Friday, 9 August 2013

జల చికిత్స :

జలజల జల జల - జలజల మని రాలురా!!
జలముతోనే దీర్ఘకాల - రోగాలే కూలురా!!
జల మహా భూతమే -  జగతికాదరువురా!!
జల చికిత్సలను నేర్చి - జవ శక్తిని పొందరా!!

క్రింద తడి బట్టను - పైన పొడి బట్టను
మొల చుట్టూ గుండ్రంగా - ఒక గంట కట్టరా
జననాంగ గర్భాశయ - మూత్రపిండ వ్యాధులు
అతి మూత్రం ఆర్శమొలలు - అతివల ఋతుబాధలు
శీఘ్రస్కలన దోషాలను - వృషణాల లోపాలు
జలవిదుచ్ఛక్తితో - సమియించి పోవురా

పొట్ట వీపు చుట్టూరా - తడి బట్టను కట్టి
పైన పొడి బట్టను - గంట చుట్టి వుంచితే
ప్లీహంలో వాపులు - తేప తేప తేపులు
కాలేయపు ఆవిర్లు - క్రూరమైన కామెర్లు
కడుపు వాపు కడుపు నెప్పి - కడుపులోని మంటలు
ప్రేవుల్లో అరుపులు - పటా పంచలౌనురా

ఆరడుగుల పొడవున్న - అయిదంగుళ వెడల్పున్న
తడిబట్టను గొంతుచుట్టూ - గుండ్రంగా చుట్టాలి
అదే పొడవు వెడల్పున్న - పొడి బట్టను పైన గట్టి
దానిపైన మరో నూలు - బట్ట కట్టి ఉంచితే
గొంతువాపు గొంతుపుండు - థైరాయిడ్ గ్రంధులు
అన్ని గొంతు రోగాలు - అంతమైపోవురా

జలమనగా శ్రీమహా విష్ణువే తెలుసుకో
సృష్టీ స్థితి లయలలో - స్థితి రూపమే పోల్చుకో
భూమిలోన మూడొంతులు - జలమున్నది చూసుకో
మన మానవ దేహంలో - మూడొంతులు జలమేనూ
సకల జీవరాశులకూ - జలమేరా ప్రాణాధారమూ
జలము విలువ తెలుసుకుంటె - జయము నీదౌను

0 comments:

Post a Comment