Pages

Friday, 30 May 2014

నల్లమచ్చలు పోవటానికి

నీలాకాశంలో మబ్బు తునకలులా తెల్లటి పలుచటి చర్మము మీద నల్లటి మచ్చలు.
మబ్బు కమ్మిన నీలాకాశమును చూసి ఆనందిస్తాము. స్వీయదేహకాంతి మీద చీకటిలాంటి మచ్చలు చూసి రోధిస్తాము. ఆ మానసిక రోదన పోవాలంటే...

1. జాజికాయను నీటిలో అరగదీసి గంధం పూయాలి.
2. దోసకాయ రసము తీసి మచ్చలపైన పూయాలి.
3. తోటకుర లేదా కారెట్ రసముతో ఒక చిటికెడు పసుపు చేర్చి రోజూ ఉదయం తాగాలి.
4. చేతులు అందంగా కాంతివంతంగా ఉండాలంటే ఒక స్పూను పెరుగు తరచు చేతులకు వ్రాస్తూ ఉండాలి.
5. రావిచెట్టు బెరడు గంధంగా తీసి పూసిన నల్లమచ్చలు పోతాయి.
6. అల్లం రసాన్ని ఆముదముతో కలిపి చర్మము మీద ఏర్పడిన మచ్చ్లల మీద రాస్తే మచ్చలు పోతాయి.
7. కాలిన పుండ్లు మాడిన తరువాత ఆ చోట తేనెతో ముంచిన దూది వేసి కట్టుకడుతూ ఉంటే కాలిన మచ్చలు పోతాయి.
                                         మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవa

Thursday, 22 May 2014

జుట్టు పెరుగుటకు -నల్లబడుటకు :

1. పసుపు కొమ్ము అరగదీసి ఆ గంధమును తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి.
2. సీతాఫలము ఆకు రసము తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి.
3. గురివింద గింజలు నీటితో ముద్దగా నూరి , తలకి రాసి, ఒక గంట తరువాత స్నానం చేయాలి.
4. వారానికి ఒకసారి కొబ్బరిపాలు తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి.
5. ఉసిరికాయ చూర్ణాన్ని ఒక పాత్రలో నానపెట్టి ఉదయమే అందులో ఒక నిమ్మకాయ పిండి జుట్టుకు పట్టిస్తే ఏపుగా పెరిగి మెరుస్తూ ఉంటుంది.
6. కొబ్బరినూనెలో వెల్లుల్లి పాయలను ఉడికించి తరువాత వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.

Tuesday, 20 May 2014

దంత పటిష్టతకు - నేరేడు పుల్ల :

రోజూ ఉదయమే నేరేడు పుల్లతో పండ్లు తోముకొంటూ వుంటే కదిలే దంతాలు కూడా గట్టిపడతయ్. పుల్లలతో తోముకోవటం అలవాటులేనివారు నేరేడు చేక్కను లేదా పుల్లలను ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకొని , ఆ చూర్ణంతో పండ్లు తోముకోవచ్చు.

చిగుళ్ళవాపుకు - జామ ఆకుతో జయమైన యోగం :

జామ చెట్టు ఆకులను దంచి నీళ్ళలో వేసి కషాయం కాచి, ఆ కషాయం గోరువెచ్చగా వున్నప్పుడు నోట్లో పోసుకొని పలుమార్లు పుక్కిలించి వూసివేస్తుంటే చిగుళ్లవాపు హరించి చిగుళ్ళు గట్టిపడతయ్.

గమనిక: ఇదే విధంగా బాగా పండిన జామ పండుతో కూడా చేసుకోవచ్చు.

                మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ


దంత సౌందర్యం ఎందుకు హరించిపోతుంది ???

ఈ ఆధునిక యుగంలో దంత బాధలు లేనివారు ఒక్కరు కూడా లేరని చెప్పటం అతిశయోక్తి కాదు. దంతాలు కదలటం, వూడిపోవటం, పుచ్చిపోవటం, తీపులు పుట్ట్టటం, లొట్టలు పడటం, చిగుళ్ళు చిట్లటం , నెత్తురు కారటం , వాయటం , మొదలైన సమస్యలు నానాటికీ పెరుగుతున్నయ్. యుక్త వయస్సులోనే కట్టుడు పళ్ళు పెట్టుకునే దౌర్భాగ్యం మనకు కలుగుతుంది.

మూలికలతో కూడిన దంత చూర్ణాలు, వివిధ చెట్ల పుల్లలు దంత దావనానికి ఉపయోగించిన మన పూర్వీకులు, ఇప్పటికీ కొన్ని పల్లేల్లో ఇదే పద్ధతిని అనుసరిస్తున్న గ్రామీణులు, చక్కటి దంత సౌభాగ్యంతో అందమైన పలువరసతో ఆరోగ్యంగా జీవించారు, జీవిస్తున్నారు కూడా.

అయితే రకరకాల పేస్టులతో బ్ర్ష్లష్ లతో పండ్లు తోముకోవటం అలవాటైన నాటినుండీ మన భారతీయుల దంత సౌందర్యం వినాశనం ప్రారంభమైందని మనం ఖచ్చితం గా తెలుసుకోవచ్చు. పేస్టుల్లో నురుగుకోసం పేస్టుల బేస్ కోసం ఉపయోగించే రక రకాల రసాయనిక పదార్షాల వల్ల దంతాల ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుంది. పసితనం నుంచే పళ్ళు సడలిపోవటం , పిప్పి పళ్ళు రావటం , యుక్తవయసులోకి వచ్చేటప్పటికి గట్టిపదార్ధాలను, తీపి పదార్ధాలను తినలేని దుస్థితికి చేరటం, నలభై ఏళ్ళకే పళ్ళు పండుటాకుల్లా రాలిపోవటం మనం చూస్తూనేవున్నాం. పేస్ట్లతో పాటు చల్లటి కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీములు , ఫ్రిజ్ ల్లో వుంచిన అతి చల్లని నీరు , ఆహార పదార్ధాలు , వేడి వేడి టీ, కాఫీలు , గుట్కాలు , సిగరెట్లు , బీడీలు , చుట్టలు అతిగా సేవించటం వల్ల కూడా దంత సౌందర్యం హరించిపోతూవుంది. ఈ అలవాట్లు మానుకోకుండ , ప్రకృతి సహజమైన దంత చూర్ణాలను వాడుకోవడం అలవాటు చేసుకోకుండ , సౌందర్యం కావాలంటే, ఎక్కడనుంచి వస్తుంది. ఎలా వస్తుంది ? మీరే ఆలోచించండి.

టీ.వీ.ల్లో వచ్చే ప్రకటనలు చూసి భ్రమపడకుండ కళ్ళముందు కనిపిస్తున్న నిజాలను , రుజువులను బేరీజు వేసుకుని వాస్తవాలను అవగాహన చేసుకొని శాశ్వత దంత సౌందర్యం కోసం ప్రయత్నించమని కోరుతున్నాను.....

                                     మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

Sunday, 18 May 2014

శ్రమ చేయకపోవటమే సుఖమనుకుంటున్నారా? కాదు, అది మధుమేహానికి మూలం:

ఈనాడు చాలామంది శారీరక శ్రమ చేయకుండా హాయిగా కూర్చొని పనిచేయటమే గొప్ప వరం అని భావిస్తున్నారు. కానీ నిజానికి అదే ఆరోగ్యానికి శాపం అని తెలుసుకోలేకపోతున్నారు. ఉద్యోగాలు చేసేవారు కానీ, వ్యాపారాలు చేసేవారు కానీ, ఉదయం ఇంటినుండి స్కూటరు మీదనో, కారు మీదనో, లేక బస్ లోనే ఆ ప్రదేశాలకు చేరటం, అక్కడ పని చేయటం, సాయంత్రం మళ్ళీ వాహనాలలో ఇంటికి రావటం, తినటం, నిద్రపోవటం జరుగుతుంది.

అలాగే ఇండ్లలో వుండే స్త్రీలకు వళ్ళు వంచి పని చేసే అవసరం లేకుండాపోయింది. ఏ చిన్న పనులున్నా అవి చేయటానికి పని మనుషులుంటునారు. వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్ లు , కుక్కర్లు, గ్యాస్ స్టౌవ్ లు వంటివి వాడకంలోకి రావటం స్త్రీలకు శారీరక శ్రమ తగ్గటం అదే వారి అనారోగ్యానికి మూలకారణం అవుతున్నయ్. అంతేగాకుండా టీ.వీ లు వచ్చిన తరువాత ఎక్కువ గంటలు వాటి ముందు కూర్చుని వుండటం వలన కూడా స్త్రీల శరీరాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ అదనపు కొవ్వు పెరగటమే స్త్రీలలో గానీ పురుషులలోగానీ మధుమేహం వంటి రోగాలు రావటనికి రెండవ ప్రధాన కారణం అవుతుంది. ఈ లోపాలతో పాటు వేళకు భోజనం చేయకపోవటం, తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ భుజించటం, రాత్రిళ్ళు మరీ ఆలస్యంగా భుజించటం, భుజించిన వెంటనే నిద్రించటం వంటి అనేక పొరపాట్ల వల్ల శరీరాలు రోగగ్రస్తమౌతున్నాయ్.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ.


Thursday, 15 May 2014

లివర్ (కాలేయ) సమస్యలకు(జుట్టు, కండ్లకు) :

1. తమలపాకులకు ఆముదం రాసి వేడి చేసి కట్టుకడుతూ వుంటే లివర్ గట్టి పడటం తగ్గి యధాస్థితికి వస్తుంది.

2. నిమ్మ పండ్లరసము, టమేటో పండ్ల రసము, బొప్పాయి పండ్లు తరచుగా వాడుకొంటూ వుంటే  కాలేయము మరియు ప్లీహ వ్యాధులు కలుగకుండ వుంటయ్.

3. పచ్చి గుంటగలగర ప్రతిసారి దొరకని వారు ఒకేసారి గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చుకొని రోజూ పూటకు 3 గ్రాములు మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండుపూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.

4.పచ్చి గుంటగలగర చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొన్ని అన్నంలో కలుపుకొని వారానికి ఒకసారి తింటూ వుంటే ఎప్పటికప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండ వుంటుంది. అంతే గాక వెంట్రుకలు తెల్లబడకుండ, కంటి చూపు తగ్గకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

ఆయువుకు అనాది ఆహారం - ఆరోగ్యానికి పునాది ఆచారం :

మనిషికి ఆయువు, ఆరోగ్యం ఎందుకు? కేవలం తను, తన కుటుంబం ఆనందంగా జీవించటానికి అవసరమైన ఆస్తులు, అంతస్తులు ఆర్జించటానికేనా? వందల వేలమంది పొట్టలు కొట్టి తన పొట్ట దిట్టంగా నింపుకొని సాట్ అమాయక ప్రజల సమాధుల మీద తన కుటుంబానికి పునాది వేసుకొని తరతరాలకు తరగనంత ధనాన్ని కూడబెట్టటానికేనా? ఇదే మనిషి ఆయువుకు ఆరోగ్యానికి పరమావధి కాదు ...

భారతీయ మహర్షులు తమ నిండు జీవితాలను ధారపోసి వేల సంవత్సరాలపాటు ప్రకృతిలోని అణువణువును మధించి పరిశొధించి చరకం, శుశ్రుతం, అష్టాంగహృదయం వంటి ఆరోగ్య శాస్త్రాలను సృష్టించింది ఎందుకు ? మనిషి చిరాయువై స్వార్ధపరుడిగా జీవించాలని కాదు. మట్టిలో పుట్టి, మట్టిలోనే గిట్టీ చెదపురుగుల్లా చరిత్రలేని అపవిత్రుల్లా ఊరు, పేరు లేకుండా చెరిగిపోవాలని కాదు. ప్రతి మనిషి ఈ ఆరోగ్య శాస్త్రాల అండదండలతో సక్రమమైన ఆహార నియమాలను అనుసరించి నిండు నూరేళ్ళపాటు సంపూర్ణ ఆరోగ్యంతో ధర్మార్ధకామ మోక్షాలను సాధించి ముందు తరాలకు ఆదర్సజీవులుగా మిగిలిపోవాలనే మహాలక్ష్యంతోనే మన మహర్షులు తమ ఆయువును ఆహుతి చేసి ఆయుర్వేదాన్ని లోకాననికి అందించారు.

ఈనాడు స్వార్ధమే పరమావధిగా, పరమ లక్ష్యంగా బ్రతుకుతున్న మానవుడు, తను ఎంత సంపాదించినా, ఎన్ని పదవులు ఏలినా చివరు తనను రక్షింపగలిగేది ఆ పదవులు అంతస్థులు కావని, తను చేసిన మంచి, ఆ మంచితో తాను నిలబెట్టుకున్న ఆరోగ్యము, ఆ అరోగ్యం కోసం తాను భుజించే సక్రమమైన ఆహారం. ఆ ఆహార సంపాదనకోసం తాను చేసే శ్రమ, ఆశ్రమలో కలిగే ఆనందం. ఇవే మనిషికి ఇహ పరలోకాల విజయానికి ఉపకరించే ఉత్తమ సాధనాలని ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆచరణలో తమ జీవితాలను పండిచుకోవాలని కోరుకుంటున్నాను..

                                            మాతృదేవోభవ -  పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Saturday, 10 May 2014

నీళ్ళతో కంటి జబ్బులు, కళ్ళక్రింద గుంటలు, నల్లటి వలయాలు పోగొ్ట్టుకోవచ్చు...

ఉదయం నిద్రలేవగానే నోటినిండా మంచినీళ్ళు పోసుకుని పుక్కిలిస్తూ తలవంచి రెండుచేతుల నిండా చన్నీళ్ళు తేసుకుని, కళ్ళు మూడు అంగుళాల దూరం నుంచి ఆ నీళ్ళతో కళ్ళ కొనలను సున్నితంగా తడుపుతూ వుండాలి. ఈ విధంగా రోజుకు ఇరవై అయిదుసార్లు ఉదయం పూట చేస్తూవుండాలి. ఇలా చేస్తూవుంటే క్రమంగా మంచి నేత్రదృష్టి కలిగి కళ్ళజోడు పెట్టే అవసరం లేకుండా పోతుంది. కళ్ళకింది గుంటలు, నల్లటి వలయాలు హరించిపోయి నేత్ర సౌందర్యం ఇనుమడిస్తుంది.

ఎండు ఉసిరికాయతో ఆందం, ఆరోగ్యం..

ఎండు ఉసిరికాయ బెరడు ముక్కల్ని తెచ్చుకుని నిలువచేసుకుని రోజూ పది ముక్కలు మంచినీళ్ళు తాగే కుండలో వేసి, ఆ ముక్కలు నానిన తరువాత ఆ నీళ్ళు తాగుతూ వుండాలి. ఈ అలవాటు సంవత్సరం పొడవునా చేస్తూ వుంటే మీ అందం మీ ఆరోగ్యం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.