Sunday, 15 June 2014

ఏ.సి. గదులు - ఎముకల వ్యాధులు :

ఎయిర్ కండిషను గదుల్లో గంటలు తరబడి కూర్చోవడం, నిద్రపోవటం, శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మానవ శరీరం ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే పంచ భూతాల కలయికతో నిర్మితమైనది. ఈ అయిదు భూతాల స్పర్శ ప్రతిరోజూ మన శరీరానికి తగలకపోతే, రోగాలు రావటం ఖాయం. ఎలా అంటే, మన శరీరాన్ని ముఖ్యంగా పంచభూతాలనుండి పుట్టిన వాతము, పిత్తము, శ్లేష్మము(కఫం) అనే మూడు ధాతువులు పరిపాలిస్తున్నయ్. ఆ మూడు ధాతువులు మన శరీరంలో సమంగా వుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఆ ధాతువులు సమంగా వుండాలంటే, వాటి మూల రూపాలైన పంచభూతాల స్పర్శను మనం అనుభవించి తీరాలి. ప్రకృతిలోని పరిశుభ్రమైన అతి శక్తివంతమైన ఎండ, గాలి తగలకుండ మనం ఎక్కువ సమయం ఏ.సి. గదుల్లో వుండటం వల్ల శరీరంలో ని వాత, పిత్త, శ్లేష్మాల సమతౌల్యం దెబ్బతింటుంది.ప్రతి రోజూ మన శరీరం ఆరోగ్యంగా వుండి తగినంత ఉత్సాహంతో పని చేయటానికి అవసరమైన విటమినులు, సూర్య్రశ్మి నుంచి మనకు అందకుండా పోతాయ్. దీనివల్ల క్రమంగా మానవ శరీరంలోని ఎముకల్లో, దంతాల్లో పటుత్వం తగ్గిపోతుంది. ఎక్కువసేపు కూర్చోలేక, నిలబడలేక, నడవలేక, ఎముకల, దంతాల దారుఢ్యం తగ్గిపోయి, శరీరం వంగిపోతుంది. అందువల్ల రోజులో కొంతసమయమైనా మనం తప్పకుండా సూర్యరశ్మిని ఆస్వాదించాలి. ప్రతిరాత్రి నిద్రపోయే ముందు పాలు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ' పళ్ళూడిపోయి, ఎముకలు క్షీనించిపోయి యౌవన దశలోనే అకాల వృద్ధాప్యం ఆవహిస్తుంది.


                                           మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ 

0 comments:

Post a Comment