Pages

Friday, 27 September 2013

తెలుసుకోవలసిన ఆరోగ్య సూత్రాలు :

*మధ్యాహ్న భోజనంలోకి పెరుగు వాడకుండా మజ్జిగను వాడాలి.
* పళ్ళు తోముకున్న తరువాత ఏమి తినకుండ ఐదారు తులసి ఆకులు / రసం తీసుకోవటం వల్ల ఎప్పటికీ జ్వరాలు, అజీర్ణరోగాలు రావు.

* పండ్లు తిన్న వెంటనే మంచి నీళ్ళు తాగవద్దు. అలా చేస్తే జలుబు చేస్తుంది.
* వేడి అన్నంగాని, వీడి కాఫీ, టీలు గానీ సేవించిన వెంటనే చల్లని నీళ్ళు త్రాగకూడదు.
* స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకొనకూడదు. అలా తీసుకుంటే జీర్ణశక్తి చెడుతుంది.

Thursday, 26 September 2013

గేస్/అజీర్ణం సమస్యకు :

పద్ధతి 1:

దోరగా వేయించిన వామ్ము పొడి 100 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 50 గ్రాములు, సైంధవ లవణం 25 గ్రాములు  కలిపి ఒక సీసాలో బధ్రపరచుకుని,

1)గేస్ సమస్య వున్న వాళ్ళు అర గ్లాసు నీటిలో అర చెంచా నుంచీ ఒక చెంచా వరకు పొడిని కలుపుకుని అన్నం తినే గంట ముందు త్రాగాలి.
2)అజీర్ణ సమస్య వున్న వాళ్ళు అన్నం తిన్నా గంట తరువాత త్రాగాలి.

పద్ధతి 2:

దోరగా వేయించిన వామ్ము 100 గ్రాములు, పటిక బెల్లం(మిశ్రీ) పొడి  100 గ్రాములు, ఆవు నెయ్యి(దేశవాళీ ఆవునెయ్యి) 100 గ్రాములు ముందుగా వామ్ము పొడి, మిశ్రీ పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి, నెయ్యి వేడి చేసుకుని (మరిగించక్కర్లేదు) ఈ పొడిని వేస్తూ వుండలు లేకుండా కలుపుకోవాలి్. అది ఒక లేహ్యం లాగా/ హల్వా లాగ తయారవుతుంది.దీన్నే అగస్త్య లేహ్యం అంటారు.
దీన్ని గేస్ సమస్య వున్నా వాళ్ళు ఒక చెంచా ముద్దను అన్నం తినే గంట ముందు తినాలి.
అజీర్ణ సమస్య వున్నా వాళ్ళు అన్నం తిన్నా గంట తరవాత తినాలి.
ఈ లేహ్యంతో వాతం వలన కలిగిన కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి కూడా తగ్గిపోతుంది.

రోజుకు రెండు పూటలా పైన చెప్పిన విధానాలలో ఏది వీలైతే అది ఆచరించుకోవచ్చు.

Monday, 23 September 2013

జాగృతి

పొట్ట పెరిగితే రోగం మొదలైనట్లే, వీపు పెరిగితే రోగం ముదిరినట్లే.

కంటి రెప్పల వెంట్రుకలు వూడుతూవుంటే:

ఆరు గ్రాముల వామ్ము తెచ్చి శుభ్రం చేసి రోట్లో వేసి అందులో నాటు కోడి గుడ్డులోని తెల్ల సొన కలిపి మెత్తగా మర్ధించి కను రెప్పల మీద లేపనం చేస్తూవుంటే, రెప్పల వెంట్రుకలు వూడటం ఆగుతుంది. ఓక వేళ వూడి వుంటే వెంట్రుకలు మళ్ళీ మొలుస్తయ్. ఇంకా దీనివల్ల కనురెప్పల వాపు, రెప్పల యందలి దుర్మాంసం కూడా హరించి నేత్రాలు బహుసుందరంగా రూపుదిద్దుకుంటయ్.

Wednesday, 18 September 2013

చిగుళ్ళవాపుకు :

తులసి ఆకులు 10 గ్రాములు, సన్నజాజిఆకులు 6 గ్రాములు కలిపి నమిలి మింగుతూ వుంటే నాలుగైదు పూటల్లో చిగురువాపు, చిగురుపోటు, దంతాలపోట్లు తగ్గిపోతయ్. ఒక్కసారికే ఎంతో హాయిగా వుంటుంది..
ఆచరించి మీ అనుభవం తెలియజేయండి..

Saturday, 14 September 2013

తెలుసుకుందాం :

1. నీరు ఎక్కువ తాగినా కూడా మూత్రపిండాలకు, మూత్రాశయంకు భారం పెరుగుతుంది.
2. ఆరోగ్యం మొత్తం సూర్య భగవానుని మీద ఆధారపడి వుంటుంది.
3. ప్రతి అవయవానికి అతి తొందరగా చేరేది నువ్వులనూనె.

స్నాన నిబంధనలు :

1. నూనె పెట్టూకోకుండా స్నానం చేయరాదు.
2. హడావిడిగా స్నానం చేయరాదు.
3. భోజనం చేసినవెంటనే స్నానం చేయరాదు.
4. చన్నీళ్ళ స్నానం :చన్నీళ్ళను మొదట తలమీద పోసుకుని తరవాత మిగతా భాగాల మీద పోసుకుని స్నానం చేయాలి.
5. వేన్నీళ్ళ స్నానం : వేన్నీళ్ళను మొదట కాళ్ళమీద పోసుకుని తరవాత పై భాగాల మీదా పోసుకుని స్నానం చే్యాలి.

మలబద్ధకంనకు మంచి యోగం :

వంటాముదం 4 చెంచాలు, అల్లం రసం 2 చెంచాలు, తేనె 2 చెంచాలు ఒక గిన్నెలో వేసి మూడు సార్లు పొంగించి గోరువెచ్చగా వున్నప్పుడు త్రాగాలి. ఇలా త్రాగిన తరువాత 3 లేదా 4 సార్లు విరేచనాలు అవుతాయి. ఆరోజంతా చారు అన్నం మాత్రమే తినాలి.

తెలుగు భాష గొప్పదనం

గడచిపోయిన ప్రతినిమేషమ్ముకూడ
జీవితమ్మున భాగమ్ముపంచుకొనును
దీపముండగ నిలుచక్కదిద్దుకొంచు
మించిపోనీడు సమయము మంచివారు !!!

Friday, 13 September 2013

పొట్ట ఉబ్బరంకు:

 కర్జూర గింజను నోట్లో పెట్టుకుని రసాన్ని మింగాలి.

బొల్లి మచ్చలకు:

తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. అతి త్వరగా మచ్చలు పోతాయి.

Wednesday, 11 September 2013

శరీర - మంటలకు - మంచి మార్గం :

1) ఆముదంగానీ, కొబ్బరినూనెగానీ నీటిలో కలిపి చేతితో గిలకొడితే నురుగు వస్తుంది. ఆ నురుగును మంటలపైన రుద్దుతుంటే, ఆశ్చర్యకరంగా మంటలు మాయమౌతయ్.

2)అదేవిధంగా పైవిధానం కుదరనివారు తంగేడు ఆకు తెచ్చి నీటితో మెత్తగానూరి మంటలపైన రసం ఇంకేలా రుద్దుతుంటే ఎక్కడమంటలైనా అతిత్వరగా తగ్గిపోతయ్.

అతిమూత్ర వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలు:

అతిగా మూత్రంపోయే వ్యాధిగ్రస్తులకు ఆకలి, దప్పిక, శరీరతాపం, బలహీనత ఎక్కువగా వుంటాయి. ఆహారపు రుచి తెలియదు. మాటిమాటికి గొంతు ఎండిపోతుంటుంది. అధిక శాతం మందికి మూత్రం తియ్యగా వుండి విసర్జించినచోట చీమలు మూగుతయ్. ఈ లక్షనాలను బట్టీ అతిమూత్ర సమస్యను గుర్తించి ఈ క్రింది అహారమార్గాల ద్వారా నివారించుకోవచ్చు.

జీలకర్రతో జీవమైన యోగం:

జీలకర్రను కొంచం దోరగా వేయించి దంచి పొడిచేసి ఆ పొడితో సమంగా పాతబెల్లం లేదా తాటిబెల్లం కలిపి బాగా దంచి ఆ ముద్దను నిలువచేసుకోవాలి. రోజూ రెండూ పూటలా 10 గ్రాముల ముద్దను తింటూవుంటే, అతి మూత్రం అణగారిపోతుంది.

అల్లనేరేడు గింజలతో అద్భుత యోగం:

అల్లనేరేడుపండ్లు తిన్న తరవాత లోపలి గింజలను ఊసివేస్తుంటాం. కానీ ఆ గింజలు చాలా విలువైనవి. ఆ గింజలను దంచి జల్లించిన పొడి నిలువచేసుకోవాలి. రోజూ రెండు పూటలా పావుచెంచా నుండీ అరచెంచా వరకు ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తుంటే అతిమూత్రం హరించిపోతుంది.

ఉసిరిపండ్లతో ఉసిగొలిపే యోగం:

పచ్చి ఉసిరికపండ్లరసం 1 ఔంసు తీసుకుని అందులో తేనె రెండు చెంచాలు కలిపి రెండుపూటలా ఆహారానికి రెండు గంటలముందు సేవిస్తుంటే, కొద్దిరోజుల్లోనే అతిమూత్రం హరించిపోయి శరీరంలోని అన్ని అవయవాలకు అమితమైన శక్తి కలుగుతుంది.

Tuesday, 10 September 2013

దురదలు, దద్దుర్లకు

పాత బెల్లం, వామ్ము పొడి సమంగా దంచి 10 గ్రాములు మోతాదుగా రెండు పూటలా తింటుంటే దురదలు, దద్దుర్లు హరిస్తయ్.

కాలిన పుండ్లుకు

కాల్చిన బార్లీగింజల మసి నువ్వుల నూనెతో నూరి పూస్తే కాలిన పుండ్లు త్వరగా మానిపోతయ్.

Saturday, 7 September 2013

తల వెంట్రుకలు పెరగటానికి :

కలబంద గుజ్జు 100 గ్రాములు నువ్వులనూనె 200 గ్రాములు ఈ రెండు కలిపి చిన్న మంటపైన మరగపెట్టి కలబంద గుజ్జు నూనెలో మరిగేవరకు ఉడికించి దించి వడపోసి చల్లార్చిన తరువాత  రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

Thursday, 5 September 2013

మత్తు మందుల విషానికి విరుగుడు - రావి:

గంజాయి, నల్ల మందు ఇంకా ప్రాణాంతకమైన మత్తుమందులు సేవించి ప్రాణాపాయ స్థితికి చేరినవారికి రావిచెట్టుబెరడుతో కాచిన కషాయం రెండు లేదా మూడు పూటలా సేవింపచేస్తే ఆ విషాల ప్రభావం విరిగిపోయి ఆ మనిషి జీవిస్తాడు.

Wednesday, 4 September 2013

ఎముకలు అరిగిన సమస్యకు :

శరీరం సంధుల్లో గుజ్జు ,  ఎముకలు  అరిగిపోయి  ఎన్ని మందులు వాడినా సమస్య తీరక విసికిపోయిన వారు చాలా మంది వున్నారు, వారందరూ ఈ యోగం ఆచరించి లబ్ది పొందుతారని ఆకాంక్ష:
చింతగింజలు తెచ్చి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పైతోలు తీసి పప్పును ఎండించాలి. తరువాత వాటిని మెత్తగా దంచి పొడిచేసుకోవాలి. సమానంగా పటిక పంచదార(మిశ్రీ) పొడి కూడా కలిపి తయారుచేసుకుని, ఒక గ్లాసు పాలలో ఒక చెంచా పొడి కలుపుకుని్ ఉదయం, సాయంత్రం తీసుకుంటుంటే సంధుల్లో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడుతుంది..ఈ యోగంతో బాగుపడిన వారు చాలా మంది వున్నారు.

Tuesday, 3 September 2013

బెణుకుల నొప్పి, వాపులకు:

నిమ్మరసం రెండుపూటలా రుద్దుతుంటే బెణుకులనెప్పి, వాపు తగ్గుతయ్. తగ్గించుకున్నాక చెప్పటం మరచిపోకండి..