Tuesday, 31 December 2013

కడుపు నొప్పి కి :

పచ్చి పుదీనా ఆకులు ఏడు , ఏలకకాయ ఒకటి ఈ రెండు పదార్ధాలు ఒక తమలపాకులో పెట్టి కిళ్ళీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగి తరువాత కొద్ది కొద్దిగా మంచి నీళ్ళు తాగితే ఆ మరుక్షణమే కడుపు నొప్ప్పి కనుమరుగవుతుంది.

మురికినీటి వల్ల కలిగిన జ్వరాలకు :

శొంఠి 40 గ్రాములు తీసుకుని దానిని నాలుగు రెట్లు నీటితో కలిపి నాల్గవ వంతు కషాయం మిగిలేటట్లు మరిగించి, వడపోసి చల్లర్చి అందులో తగుమాత్రంగా తేనె కలిపి కొద్ది కొద్దిగా సేవిస్తూ వుంటే దుష్టజల సంయోగం వల్ల కలిగిన జ్వరం, అరుచి, అగ్నిమాంద్యం, దగ్గు, పడిశం, జలదోషం వీనిని హరింపచేసి శరీరానికి, మనసుకు, నేత్రములకు నిర్మలత్వాన్ని ప్రసన్నతను కలుగచేస్తుంది.

Saturday, 28 December 2013

మూలవ్యాధి (piles) నివారణకు :

1. కందను కూరగా వండుకుని తింటూ వుంటే 5,6 రోజుల్లో మొలల బాధ నివారణ అవుతుంది
2. బప్పాయి పండ్లు తరుచుగా తింటూ వుంటే మూలవ్యాధులు శాంతిస్తాయ్.
3. వేప పండ్లను రోజూ 5,6 తింటూ వుంటే వేపపండ్లు వచ్చే రుతువు పూర్తయ్యేసరికి మొలలు తగ్గిపోతయ్.
4. నీరుల్లి(ఉల్లిగడ్డల) పాయలను ముక్కలుగా తరిగి నేతితో దోరగా వేయించి ఆ ముక్కల మేద తగినంత పంచదార చల్లి రెండు పూటలా తింటూ వుంటే రక్తం పడే మొలలు తగ్గుతయ్.
5. రోజూ రెండు పూటలా భోజనం చేసిన తరువాత 10 గ్రాములు కరక్కాయ పొడిని పుల్లటి మజ్జిగలో కలుపుకుని తాగుతూ వుంటే మూల వ్యాధి పిలకలు వూడిపడిపోతయ్.
6. మూలవ్యాధి కలవారు ఎక్కువగా జామకాయలను తింటూ వుంటే మొలలలు బాధ శాంతిస్తుంది.

Wednesday, 18 December 2013

తెలుసుకుందాం : బియ్యం గురించి

బియ్యంలో శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్ధాలు అత్యధిక శాతంలో వున్నాయి.

బియ్యంలో శరేర నిర్మాణానికి్ ఉపకరించే మాంసకృత్తులు 7 శాతమే వున్నాయి.

బియ్యంలోగింజకి, పైన వుండే వరి పొట్టూకీ మధ్య విటమిను  బి వుంటుంది. బాగ పాలిష్ పట్టిన బియ్యంలో తవుడుతో పాటు ఇది వెళ్ళిపోతుంది.

గోధుమతో పోలిస్తే బియ్యంలో మాంసకృత్తుల శాతం స్వల్పం. అయితే మనిషి శరీరం మాత్రం గోధుమలోని మాంసకృత్తుల కన్నా బియ్యంలోని మాంసకృత్తులే అధికంగా వినియోగించుకుంటుంది.

చాలా కాలం నుంచే పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడే వారిలో ఒకవేళ పాదాలు తిమ్మిరి పట్టడం, మొద్దు బారడం, మంటగా అనిపించడం గనుక జరిగితే అది విటమిను  బి లోపంగా గ్రహించాలి.

మామూలు బియ్యం కన్నా ఉప్పుడు బియ్యంలో బి వితమిను శాతం ఎక్కువగా వుంటుంది. గిజలోని ఈ విటమిను చొచ్చుకుపోవడం వల్ల ఈ బియ్యాన్ని ఎంత కడిగినా ఏంకాదు.

కాళ్ళు చేతులు పీకుతుంటే :

ఇటుక పొడుమును గానీ, తవుడు గానీ, ఉప్పు గానీ వెచ్చజేసి గుడ్డలో వేసి కాపడం పెట్టాలి.

వాత నొప్పులకు :

ఉమ్మెత్త ఆకులకి ఆముదము రాసి ఆకుల్ని వేడి చేసి నొప్పిగల చోట వేసి కట్టుకడీతే వెంటనే నొప్పిలాగేస్తుంది.

కాళ్ళు - చేతులు మంటలు :

10 గ్రాముల ఆవునెయ్యిలో 5 గ్రాముల మిరియాలు చితగ్గొట్టీవేసి, మరగకాయాలి.చల్లారిన తరువాత ఆ నేయితో మర్ధనా చేస్తూ ఆ నేతినే అన్నంలో కలుపుకొని తింటూ వుంటే మంటలు తగ్గిపోతయ్.