Saturday, 11 January 2014

అతిసారం(విరేచనాలు) వస్తే:

ఆకలి మందగించి, దేహంలోని వాత, పిత్త, కఫాలు దోషాలుగా మారి మలం ద్రవం రూపం చెంది మాటిమాటికి విసర్జింపబడటాన్ని అతిసారం అంటారు.

1. గంజితో: పలుచగా కాచిన బియ్యపు గంజిలో దోరగా వేయించి దంచిన జిలకర్రపొడిని పావుచెంచా, సైంధవలవణం అరచెంచా కలిపి తాగుతూ వున్నా అతిసారం ఆగిపోతుంది.

2. బార్లీగింజలతో: బార్లీ గింజలతో పలుచగా జావ కాచి అందులో ఒక చెంచా చక్కెర, రెండు చెంచాల నిమ్మరసం కలిపి తాగుతుంటే అతిసారం ఆగిపోతుంది.

3. పిప్పళ్ళతో: పిప్పళ్ళను దోరగా వేయించి దంచి జల్లించిన పొడి మూడు చిటికెల మోతాదులో ఒక చెంచా తేనె కలిపి తింటే అతిసారం హరించిపోతుంది.

4. జామాకుతో: ఒకగ్లాసు నీటిలో ఒక జామాకు వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి చల్లర్చి సేవిస్తూ ఉంటే అతిసారం అతి త్వరగా తగ్గిపోతుంది.

5. దనిమ్మ తొక్కతో: దనిమ్మ పండూ పైతొ్క్కు తీసి 20 గ్రాములు మోతాదులో ఒక గ్లాస్ నీటిలో నల్గ్గొట్టివేసి, కప్పు కషాయానికి మరిగించాలి. వడపోసి చల్లార్చి తాగితే అతిసారం హరిస్తుంది.

6. వేయించిన బియ్యం, వేయించిన పెసలు తీసుకుని నీటిలో కలిపి కషాయం కాచి పిసికి వడపోసి, అది చల్లార్చిన తరువాత అందులో చక్కెర, తేనె కలిపి తాగితే అతిసారం, దప్పిక, కడుపులో మంట తగ్గిపోయి రోగికి బలం కలుగుతుంది.

0 comments:

Post a Comment