్టే బొగ్గుపులుసు వాయువు అనేచెడుపదార్ధాలను ఆహారంగా తీసుకొంటూ మరోవైపునుండి జీవకోటి ఆయువునిలిపే ప్రాణవాయువులను నిరంతరం వెదజల్లుతూ వుంటుంది.

అందుకే ఈ చెట్టును సూర్యాత్మ అని, దైవాత్మ అని దైవభవనం అని అశ్వత్ఠవృక్షము అని బోధివృక్షము అని జ్ణాన వృక్షము అని  ధర్మ వృక్షము అని సంతాన వృక్షము అని ఇలా అనేకవందల రకాల  పేర్లు ఈ చెట్టుకు పెట్టబడినయ్.

చర్మం పై పుట్టిన - గడ్డలకు, బిళ్ళలకు:

రావిచెట్టు ఆకులకు ఆముదంరాసి వాటిని వేడిచేసి గడ్డలపై వేసి కట్టుకడుతూవుంటే ఆ గడ్డలు చితికిపోయి మాడడిపోతయ్.

అధికపానం అనర్ధం:

దాహమైంది కదాని అధికంగా నీరు సేవించినాకూడా అనేకరోగాలు పుడతయ్. దాహం తీరడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వుంటుంది. మనసులో ఇక చాలు అనిపించినప్పుదు నీరు తాగడం ఆపివేయాలి. ఈ నియమం ప్రధానంగా గుర్తుంచుకో్దగినది.
అతిఋతు రక్త స్రావ సమస్యకు: అరటిపండ్లతో నెయ్యి కలిపి మెత్తగా పిసికి తింటూ వుంటే ఎర్రకుసుమ రోగం/అతి ఋతు రక్త స్రావం ఆశ్చర్యంగా తగ్గిపోతుంది.

బుద్ధ్హి/ఆయుష్షు పెరగాలంటే:

మర్రి వూడలతో రోజూ పండ్లు తోముకుంటూంటే క్రమంగా బుద్ధి, ఆయుష్షు పెరుగుతయ్.

దేహ పుష్టికి :

వంద గ్రాముల పెరుగు, ఆవునేతితో దోరగా వేయించిన మిరియాల చూర్ణం ఐదు గ్రాములు, ఈ రెండు కలిపి, బాగా చిలికితే పానకం లాగా అవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తాగుతూ వుంటే శరీరానికి అగ్నిదీప్తి (ఆకలి), కాంతి పుష్టి కలుగుతయ్.

Wednesday, 11 December 2013

7 రోజుల్లొ టాన్సిల్స్ పోతాయి

7 రోజుల్లొ టాన్సిల్స్ పోతాయి పసుపు 100 గ్రాములు సైంధవ లవణం  100 గ్రాములు వాయువిదంగాలపొడి 100 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి . అర లీటరు మంచి నీటిలో పై చూర్ణాన్ని ఒక టీ చెంచా మోతాదుగా వేసి 5 నిముషాలపాటు మరిగించి వడపోసి గోరు వెచ్చగా నోట్లొ పోసుకుని గులగరించి వుసివెస్తుంటె 7 రోజుల్లొ టాన్సిల్స్ తగ్గుతాయి

ఆహార నియామాలు పాటించాలి.

తెల్లబోల్లి మచ్చలు/tellabolli machalaku

మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు హరిస్తయ్
minumulanu neetitoo nuuri pattistunte kramamgaa tellabolli machalu haristai.

చర్మ రోగాలు

కాకరకాయ మరియు పసుపు కలిపి నూరి  పూస్తుంటే సిబ్బెం ఇంకా చాలా  చర్మ రోగాలు పోతాయి 

Tuesday, 10 December 2013

తెలుసుకుందాం/telusukundaam

మానసిక శక్తి మహోన్నతంగా పెరగాలంటే రొజూ సూర్యసక్తిని గ్రహించావలసిందే
maanasika sakti mahonnatamgaa peragaalante  roojuu suurya saktini grahinchavalasinde.

ఏ ఇంటిలోనికి సూర్య రశ్మి ప్రవెశీంచదొ ఆ ఇల్లు నివాస యోగ్యం కాదు
ee intiloniki suuryarasmi pravesinchadoo aa illu nivaasa yogyam kaadu.

మంచి విషయం/manchi vishayam

ఆహార విహార వ్యవహారాలలో జరిగే లోపాలే అన్ని రోగాలకు అసలు కారణాలు 
aahaara vihaara vyavahaaraalalo jarige lopaale anni roogaalaku asalu kaaranaalu.

కాలిన గాయాలకు కమ్మని లేపనం/ kaalina gaayaalaku kammani lepanam.

బాగా పండిన అరటిపండును మెత్తగా పిసికి కాలిన గాయాలపైన వెంటనే లేపనం చేస్తే మంట పోటు తగ్గి గాయాలు త్వరగా మానుతయ్ .
baagaa pandina arati pandunu mettagaa pisiki kaalina gaayaalapaina ventane  lepanam cheste manta, potu taggi gaayaalu tvaragaa maanatay.

Sunday, 8 December 2013

ఉబ్బసరోగం పారిపోతుంది / vubbasa rogaaniki

మంచి వేప నూనె 5 చుక్కలు తమలపాకు పై  వేసి రొజూ తింటుంటే 21 రోజుల్లో ఉబ్బసరోగం పారిపోతుంది
Manchi vepa nune 5 chukkalu tamalapaku pai vesi roju tintunte 21 rojullo vubbasa rogam paaripotundi.

మాటలు రాని చంటి బిడ్డలకు మహత్తర మార్గం :

మర్రి వూడలు తెచ్చి , వాటిని నీళ్ళతో మెత్తటి గంధంగా నూరాలి . ఆ  గంధాన్ని చంటి బిడ్డల నాలుక మీద రుద్దుతూ ఉంటే క్రమంగా మాటలు వస్తాయ్, ఈ వూడల గంధం లోపలికి పోయినా మంచిదే గానీ నష్టమేమీ వుండదు .