Sunday, 9 March 2014

ఆహారం నుంచి సప్తధాతువులు ఎలా తయారవుతాయి : Must know...

మనం తినే ఆహారం అన్నశయంలోని జఠరాగ్ని చేత చక్కగా పచనము చేయ బడినదై, రసము, మలము అనెడి రెండు ప్రధాన విభాగాలుగా మారుతుంది. వీనిలో మొదటిదైన రసము అనే ధాతువు నుండి రక్తము, రక్తము నుండి మాంసము, మాంసము నుండి కొవ్వు, కొవ్వు నుండి ఎముక, ఎముక నుండి మజ్జ, మజ్జ నుండి వీర్యము, వీర్యము నుండి ఓజస్సు తేజస్సు గా రూపాంతరం చెందుతుంది. వీనినే సప్తధాతువులు అని పిలుస్తారు. ఈ ఏడు  ధాతువుల నుండి ఉత్పన్నమయ్యే పోషక శక్తులు శరీరంలోని పంచేంద్రియాలను కాపాడే జీవద్రవ్యాలుగాను, శరీరంలోని కీళ్ళు వాటికి అనుసంధానంగా వుండే నరాలు మొదలైన సమస్త శారీరక అవయవాలను పోషించే పోషకద్రవ్యాలుగాను వినియోగపడుతుంటయ్.
ఇక పైన చెప్పిన రెండవ ప్రధాన విభాగమైన కిట్టము అను పేరుగల మలము వలన చెమట,మూత్రము, విసర్జింపబడే పురీషము అనెడు మలము, ముక్కులో పుట్టే మము, ముఖము మేద పుట్టే మలము, రోమ కూపాలనుండి పుట్టే మలము, తల వెంట్రుకలు, మీసము, గడ్డము, శరీఋఅముపైన రోమాలు, గోళ్ళు మొదలైన పదార్ధాలుగా రూపాంతరాలు చెందుతూ ఆయా భాగాలను పోషిస్తూ వుంటుంది.

ఈ విధంగా ఆహారము వలననే పుట్టే రసము, కిట్టము అనే మౌలిక  పదార్ధాల సమత్వం వలననే శరీరం ఎల్లవేళలా క్రమ పద్ధతిలో పోషింప బడుతూ, మానవులను సర్వాంగ సుందరులుగా, కాంతి మంతులుగా, బలవంతులుగా, సుఖజీవులుగా, శతాధిక ఆయుష్మంతులుగా తీర్చి దిద్దుతూ వుంటుంది.

ఇది ఎప్పుడు జరుగుతుంది:
మానవులు తమ జఠరాగ్ని శక్తిని అనుసరించి హితమైన ఆహార విధానాన్ని అనుసరించినప్పుడే పైన చెప్పింది సుసాధ్యమౌతుంది. అదే వేళా పాళా లేకుండా కనిపించిన ప్రతి పదార్ధం తింటూ జిహ్వచాపల్యానికి లొంగిపోతే పైన చెప్పిన, రసము, కిట్టము అనే మూల విభాగాలే దోషాలుగా మారి అటు ధాతువులను, ఇటు వివిధ మలాలను చెరచి శరీరాన్నే సర్వనాశనం చేస్తయ్.

ఇంత మహోపకారానికి మానవ జన్మ సాఫల్యానికి సహకరించే ఆహారాన్ని మనమంతా సరైన పద్ధతిలో తింటున్నామా?
వ్యవాయదారులకు : అసలు ఆహార పదార్ధాలనే విష రసాయనాలు వేయకుండా పెంచగలుగుతున్నామా ? ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

1 comments:

  1. Super Explanation, Very precise and useful, Thank you

    ReplyDelete